< మీకా 6 >

1 యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి. మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు, లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు. నీ స్వరం కొండలు వినాలి.
Ακούσατε τώρα ό, τι λέγει ο Κύριος Σηκώθητι, διαδικάσθητι έμπροσθεν των ορέων, και ας ακούσωσιν οι βουνοί την φωνήν σου.
2 పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు యెహోవా చేసిన ఫిర్యాదు వినండి. ఆయన ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు.
Ακούσατε, όρη, την κρίσιν του Κυρίου, και σεις, τα ισχυρά θεμέλια της γης διότι ο Κύριος έχει κρίσιν μετά του λαού αυτού και θέλει διαδικασθή μετά του Ισραήλ.
3 నా ప్రజలారా, నేను మీకేం చేశాను? మిమ్మల్ని నేనెలా కష్టపెట్టాను? జవాబివ్వండి.
Λαέ μου, τι σοι έκαμα; και εις τι σε παρηνώχλησα; μαρτύρησον κατ' εμού.
4 ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను. బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను. మీ కోసం మోషే అహరోను మిర్యాములను పంపించాను.
Διότι σε ανεβίβασα εκ γης Αιγύπτου και σε ελύτρωσα εξ οίκου δουλείας και εξαπέστειλα έμπροσθέν σου τον Μωϋσήν, τον Ααρών και την Μαριάμ.
5 నా ప్రజలారా, మోయాబురాజు బాలాకు చేసిన ఆలోచన, బెయోరు కుమారుడు బిలాము అతనికిచ్చిన జవాబు గుర్తుకు తెచ్చుకోండి. యెహోవా నీతి పనులు మీరు తెలుసుకునేలా షిత్తీము మొదలు గిల్గాలు వరకూ జరిగిన వాటిని మనసుకు తెచ్చుకోండి.
Λαέ μου, ενθυμήθητι τώρα τι εβουλεύθη Βαλάκ ο βασιλεύς του Μωάβ και τι απεκρίθη προς αυτόν Βαλαάμ ο του Βεώρ από Σιττείμ έως Γαλγάλων, διά να γνωρίσητε την δικαιοσύνην του Κυρίου.
6 యెహోవాకు నేనేం తీసుకురాను? మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను? దహనబలులనూ ఏడాది దూడలనూ తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా?
Με τι θέλω ελθεί ενώπιον του Κυρίου, να προσκυνήσω ενώπιον του υψίστου Θεού; θέλω ελθεί ενώπιον αυτού με ολοκαυτώματα, με μόσχους ενιαυσίους;
7 వేలకొలది పొట్టేళ్లు, పది వేల నదుల నూనెతో యెహోవా సంతోష పడతాడా? నా అతిక్రమానికి నా పెద్ద కొడుకుని నేనివ్వాలా? నా సొంత పాపానికి నా గర్భఫలాన్ని నేనివ్వాలా?
Θέλει ευαρεστηθή ο Κύριος εις χιλιάδας κριών ή εις μυριάδας ποταμών ελαίου; θέλω δώσει τον πρωτότοκόν μου διά την παράβασίν μου, τον καρπόν της κοιλίας μου διά την αμαρτίαν της ψυχής μου;
8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు. ఆయన నిన్ను కోరేదేంటంటే, న్యాయంగా ప్రవర్తించు. కనికరాన్ని ప్రేమించు. వినయంగా నీ దేవునితో నడువు.
Αυτός σοι έδειξεν, άνθρωπε, τι το καλόν και τι ζητεί ο Κύριος παρά σου, ειμή να πράττης το δίκαιον και να αγαπάς έλεος και να περιπατής ταπεινώς μετά του Θεού σου;
9 వినండి. పట్టణానికి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, ఇప్పటికి కూడా తెలివి నీ పేరును గుర్తిస్తున్నది. “బెత్తం పట్ల, దాన్ని తన స్థానంలో ఉంచిన వాని పట్ల శ్రద్ధ చూపండి.
Η φωνή του Κυρίου κράζει προς την πόλιν, και η σοφία θέλει φοβείσθαι το όνομά σου· ακούσατε την ράβδον και τις διώρισεν αυτήν.
10 ౧౦ దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది. అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి.
Υπάρχουσιν έτι οι θησαυροί της ασεβείας εν τω οίκω του ασεβούς και το ελλιπές μέτρον το βδελυκτόν;
11 ౧౧ తప్పు త్రాసు, తప్పు రాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా?
να δικαιώσω αυτούς με τας ασεβείς πλάστιγγας και με το σακκίον των δολίων ζυγίων;
12 ౧౨ ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు. అక్కడి ప్రజలు అబద్దికులు. వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.
Διότι οι πλούσιοι αυτής είναι πλήρεις αδικίας, και οι κάτοικοι αυτής ελάλησαν ψεύδη, και η γλώσσα αυτών είναι απατηλή εν τω στόματι αυτών.
13 ౧౩ కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరచాను. నీ పాపాలను బట్టి నిన్ను నిర్మూలం చేశాను.
Και εγώ λοιπόν πατάξας θέλω σε αδυνατίσει, θέλω σε ερημώσει εξ αιτίας των αμαρτιών σου.
14 ౧౪ నువ్వు తింటావు కానీ తృప్తి పడవు. నీలోపల వెలితిగానే ఉంటుంది. నువ్వు కూడబెట్టుకుంటావు కానీ అది నీకుండదు. నువ్వు దాచుకున్నదాన్ని కత్తికి అప్పగిస్తాను.
Συ θέλεις τρώγει και δεν θέλεις χορτάζεσθαι, και η πείνά σου θέλει είσθαι εν μέσω σου και θέλεις φύγει αλλά δεν θέλεις διασώσει, και ό, τι διέσωσας, θέλω παραδώσει εις την ρομφαίαν.
15 ౧౫ నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు. నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు కానీ ఆ నూనె పూసుకోవు. ద్రాక్షపళ్ళను తొక్కుతావు కానీ ద్రాక్షారసం తాగవు.
Συ θέλεις σπείρει και δεν θέλεις θερίσει συ θέλεις πιέσει ελαίας και δεν θέλεις αλειφθή με έλαιον, και γλεύκος και δεν θέλεις πίει οίνον.
16 ౧౬ ఒమ్రీ చట్టాలను మీరు పాటిస్తున్నారు. అహాబు వంశం వాళ్ళు చేసిన పనులన్నిటినీ అనుసరిస్తున్నారు. వారి సలహాల ప్రకారం నడుస్తున్నారు. కాబట్టి నీ పట్టణాన్ని నాశనం చేస్తాను. దానిలో నివసించే వారిని అపహాస్యంగా చేస్తాను. నా ప్రజలకు రావలసిన అవమానం మీరు పొందుతారు.”
Διότι εφυλάχθησαν τα διατάγματα του Αμρί και πάντα τα έργα του οίκου του Αχαάβ και επορεύθητε εν ταις βουλαίς αυτών διά να σε παραδώσω εις αφανισμόν και τους κατοίκους αυτής εις συριγμόν και θέλετε βαστάσει το όνειδος του λαού μου.

< మీకా 6 >