< నెహెమ్యా 11 >
1 ౧ ప్రజల అధికారులు యెరూషలేంలో నివాసం ఏర్పరచుకున్నారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకడు పరిశుద్ధ పట్టణం యెరూషలేంలో నివసించాలనీ, మిగిలిన తొమ్మిదిమంది వేరు వేరు పట్టణాల్లో నివసించాలనీ చీట్లు వేసి నిర్ణయించారు.
那時,人民的首長住在耶路撒冷;其餘的人民都拈鬮,抽出十分之一的人民,遷移到耶路撒冷聖城居住,其餘九分仍留在自己的城內。
2 ౨ యెరూషలేంలో నివసించడానికి సంతోషంగా అంగీకరించిన వారిని ప్రజలు దీవించారు.
民眾都稱讚那些自願遷居到耶路撒冷的人。
3 ౩ ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయ సేవకులు, సొలొమోను సేవకుల వంశాలవారు, దేశంలో ప్రముఖులు యెరూషలేం, యూదా పట్టణాల్లో వారికి నిర్దేశించిన ప్రాంతాల్లో నివసించారు.
以下是住在耶路撒冷的本省族長;其餘的以色列人、司祭、肋未人、獻身者和撒羅滿僕役的子孫,在猶大各城中,個人住在本城內自己的產業中。
4 ౪ యూదుల నాయకుల్లో కొందరు, బెన్యామీనీయుల నాయకుల్లో కొందరు యెరూషలేంలో నివాసం ఏర్పరచుకున్నారు. యూదుల నాయకుల జాబితాలో ఉన్నవారు ఎవరంటే, జెకర్యా మనవడు ఉజ్జియా కొడుకు అతాయా. జెకర్యా తండ్రి అమర్యా, అమర్యా తండ్రి షెఫట్య, షెఫట్య తండ్రి పెరెసు వంశీకుడైన మహలలేలు.
有些猶大的子孫和本雅明的子孫,住在耶路撒冷。猶大的子孫:培勒茲的子孫,有烏齊雅的兒子阿塔雅;烏齊雅是則加黎雅的兒子,則加黎雅是阿瑪黎雅的兒子,阿瑪黎雅是舍法提雅的兒子,舍法提雅是瑪拉肋耳的兒子;
5 ౫ కొల్హోజె మనవడు బారూకు కొడుకు అయిన మయశేయా. కొల్హోజె తండ్రి హజాయా, హజయా తండ్రి అదాయా, అదాయా తండ్రి యోయారీబు, యోయారీబు తండ్రి జెకర్యా. జెకర్యా షెలా వంశం వాడు.
舍拉的子孫,有巴路客的兒子瑪阿色雅;巴路客是苛耳曷則的兒子,苛耳曷則是哈匝雅的兒子,哈匝雅是阿達雅的兒子,阿達雅是約雅黎布的兒子,約雅黎布是則加黎雅的兒子。
6 ౬ యెరూషలేంలో నివసించిన పెరెసు వంశంవారు పరాక్రమవంతులైన 468 మంది.
培勒茲的子孫住在耶路撒冷的,共計四百六十八人,都是成人。
7 ౭ బెన్యామీనీయుల వంశంలో ఉన్నవారు, యోవేదు మనవడు, మెషుల్లాము కొడుకు సల్లు. పెదాయా కొడుకు యావేరు, కోలాయా కొడుకు మయశేయా, మయశేయా కొడుకు కాలాయా, ఈతీయేలు కొడుకు మయసీయా, మయసీయా కొడుకు యెషయా.
本雅明的子孫有撒路,他是默叔藍的兒子,默叔藍是約厄得的兒子,約厄得是科拉雅的兒子,科拉雅是瑪阿色雅的兒子,瑪阿色雅是依提耳的兒子,依提耳是耶沙雅的兒子,
8 ౮ సల్లును అనుసరించి వీరి అనుచరులు గబ్బయి, సల్లయి. వీరంతా మొత్తం 928 మంది.
撒路的族人,共計二十八人,都是成人。
9 ౯ జిఖ్రీ కొడుకు యోవేలు వారికి నాయకుడుగా ఉన్నాడు. సెనూయా కొడుకు యూదా ఆ పట్టణపు అధికారుల్లో రెండవ స్థానంలో ఉన్నాడు.
齊革黎的兒子約厄耳,作他們的首長;色奴阿的兒子猷答為副市長。
10 ౧౦ యాజకుల్లో, యోయారీబు కొడుకులు యెదాయా, యాకీను.
司祭中有耶達雅、約雅黎布、雅津,
11 ౧౧ శెరాయా దేవుని మందిరంలో అధిపతిగా ఉన్నాడు. ఇతడు మెషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటూబుల పూర్వీకుల క్రమంలో హిల్కీయాకు పుట్టాడు.
天主聖殿的總管色辣雅,他是希耳克雅的兒子,希耳克雅是默叔藍的兒子,默叔藍是匝多克的兒子,匝多克是默辣約特的兒子,默辣約特是阿希突布的兒子;
12 ౧౨ నిర్మాణ పని చేసినవాళ్ళ బంధువులు 822 మంది, పూర్వీకులైన మల్కీయా, పషూరు, జెకర్యా, అమీజు, పెలల్యాల క్రమంలో యెరోహాముకు పుట్టిన అదాయా.
和他們在聖殿服務的兄弟,共計八百二十二人;還有耶洛罕的兒子,阿達雅;耶洛罕是培拉里雅的兒子,培拉里雅是阿默漆的兒子,阿默漆是則加黎雅的兒子,則加黎雅是帕市胡爾的兒子,帕市胡爾是瑪耳基雅的兒子,
13 ౧౩ పెద్దల్లో ప్రముఖులైన అదాయా బంధువులు 242 మంది. పూర్వీకులైన ఇమ్మేరు, మెషిల్లేమోతె, అహజైయల క్రమంలో అజరేలుకు పుట్టిన అమష్షయి.
和他做族長的兄弟共計二百四十二人;還有阿匝勒耳的兒子阿瑪賽;阿匝勒耳是阿赫齋的兒子,阿赫齋是默史勒米特的兒子,默史勒米特是依默爾的兒子,
14 ౧౪ పరాక్రమం గలవారి బంధువులు 128 మంది. వీరి నాయకుడు హగ్గేదోలిము కొడుకు జబ్దీయేలు.
和他的兄弟都是成人,共計一百二十八人;管理他們的是,哈加多耳的兒子匝貝狄耳。
15 ౧౫ లేవీయుల నుండి షెమయా. ఇతడు అజ్రీకాము మనవడు, హష్షూబు కొడుకు. అజ్రీకాము హషబ్యా కొడుకు, హషబ్యా బున్నీ కొడుకు.
肋未人中有,哈叔布的兒子舍瑪雅;哈叔布是阿次黎岡的兒子,阿次黎岡是哈沙彼雅的兒子,哈沙彼雅是步尼的兒子;
16 ౧౬ లేవీయుల్లో ప్రముఖులైన షబ్బెతై, యోజాబాదులకు దేవుని మందిరం బయటి పనుల నిర్వహించే అధికారం ఇచ్చారు.
沙貝泰和約匝巴得,作肋未人之長,管理天主聖殿的外務。
17 ౧౭ ఆసాపుకు పుట్టిన జబ్దికి మనుమడూ, మీకా కొడుకు అయిన మత్తన్యా ప్రార్థన, స్తుతి గీతాల నిర్వహణలో ప్రవీణుడు. అతనికి సహాయులుగా తన సహోదరుల్లో బక్బుక్యా, యెదూతూ కొడుకు గాలాలు మనవడు షమ్మూయ కొడుకు అబ్దా ఉన్నారు.
還有米加的兒子瑪塔尼雅;米加是匝貝狄的兒子,匝貝狄是阿撒夫的兒子;瑪塔尼雅在祈禱時,是啟頌謝經文之長;巴刻步克雅在兄弟中為副;還有沙慕亞的兒子阿貝達;沙慕亞是加拉耳的兒子,加拉耳是耶杜通的兒子。
18 ౧౮ పరిశుద్ధ పట్టణంలో నివాసమున్న లేవీయుల సంఖ్య 284 మంది.
在聖城的肋未人,共計二百八十四人。
19 ౧౯ ద్వారపాలకులు అక్కూబు, టల్మోను. ద్వారాల దగ్గర కాపలా ఉండేవారు 172 మంది.
門丁:阿谷布、塔耳孟和. 和他們護守各門的兄弟,共計一百七十二人。
20 ౨౦ ఇశ్రాయేలీయుల్లో మిగిలిపోయిన యాజకులు, లేవీయులు, ఇతరులు అన్ని యూదా పట్టణాల్లో ఎవరి వంతులో వారు ఉండిపోయారు.
其餘的以色列人、司祭和肋未人,住在猶大各城,佔據自己的產業。
21 ౨౧ దేవాలయం పనివారు ఓపెలులో నివసించారు. వారిలో ప్రముఖులు జీహా, గిష్పా అనేవాళ్ళు.
獻身者住在曷斐耳區;漆哈和基市帕管理獻身者。
22 ౨౨ యెరూషలేంలో ఉన్న లేవీయులకు నాయకుడు ఉజ్జీ. ఇతడు మీకా మనవడు, మత్తన్యా కొడుకు హషబ్యాకు పుట్టిన బానీ కొడుకు. ఆసాపు సంతానం వాళ్ళు గాయకులు, దేవుని మందిరం పనులు పర్యవేక్షించే వారిపై అధికారులు.
在耶路撒冷肋未人之長,是巴尼的兒子烏齊;巴尼是哈沙彼雅的兒子,哈沙彼雅是瑪塔尼雅的兒子,瑪塔尼雅是米加的兒子,出自阿撒夫的子孫,都是在天主聖殿內行禮時的歌詠者。
23 ౨౩ వీరు చేయాల్సిన పని ఏమిటంటే, గాయకులు నిర్ణయించిన సమయంలో తమ వంతుల ప్రకారం క్రమంగా పనిచేసేలా చూడాలి. రాజు నిర్ణయించిన రోజువారీ పనులు క్రమంగా జరిగించాలి.
每天給歌詠者一定的報酬,這是君王有關他們出的命令。
24 ౨౪ యూదా గోత్రం వాడైన జెరహు వంశంలో పుట్టిన మెషేజబెయేలు కొడుకు పెతహయా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించే పనిలో రాజు దగ్గర ఉన్నాడు.
猶大的兒子則辣黑的子孫中,有默舍匝貝耳的兒子培塔希雅,他是王的助手,掌管人民一切事務。
25 ౨౫ గ్రామాల, పొలాల విషయంలో, యూదా వంశం వారిలో కొందరు కిర్యతర్బా, దానికి చెందిన ఊళ్లలో, దీబోను, దానికి చెందిన ఊళ్లలో, యెకబ్సెయేలు, దానికి చెందిన ఊళ్లలో నివసించారు.
至於村鎮和所屬地域:猶大的子孫,有些住在克黎雅特阿爾巴,和所屬村鎮,
26 ౨౬ ఇంకా, యేషూవ, మోలాదా, బేత్పెలెతు ఊళ్ళలో,
住在耶叔亞、摩拉達、貝特培肋特,
27 ౨౭ హజర్షువలు, బెయేర్షెబా దానికి చెందిన ఊళ్లలో,
住在哈匝叔阿耳、貝爾舍巴和所屬村鎮,
28 ౨౮ సిక్లగులో, మెకోనాలకు చెందిన ఊళ్లలో,
住在漆刻拉格、默苛納和所屬村鎮,
29 ౨౯ ఏన్రిమ్మోను, జొర్యా, యర్మూతు ఊళ్ళలో,
住在恩黎孟、祚辣、雅爾慕特,
30 ౩౦ జానోహ, అదుల్లాము, వాటికి చెందిన ఊళ్లలో, లాకీషులో ఉన్న పొలంలో, అజేకా, దానికి చెందిన ఊళ్లలో నివాసం ఉన్నారు. బెయేర్షెబా నుండి హిన్నోము లోయ దాకా వారు నివసించారు.
住在匝諾亞、阿杜藍和所屬村鎮,住在拉基士和城外四郊、住在阿則卡和所屬村鎮。他們定居之處,是從貝爾舍巴起,直到希農山谷。
31 ౩౧ గెబ నివాసులైన బెన్యామీనీయులు మిక్మషులో, హాయిలో, బేతేలు వాటికి చెందిన ఊళ్లలో,
本雅明的子孫,有些住在革巴、米革瑪士、阿雅、貝特耳、和所屬村鎮,
32 ౩౨ అనాతోతులో, నోబులో, అనన్యాలో,
住在阿諾托特、諾布、阿納尼雅、
33 ౩౩ హాసోరులో, రామాలో, గిత్తయీములో,
哈祚爾、辣瑪、基塔殷、
34 ౩౪ హదీదులో, జెబోయిములో, నెబల్లాటులో,
哈狄得、責波殷、乃巴拉特、
35 ౩౫ లోదులో, పనివారి లోయ అని పిలిచే ఓనోలో నివసించారు.
羅得、敖諾和匠人谷。
36 ౩౬ లేవీ గోత్రికుల గుంపులో యూదా, బెన్యామీను గోత్రాలవారు కొన్ని భాగాలు పంచుకున్నారు.
肋未人散居在猶大和本雅明。