< మత్తయి 25 >
1 ౧ “పరలోక రాజ్యాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. పదిమంది కన్యలు పెళ్ళికొడుకును కలుసుకోడానికి కాగడాలు పట్టుకుని బయలుదేరారు.
Igbuchu shulu ani he to mrli mba wlon wa ba vu ba fitila mba nda hi kpa ilon wa sa.
2 ౨ వీరిలో ఐదుగురు తెలివి తక్కువ వారు, ఐదుగురు తెలివైన వారు.
Iton ni mi mba ba he toh, u ton ba na ruru.
3 ౩ తెలివి తక్కువ వారు తమ దీపాలు పట్టుకున్నారు గాని తమతో నూనె తీసుకుని పోలేదు.
Niwa ruru mrli mbaa ba vu ba fitila mba nda na nji babran na.
4 ౪ తెలివైన వారు తమ దీపాలతో బాటు సీసాల్లో నూనె తీసుకుని వెళ్ళారు.
U mrli mba bi hr to ha baka nji nye u ba fitila mba mla.
5 ౫ పెళ్ళికొడుకు రావడం ఆలస్యం కావడంతో వారంతా నిద్రపోయారు.
Ilon wasa ana ciciye na u baka ri druna hi mla ka kurna.
6 ౬ అర్థరాత్రి, ‘ఇడుగో, పెళ్ళికొడుకు వస్తున్నాడు. అతనికి ఎదురు వెళ్ళండి’ అనే పిలుపు వినిపించింది.
U ni tsutsu cuu baka dbu 'Lilon wasa ye'ye! Rju hi kpau.
7 ౭ అప్పుడు ఆ కన్యలంతా లేచి తమ దీపాలు సరిచేసుకున్నారు.
U mrli mba wa wumba wu baka wlunde nda mla ba fitila mbo tie.
8 ౮ అయితే తెలివి తక్కువవారు, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాక్కూడా ఇస్తారా?’ అని తెలివైన వారిని అడిగారు.
Bi ruru ba ba hla ni bi he to ha tie nye mbia nno ndu ba fitila mbu na khwu na.
9 ౯ అందుకు వారు, ‘మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో, మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి’ అని చెప్పారు.
“Bi he to h'a ba saa ni bawu inye a natsra tawu yayi na bika hi ni bi lenye'a ndi le u mbi.
10 ౧౦ వారు కొనడానికి వెళ్తూ ఉండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు. అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు యువతులు అతనితో కలిసి పెళ్ళి విందుకు లోపలికి వెళ్ళారు. వెంటనే తలుపు మూశారు.
Waa ba hi le'nye'a, u ilon wasaa ri ubiwa bana mla ki gben'a ba rihu hi ni bubu lo gran u baka tro nkon traa.
11 ౧౧ ఆ తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ‘ప్రభూ, ప్రభూ, మాకు తలుపు తెరవండి’ అని అడిగారు.
Imrli mba ba rima baka ye ni kogon nda tre Tiekoh, tiekoh, bwu nkon'a ni tawu!
12 ౧౨ కాని ఆయన, ‘నేను కచ్చితంగా చెబుతున్నాను, మీరెవరో నాకు తెలీదు’ అన్నాడు.
A saa ni bawu, 'Njanjimu mi hla yiwu mina toh yi na.
13 ౧౩ ఆ రోజైనా, ఆ గంటైనా మీకు తెలియదు కాబట్టి మేలుకుని ఉండండి.
To kima bika mla ki ni tu wa bina toh vi ka nton'a na.
14 ౧౪ “పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు.
Ahe towa indji ri ta hi ni meme ri. A yo ba mrli koh ma nda nno ba kpyi ma.
15 ౧౫ వారి వారి సామర్ధ్యం ప్రకారం ఒకడికి ఐదు తలాంతులూ ఇంకొకడికి రెండు తలాంతులూ మరొకడికి ఒక్క తలాంతూ ఇచ్చి, వెంటనే ప్రయాణమై వెళ్ళాడు.
A nno ri mba talenti ton nda nno iha nda la nno ri ngame talenti iri.
16 ౧౬ ఐదు తలాంతులు తీసుకున్న వాడు వాటితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు.
Iwaa a kpa talenti ton a agbla hi nda ka tie ndu ni mba nda fe talenti ton bari ni tuma.
17 ౧౭ అదే విధంగా రెండు తలాంతులు తీసుకున్న వాడు ఇంకో రెండు సంపాదించాడు.
U wa a kpa harli'a a tie tokima me nda fe ha bari nha.
18 ౧౮ అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి, గుంట తవ్వి తన యజమాని డబ్బు దాచిపెట్టాడు.
Se waa a kpa talenti ri'a hi kpama nda shi juju ni meme nda ri nklen tie koh ma.
19 ౧౯ “చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు.
Tie koh mba aka son ban nton babran rlikoh nda k'ma ye ndu mrli koh maa ndu bla nklen ba nno.
20 ౨౦ అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరో ఐదు తలాంతులు తెచ్చి ‘అయ్యగారూ, మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు.
Ivren koh wa akpa talenti ton'a a nji u ma ni talenti ton wa a hon'a nhaa nda tre, Tiekah mu, u ne talenti ton to yi mi fe talenti ton bari nhaa'
21 ౨౧ అతని యజమాని, ‘ఆహా! నీవు నమ్మకమైన మంచి పనివాడివి! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు.
“Tiekoh ma a hlawu, u toh tie, vrenkoh ndindi ni u kponji! U tie njanji ni kpyi fyi me, mi yowu nji ikpyi gbugbuwu. Rihi ni takpe u tiekoh me'.
22 ౨౨ అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, ‘అయ్యగారూ, మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు.
Ivren koh wa' a kpa talenti ha'a ye nda tre 'Tiekoh, u'ne talenti ha, Toyi, mi fe talenti ha bari nhaa'.
23 ౨౩ యజమాని, ‘ఆహా! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు.
Tiekohma a hla wu, “u toh tie, vrenkoh ndindi ni u kponji! U tie njanji ni kpyi fyi me. mi yo wu ndu nji ikpyi gbugbuwu. Ri ni mi takpye tiekoh me.
24 ౨౪ తరువాత ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. అతడన్నాడు, ‘అయ్యగారూ, మీరు విత్తనాలు నాటని చోట పంట కోయడానికీ, వెదజల్లని చోట పంట పోగుచేసుకోడానికీ చూసే కఠినాత్ములని నాకు తెలుసు.
U vrenkoh waa kpa talenti ri'a ye nda tre, Tiekoh, mitoh ndi u ndi wa ana tie ro na. U can ni wrji wa una cu'a na ndi ni vu ni wrji wa una hii na.
25 ౨౫ కాబట్టి నాకు భయం వేసి, మీరిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టాను. ఇదిగో, తీసుకోండి’ అన్నాడు.
Mi klu sisri ndi nji talenti mea ka ri ni mi meme. Toyi kpa kpye wa u mea.
26 ౨౬ అందుకు ఆ యజమాని అతనితో, ‘నీవు సోమరివాడివి! చెడ్డ దాసుడివి. నేను విత్తని చోట కోసేవాడిని, వెదజల్లని చోట పంట పోగుచేసుకో జూసేవాడిని అని నీకు తెలుసు గదా!
U tie koh ma ka saa niwu nda tre, u vrenkoh u' ridrii wa ani tie sankon'a, u toh ndi mi can ni ivrji wa mina cu'a na ndi ni vu ni wrji wa mina hii na.
27 ౨౭ అలాంటప్పుడు నీవు నా డబ్బును వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంచాల్సింది. అప్పుడు నేను వచ్చి దాన్ని వడ్డీతో కలిపి తీసుకుని ఉండేవాణ్ణి’ అని చెప్పి,
Una ka nklen mu'a nno banki to mina kmaye nii ka kpa kpye mu nha' ni wa a hon'a.
28 ౨౮ ‘ఆ తలాంతును వాడి దగ్గర నుండి తీసుకుని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి.
Ni tu kima, vu kpa talenti u wo ma ka nno u talenti wlon'a.
29 ౨౯ ఉన్న ప్రతివాడికీ మరింత ఇవ్వడం జరుగుతుంది, అతడు సమృద్ధి కలిగి ఉంటాడు. లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది.
Ahi wa ahe wu'a bala nno nhaa gbugbuwu kahewu vlalala me. U wa nda na he ni kpye na ikpye wa umaa ba vu kpa.
30 ౩౦ పనికిమాలిన ఆ దాసుణ్ణి బయట ఉన్న చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి.
Vu vrenkoh u ridri yi wa ana hi ndu kpyeri tayo ni wrji u kplakpakpa bwu wa ani yi nda tan nyinyren'a.
31 ౩౧ “మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.
Niwa Ivren Ndji ni ye ni mi (he ma u kpan) ni malaiku ba wawuu, ani son ni kpancima u (daraja).
32 ౩౨ మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు
Ba vu bi kohra ba wawuu ziwu k'bu ma wani ga ndi ni yiyri towa ani ho n'ma bi koh ni ga nt'matie kan ni ba yawo.
33 ౩౩ ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు.
Ani zi ntma ba ni wo korli na u yawo ba ni woma ko'ta.
34 ౩౪ తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి.
U chu'a ni hla ni bi wo korli ma 'Ye biyi wa Tiemu tie luluni yiwu'a rini gbuchu wa be tie zi yiwu guci ni tie ngbungblua.
35 ౩౫ ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు.
Iyon a tie me u bika ne rli hlan ma atie me u bika ne ma miso; mi ye tsri u bika kpame ri kohmbi,
36 ౩౬ బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు.
I he gbyre u bika sru nklon nimu milo u bika toh tie mu; mi he tro u bika zren yi ni me.
37 ౩౭ అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం?
U bi tsratsra ba saa nda tre, 'Baci ani tanyi ki toh wu si tie yon ndi nno wu rli? Ka tie hlan ma ndi nno wu so?
38 ౩౮ ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం?
Ni tanyi ki toh wu ndji u tsri ndi kpau? Ka ni gbyre ndi nnowu nklon?
39 ౩౯ ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు.
Nitanyi ki toh wu si lo ka nitro ndi ye niwu?
40 ౪౦ అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు.
U chua ni saa nda tre Njanjimu mi hla yiwu ikpye'a bi tie ni ri wa zan tsi tsa me ni mi mrli vayi mu biyi a, bi tie nimu.
41 ౪౧ “తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. (aiōnios )
Wa ni hla ni bi wo kota ma, Cbi dinkon mu wayi, biyi wa ba lanyu yiwu'a, hiri ni ilu u kakle wa ba tie ni brji ni malaiku ma. (aiōnios )
42 ౪౨ ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు.
Ni tu wa iyon a tie me u bika na rlina hlan ma tie ma bika na ne so na.
43 ౪౩ పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు.
Mi ye tsri u bika na kpame na mi he gbyre bika na ne nklon sru na ndi lo ndi he tro u bina tie kpye muna.
44 ౪౪ అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు.
U ba saa ngame nda tre, Baci ani tanyi kie toh ni yon ka hlan ma ka ndji u tsri ka ni gbyre ka ni lilo, ka ni tro, u kie kana tie kpye wu na?
45 ౪౫ అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు.
U ani saa ni bawu nda tre Njanjimu mi hla yiwu, ikpye wa bi na tie ni ri wa a zan fyime u mrli vayi mu na bina tie nimu na.
46 ౪౬ వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.” (aiōnios )
Biyi bahi kpamba nimi ya'u kakle u bi tsratsra a nimi rai sese kase” (aiōnios )