< మీకా 6 >
1 ౧ యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి. మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు, లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు. నీ స్వరం కొండలు వినాలి.
Sikiliza asemalo Bwana: “Simama, tetea shauri lako mbele ya milima; vilima na visikie lile unalotaka kusema.
2 ౨ పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు యెహోవా చేసిన ఫిర్యాదు వినండి. ఆయన ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు.
Sikilizeni, ee milima, mashtaka ya Bwana, sikilizeni, enyi misingi ya milele ya dunia. Kwa kuwa Bwana ana shauri dhidi ya watu wake; anatoa mashtaka dhidi ya Israeli.
3 ౩ నా ప్రజలారా, నేను మీకేం చేశాను? మిమ్మల్ని నేనెలా కష్టపెట్టాను? జవాబివ్వండి.
“Watu wangu, nimewatendea nini? Nimewalemea kwa jinsi gani? Mnijibu.
4 ౪ ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను. బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను. మీ కోసం మోషే అహరోను మిర్యాములను పంపించాను.
Nimewatoa kutoka Misri na kuwakomboa kutoka nchi ya utumwa. Nilimtuma Mose awaongoze, pia Aroni na Miriamu.
5 ౫ నా ప్రజలారా, మోయాబురాజు బాలాకు చేసిన ఆలోచన, బెయోరు కుమారుడు బిలాము అతనికిచ్చిన జవాబు గుర్తుకు తెచ్చుకోండి. యెహోవా నీతి పనులు మీరు తెలుసుకునేలా షిత్తీము మొదలు గిల్గాలు వరకూ జరిగిన వాటిని మనసుకు తెచ్చుకోండి.
Watu wangu, kumbukeni jinsi Balaki mfalme wa Moabu alivyofanya shauri na kile Balaamu mwana wa Beori alichojibu. Kumbukeni safari yenu kutoka Shitimu mpaka Gilgali, ili mfahamu matendo ya haki ya Bwana.”
6 ౬ యెహోవాకు నేనేం తీసుకురాను? మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను? దహనబలులనూ ఏడాది దూడలనూ తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా?
Nimjie Bwana na kitu gani na kusujudu mbele za Mungu aliyetukuka? Je, nije mbele zake na sadaka za kuteketezwa, nije na ndama za mwaka mmoja?
7 ౭ వేలకొలది పొట్టేళ్లు, పది వేల నదుల నూనెతో యెహోవా సంతోష పడతాడా? నా అతిక్రమానికి నా పెద్ద కొడుకుని నేనివ్వాలా? నా సొంత పాపానికి నా గర్భఫలాన్ని నేనివ్వాలా?
Je, Bwana atafurahishwa na kondoo dume elfu, au mito elfu kumi ya mafuta? Je, nimtoe mzaliwa wangu wa kwanza kwa ajili ya kosa langu, mtoto wangu mwenyewe kwa ajili ya dhambi ya nafsi yangu?
8 ౮ మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు. ఆయన నిన్ను కోరేదేంటంటే, న్యాయంగా ప్రవర్తించు. కనికరాన్ని ప్రేమించు. వినయంగా నీ దేవునితో నడువు.
Amekuonyesha yaliyo mema, ee mwanadamu. Bwana anataka nini kwako? Ila kutenda kwa haki na kupenda rehema, na kwenda kwa unyenyekevu na Mungu wako.
9 ౯ వినండి. పట్టణానికి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, ఇప్పటికి కూడా తెలివి నీ పేరును గుర్తిస్తున్నది. “బెత్తం పట్ల, దాన్ని తన స్థానంలో ఉంచిన వాని పట్ల శ్రద్ధ చూపండి.
Sikiliza! Bwana anauita mji: kulicha jina lako ni hekima: “Tii hiyo fimbo na yeye aliyeiamuru.
10 ౧౦ దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది. అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి.
Je, bado nisahau, ee nyumba ya uovu, hazina yako uliyopata kwa udanganyifu na vipimo vilivyopunguka, ambavyo vimelaaniwa?
11 ౧౧ తప్పు త్రాసు, తప్పు రాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా?
Je, naweza kuhukumu kuwa mtu mwenye mizani ya udanganyifu hana hatia, aliye na mfuko wa mawe ya kupimia ya uongo?
12 ౧౨ ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు. అక్కడి ప్రజలు అబద్దికులు. వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.
Matajiri wake ni wajeuri; watu wake ni waongo na ndimi zao zinazungumza kwa udanganyifu.
13 ౧౩ కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరచాను. నీ పాపాలను బట్టి నిన్ను నిర్మూలం చేశాను.
Kwa hiyo, nimeanza kukuharibu, kuwaangamiza kwa sababu ya dhambi zenu.
14 ౧౪ నువ్వు తింటావు కానీ తృప్తి పడవు. నీలోపల వెలితిగానే ఉంటుంది. నువ్వు కూడబెట్టుకుంటావు కానీ అది నీకుండదు. నువ్వు దాచుకున్నదాన్ని కత్తికి అప్పగిస్తాను.
Mtakula lakini hamtashiba; matumbo yenu bado yatakuwa matupu. Mtaweka akiba lakini hamtaokoa chochote, kwa sababu mtakachoweka akiba nitatoa kwa upanga.
15 ౧౫ నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు. నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు కానీ ఆ నూనె పూసుకోవు. ద్రాక్షపళ్ళను తొక్కుతావు కానీ ద్రాక్షారసం తాగవు.
Mtapanda lakini hamtavuna; mtakamua zeituni lakini hamtatumia mafuta yake. Mtakamua zabibu lakini hamtakunywa hiyo divai.
16 ౧౬ ఒమ్రీ చట్టాలను మీరు పాటిస్తున్నారు. అహాబు వంశం వాళ్ళు చేసిన పనులన్నిటినీ అనుసరిస్తున్నారు. వారి సలహాల ప్రకారం నడుస్తున్నారు. కాబట్టి నీ పట్టణాన్ని నాశనం చేస్తాను. దానిలో నివసించే వారిని అపహాస్యంగా చేస్తాను. నా ప్రజలకు రావలసిన అవమానం మీరు పొందుతారు.”
Mmezishika sheria za Omri na matendo yote ya nyumba ya Ahabu, tena umefuata desturi zao. Kwa hiyo nitakutoa kwa maangamizi na watu wako kuwa dhihaka; mtachukua dharau za mataifa.”