< నహూము 2 >
1 ౧ నీనెవే పట్టణమా, నాశనకారుడు నీ మీదికి వస్తున్నాడు. నీ కోటలకు, దారుల వెంబడి కాపలా ఉంచుకో. నడుం బిగించుకుని తీవ్రంగా ఎదిరించు.
১যে তোমাদের টুকরো টুকরো করবে সে তোমার বিরুদ্ধে এগিয়ে আসছে। শহরের দেওয়ালে উপর তোমার সৈন্য সাজাও, রাস্তায় পাহারা দাও, নিজেদেরকে শক্তিশালী কর, তোমার সৈন্যদল জড়ো কর।
2 ౨ దోపిడీ దారులు యాకోబు సంతతి వారిని దోచుకున్నా వాళ్ళ ద్రాక్ష తోటలను నరికివేసినా ఇశ్రాయేలీయుల వైభవం వలే యెహోవా యాకోబు సంతతి వారికి పూర్వ వైభవం తిరిగి కల్పిస్తాడు.
২যদিও ধ্বংসকারীরা ইস্রায়েলকে জনশূন্য করেছে এবং তার আঙ্গুর শাখাগুলো ধ্বংস করে দিয়েছে তবুও সদাপ্রভু ইস্রায়েলের মত যাকোবের মহিমাকে ফিরয়ে আনবেন।
3 ౩ ఆయన శూరుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి. పరాక్రమశాలురు ఎర్రని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు, వ్యూహాలు పన్నే రోజున ఆయన సైన్యం, రథాలు మెరుగు పెట్టిన ఉక్కులాగా మెరిసిపోతున్నాయి. సరళవృక్షం కలపతో చేసిన ఈటెలను వీరులు అటూ ఇటూ ఊపుతున్నారు.
৩সৈন্যদের ঢাল রক্তে লাল, আর যোদ্ধারা টকটকে লাল রঙের পোশাক পরে আছে। তারা যুদ্ধের জন্য তৈরী হচ্ছে, তাদের রথগুলোর ধাতু ঝকমক করছে; তারা বর্শা ঘোরাচ্ছে।
4 ౪ వీధుల్లో రథాలు అతి వేగంగా పరుగులు పెడుతున్నాయి. రాజ వీధుల్లో రథాలు ఒక దానిపై ఒకటి పడేంత వేగంగా పరుగెత్తుతున్నాయి, అవి దివిటీల్లాగా కనిపిస్తున్నాయి. మెరుపుల్లాగా వేగంగా వెళ్తున్నాయి.
৪তাদের সব রথ রাস্তায় ঝড়ের মত চলে আর শহরের চওড়া জায়গাগুলোর মধ্য দিয়ে বেপরোয়াভাবে এদিক ওদিক যাচ্ছে। তারা দেখতে মশালের মত এবং বিদ্যুতের মত ছুটে যাচ্ছে।
5 ౫ మిమ్మల్ని ముక్కలుచెక్కలు చేసే వాడు తన పరాక్రమశాలురను పిలిపిస్తున్నాడు. వాళ్ళు రహదారుల్లో పరుగులు పెడుతూ తొట్రుపడతారు. ప్రాకారం దగ్గరికి పరుగెత్తి వచ్చి దాడి చేసే వారి భద్రత కోసం ఏర్పాట్లు చేస్తారు.
৫রাজা তাঁর আধিকারিকদের ডাকছেন; তারা হোঁচট খেয়েও এগিয়ে যাচ্ছে। তারা শহরের দেয়ালের দিকে ছুটে যাচ্ছে; আক্রমণকারীদের প্রতিরোধ করার জন্য ঢাল তৈরী করা হয়েছে।
6 ౬ నదులకు ఎదురుగా ఉన్న ద్వారాలను తెరుస్తున్నారు. రాజ నగరు కూలిపోతున్నది.
৬নদীর দরজাগুলো খোলা হয়েছে, আর প্রাসাদ ভেঙে পড়ল।
7 ౭ రాణిని నగ్నంగా చేసి ఈడ్చుకుపోతున్నారు. ఆమె దాసీలు గువ్వల్లాగా మూలుగుతున్నారు. రొమ్ము కొట్టుకుంటున్నారు.
৭তার রানীকে বিবস্ত্র করে তাকে নিয়ে যাওয়া জন্য আদেশ করা হল। তাঁর দাসীরা পায়রার মত শোক করছে এবং বুক চাপড়াচ্ছে।
8 ౮ నీనెవె పట్టణం నిర్మాణమైనప్పటి నుండి నీటికొలనులాగా ఉంది. ఆ పట్టణ ప్రజలు పారిపోతున్నారు. ఆగండి, ఆగండి అని పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూసేవాడు ఒక్కడు కూడా లేడు.
৮নীনবী জলে পূর্ণ পুকুরের মত, সকলে জলের স্রোতের মত পালিয়ে যাচ্ছে, অন্যরা চিত্কার করছে, থামো, থামো বললেও কেউ ফিরে তাকাচ্ছে না।
9 ౯ అది లెక్కలేనన్ని వివిధ విచిత్ర ఆభరణాలతో నిండి ఉంది. వెండి కొల్లగొట్టండి, బంగారం కొల్లగొట్టండి.
৯তার রূপা লুট কর, সোনা লুট কর। কারণ ধনসম্পদের কোনো শেষ নেই; এগুলো সব সুন্দর জিনিসের গৌরব।
10 ౧౦ అది ఏమీ లేకుండా ఖాళీగా, పాడుబడిపోతుంది. ప్రజల గుండెలు నీరైపోతున్నాయి. వాళ్ళ మోకాళ్లు వణకుతున్నాయి, అందరిలో వేదన ఉంది. అందరి ముఖాలు తెల్లబోతున్నాయి.
১০নীনবীকে শূন্য ও ধ্বংস করা হচ্ছে। তার লোকদের হৃদয় গলে গেছে, হাঁটুতে হাঁটুতে ঠোকাঠুকি লাগছে, তাদের প্রত্যেকের যন্ত্রণা, তাদের সকলের মুখ ফ্যাকাশে হয়ে গিয়েছে।
11 ౧౧ సింహాల గుహ ఏమయింది? సింహపు పిల్లల మేత మేసే స్థలం ఏమయింది? ఎవరి భయం లేకుండా సింహం, ఆడ సింహం, సింహం పిల్లలు తిరిగిన స్థలం ఏమయింది?
১১সিংহদের গর্ত এখন কোথায়, যেখানে তারা তাদের বাচ্চাদের খাওয়াত, যেখানে সিংহ, সিংহী ও তাদের বাচ্চারা ঘুরে বেড়াত।
12 ౧౨ తన పిల్లలకు కావలసినంత తిండి సమకూరుస్తూ, ఆడ సింహాలకు కావలసినంత ఎర కడుపారా నింపుతూ, తన గుహలను, నివాసాలను వేటాడి తెచ్చిన మాంసంతో నింపిన సింహం ఏమైయింది?
১২সিংহ তার বাচ্চাদের জন্য যথেষ্ট পশু মারত আর তার সিংহীদের জন্য গলা টিপে মারত অনেক পশু; সে তার মেরে ফেলা পশু দিয়ে তার বাসস্থান এবং ছিঁড়ে ফেলা পশু দিয়ে তার গুহা করত।
13 ౧౩ సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు, నేను నీకు విరోధిని. నీ రథాలను వాటి పొగ పైకి ఎగబ్రాకేలా కాల్చివేస్తాను. సింహం పిల్లలు నీ కత్తి వేటుకు గురౌతాయి. నీకు ఏమీ దొరకకుండా నీకు చెందినదంతా భూమిలో నుండి తీసివేస్తాను. నీ వార్తాహరుల స్వరం ఇకపై వినబడకుండా చేస్తాను.
১৩বাহিনীদের সদাপ্রভু বলছেন, “দেখ, আমি তোমার বিরুদ্ধে; আমি তোমার রথগুলো পুড়িয়ে ফেলব, আর তলোয়ার তোমার যুবসিংহদের গ্রাস করবে। আমি তোমার শিকারের জন্য কোন কিছুই এই পৃথিবীতে ফেলে রাখব না। তোমার দূতদের গলার স্বর আর শোনা যাবে না।”