< మత్తయి 3 >

1 ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో
Mõne aja pärast hakkas tegutsema ristija Johannes ning ta kuulutas Juuda kõrbes:
2 “పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాప పడండి” అని బోధిస్తూ ఉన్నాడు.
„Parandage meelt, sest taevariik on tulnud!“
3 పూర్వం యెషయా ప్రవక్త, అరణ్యంలో ఒకడి స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన దారులు తిన్నగా చేయండి, అని చెప్పింది ఇతని గురించే.
Tema oli see, kellest Jesaja kõneles, kui ta ütles: „Kõrbes kuuldakse häält hüüdmas: „Valmistage Issandale teed! Tehke rajad tema jaoks sirgeks!““
4 ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె.
Johannese riided olid tehtud kaameli karvadest ja tal oli ümber nahkvöö. Tema toiduks olid jaanikaunad ja metsmesi.
5 యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి,
Rahvas tuli tema juurde Jeruusalemmast, tervest Juudast ja kogu Jordani piirkonnast
6 తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు.
nad ristiti Jordani jões ning nad tunnistasid avalikult oma patte.
7 చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు, “విషసర్పాల పిల్లలారా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
Aga kui Johannes nägi ristimisele tulemas palju varisere ja sadusere, ütles ta neile: „Te rästikute sigitised! Kes hoiatas teid tulevase kohtu eest põgenema?
8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి.
Näidake tegudega, et olete tõeliselt meelt parandanud,
9 ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను.
ja ärge julgege uhkelt endamisi öelda: „Aabraham on meie isa.“Ma ütlen teile, et Jumal võib teha Aabrahamile lapsi neist kividest.
10 ౧౦ ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు ఆనించి ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో పడేస్తారు.
Tegelikult on kirves valmis puid maha raiuma. Iga puu, mis ei kanna head vilja, raiutakse maha ja heidetakse tulle.
11 ౧౧ పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లతో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో, అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.
Jah, mina ristin teid veega meeleparanduse ilmutamiseks, aga pärast mind tuleb see, kes on minust suurem. Ma ei ole väärt isegi tema sandaale lahti päästma. Tema ristib teid Püha Vaimu ja tulega.
12 ౧౨ తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోదుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు” అని చెప్పాడు.
Tal on käes valmis sari. Ta puhastab rehealuse ja kogub nisu aita, kuid aganad põletab ta ära tulega, mida ei saa kustutada.“
13 ౧౩ ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు.
Siis tuli Jeesus Galileast Jordani jõe äärde, et lasta end Johannesel ristida.
14 ౧౪ అయితే యోహాను, “నేను నీచేత బాప్తిసం పొందవలసి ఉండగా, నీవు నా దగ్గరికి వస్తున్నావా?” అని ఆయనను నివారింపజూశాడు.
Kuid Johannes üritas tema meelt muuta. Ta ütles Jeesusele: „Mul on vaja, et sina mind ristiksid, ja sina tuled minu juurde, et ma su ristiks?“
15 ౧౫ కానీ యేసు, “ఇప్పటికి కానివ్వు. నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే” అని అతనికి జవాబిచ్చాడు, కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు.
„Palun tee seda, sest meie jaoks on hea teha seda, mis Jumala sõnul on õige, “vastas Jeesus talle. Niisiis oli Johannes nõus seda tegema.
16 ౧౬ యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు.
Kohe pärast seda, kui Jeesus sai ristitud, tuli ta vest välja. Taevad avanesid ja ta nägi Jumala Vaimu nagu tuvi laskumas ja tema peale tulemas.
17 ౧౭ “ఇదిగో చూడండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం” అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.
Hääl taevast ütles: „See on minu poeg, keda ma armastan, kellest mul on hea meel.“

< మత్తయి 3 >