< మత్తయి 24 >
1 ౧ యేసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు.
Un no Dieva nama izgājis Jēzus aizgāja. Un Viņa mācekļi piegāja pie Viņa un rādīja Viņam, kā tas Dieva nams uztaisīts.
2 ౨ అందుకాయన, “మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా. నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ కూలదోస్తారు” అని వారితో అన్నాడు.
Bet Jēzus uz tiem sacīja: “Vai jūs to visu neredzat? Patiesi, Es jums saku, šeit akmens uz akmens netaps pamests, kas netaps nolauzīts.”
3 ౩ ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు. (aiōn )
Un Viņam uz Eļļas kalna sēžot, tie mācekļi piegāja sevišķi un sacīja: “Saki mums, kad šīs lietas notiks, un kāda būs Tavas atnākšanas un pastara laika zīme?” (aiōn )
4 ౪ యేసు వారితో ఇలా అన్నాడు, “ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి.
Un Jēzus atbildēja un uz tiem sacīja: “Pielūkojiet, ka neviens jūs nepieviļ.
5 ౫ చాలామంది నా నామంలో వచ్చి ‘నేనే క్రీస్తుని’ అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు.
Jo tur daudz nāks Manā Vārdā un sacīs: es esmu Kristus, un daudz pievils.
6 ౬ అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు. వాటి గురించిన వార్తలు వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు.
Bet jūs dzirdēsiet karus un karu daudzināšanu. Lūkojiet, nebēdājaties, jo visam tam tā būs notikt, bet tad vēl nav tas gals.
7 ౭ జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి.
Jo tad celsies tauta pret tautu un valsts pret valsti, un tad būs bada laiki un mēris un zemes trīcēšanas dažās vietās.
8 ౮ ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే.
Bet viss tas būs tikai to lielo bēdu iesākums.
9 ౯ “అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు, చంపుతారు. నా నామం కారణంగా మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు.
Tad tie jūs nodos mokās un jūs nokaus, un jūs tapsiet ienīdēti no visiem ļaudīm Mana Vārda dēļ.
10 ౧౦ ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు, ఒకరినొకరు ద్వేషించుకుని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు.
Un tad daudz apgrēcināsies, un viens otru nodos, un viens otru nīdēs.
11 ౧౧ అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు.
Jo tad daudz viltīgi pravieši celsies un daudz pievils.
12 ౧౨ అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది.
Un tāpēc, ka netaisnība ies vairumā, mīlestība pie daudziem izdzisīs.
13 ౧౩ కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది.
Bet kas pastāv līdz galam, tas tiks izglābts.
14 ౧౪ రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.
Un šis evaņģēlijs no (Dieva) valstības visā pasaulē taps sludināts visām tautām, un tad nāks tas gals.
15 ౧౫ “కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన ‘వినాశకారి అయిన హేయ వస్తువు’ అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక),
Kad jūs nu redzēsiet to izpostīšanas negantību, par ko pravietis Daniēls sacījis, ka tā stāv tai svētā vietā, (kas to lasa, tas lai to labi apdomā!)
16 ౧౬ యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి.
Kas tad ir Jūdu zemē, tie lai bēg kalnos.
17 ౧౭ మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లో నుండి దేనినైనా తీసుకుపోవడానికి దిగి రాకూడదు.
Un kas ir uz jumta, tas lai nekāpj zemē, kādu lietu no sava nama iznest;
18 ౧౮ పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు.
Un kas ir laukā, tas lai neatgriežas, savas drēbes paņemt.
19 ౧౯ అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం.
Bet vai tām grūtām un zīdītājām tanī laikā!
20 ౨౦ అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి.
Bet lūdziet, ka jūsu bēgšana nenotiek ziemas laikā nedz svētā dienā.
21 ౨౧ ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు, ఇక ముందు రాదు.
Jo tad būs tādas lielas bēdas, kādas nav bijušas no pasaules iesākuma līdz šim laikam, un kādas arī vairs nebūs.
22 ౨౨ ఆ రోజులను దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. అయితే, ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజులను దేవుడు తక్కువ చేస్తాడు.
Un ja šīs dienas netaptu paīsinātas, tad neviens cilvēks netaptu izglābts; bet to izredzēto labad tās dienas taps paīsinātas.
23 ౨౩ “ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు’ అని చెబితే నమ్మవద్దు.
Ja tad kas uz jums sacīs: redzi, še ir Kristus, vai tur; tad neticiet.
24 ౨౪ కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు.
Jo viltīgi kristi un viltīgi pravieši celsies un lielas zīmes un brīnumus darīs, ka arī tie izredzētie, ja tas varētu būt, uz alošanu taptu pievilti.
25 ౨౫ ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను.
Redziet, Es jums to papriekš esmu sacījis.
26 ౨౬ కాబట్టి ఎవరైనా ‘ఇదిగో, క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు’ అని చెప్పినా, ‘ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు’ అని చెప్పినా మీరు నమ్మవద్దు. వారి వెంట వెళ్ళవద్దు.
Tāpēc, kad tie uz jums sacīs: redzi, Viņš ir tuksnesī, - tad neejat ārā; redzi, Viņš ir kambaros, - tad neticat.
27 ౨౭ “మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది.
Jo kā zibens izšaujas no rīta puses un atspīd līdz vakara pusei, tā būs arī Tā Cilvēka Dēla atnākšana.
28 ౨౮ శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి.
Jo kur ir maita, tur arī ērgļi sakrāsies.
29 ౨౯ “ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి.
Bet tūdaļ pēc šā laika bēdām saule taps aptumšota, un mēnesis nedos savu spīdumu, un zvaigznes kritīs no debess, un debess stiprumi kustināsies.
30 ౩౦ అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు.
Un tad Tā Cilvēka Dēla zīme rādīsies debesī, un tad visas ciltis virs zemes kauks un redzēs To Cilvēka Dēlu nākam debess padebešos ar lielu spēku un godību.
31 ౩౧ ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు.
Un Viņš sūtīs Savus eņģeļus ar lielu bazūnes skaņu, un tie Viņa izredzētos sakrās no tiem četriem vējiem, no viena debess gala līdz otram.
32 ౩౨ “అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు.
Mācaties līdzību no vīģes koka: kad jau viņa zaros pumpuri metās, un lapas plaukst, tad jūs zināt, vasaru esam klātu.
33 ౩౩ అదే విధంగా ఈ సంగతులన్నీ జరగడం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే, ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.
Tā arīdzan, kad jūs visu to redzēsiet, tad ziniet, ka tas ir tuvu priekš durvīm.
34 ౩౪ ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతరించదని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.
Patiesi, Es jums saku: šī cilts nezudīs, tiekams viss tas būs noticis.
35 ౩౫ ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.
Debess un zeme zudīs, bet Mani vārdi nezudīs.
36 ౩౬ “అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారుడికి కూడా తెలియదు.
Bet par to dienu un stundu neviens nezina, ne tie debesu eņģeļi, kā vien Mans Tēvs.
37 ౩౭ నోవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది.
Bet tā, kā bija Noas dienās, tāpat arī būs Tā Cilvēka Dēla atnākšana.
38 ౩౮ జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ, మనుషులు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు.
Jo itin kā tie tais dienās priekš tiem grēku plūdiem rija un plītēja, precējās un laulībā devās līdz tai dienai, kad Noa iegāja šķirstā,
39 ౩౯ జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకునిపోయే వరకూ వారికి తెలియలేదు. ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడ ఉంటుంది.
Un tie neņēma vērā, tiekams tie plūdi nāca un visus aizņēma; tāpat būs arī Tā Cilvēka Dēla atnākšana.
40 ౪౦ ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు.
Tad divi būs laukā; viens taps pieņemts, otrs atmests.
41 ౪౧ ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే, ఒకామె వెళ్ళిపోతుంది, మరొకామె ఉండిపోతుంది.
Divas mals dzirnavās, viena taps pieņemta, otra atmesta.
42 ౪౨ ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి.
Tāpēc esiet modrīgi, jo jūs nezināt, kurā stundā jūsu Kungs nāk.
43 ౪౩ దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకుని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా!
Bet to protiet, kad nama kungs zinātu, kurā stundā zaglis nāks, tad tas paliktu nomodā un neļautu savā namā ielauzties.
44 ౪౪ మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి.
Tāpēc arī jūs esiet gatavi, jo tanī stundā, kurā jūs nedomājiet, Tas Cilvēka Dēls nāks.
45 ౪౫ “ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడు ఎవరు?
Kurš nu ir tas uzticīgais un gudrais kalps, ko tas kungs iecēlis pār savu saimi, tiem maizi dot savā laikā?
46 ౪౬ యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు.
Svētīgs tas kalps, ko tas kungs pārnācis atradīs tā darām.
47 ౪౭ ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.
Patiesi, Es jums saku, ka viņš to iecels pār visām savām mantām.
48 ౪౮ కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని
Bet ja tas ļaunais kalps savā sirdī sacīs: mans kungs kavējās nakt.
49 ౪౯ తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే,
Un iesāks savus darba biedrus sist un ar tiem plītniekiem rīt un plītēt:
50 ౫౦ అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు.
Tad tā kalpa kungs nāks tādā dienā, kad šis negaida, un tādā stundā, ko šis nezina,
51 ౫౧ వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు. అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.”
Un to šķels pušu un tam dos algu ar tiem liekuļiem. Tur būs raudāšana un zobu trīcēšana.