< మత్తయి 9 >
1 ౧ యేసు పడవ ఎక్కి సముద్రం దాటి తన స్వగ్రామం వచ్చాడు.
Og han gik om Bord i et Skib og for over og kom til sin egen By.
2 ౨ కొంతమంది ఒక పక్షవాత రోగిని అతని మంచం మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, బాబూ, ధైర్యం తెచ్చుకో. నీ పాపాలకు క్షమాపణ దొరికింది, అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు.
Og se, de bare til ham en værkbruden, som laa paa en Seng; og da Jesus saa deres Tro, sagde han til den værkbrudne: „Søn! vær frimodig, dine Synder forlades dig.‟
3 ౩ ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, అని తమలో తాము అనుకున్నారు.
Og se, nogle af de skriftkloge sagde ved sig selv: „Denne taler bespotteligt.‟
4 ౪ యేసు వారి ఆలోచనలు గ్రహించి, “మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు?
Og da Jesus saa deres Tanker, sagde han: „Hvorfor tænke I ondt i eders Hjerter?
5 ౫ ‘నీ పాపాలు క్షమించాను’ అని చెప్పడం తేలికా? ‘లేచి నడువు’ అని చెప్పడం తేలికా?
Thi hvilket er lettest at sige: Dine Synder forlades dig, eller at sige: Staa op og gaa?
6 ౬ అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి, ఆ పక్షవాత రోగితో, “నీవు లేచి నీ మంచం తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
Men for at I skulle vide, at Menneskesønnen har Magt paa Jorden til at forlade Synder, ‟ da siger han til den værkbrudne: „Staa op, og tag din Seng, og gaa til dit Hus!‟
7 ౭ అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
Og han stod op og gik bort til sit Hus.
8 ౮ ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు.
Men da Skarerne saa det, frygtede de og priste Gud, som havde givet Menneskene en saadan Magt.
9 ౯ యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు.
Og da Jesus gik videre derfra, saa han en Mand, som hed Matthæus, sidde ved Toldboden; og han siger til ham: „Følg mig!‟ Og han stod op og fulgte ham.
10 ౧౦ యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో కూర్చున్నారు.
Og det skete, da han sad til Bords i Huset, se, da kom der mange Toldere og Syndere og sade til Bords med Jesus og hans Disciple.
11 ౧౧ పరిసయ్యులు అది గమనించి, “మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యులను అడిగారు.
Og da Farisæerne saa det, sagde de til hans Disciple: „Hvorfor spiser eders Mester med Toldere og Syndere?‟
12 ౧౨ యేసు అది విని, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం.
Men da Jesus hørte det, sagde han: „De raske trænge ikke til Læge, men de syge.
13 ౧౩ నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను, నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్ళి ‘మీరు బలులు అర్పించడం కాదు, కనికరం చూపించాలనే కోరుతున్నాను’ అనే వాక్యభావం నేర్చుకోండి” అని చెప్పాడు.
Men gaar hen og lærer, hvad det vil sige: Jeg har Lyst til Barmhjertighed og ikke til Offer; thi jeg er ikke kommen for at kalde retfærdige, men Syndere.‟
14 ౧౪ అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పరిసయ్యులూ మేమూ తరచుగా ఉపవాసం ఉంటాము గానీ నీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకు?” అని ఆయనను అడిగారు.
Da komme Johannes's Disciple til ham og sige: „Hvorfor faste vi og Farisæerne meget, men dine Disciple faste ikke?‟
15 ౧౫ యేసు వారికిలా జవాబిచ్చాడు. “పెళ్ళికొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి వారు విచారంగా ఉంటారా? అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. అప్పుడు వారు ఉపవాసం ఉంటారు.
Og Jesus sagde til dem: „Kunne Brudesvendene sørge, saa længe Brudgommen er hos dem? Men der skal komme Dage, da Brudgommen bliver tagen fra dem, og da skulle de faste.
16 ౧౬ “ఎవడూ పాత బట్టకు కొత్త బట్ట అతుకు వేయడు. వేస్తే ఆ అతుకు బట్టను చింపేస్తుంది. ఆ చినుగు మరింత పెద్దదవుతుంది.
Men ingen sætter en Lap af uvalket Klæde paa et gammelt Klædebon; thi Lappen river Klædebonnet itu, og der bliver et værre Hul.
17 ౧౭ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయరు. పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయి, ద్రాక్షారసం కారిపోతుంది. తిత్తులు పాడైపోతాయి. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోస్తారు. అప్పుడు ఆ రెండూ చెడిపోవు.”
Man kommer heller ikke ung Vin paa gamle Læderflasker, ellers sprænges Læderflaskerne, og Vinen spildes, og Læderflaskerne ødelægges; men man kommer ung Vin paa nye Læderflasker, saa blive begge Dele bevarede.‟
18 ౧౮ ఆయన ఈ మాటలు వారితో చెబుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, “నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది” అన్నాడు.
Medens han talte dette til dem, se, da kom der en Forstander og faldt ned for ham og sagde: „Min Datter er lige nu død; men kom og læg din Haand paa hende, saa bliver hun levende.‟
19 ౧౯ అప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు.
Og Jesus stod op og fulgte ham med sine Disciple.
20 ౨౦ అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి,
Og se, en Kvinde, som havde haft Blodflod i tolv Aar, traadte hen bagfra og rørte ved Fligen af hans Klædebon;
21 ౨౧ “నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను” అని తనలో తాను అనుకుని, ఆయన పైవస్త్రం కొనను తాకింది.
thi hun sagde ved sig selv: „Dersom jeg blot rører ved hans Klædebon, bliver jeg frelst.‟
22 ౨౨ యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “అమ్మాయ్, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగుచేసింది” అన్నాడు. అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది.
Men Jesus vendte sig om, og da han saa hende, sagde han: „Datter! vær frimodig, din Tro har frelst dig.‟ Og Kvinden blev frelst fra den samme Time.
23 ౨౩ అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వాయిద్యాలు వాయించే వారినీ గోల చేస్తున్న గుంపునూ చూశాడు.
Og da Jesus kom til Forstanderens Hus og saa Fløjtespillerne og Hoben, som larmede, sagde han:
24 ౨౪ “వెళ్ళిపోండి. ఈ అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది” అన్నాడు. అయితే వారు నవ్వి ఆయనను హేళన చేశారు.
„Gaar bort, thi Pigen er ikke død, men hun sover.‟ Og de lo ad ham.
25 ౨౫ ఆయన ఆ గుంపును బయటకు పంపివేసి, లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ పాప లేచింది.
Men da Hoben var dreven ud, gik han ind og tog hende ved Haanden; og Pigen stod op.
26 ౨౬ ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది.
Og Rygtet herom kom ud i hele den Egn.
27 ౨౭ యేసు అక్కడనుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివారు ఆయనను అనుసరిస్తూ, “దావీదు కుమారా, మామీద దయ చూపించు” అని కేకలు వేశారు.
Og da Jesus gik bort derfra, fulgte der ham to blinde, som raabte og sagde: „Forbarm dig over os, du Davids Søn!‟
28 ౨౮ యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు వారితో, “నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా?” అని వారిని అడిగాడు. వారు, “అవును ప్రభూ” అన్నారు.
Men da han kom ind i Huset, gik de blinde til ham; og Jesus siger til dem: „Tro I, at jeg kan gøre dette?‟ De sige til ham: „Ja, Herre!‟
29 ౨౯ అప్పుడాయన వారి కళ్ళు ముట్టి, “మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది” అన్నాడు.
Da rørte han ved deres Øjne og sagde: „Det ske eder efter eders Tro!‟
30 ౩౦ వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసు “ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండి” అని ఖండితంగా వారికి చెప్పాడు.
Og deres Øjne bleve aabnede. Og Jesus bød dem strengt og sagde: „Ser til, lad ingen faa det at vide.‟
31 ౩౧ కానీ ఆ ఇద్దరూ వెళ్లి ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు.
Men de gik ud og udbredte Rygtet om ham i hele den Egn.
32 ౩౨ ఆ ఇద్దరూ వెళ్తుండగా కొంతమంది దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు.
Men da disse gik ud, se, da førte de til ham et stumt Menneske, som var besat.
33 ౩౩ దయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, “ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు” అని చెప్పుకున్నారు.
Og da den onde Aand var uddreven, talte den stumme. Og Skarerne forundrede sig og sagde: „Aldrig er saadant set i Israel.‟
34 ౩౪ అయితే పరిసయ్యులు, “ఇతడు దయ్యాల రాజు మూలంగా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అన్నారు.
Men Farisæerne sagde: „Ved de onde Aanders Fyrste uddriver han de onde Aander.‟
35 ౩౫ యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు.
Og Jesus gik omkring i alle Byerne og Landsbyerne, lærte i deres Synagoger og prædikede Rigets Evangelium og helbredte enhver Sygdom og enhver Skrøbelighed.
36 ౩౬ ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా నిస్పృహగా, చెదరిపోయి ఉన్నారు.
Men da han saa Skarerne, ynkedes han inderligt over dem; thi de vare vanrøgtede og forkomne som Faar, der ikke have Hyrde.
37 ౩౭ ఆయన తన శిష్యులతో, “కోత చాలా ఎక్కువగా ఉంది. కానీ పని వారు తక్కువగా ఉన్నారు.
Da siger han til sine Disciple: „Høsten er stor, men Arbejderne ere faa;
38 ౩౮ కాబట్టి తన కోతకు కూలి వారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి” అని తన శిష్యులతో చెప్పాడు.
beder derfor Høstens Herre om, at han vil sende Arbejdere ud til sin Høst.‟