< మీకా 3 >
1 ౧ నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి. న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా?
Afei mekae se, “Muntie, mo Yakob akannifo, mo a mudi Israelfi so. Ɛsɛ sɛ muhu nea ɛyɛ atɛntrenee,
2 ౨ మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు. నా ప్రజల చర్మం ఒలిచేసి వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు.
Mo a mukyi nea eye na modɔ bɔne moworɔw me nkurɔfo were na motetew nam no fi wɔn nnompe ho;
3 ౩ నా ప్రజల మాంసాన్ని తింటారు. వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరగగొట్టేస్తారు. ఒకడు పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టుగా ఉడుకుతున్న పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టు మీరు చేస్తారు.
mowe me nkurɔfo nam, mowae wɔn were, bubu wɔn nnompe mu nketenkete; mutwitwa wɔn sɛ nam a mode regu kutu mu.”
4 ౪ ఆ తరువాత నాయకులైన మీరు యెహోవాకు మొరపెడతారు కానీ ఆయన వారికి జవాబివ్వడు. మీరు చెడు పనులు చేశారు. కాబట్టి అప్పుడు ఆయన వారికి తన ముఖాన్ని చూపించడు.”
Afei wobesu afrɛ Awurade, nanso ɔrennye wɔn so. Saa bere no ɔde nʼanim besie wɔn, bɔne a wɔayɛ nti.
5 ౫ నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, తమకు భోజనం పెట్టేవారికి “సంపద వస్తుంది” అని చెబుతారు. భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు.
Nea Awurade se ni: “Adiyifo a wɔdaadaa me nkurɔfo no de, obi ma wɔn biribi di a wɔpae mu ka asomdwoe nsɛm, na sɛ wɔamma wɔn biribi anni a, adiyifo no siesie wɔn ho sɛ wobetu wɔn so sa.
6 ౬ అందుచేత మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముకువస్తుంది. సోదె చెప్పకుండా మీకు చీకటి ఆవరిస్తుంది. ఇలాంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమిస్తాడు. పగలు చీకటిగా మారిపోతుంది.
Enti ade bɛsa mo a morennya adaeso, sum beduru mo a morennya ahintasɛm biara. Owia bɛtɔ ama adiyifo no, na adekyee bɛdan sum ama wɔn.
7 ౭ అప్పుడు భవిష్యత్తును చెప్పేవారికి సిగ్గు కలుగుతుంది. సోదె చెప్పేవాళ్ళు కలవరపడతారు. నా దగ్గరనుంచి జవాబేమీ రానందుకు వారంతా నోరు మూసుకుంటారు.
Adehufo ani bewu na wobegu asamanfrɛfo anim ase. Wɔn nyinaa bɛkatakata wɔn anim, efisɛ mmuae biara mfi Onyankopɔn hɔ mma.”
8 ౮ అయితే నా మట్టుకైతే, యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలనూ ఇశ్రాయేలీయులకు తమ పాపాన్ని వెల్లడించడానికి యెహోవా ఆత్మమూలంగా సంపూర్ణ అధికారంతో, న్యాయంతో ఉన్నాను.
Nanso me de, tumi ahyɛ me ma, Awurade Honhom ahyɛ me ma trenee ne ahoɔden a mede bɛpae mu aka Yakob amumɔyɛ ne Israel bɔne.
9 ౯ యాకోబు వంశపు ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు.
Muntie, mo Yakobfi akannifo, mo a mudi Israel so, a mukyi atɛntrenee na mokyea nea ɛteɛ nyinaa;
10 ౧౦ సీయోనును మీరు రక్తంతో కడతారు. దుర్మార్గంతో యెరూషలేమును కడతారు.
Mo a mode mogyahwiegu kyekyeree Sion ne awurukasɛm kyekyeree Yerusalem.
11 ౧౧ ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. వారి యాజకులు కూలికి బోధిస్తారు. ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు. అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు.
Nʼakannifo no gye adanmude ansa na wobu atɛn, nʼasɔfo gye sika ansa na wɔakyerɛkyerɛ, nʼadiyifo de nkɔmhyɛ ayɛ sikapɛ. Nanso wɔdan Awurade, na wɔka se, “Awurade nni yɛn ntam ana? Ɔhaw biara remma yɛn so.”
12 ౧౨ కాబట్టి మీ మూలంగా శత్రువులు సీయోనును పొలంలాగా దున్నుతారు. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న కొండ, అడవిలాగా అవుతుంది.
Na mo nti, wobefuntum Sion te sɛ afuw, Yerusalem bɛyɛ nnwiriwii siw, na asɔredan no pampa bɛyɛ nkɔmoa so nkyɛkyerɛ.