< మీకా 7 >

1 నాకెంతో బాధగా ఉంది! వేసవికాలపు పండ్లు కోసుకున్న తరువాత, ద్రాక్షతోటల్లో మిగిలిపోయిన ద్రాక్షపండ్ల పరిగె కూడా ఏరుకున్న తరువాత ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఆలా ఉంది. పండ్ల గుత్తులు ఇక ఏమీ లేవు. అయినా నేను మొదటి అంజూరపు పండ్ల కోసం ఆశతో ఉన్నాను.
Malè a mwen menm! Anverite, mwen tankou moun k ap ranmase fwi gran sezon, k ap rasanble retay rezen yo lè yo fin retire diven. Pa gen grap rezen pou manje, ni yon grenn premye fwi fig etranje pou m ta anvi goute.
2 భక్తులు దేశంలో లేకుండా పోయారు. ప్రజల్లో యథార్థపరుడు ఒకడూ లేడు. హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు. ప్రతివాడూ తన తోటి దేశస్థుని వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు.
Moun fidèl fin disparèt sou latè a, e nanpwen moun dwat pami lòm. Yo tout kouche an anbiskad pou vèse san; yo tout fè lachas dèyè frè yo ak pèlen.
3 వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి. అధికారి డబ్బులు అడుగుతాడు. న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు. గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు. ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు.
Toude men yo sou sa ki mal la pou fè l byen. Prens lan mande, e jij la prè pou yon glise anba tab. Yon nonm pwisan prezante tout mechanste ke nanm li bezwen. Konsa yo trese l pou fè l vin yon sèl.
4 వారిలోని మంచివారు ముళ్ళచెట్టులాంటి వారు. వారిలోని నిజాయితీ పరులు ముళ్ళకంచెలాంటి వారు. అది నీ కాపలాదారులు ముందే చెప్పిన రోజు, మీరు శిక్ష అనుభవించే రోజు. ఇప్పుడే వారికి కలవరం వచ్చేసింది.
Pi bon nan yo se pikan. Pi dwat la pi mal pase kloti zepin. Jou gadyen ou, jou vizitasyon ou an fin rive. Koulye a y ap boulvèse, egare nèt.
5 ఏ పొరుగువాన్నీ నమ్మవద్దు. ఏ స్నేహితుని మీదా నమ్మకం పెట్టుకోవద్దు. నీ కౌగిట్లో పడుకునే స్త్రీతో కూడా జాగ్రత్తగా మాట్లాడు.
Pa fè konfyans ak yon vwazen. Pa fè konfyans ak yon zanmi. Ak fi la k ap kouche ak ou a, gade pòt bouch ou!
6 కొడుకు తండ్రిని అగౌరవపరుస్తున్నాడు. కూతురు తన తల్లి మీద, కోడలు తన అత్త మీద ఎదురు తిరుగుతారు. తన సొంత ఇంటివారే తన శత్రువులు.
Paske fis la derespekte papa a, e fi a leve kont manman li, bèlfi a kont bèlmè li; lènmi a yon nonm se anndan lakay li.
7 అయితే, నా వరకైతే నేను యెహోవా కోసం ఎదురుచూస్తాను. రక్షణకర్త అయిన నా దేవుని కోసం నేను కనిపెడతాను. నా దేవుడు నా మాట వింటాడు.
Men pou mwen menm, mwen va gade vè SENYÈ a. Mwen va tann Bondye a sali mwen an. Bondye mwen an va koute mwen.
8 నా పగవాడా, నా మీద అతిశయించవద్దు. నేను కింద పడినా తిరిగి లేస్తాను. నేను చీకట్లో కూర్చున్నపుడు యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు.
Pa rejwi nou kont mwen menm, O lènmi mwen. Malgre mwen tonbe, mwen va leve ankò. Malgre mwen chita nan tenèb, SENYÈ a va yon limyè pou mwen.
9 నేను యెహోవా దృష్టికి పాపం చేశాను, కాబట్టి ఆయన నా పక్షాన వాదించి నా పక్షాన న్యాయం తీర్చే వరకూ నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు. ఆయన తన న్యాయంలో నన్ను కాపాడడం నేను చూస్తాను.
Mwen va pote endiyasyon SENYÈ a, akoz mwen te peche kont Li, jiskaske li plede ka mwen an, e egzekite jijman pou mwen. Konsa, Li va mennen m sòti nan plen limyè, e mwen va wè ladwati Li.
10 ౧౦ నా శత్రువు దాన్ని చూస్తాడు. “నీ యెహోవా దేవుడు ఎక్కడ?” అని నాతో అన్నది అవమానం పాలవుతుంది. నా కళ్ళు ఆమెను చూస్తాయి. వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు.
Answit, lènmi m va wè sa, e gwo wont va kouvri fi la ki te di m: “Kote SENYÈ Bondye ou a?” Zye m va gade fi sa a. Epi konsa, nan lè sa a, li va vin foule anba pye tankou kras labou nan lari.
11 ౧౧ నీ గోడలు కట్టించే రోజు వస్తుంది. ఆరోజు నీ సరిహద్దులు చాలా దూరం వరకూ విశాలమవుతాయి.
Sa va yon jou pou bati miray ou yo. Nan jou sa a, lizyè ou yo va vin grandi.
12 ౧౨ ఆ రోజు అష్షూరు దేశం నుంచి, ఐగుప్తు దేశపు పట్టణాల నుంచి, ఐగుప్తు మొదలు యూఫ్రటీసు నది వరకూ ఉన్న ప్రాంతం నుంచి, ఒక సముద్రం నుంచి మరో సముద్రం వరకూ ఒక పర్వతం నుంచి మరో పర్వతం వరకూ ఉన్న ప్రజలు నీ దగ్గరికి వస్తారు.
Sa va yon jou ke yo va vin kote ou soti Assyrie ak vil Égypte yo; soti Égypte menm pou rive Rivyè Euphrate la, menm soti nan lanmè, rive nan lanmè, nan mòn rive nan mòn.
13 ౧౩ ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన, వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి.
Malgre, latè va vin dezole akoz sila k ap viv ladann yo, akoz fwi a zak yo.
14 ౧౪ నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు. కర్మెలుకు చెందిన అడవిలో వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నా పూర్వ కాలంలో బాషాను, గిలాదుల్లో మేసినట్టు మేస్తారు.
Mennen pèp Ou a ak kwòk beje Ou a, bann mouton a eritaj Ou a, ki rete pou kont yo, nan forè. Kite yo manje nan mitan bon pa, nan Basan ak Galaad, tankou nan ansyen tan an.
15 ౧౫ ఐగుప్తుదేశంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను ప్రజలకు అద్భుతాలు చూపిస్తాను.
“Tankou nan jou lè ou te sòti nan peyi Égypte la, Mwen va montre ou Mirak.”
16 ౧౬ రాజ్యాలు వారందరి బలం చూసి సిగ్గుపడతాయి. వాళ్ళు తమ నోటిమీద తమ చేతులు పెట్టుకుంటారు. వాళ్ళ చెవులు వినబడవు.
Nasyon yo va wè, e yo va wont de tout pwisans yo. Yo va mete men yo sou bouch yo; zòrèy yo va vin soud.
17 ౧౭ పాము లాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు. వాళ్ళు తమ గుహల్లోనుంచి భయంతో బయటికి వస్తారు. భయంతో మన యెహోవా దేవుని దగ్గరికి వస్తారు. నిన్నుబట్టి వాళ్ళు భయపడతారు.
Yo va niche pousyè tankou sèpan. Tankou bagay k ap ranpe sou latè, yo va sòti tou ap tranble nan sitadèl souteren yo. Yo va vin vè SENYÈ Bondye nou an, ak gwo lakrent; konsa, yo va pè devan Ou.
18 ౧౮ నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి. నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి. నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి. నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.
Se kilès ki yon Bondye tankou Ou, ki padone inikite, e ki bliye zak rebèl a retay pèp eritaj li? Li pa kenbe kòlè li pou tout tan an, akoz Li pran plezi nan lanmou dous Li.
19 ౧౯ నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు. నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు. మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు.
Li va gen konpasyon pou nou ankò. Li va foule inikite nou yo anba pye L. Wi, Ou va jete tout peche yo nan fon lanmè.
20 ౨౦ నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు. పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.
Ou va bay verite a Jacob ak mizerikòd a Abraham, tankou Ou te sèmante a papa zansèt nou yo depi nan jou ansyen yo.

< మీకా 7 >