< మీకా 4 >

1 తరువాత రోజుల్లో యెహోవా మందిర పర్వతం పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది. కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.
Та бу́де напри́кінці днів, гора дому Господнього міцно поста́влена буде верши́ною гір, і підне́сена буде вона понад узгі́р'я, і будуть наро́ди до неї пливсти́.
2 అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు, “యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి మనం వెళ్దాం, పదండి. ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు. మనం ఆయన దారుల్లో నడుచుకుందాం.” సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి.
І пі́дуть числе́нні наро́ди та й скажуть: Ходімо, і ви́йдім на го́ру Господню та до дому Якового, і Він бу́де навчати дорі́г Своїх нас, і ми бу́демо ходити стежка́ми Його. Бо ви́йде Зако́н із Сіону, а слово Господнє — із Єрусалиму.
3 ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు. దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు. వారు తమ కత్తులను నాగటి నక్కులుగా తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు. యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు.
І Він буде судити числе́нні племе́на, і розсу́джувати буде народи міцні аж у далечині́. І вони перекую́ть мечі свої на лемеші́, а спи́си свої — на серпи́. Не піді́йме меча наро́д на наро́д, і більше не бу́дуть навчатись війни́!
4 దానికి బదులు, ప్రతివాడూ ఎవరి భయమూ లేకుండా తన ద్రాక్షచెట్టు కింద తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. ఇది సేనల అధిపతి యెహోవా నోట వెలువడ్డ మాట.
І буде кожен сидіти під своїм виноградником, і під своєю фіґо́вницею, і не бу́де того, хто б страши́в, бо уста Господа Савао́та оце́ прорекли.
5 ఇతర ప్రజలంతా తమ దేవుళ్ళ పేరుతో నడుచుకుంటారు. మనమైతే మన యెహోవా దేవుని పేరును బట్టి ఎప్పటికీ నడుచుకుంటాము.
Усі бо наро́ди ходитимуть кожен ім'я́м свого бога, а ми бу́дем ходити Ім'я́м Господа, нашого Бога, на віки вікі́в!
6 యెహోవా ఇలా చెబుతున్నాడు, ఆ రోజు నేను కుంటి వారిని పోగుచేస్తాను. అణగారిన వారిని, నేను కష్టపెట్టినవారిని దగ్గరికి చేరుస్తాను.
Того дня — промовляє Госпо́дь — позбираю кульга́ве й згрома́джу розі́гнане, і те, що на нього навів коли лихо.
7 కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని బలమైన ప్రజగా చేస్తాను. యెహోవానైన నేను, సీయోను కొండ మీద ఇప్పటినుంచి ఎప్పటికీ వారిని పాలిస్తాను.
І зроблю́ Я кульга́ве останком, а відда́лене — поту́жним наро́дом, і зацарює над ними Господь на Сіонській горі відтепе́р й аж наві́ки!
8 మందల గోపురమా, సీయోను కుమార్తెకు కొండగా ఉన్న నీకు పూర్వపు అధికారం వస్తుంది. యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వం వస్తుంది.
А ти, башто Чері́дна, підгі́рку Сіонської до́ньки, при́йде до тебе і ді́йде старе́ панува́ння, царюва́ння для до́нечки Єрусалиму.
9 మీరెందుకు కేకలు వేస్తున్నారు? మీకు రాజు లేడా? మీ సలహాదారులు నాశనమయ్యారా? అందుకే ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా మీరు బాధపడుతున్నారా?
Тепер на́що здіймаєш ти о́крик? Чи в тебе немає царя? Чи ж загинув твій радник, що ти ко́рчишся, мов породі́лля?
10 ౧౦ సీయోను కూతురా, ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా నొప్పులు పడుతూ కను. ఎందుకంటే మీరు పొలంలో బతికేలా పట్టణం వదిలిపెట్టండి. బబులోను వెళ్తారు. అక్కడ మీకు విడుదల కలుగుతుంది. అక్కడే యెహోవా మీ శత్రువుల చేతిలోనుంచి మిమ్మల్ని విడిపిస్తాడు.
Ви́йся та ко́рчся, о до́чко Сіону, немов породі́лля, бо тепер вийдеш із міста та перебува́тимеш у полі, і при́йдеш аж до Вавилону. Та будеш ти там урято́вана, там Господь тебе ви́купить з рук твоїх ворогів!
11 ౧౧ అనేక రాజ్యాల ప్రజలు మీకు విరోధంగా వచ్చి, “సీయోను అపవిత్రం అవుతుంది గాక! దాని నాశనం మేము కళ్ళారా చూడాలి.” అంటారు.
А зараз зібра́лись на тебе числе́нні наро́ди, говорячи: Нехай він знева́жений бу́де, і нехай наше око побачить нещастя Сіону!
12 ౧౨ ప్రవక్త ఇలా అంటాడు, యెహోవా తలంపులు వారికి తెలియవు. ఆయన ఆలోచన అర్థం కాదు. కళ్లంలో పనలు దగ్గర చేర్చినట్టు ఆయన వారిని చేరుస్తాడు.
Та не знають вони Господніх думо́к, і не розуміють поради Його, бо Він їх позбира́в, як до клуні снопи́.
13 ౧౩ యెహోవా ఇలా అంటున్నాడు, “సీయోను కుమారీ, లేచి కళ్ళం తొక్కు. మీకు ఇనుప కొమ్ములూ కంచు డెక్కలూ చేస్తాను. నీవు అనేక ప్రజల సమూహాలను అణిచేస్తావు. వారి అన్యాయ సంపదను యెహోవానైన నాకు ప్రతిష్టిస్తాను. వారి ఆస్తిపాస్తులను సర్వలోక ప్రభువునైన నాకు ప్రతిష్టిస్తాను.”
Ставай та молоти, до́чко Сіону, бо Я ріг твій залізом учиню, а копи́та твої вчиню міддю, і ти розпоро́шиш числе́нні наро́ди та вчи́ниш закляттям для Господа несправедливий їхній зиск, а їхнє багатство — Владиці всієї землі.

< మీకా 4 >