< మీకా 5 >

1 యెరూషలేము ప్రజలారా, యుద్ధ సేనలతో ఇప్పుడు కలిసి రండి. నీ పట్టణం చుట్టూ గోడ ఉంది. అయితే శత్రువులు ఇశ్రాయేలీయుల నాయకుణ్ణి బెత్తంతో చెంప మీద కొడతారు.
軍隊の女よ今なんぢ集りて隊をつくれ 敵われらを攻圍み杖をもてイスラエルの士師の頬を撃つ
2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు.
ベテレヘム、エフラタ汝はユダの郡中にて小き者なり 然れどもイスラエルの君となる者汝の中より我ために出べし その出る事は古昔より永遠の日よりなり
3 కాబట్టి ప్రసవవేదన పడే స్త్రీ, బిడ్డను కనే వరకూ, దేవుడు వారిని అప్పగిస్తాడు. అప్పుడు ఆయన సోదరుల్లో మిగిలినవారు ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వస్తారు.
是故に產婦の產おとすまで彼等を付しおきたまはん 然る後その遺れる兄弟イスラエルの子孫とともに歸るべし
4 ఆయన యెహోవా బలంతో తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో నిలబడి తన మంద మేపుతాడు. వాళ్ళు క్షేమంగా ఉంటారు. భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు.
彼はヱホバの力に由りその神ヱホバの名の威光によりて立てその群を牧ひ之をして安然に居しめん 今彼は大なる者となりて地の極にまでおよばん
5 అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు, వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను, ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం. ఆయనే మనకు శాంతి.
彼は平和なり アッスリヤ人われらの國に入り我らの宮殿を踏あらさんとする時は我儕七人の牧者八人の人君を立てこれに當らん
6 వారు కత్తితో అష్షూరు దేశాన్ని పాలిస్తారు. తమ చేతుల్లోని కత్తులతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన మనలను ఇలా కాపాడతాడు.
彼ら劍をもてアッスリヤの地をほろぼしニムロデの地の邑々をほろぼさん アッスリヤの人我らの地に攻いり我らの境を踏あらす時には彼その手より我らを救はん
7 యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ, యెహోవా కురిపించే మంచులాగా, మానవ ప్రయత్నం, ఆలోచన లేకుండ, గడ్డి మీద పడే వానలాగా ఉంటారు.
ヤコブの遺餘者は衆多の民の中に在こと人に賴ず世の人を俟ずしてヱホバより降る露の如く靑草の上にふりしく雨の如くならん
8 యాకోబు సంతానంలో మిగిలినవారు రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య అడవి జంతువుల్లోని సింహం లాగా, గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు. అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది.
ヤコブの遺餘者の國々にをり衆多の民の中にをる樣は林の獸の中に獅子の居るごとく羊の群の中に猛き獅子の居るごとくならん その過るときは踏みかつ裂ことをなす救ふ者なし
9 నీ చెయ్యి నీ శత్రువుల మీద ఎత్తి ఉంటుంది. అది వారిని నిర్మూలం చేస్తుంది.
望らくは汝の手汝が諸の敵の上にあげられ汝がもろもろの仇ことごとく絶れんことを
10 ౧౦ యెహోవా ఇలా చెబుతున్నాడు, “ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను. నీ రథాలను ధ్వంసం చేస్తాను.
ヱホバ言たまふ其日には我なんぢの馬を汝の中より絶ち汝の車を毀ち
11 ౧౧ నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను. నీ కోటలన్నిటినీ పడగొడతాను.
汝の國の邑々を絶し汝の一切の城をことごとく圮さん
12 ౧౨ మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను. జాతకం చెప్పేవారు ఇక నీలో ఉండరు.
我また汝の手より魔術を絶ん 汝の中に卜筮師無にいたるべし
13 ౧౩ చెక్కిన విగ్రహాలూ దేవతా స్తంభాలూ మీ మధ్య ఉండకుండాా నాశనం చేస్తాను. అప్పటినుంచి మీరు చేతులతో చేసిన వాటికి మొక్కరు.
我なんぢの彫像および柱像を汝の中より絶ん 汝の手にて作れる者を汝重て拜むこと無るべし
14 ౧౪ మీ అషేరా దేవతా స్తంభాలను మీ మధ్య ఉండకుండాా వాటిని పెల్లగిస్తాను. నీ పట్టణాలను పడగొడతాను.
我また汝のアシラ像を汝の中より抜たふし汝の邑々を滅さん
15 ౧౫ నేను మహా కోపంతో ఉగ్రతతో నా మాట వినని రాజ్యాలకు ప్రతీకారం చేస్తాను.”
而して我忿怒と憤恨をもてその聽從はざる國民に仇を報いん

< మీకా 5 >