< మీకా 5 >
1 ౧ యెరూషలేము ప్రజలారా, యుద్ధ సేనలతో ఇప్పుడు కలిసి రండి. నీ పట్టణం చుట్టూ గోడ ఉంది. అయితే శత్రువులు ఇశ్రాయేలీయుల నాయకుణ్ణి బెత్తంతో చెంప మీద కొడతారు.
¡Fórmate ahora un ejército, ciudad atacada! Nos han puesto sitio; con una vara hieren en la mejilla al juez de Israel.
2 ౨ బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు.
Pero tú, Belén de Efrata, pequeña (para figurar) entre los millares de Judá, de ti me saldrá el que ha de ser dominador de Israel, cuyos orígenes son desde los tiempos antiguos, desde los días de la eternidad.
3 ౩ కాబట్టి ప్రసవవేదన పడే స్త్రీ, బిడ్డను కనే వరకూ, దేవుడు వారిని అప్పగిస్తాడు. అప్పుడు ఆయన సోదరుల్లో మిగిలినవారు ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వస్తారు.
Por esto los entregará (a sus enemigos), hasta el tiempo en que dará a luz la que ha de dar a luz, y los restos de sus hermanos regresarán a los hijos de Israel.
4 ౪ ఆయన యెహోవా బలంతో తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో నిలబడి తన మంద మేపుతాడు. వాళ్ళు క్షేమంగా ఉంటారు. భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు.
Él se mantendrá firme, y apacentará (su grey) con la fortaleza de Yahvé, y con la majestad del Nombre, de Yahvé, su Dios; y ellos habitarán (en paz), pues entonces será Él glorificado hasta los términos de la tierra;
5 ౫ అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు, వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను, ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం. ఆయనే మనకు శాంతి.
y Él será la paz. Cuando el asirio penetrare en nuestra tierra y ponga su pie en nuestros palacios, le opondremos siete pastores y ocho príncipes,
6 ౬ వారు కత్తితో అష్షూరు దేశాన్ని పాలిస్తారు. తమ చేతుల్లోని కత్తులతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన మనలను ఇలా కాపాడతాడు.
que apacentarán el país de Asiria con la espada y la tierra de Nimrod con sus cuchillos. Él (nos) librará del asirio cuando este invadiere nuestra tierra y hollare nuestro territorio.
7 ౭ యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ, యెహోవా కురిపించే మంచులాగా, మానవ ప్రయత్నం, ఆలోచన లేకుండ, గడ్డి మీద పడే వానలాగా ఉంటారు.
Y el resto de Jacob estará entre muchas naciones, como rocío de Yahvé, como lluvia sobre la hierba, que no aguarda a nadie, ni espera (nada) de los hijos de los hombres.
8 ౮ యాకోబు సంతానంలో మిగిలినవారు రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య అడవి జంతువుల్లోని సింహం లాగా, గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు. అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది.
Y será el resto de Jacob entre las naciones, en medio de muchos pueblos, como león entre las bestias de la selva, como leoncillo entre los hatos de ovejas; el cual pasa, huella y despedaza, y no hay quien salve.
9 ౯ నీ చెయ్యి నీ శత్రువుల మీద ఎత్తి ఉంటుంది. అది వారిని నిర్మూలం చేస్తుంది.
Se alzara tu mano sobre tus adversarios, y todos tus enemigos serán exterminados.
10 ౧౦ యెహోవా ఇలా చెబుతున్నాడు, “ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను. నీ రథాలను ధ్వంసం చేస్తాను.
En aquel día, dice Yahvé, extirparé tus caballos de en medio de ti y destruiré tus carros.
11 ౧౧ నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను. నీ కోటలన్నిటినీ పడగొడతాను.
Arruinaré las ciudades de tu tierra y destruiré todas tus fortalezas.
12 ౧౨ మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను. జాతకం చెప్పేవారు ఇక నీలో ఉండరు.
Quitaré de tu mano las hechicerías, y no habrá más agoreros en ti.
13 ౧౩ చెక్కిన విగ్రహాలూ దేవతా స్తంభాలూ మీ మధ్య ఉండకుండాా నాశనం చేస్తాను. అప్పటినుంచి మీరు చేతులతో చేసిన వాటికి మొక్కరు.
Cortaré de en medio de ti tus estatuas y tus piedras de culto, y no adorarás más la obra, de tus manos.
14 ౧౪ మీ అషేరా దేవతా స్తంభాలను మీ మధ్య ఉండకుండాా వాటిని పెల్లగిస్తాను. నీ పట్టణాలను పడగొడతాను.
Arrancaré de en medio de ti tus ascheras y destruiré tus ciudades;
15 ౧౫ నేను మహా కోపంతో ఉగ్రతతో నా మాట వినని రాజ్యాలకు ప్రతీకారం చేస్తాను.”
y con ira e indignación tomaré venganza de los pueblos que no escucharon.