< మత్తయి 28 >
1 ౧ విశ్రాంతిదినం గడిచిన తరవాత ఆదివారం నాడు తెల్లవారుతుండగా మగ్దలేనే మరియ, మరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు.
Na úsvitu neděle se Marie Magdaléna a ta druhá Marie vypravily k hrobu.
2 ౨ ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది.
Nastalo silné zemětřesení. Boží anděl sestoupil s nebe, odvalil kámen a sedl si na něj.
3 ౩ ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది.
Zářil jako blesk a jeho oděv byl bílý jako sníh.
4 ౪ అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు.
Strážci byli tak vyděšeni, že se nemohli ani hnout.
5 ౫ ఆ దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు.
Anděl promluvil k ženám: „Nebojte se, vím, že hledáte Ježíše, který byl ukřižován.
6 ౬ ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకున్న చోటు చూసి,
Ale on tu již není, vstal opět k životu, jak to předpověděl. Pojďte se podívat do hrobu.
7 ౭ త్వరగా వెళ్ళి, ‘ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు’ అని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో, ఆయన గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఇదిగో, నేను మీతో చెప్పాను గదా” అన్నాడు.
A teď si pospěšte a řekněte jeho učedníkům, že vstal z mrtvých a jde napřed do Galileje, kde ho uvidíte. To jsem vám měl vyřídit.“
8 ౮ వారు భయంతో, మహా ఆనందంతో సమాధి దగ్గర నుండి త్వరగా వెళ్ళి ఆ సంగతి ఆయన శిష్యులకు చెప్పడానికి పరుగెడుతుండగా
S bázní, a přece s velkou radostí opustily ženy rychle hrob a běžely to oznámit učedníkům.
9 ౯ యేసు వారికి ఎదురు వచ్చి, “మీకు శుభం!” అని చెప్పాడు. వారు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పాదాలపై వాలి ఆయనను పూజించారు.
Na cestě se setkaly se samým Ježíšem. Pozdravil je a ony padly na kolena a objímaly jeho nohy.
10 ౧౦ అప్పుడు యేసు, “భయపడకండి. మీరు వెళ్ళి, నా సోదరులను గలిలయకి వెళ్ళమని చెప్పండి. అక్కడ వారు నన్ను చూస్తారు” అని వారితో చెప్పాడు.
Ježíš jim řekl: „Nebojte se, jen jděte za mými bratry a řekněte jim, ať jdou do Galileje a tam se setkáme.“
11 ౧౧ వారు వెళ్తూ ఉండగా సమాధికి కావలిగా ఉన్నవారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు.
Po odchodu žen se někteří strážci odebrali do města, aby ohlásili velekněžím všechno, co se stalo.
12 ౧౨ కాబట్టి వారు పెద్దలతో ఆలోచించి, ఆ సైనికులకు చాలా లంచమిచ్చి,
Ti hned svolali poradu s ostatními židovskými představiteli, aby se dohodli, co dělat. Potom štědře podplatili vojáky, aby mluvili shodně s nimi: „V noci jsme usnuli, a zatímco jsme spali, přišli Ježíšovi učedníci a ukradli jeho tělo.“
13 ౧౩ “మీరు ‘మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు’ అని చెప్పండి.
14 ౧౪ ఇది గవర్నరుకు తెలిసినా మేమతనితో మాట్లాడి మీకేమీ ఇబ్బంది లేకుండా చూస్తాం.” అన్నారు.
Pak vojákům slíbili, že doslechne-li se o tom místodržitel, uchlácholí ho a postarají se, aby z toho vyvázli bez nepříjemností.
15 ౧౫ సైనికులు ఆ డబ్బు తీసుకుని వారు తమతో చెప్పిన ప్రకారం చేశారు. ఆ మాట యూదుల్లో ఇప్పటి వరకూ వ్యాపించి ఉంది.
Vojáci si tedy vzali peníze a rozhlašovali, k čemu byli navedeni. Tato verze se mezi židy rozšířila, takže tomu věří dodnes.
16 ౧౬ పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు.
Jedenáct apoštolů šlo do Galileje, na horu, kterou Ježíš určil jako místo setkání.
17 ౧౭ అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు.
Tam ho uviděli, klaněli se mu, ale někteří pochybovali, že to je skutečně on.
18 ౧౮ అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది.
Ježíš jim řekl: „Je mi dána veškerá moc na nebi i na zemi.
19 ౧౯ కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ
Proto jděte a získávejte mi následovníky ve všech národech, křtěte je ve jméno Otce, Syna i Ducha svatého.
20 ౨౦ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు. (aiōn )
Veďte tyto nové učedníky k tomu, aby poslouchali všechny příkazy, které jsem vám dal. A spoléhejte na to, že já jsem vždy s vámi až do konce světa.“ (aiōn )