< మీకా 3 >

1 నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి. న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా?
我曾經說過:「雅各伯的首領,以色列家的官吏,請你們傾聽! 認識正義,豈不是你們分內的事﹖」
2 మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు. నా ప్రజల చర్మం ఒలిచేసి వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు.
然而他們惡善好惡,從平民身上剝下他們的皮,從骨頭上剔下他們的肉。
3 నా ప్రజల మాంసాన్ని తింటారు. వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరగగొట్టేస్తారు. ఒకడు పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టుగా ఉడుకుతున్న పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టు మీరు చేస్తారు.
他們吞食我百姓的肉,剝去他們的皮,折斷他們的骨頭,將他們切成碎塊,如釜中的肉,如鼎中的肉。
4 ఆ తరువాత నాయకులైన మీరు యెహోవాకు మొరపెడతారు కానీ ఆయన వారికి జవాబివ్వడు. మీరు చెడు పనులు చేశారు. కాబట్టి అప్పుడు ఆయన వారికి తన ముఖాన్ని చూపించడు.”
當他們呼求上主時,上主決不俯聽他們;反要掩面不理他們,因為他們行了窮凶極惡的事。
5 నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, తమకు భోజనం పెట్టేవారికి “సంపద వస్తుంది” అని చెబుతారు. భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు.
論及迷我百姓的先知,上主這樣說:當他們的牙齒有咀嚼的東西時,他們便呼喊:「和平。」但凡不將食物送到他們口上的,他們便宣佈「戰爭。」
6 అందుచేత మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముకువస్తుంది. సోదె చెప్పకుండా మీకు చీకటి ఆవరిస్తుంది. ఇలాంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమిస్తాడు. పగలు చీకటిగా మారిపోతుంది.
因此,為你們只有黑夜而沒有神視,只有黑暗而沒有神諭;太陽必為先知而沒落,白畫必為他們而變為黑暗。
7 అప్పుడు భవిష్యత్తును చెప్పేవారికి సిగ్గు కలుగుతుంది. సోదె చెప్పేవాళ్ళు కలవరపడతారు. నా దగ్గరనుంచి జవాబేమీ రానందుకు వారంతా నోరు మూసుకుంటారు.
先知必將抱愧,巫士必將蒙羞,他們都要掩住自己的鬍鬚,因為沒有天主的答覆。
8 అయితే నా మట్టుకైతే, యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలనూ ఇశ్రాయేలీయులకు తమ పాపాన్ని వెల్లడించడానికి యెహోవా ఆత్మమూలంగా సంపూర్ణ అధికారంతో, న్యాయంతో ఉన్నాను.
至於我,我因上主的神而充滿 力量、正義和勇氣,向雅各伯指出她的邪惡,向以色列說明她的罪過。
9 యాకోబు వంశపు ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు.
雅各伯家的領袖,以色列家的官吏,請你們傾聽這事! 你們憎惡正義,曲解一切正理;
10 ౧౦ సీయోనును మీరు రక్తంతో కడతారు. దుర్మార్గంతో యెరూషలేమును కడతారు.
你們以血債建設耶路撒冷。
11 ౧౧ ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. వారి యాజకులు కూలికి బోధిస్తారు. ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు. అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు.
她火首領為賄賂而審判,司祭為薪俸而設教,先知為銀錢而占卜,尚依賴上主說:「上主不是在我們中間嗎﹖災禍決不會臨在我們身上! 」
12 ౧౨ కాబట్టి మీ మూలంగా శత్రువులు సీయోనును పొలంలాగా దున్నుతారు. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న కొండ, అడవిలాగా అవుతుంది.
因此,為了你的緣故,熙雍必被耕耘有如一塊地.耶路撒冷必成為一堆廢墟,聖殿山必成為叢林中的一個丘陵。

< మీకా 3 >