< నహూము 3 >
1 ౧ నరహత్య చేసిన పట్టణమా, నీకు బాధ తప్పదు. అది నిరంతరం అబద్ధాలతో దొంగిలించి తెచ్చిన వస్తువులతో నిండి ఉంది. దాని చేతుల్లో హతమైన వారు దానిలో ఉన్నారు.
ख़ूँरेज़ शहर पर अफ़सोस, वह झूट और लूट से बिल्कुल भरा है; वह लूटमार से बाज़ नहीं आता।
2 ౨ రథసారధి చేసే కొరడా శబ్దం, రథ చక్రాల ధ్వని, గుర్రాల అడుగుల శబ్దం, వేగంగా పరిగెత్తే రథాల శబ్దం వినబడుతున్నాయి.
सुनो, चाबुक की आवाज़, और पहियों की खड़खड़ाहट और घोड़ों का कूदना और रथों के हिचकोले!
3 ౩ రౌతులు వేగంగా పరుగెత్తుతున్నారు, కత్తులు, ఈటెలు తళతళ మెరుస్తున్నాయి. శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కూలిన శవాలకు లెక్కే లేదు, శవాలు కాళ్ళకు తగిలి దాడి చేసే వారు తొట్రుపడుతున్నారు.
देखो, सवारों का हमला और तलवारों की चमक और भालों की झलक और मक़्तूलों के ढेर, और लाशों के तूदे; लाशों की इन्तिहा नहीं, लाशों से ठोकरें खाते हैं।
4 ౪ ఇందుకు కారణం, అది మంత్ర విద్యలో ఆరితేరిన అందమైన వేశ్య జరిగించిన కామ క్రీడలే. ఆమె తన జారత్వంతో జాతులను అమ్మేసింది. తన ఇంద్రజాలంతో మనుషులను వశపరచుకుంది.
ये उस ख़ूबसूरत जादूगरनी फ़ाहिशा की बदकारी की कसरत का नतीजा है, क्यूँकि वह क़ौमों को अपनी बदकारी से, और घरानों को अपनी जादूगरी से बेचती है।
5 ౫ సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “నేను నీకు విరోధిని. నీ బట్టలు నీ ముఖం పైకి ఎత్తి ప్రజలకు నీ మర్మాంగాలను చూపిస్తాను. రాజ్యాలకు నీ అవమానాన్ని బట్టబయలు చేస్తాను.
रब्ब — उल — अफ़वाज फ़रमाता है, देख, मैं तेरा मुख़ालिफ़ हूँ और तेरे सामने से तेरा दामन उठा दूँगा, और क़ौमों को तेरी बरहनगी और ममलुकतों को तेरा सत्र दिखलाऊँगा।
6 ౬ నీ ముఖంపై పెంట విసిరి చూసేవారు నిన్ను ఏవగించుకునేలా చేస్తాను.
और नजासत तुझ पर डालूँगा, और तुझे रुस्वा करूँगा, हाँ तुझे अन्गुश्तनुमा कर दूँगा।
7 ౭ అప్పుడు నిన్ను చూసేవారంతా నీ దగ్గర నుండి పారిపోతారు. ‘నీనెవె పాడైపోయింది. దాని కోసం ఎవరు విలపిస్తారు? నిన్ను ఓదార్చేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు’ అంటారు.”
और जो कोई तुझ पर निगाह करेगा, तुझ से भागेगा और कहेगा, नीनवा वीरान हुआ; इस पर कौन तरस खाएगा? मैं तेरे लिए तसल्ली देने वाले कहाँ से लाऊँ।
8 ౮ చుట్టూ నీటితో సముద్రాన్నే తనకు కావలిగా, సరిహద్దుగా చేసుకుని, నైలు నది దగ్గర ఉన్న తేబేసు పట్టణం కంటే నువ్వు గొప్పదానివా?
क्या तू नोआमून से बेहतर हैं, जो नहरों के बीच बसा था और पानी उसकी चारों तरफ़ था; जिसकी शहरपनाह दरिया-ए-नील था, और जिसकी फ़सील पानी था?
9 ౯ ఇతియోపియా, ఈజిప్టు దేశాలు దానికి అండ. పూతు, లిబియా దాని మిత్ర పక్షాలు.
कूश और मिस्र उसकी बेइन्तिहा तवानाई थे; फ़ूत और लूबीम उसके हिमायती थे।
10 ౧౦ అయినప్పటికీ దాని నివాసులు బందీలయ్యారు. పురవీధుల్లో శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు కొట్టి చంపారు. ప్రముఖుల మీద చీట్లు వేశారు, దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించారు.
तोभी वह जिलावतन और ग़ुलाम हुआ; उसके बच्चे सब कूचों में पटक दिए गए, और उनके शुर्फ़ा पर पर्चा डाला गया, और उसके सब बुज़ुर्ग ज़ंजीरों से जकड़े गए।
11 ౧౧ నీకు కూడా మత్తు ఎక్కుతుంది. నువ్వు దాక్కుంటావు. నీ మీదికి శత్రువు రావడం చూసి ఆశ్రయం కోసం వెదకుతావు.
तू भी मस्त होकर अपने आप को छिपाएगा, और दुश्मन के सामने से पनाह ढूँडेगा।
12 ౧౨ అయితే నీ కోటలన్నీ అకాలంలో పండిన కాయలున్న అంజూరపు చెట్లలాగా ఉన్నాయి. ఎవరైనా ఒకడు వాటిని ఊపితే చాలు, పండ్లు తిందామని వచ్చినవాడి నోట్లో పడతాయి.
तेरे सब क़िले' अंजीर के दरख़्त की तरह हैं, जिस पर पहले पक्के फल लगे हों, जिसको अगर कोई हिलाए तो वह खाने वाले के मुँह में गिर पड़ें।
13 ౧౩ నీ నివాసులు స్త్రీల వంటి వారు. నీ దేశపు ద్వారాలు శత్రువులకు తెరిచి ఉన్నాయి. ద్వారాల అడ్డకర్రలు కాలిపోయాయి.
देख, तेरे अन्दर तेरे मर्द 'औरतें बन गए, तेरी मम्लुकत के फाटक तेरे दुश्मनों के सामने खुले हैं; आग तेरे अड़बंगों को खा गई।
14 ౧౪ వారు ముట్టడించే సమయానికి నీళ్లు చేదుకో. నీ కోటలను దిట్టపరచుకో. బంకమట్టిలోకి దిగి ఇటుకల కోసం బురద తొక్కు. కొలిమి సిద్ధం చేసుకో.
तू अपने घिराव के वक़्त के लिए पानी भर ले, और अपने क़िलों' को मज़बूत कर; गढ़े में उतरकर मिट्टी तैयार कर, और ईंट का साँचा हाथ में ले।
15 ౧౫ అక్కడే నిన్ను అగ్ని కాల్చివేస్తుంది. కత్తివాత పడి నువ్వు నాశనం అవుతావు. గొంగళిపురుగు తినివేసే విధంగా అది నిన్ను నాశనం చేస్తుంది. గొంగళిపురుగులంత విస్తారంగా, మిడతలంత విస్తారంగా నీ సంఖ్యను పెంచుకో.
वहाँ आग तुझे खा जाएगी, तलवार तुझे काट डालेगी। वह टिड्डी की तरह तुझे चट कर जाएगी। अगरचे तू अपने आप को चट कर जाने वाली टिड्डियों की तरह फ़िरावान करे, और फ़ौज — ए — मलख़ की तरह बेशुमार हो जाए।
16 ౧౬ నీ వర్తకుల సంఖ్య లెక్కకు ఆకాశ నక్షత్రాలకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు మిడతల్లాగా వచ్చి దోచుకుని ఎగిరిపోతారు.
तू ने अपने सौदागरों को आसमान के सितारों से ज़्यादा फ़िरावान किया। चट कर जाने वाली टिड्डी, ख़राब करके उड़ जाती है।
17 ౧౭ నీ వీరులు లెక్కకు మిడతలంత విస్తారంగా ఉన్నారు. నీ సేనానులు చలికాలంలో కంచెల్లో దిగిన మిడతల్లాగా ఉన్నారు. ఎండ కాసినప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి. అవి ఎక్కడికి వెళ్లి వాలతాయో ఎవరికీ తెలియదు.
तेरे हाकिम मलख़ और तेरे सरदार टिड्डियों का हुजूम हैं, जो सर्दी के वक़्त झाड़ियों में रहती हैं; और जब आफ़ताब निकलता है तो उड़ जाती हैं, और उनका मकान कोई नहीं जानता।
18 ౧౮ అష్షూరు రాజా, నీ సంరక్షకులు నిద్రపోయారు. నీ ప్రధానులు విశ్రాంతిలో ఉన్నారు. నీ ప్రజలు పర్వతాల్లోకి చెదరిపోయారు. వారిని తిరిగి సమకూర్చేవాడు ఒక్కడు కూడా లేదు.
ऐ शाह — ए — असूर, तेरे चरवाहे सो गए; तेरे सरदार लेट गए। तेरी रि'आया पहाड़ों पर बिखर गई, और उसको इकठ्ठा करने वाला कोई नहीं।
19 ౧౯ నీకు తగిలిన దెబ్బ తీవ్రమైనది. నీ గాయాన్ని ఎవ్వరూ బాగు చెయ్యలేరు. నిన్ను గూర్చిన వార్త విన్న వాళ్ళంతా నీకు జరిగిన దానికి సంతోషంతో చప్పట్లు కొడతారు. ఎందుకంటే ప్రజలంతా నీచేత ఎడతెగకుండా హింసల పాలయ్యారు.
तेरी शिकस्तगी ला'इलाज है, तेरा ज़ख़्म कारी है; तेरा हाल सुनकर सब ताली बजाएँगे। क्यूँकि कौन है जिस पर हमेशा तेरी शरारत का बार न था?