< మీకా 7 >
1 ౧ నాకెంతో బాధగా ఉంది! వేసవికాలపు పండ్లు కోసుకున్న తరువాత, ద్రాక్షతోటల్లో మిగిలిపోయిన ద్రాక్షపండ్ల పరిగె కూడా ఏరుకున్న తరువాత ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఆలా ఉంది. పండ్ల గుత్తులు ఇక ఏమీ లేవు. అయినా నేను మొదటి అంజూరపు పండ్ల కోసం ఆశతో ఉన్నాను.
Taabu gani hii niliyo nayo! Nimefanana na yule akusanyaye matunda ya kiangazi, aokotaye masazo baada ya kuvunwa shamba la mizabibu; hakuna kishada chenye matunda ya kula, hakuna hata ile tini ya mwanzoni ninayoitamani.
2 ౨ భక్తులు దేశంలో లేకుండా పోయారు. ప్రజల్లో యథార్థపరుడు ఒకడూ లేడు. హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు. ప్రతివాడూ తన తోటి దేశస్థుని వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు.
Wanaomcha Mungu wameondolewa kutoka nchi; hakuna mtu mnyofu hata mmoja aliyebaki. Watu wote wanavizia kumwaga damu, kila mmoja anamwinda ndugu yake kwa wavu.
3 ౩ వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి. అధికారి డబ్బులు అడుగుతాడు. న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు. గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు. ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు.
Mikono yote miwili ni hodari katika kufanya ubaya, mtawala anadai zawadi, hakimu anapokea rushwa, wenye nguvu wanaamuru wanachotaka: wote wanafanya shauri baya pamoja.
4 ౪ వారిలోని మంచివారు ముళ్ళచెట్టులాంటి వారు. వారిలోని నిజాయితీ పరులు ముళ్ళకంచెలాంటి వారు. అది నీ కాపలాదారులు ముందే చెప్పిన రోజు, మీరు శిక్ష అనుభవించే రోజు. ఇప్పుడే వారికి కలవరం వచ్చేసింది.
Aliye mwema kupita wote kati yao ni kama mchongoma, anayeonekana mnyofu zaidi miongoni mwao ni mbaya kuliko uzio wa miiba. Siku ya walinzi wako imewadia, siku atakayokutembelea Mungu. Sasa ni wakati wao wa kuchanganyikiwa.
5 ౫ ఏ పొరుగువాన్నీ నమ్మవద్దు. ఏ స్నేహితుని మీదా నమ్మకం పెట్టుకోవద్దు. నీ కౌగిట్లో పడుకునే స్త్రీతో కూడా జాగ్రత్తగా మాట్లాడు.
Usimtumaini jirani; usiweke matumaini kwa rafiki. Hata kwa yule alalaye kifuani mwako uwe mwangalifu kwa maneno yako.
6 ౬ కొడుకు తండ్రిని అగౌరవపరుస్తున్నాడు. కూతురు తన తల్లి మీద, కోడలు తన అత్త మీద ఎదురు తిరుగుతారు. తన సొంత ఇంటివారే తన శత్రువులు.
Kwa kuwa mwana humdharau baba yake, naye binti huinuka dhidi ya mama yake, mkwe kuwa kinyume na mama mkwe wake: adui wa mtu ni wale wa nyumbani mwake hasa.
7 ౭ అయితే, నా వరకైతే నేను యెహోవా కోసం ఎదురుచూస్తాను. రక్షణకర్త అయిన నా దేవుని కోసం నేను కనిపెడతాను. నా దేవుడు నా మాట వింటాడు.
Lakini mimi, namtazama Bwana kwa matumaini, namngoja Mungu Mwokozi wangu; Mungu wangu atanisikia mimi.
8 ౮ నా పగవాడా, నా మీద అతిశయించవద్దు. నేను కింద పడినా తిరిగి లేస్తాను. నేను చీకట్లో కూర్చున్నపుడు యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు.
Usifurahie msiba wangu, ee adui yangu! Ingawa nimeanguka, nitainuka. Japo ninaketi gizani, Bwana atakuwa nuru yangu.
9 ౯ నేను యెహోవా దృష్టికి పాపం చేశాను, కాబట్టి ఆయన నా పక్షాన వాదించి నా పక్షాన న్యాయం తీర్చే వరకూ నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు. ఆయన తన న్యాయంలో నన్ను కాపాడడం నేను చూస్తాను.
Kwa sababu nimetenda dhambi dhidi yake, nitabeba ghadhabu ya Bwana, mpaka atakaponitetea shauri langu na kuithibitisha haki yangu. Atanileta nje kwenye mwanga, nami nitaiona haki yake.
10 ౧౦ నా శత్రువు దాన్ని చూస్తాడు. “నీ యెహోవా దేవుడు ఎక్కడ?” అని నాతో అన్నది అవమానం పాలవుతుంది. నా కళ్ళు ఆమెను చూస్తాయి. వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు.
Kisha adui yangu ataliona naye atafunikwa na aibu, yule aliyeniambia, “Yu wapi Bwana Mungu wako?” Macho yangu yataona kuanguka kwake, hata sasa atakanyagwa chini ya mguu kama tope barabarani.
11 ౧౧ నీ గోడలు కట్టించే రోజు వస్తుంది. ఆరోజు నీ సరిహద్దులు చాలా దూరం వరకూ విశాలమవుతాయి.
Siku ya kujenga kuta zako itawadia, siku ya kupanua mipaka yako.
12 ౧౨ ఆ రోజు అష్షూరు దేశం నుంచి, ఐగుప్తు దేశపు పట్టణాల నుంచి, ఐగుప్తు మొదలు యూఫ్రటీసు నది వరకూ ఉన్న ప్రాంతం నుంచి, ఒక సముద్రం నుంచి మరో సముద్రం వరకూ ఒక పర్వతం నుంచి మరో పర్వతం వరకూ ఉన్న ప్రజలు నీ దగ్గరికి వస్తారు.
Siku hiyo watu watakuja kwako kutoka Ashuru na miji ya Misri, hata kutoka Misri hadi Frati na kutoka bahari hadi bahari na kutoka mlima hadi mlima.
13 ౧౩ ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన, వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి.
Dunia itakuwa ukiwa kwa sababu ya wakazi wake, kwa sababu ya matunda ya matendo yao.
14 ౧౪ నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు. కర్మెలుకు చెందిన అడవిలో వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నా పూర్వ కాలంలో బాషాను, గిలాదుల్లో మేసినట్టు మేస్తారు.
Wachunge watu wako kwa fimbo yako, kundi la urithi wako, ambalo linaishi peke yake msituni, katika nchi ya malisho yenye rutuba. Waache walishe katika Bashani na Gileadi kama ilivyokuwa siku za kale.
15 ౧౫ ఐగుప్తుదేశంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను ప్రజలకు అద్భుతాలు చూపిస్తాను.
“Kama siku zile mlipotoka Misri, nitawaonyesha maajabu yangu.”
16 ౧౬ రాజ్యాలు వారందరి బలం చూసి సిగ్గుపడతాయి. వాళ్ళు తమ నోటిమీద తమ చేతులు పెట్టుకుంటారు. వాళ్ళ చెవులు వినబడవు.
Mataifa yataona na kuaibika, waliondolewa nguvu zao zote. Wataweka mikono yao kwenye vinywa vyao na masikio yao yatakuwa na uziwi.
17 ౧౭ పాము లాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు. వాళ్ళు తమ గుహల్లోనుంచి భయంతో బయటికి వస్తారు. భయంతో మన యెహోవా దేవుని దగ్గరికి వస్తారు. నిన్నుబట్టి వాళ్ళు భయపడతారు.
Wataramba mavumbi kama nyoka, kama viumbe vitambaavyo juu ya ardhi. Watatoka nje ya mapango yao wakitetemeka; watamgeukia Bwana Mungu wetu kwa hofu nao watakuogopa.
18 ౧౮ నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి. నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి. నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి. నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.
Ni nani Mungu kama wewe, ambaye anaachilia dhambi na kusamehe makosa ya mabaki ya urithi wake? Wewe huwi na hasira milele, bali unafurahia kuonyesha rehema.
19 ౧౯ నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు. నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు. మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు.
Utatuhurumia tena, utazikanyaga dhambi zetu chini ya nyayo zako, na kutupa maovu yetu yote katika vilindi vya bahari.
20 ౨౦ నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు. పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.
Utakuwa wa kweli kwa Yakobo, nawe utamwonyesha Abrahamu rehema, kama ulivyowaahidi kwa kiapo baba zetu siku za kale.