< మత్తయి 7 >

1 “ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు మిమ్మల్నీ తీర్పు తీర్చరు.
Nesuďte druhé, abyste nebyli souzeni.
2 మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకూ దొరుకుతుంది.
Podle toho, jak soudíte, budete souzeni i vy a na váš život budou přiložena stejná měřítka, jaká sami používáte.
3 నీ కంటిలో ఉన్న దుంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు?
Jak to, že vidíš pilinu v oku druhého člověka a poleno ve svém oku přehlížíš?
4 నీ కంటిలో దుంగను ఉంచుకుని నీ సోదరునితో, ‘నీ కంటిలోని నలుసు తీయనివ్వు’ అని ఎలా చెబుతావు?
Jak můžeš říkat druhému: ‚Dovol, abych ti vyndal smítko z oka, ‘a poleno ti ve vlastním oku nepřekáží?
5 కపట వేషధారీ! మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో, అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది.
Pokrytče! Vyčisti si nejprve svoje oko, a teprve potom jasně uvidíš na to, abys mohl vyjmout pilinu z oka svého bližního.
6 పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్టవద్దు. మీ ముత్యాలు పందుల ముందు వేయవద్దు. అలా చేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కేసి, తరువాత మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో.
Je zbytečné vysvětlovat Boží pravdy těm, kteří jimi pohrdají. To je stejné, jako byste očekávali, že pes ocení vzácný pokrm a vepř krásu perly. Co se stane? Všechno zašlapou a nakonec vás napadnou.
7 “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది.
Proste, a dostanete, hledejte, a najdete. Klepejte, a bude vám otevřeno.
8 అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది.
Protože každý, kdo prosí, dostane, kdo hledá, nalezne a tomu, kdo tluče, bude otevřeno.
9 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా?
Kdyby kohokoliv z vás poprosilo vlastní dítě o kus chleba, dali byste mu snad kámen?
10 ౧౦ లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా?
A místo ryby byste mu dali hada? Určitě ne!
11 ౧౧ మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.
Jestliže tedy vy, lidé tvrdého a hříšného srdce, dovedete dávat svým dětem dobré věci, tím spíše je nebeský Otec dá těm, kteří ho prosí.
12 ౧౨ “కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి. ధర్మశాస్త్రమూ ప్రవక్తల ఉపదేశమూ ఇదే.
Jednejte s druhými tak, jak byste si přáli, aby jednali oni s vámi. Tak se dá shrnout Starý zákon.
13 ౧౩ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు.
Do Božího království lze vstoupit jen úzkou brankou. Prostorná brána a široká cesta vedou do záhuby a mnoho lidí se tudy ubírá.
14 ౧౪ జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు. దారికష్టమైనది. దాన్ని కనుగొనే వారు కొంతమందే.
Brána a cesta k životu jsou úzké a je málo těch, kteří je najdou.
15 ౧౫ “అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
Mějte se na pozoru před falešnými náboženskými učiteli, kteří přicházejí v masce neškodné ovce, ale ve skutečnosti jsou jako lační vlci.
16 ౧౬ వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా?
Poznáte je podle toho, jak žijí a jednají – právě tak jako posuzujete strom podle ovoce, které se na něm rodí. Cožpak se sklízejí hrozny z trnek a fíky z bodláčí?
17 ౧౭ అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది.
Dobrý strom nemůže nést špatné ovoce a zase špatný strom dobré.
18 ౧౮ మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు.
19 ౧౯ మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు.
Každý strom, který nedává dobrou úrodu, je poražen a spálen.
20 ౨౦ ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.
Ovoce – činy člověka, to je spolehlivý rozpoznávací znak.
21 ౨౧ “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు.
Ne každý, kdo mne oslovuje Pane, Pane, přijde do nebeského království. Rozhodující je, zda poslouchá mého Otce.
22 ౨౨ ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు.
V den posledního soudu mi mnozí řeknou: ‚Pane, Pane, cožpak jsme v tvém jménu nemluvili, nebojovali proti zlu a nedokázali mnoho divů?‘
23 ౨౩ అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.
Já jim však odpovím: ‚Nikdy jste mi nepatřili a neřídili se podle Boží vůle. Jděte pryč!‘
24 ౨౪ “కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు.
Kdo slyší tato má slova a jedná podle nich, ten může být přirovnán k prozíravému člověku, který založil svůj dům na skále.
25 ౨౫ వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు.
Přesto, že přišly deště s povodní a vichřice se opírala do jeho zdí, dům vydržel, protože byl postaven na skále.
26 ౨౬ నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు.
Kdo však slyší tato má slova, ale neuvede je do života, jedná jako pošetilý člověk, který založil svůj dům na písku.
27 ౨౭ వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”
Přišly deště, zaplavily krajinu a prudká vichřice se opřela do zdí domu. Ten se zřítil s velkým rachotem.“
28 ౨౮ యేసు ఈ మాటలు చెప్పి ముగించినపుడు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు.
Když Ježíš domluvil, lidé žasli nad jeho učením.
29 ౨౯ ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారం గల వాడిలాగా వారికి బోధించాడు.
Na rozdíl od učitelů, které znali, z Ježíše vyzařovala zvláštní síla.

< మత్తయి 7 >