< మత్తయి 1 >

1 అబ్రాహాము వంశం వాడైన దావీదు వంశం వాడు యేసు క్రీస్తు వంశావళి.
亞巴郎之子,達味之子耶穌基督的祖譜:
2 అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు యూదా, అతని సోదరులు.
亞巴郎生依撒各,依撒各生雅各伯,雅各伯生猶大和他的兄弟們;
3 యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము.
猶由塔瑪爾生培勒茲和則辣黑,培勒茲生赫茲龍,赫茲龍生阿蘭,
4 ఆరాము కొడుకు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను. నయస్సోను కొడుకు శల్మాను.
阿蘭生阿米納達布,阿米納達布生納赫雄,納赫雄生撒爾孟,
5 శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన వాడు బోయజు. బోయజుకు రూతు ద్వారా పుట్టిన వాడు ఓబేదు. ఓబేదు కొడుకు యెష్షయి.
撒爾孟由辣哈布生波阿次,波阿次由盧德生敖貝得,敖貝得生葉瑟,
6 యెష్షయి కొడుకు దావీదు. గతంలో ఊరియాకు భార్యగా ఉన్న ఆమె ద్వారా దావీదుకు పుట్టిన వాడు సొలొమోను.
葉瑟生達味王。達味由烏黎雅的妻子生撒羅滿,
7 సొలొమోను కొడుకు రెహబాము. రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా.
撒羅滿生勒哈貝罕,勒哈貝罕生阿彼雅,阿彼雅生阿撒,
8 ఆసా కొడుకు యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు ఉజ్జీయా.
阿撒生約沙法特,約沙法特生約蘭,約蘭生烏齊雅,
9 ఉజ్జీయా కొడుకు యోతాము. యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా.
烏齊雅生約當,約當生阿哈次,阿哈次生希則克雅,
10 ౧౦ హిజ్కియా కొడుకు మనష్షే. మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.
希則克雅生默納舍,默納舍生阿孟,阿孟生約史雅,
11 ౧౧ యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు.
約史雅在巴比倫流徙期間生耶苛尼雅和他的兄弟們,
12 ౧౨ బబులోనుకు వెళ్ళిన తరువాత యూదుల వంశావళి. యెకొన్యా కొడుకు షయల్తీయేలు. షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు.
流徙巴比倫以後,耶苛尼雅生沙耳提耳,沙耳提耳生則魯巴比耳,
13 ౧౩ జెరుబ్బాబెలు కొడుకు అబీహూదు. అబీహూదు కొడుకు ఎల్యాకీము. ఎల్యాకీము కొడుకు అజోరు.
則魯巴比耳生阿彼鳥得,阿彼鳥得生厄里雅金,厄里雅金生阿左耳。
14 ౧౪ అజోరు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు ఆకీము. ఆకీము కొడుకు ఎలీహూదు.
阿左耳生匝多克,匝多克生阿歆,阿歆生厄里烏得,
15 ౧౫ ఎలీహూదు కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు మత్తాను. మత్తాను కొడుకు యాకోబు.
厄里烏得生厄肋阿匝爾,厄肋阿匝爾生瑪堂,瑪堂生雅各伯,
16 ౧౬ యాకోబు కొడుకు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమె ద్వారా క్రీస్తు అనే పేరు గల యేసు పుట్టాడు.
雅各伯生若瑟、瑪利亞的丈夫,瑪利亞生耶穌,衪稱為基督。
17 ౧౭ ఈ విధంగా అబ్రాహాము నుంచి దావీదు వరకూ మొత్తం పద్నాలుగు తరాలు. దావీదు నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం వరకూ పద్నాలుగు తరాలు. బబులోను చెరలోకి వెళ్ళిన కాలం నుంచి క్రీస్తు వరకూ పద్నాలుగు తరాలు.
所以從亞巴郎到達味共十四代,從達味到流徙巴比倫共十四代,從流徙巴比倫到基督共十四代。
18 ౧౮ యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది.
耶穌基督的誕生是這樣的:衪的母親許配於若瑟後,在同居前,她因聖神有孕的事已顯示出來。
19 ౧౯ ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు.
她的丈夫若瑟,因是義人,不願公開羞她,有意暗暗地休退她。
20 ౨౦ అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది.
當他在思慮這事時,看,在夢人上主的天使顯現給他說:「達味之子若瑟,不要怕娶你的妻子瑪利亞,因為那在她內受生的,是出於聖神。
21 ౨౧ ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు.
她要生一個兒子,妳要給衪起名叫耶穌,因為衪要把自己的民族,由他們的罪惡中拯救出來。」
22 ౨౨ “‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు” అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది.
這一切事的發生,是為應驗上主藉先知所說的話:
23 ౨౩
「看,一位貞女,將懷孕生子,人將稱衪的名字為厄瑪奴耳,意思是:天主與我們同在。
24 ౨౪ యోసేపు నిద్ర లేచి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు.
若瑟從睡夢中醒來,就照上主的天使所囑咐的辦了,娶了他的妻子;
25 ౨౫ అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.
若瑟雖然沒認識她,她就生了一個兒子,給衪起名叫耶穌。

< మత్తయి 1 >