< మత్తయి 23 >
1 ౧ అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు,
JESUS itŭm'sĭtsĭpsiuax akai'tappix ki otŭsksĭnĭmats'ax,
2 ౨ “ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు.
Ki an'iu, Ai'sĭnakix ki Pharisees, Moses otsiso'pŏtsĭsaie itau'piau:
3 ౩ కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు.
Ŭnnikaie kitomian'ĭstaniipuai sat'sĭk ki nĭstutsĭk'. Ki manĭstsĭs'tutsipiau, pinan ĭs'tutsik: tŭk'ka itan'iau, ki matsĭstutŭkkiu'axau.
4 ౪ మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు.
Issoksĭs'tsĭsts itau'monĭmiauĕsts soku'ĕsts mŏkopa'tosau ki matap'pix otsĭstsoauĕsts itotom'iauĕsts; ki osto'auai matakotsĭstŭpakiotsĭm'axauĕsts tuks'kŭmi okĭt'suauax.
5 ౫ వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు.
Otokŏnap'otŭksuauĕsts itsĭstuts'ĭmiauĕsts mŏksĭnnu'yĭsau matap'pix: itopŭx'ĭstutsĭmiauĕsts phylacteries, ki itomŭx'ĭstutsĭmĕsts otsaieno'tŭksuauĕsts,
6 ౬ విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు.
Ki ŭkome'tsĭmiauĕsts oye'tanĭsts ĭstotom'iapioyĭsts, ki natoi'apioyĭsts ĭstotom'isopŏtsĭsts.
7 ౭ సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత ‘బోధకా, బోధకా’ అని పిలిపించుకోవడం వారికి ఇష్టం.
Ki otsitau'pĭsau itau'pumaupi aiksemattsĭni'otseisĭnni, ki mŏks'ĭnikŏttosau, Rabbi, Rabbi.
8 ౮ మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు.
Pinĭs'tsĭnikŭkĭk Rabbi: tuks'kŭmă kitsĭn'aimoauă, Christ: ki ksĕsto'au kĭtokŏnaix'okoauax.
9 ౯ ఇంకా, భూమిమీద ఎవరినీ ‘తండ్రి’ అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి.
Ki Pini'nikŏttok matap'pi, annom' ksŏk'kum, kĭn'a; tuks'kŭmă kĭn'oaua annŏk' spots'im itau'piuŏk.
10 ౧౦ అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు.
Ki pinitsĭn'ikŭkĭk Nin'ax: tuks'kŭma kitsĭn'aimoaua, Christ.
11 ౧౧ మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి.
Annŏk' omŭx'ĭmŏk ksĕsto'au, kitak'apotomokoau.
12 ౧౨ తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.
Annŏk' ak'omuxĭstutosiuŏk, aks'inŭxĭstutoau; ki annŏk' aksinŭx'ĭstutosiuŏk, ak'omŭxĭstutoau.
13 ౧౩ “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు.
Kitaks'ksĭnipuau maka'pi ksĕsto'au ai'sĭnakix ki Pharisees, kitsiksĭs'tapokŏmotsitappiansuai! Kitsitaiok'iauaiau matap'pix Spots'im ĭstsĭn'naiisĭnni: ksĕsto'au kimatsitaipipuau'ats, ki aiaksipimix kimats'epokkitsetomauaxau mŏk'itsipĭsau.
14 ౧౪ మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనియ్యరు.
Kitaks'ksĭnipuau maka'pi ksĕsto'au ai'sĭnakix ki Pharisees, kitsiksĭs'tapokŏmotsitappiansuai! Nam'akex oko'auĕsts kitau'attopuaiau, ki kitaisŭmiksĭstapatsĭmoiikapuau: mĭs'tŭpkapii kitakoku'yisuai.
15 ౧౫ అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు. తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు. మీకు శిక్ష తప్పదు. (Geenna )
Kitaks'ksĭnipuau maka'pi ksĕsto'au ai'sĭnakix ki Pharisees, kitsiksĭs'tapokŏmotsitappiansuai kitotka'atau ksŏk'kum ki omŭk'sikĭmi kŏk'itokonoŏsi tuks'kŭmă matap'iuă mŏkĭtanĭs'tsitsitasi kanĭstsitsi'tawpi kitaumaitu'yĭssi, kanĭstŭm'ipuai ksĕsto'au Hell oku'yix kitak'anĭstsĭstokiaiĭstutoauau. (Geenna )
16 ౧౬ “అయ్యో, అంధ మార్గదర్శులారా, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి’ అని మీరు చెబుతారు.
Kitaks'ksĭnipuau maka'pi ksĕsto'au kitsaps'tsiotŭpĭnŭkipuau, kitan'ipuau annŏk' akitup'ŭtauŭniuŏk omŭk'atoiapioyĭs matsikiu'ats, ki annŏk' akitŭp'ŭtauŭniuŏk omŭk'atoiapioyĭs ĭsto'tokuiĭxkĭm, aks'ĭstutsĭmaie!
17 ౧౭ బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా?
Kitŭt'tsapspuau, kitsaps'tsiipuau: Tsĭma' omŭk'o. Otoku'iĭxkĭm, ki omŭk'atoiapioyĭs annik' itatsĭm'mĭmmiik otoku'iĭxkĭm.
18 ౧౮ అలాగే ‘బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని, దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెబుతారు.
Ki annŏk' akitŭp'ŭtauŭniuŏk altar, matsikiu'ats; ki annŏk' akitŭp'ŭtauŭniuŏk kotŭk'sĭnni altar itokhĭts'tsipi, ai'aksĭstutsĭmaie.
19 ౧౯ అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా?
Kitŭt'tsapspuau, kitsaps'tsipuau Tsĭma' omŭk'o, kotŭk'sĭnni, ki altar annŏk' itatsĭm'etsĭmŏk kotŭk'sĭnni?
20 ౨౦ బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ, దానిపై ఉన్న వాటన్నిటి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.
Annŏk' aiakitŭp'ŭtauŭniuŏk altar, itup'ŭtauŭniu altar ki mian'ĭsttokhĭtstsii.
21 ౨౧ అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.
Ki annŏk' aiakitŭp'ŭtauŭniuŏk omŭk'atoiapioyĭs, itŭp'ŭtauŭniu omŭk'atoiapioyĭs ki annŏk' iko'attomŏk.
22 ౨౨ ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దేవుని సింహాసనం తోడనీ, దానిపై కూర్చున్నవాడి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.
Ki annŏk' aiakitŭp'ŭtauŭniuŏk spots' im, itŭp'ŭtauŭniu Ap'ĭstotokiuă otspiso'pŏtsis ki annŏk' itokhittaupiuŏk.
23 ౨౩ “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదవ వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదవ వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి.
Kitaks'ksĭnipuau makapi ksĕsto'au ai'sĭnakix ki Pharisees, kitsiksĭs'tapokŏmotsitappiansuai! Kitai'ponitasuai mint ki anise ki cummin, ki ĭssoku'ĭsts kimatsatsipuauĕstsau, okŏk'itsimanĭsts, kĭm'apiisĭnni ki aumai'tŭksĭnni: am'osts ŏkh'si kŏk'satsŏsuaiau; ki mat'ŏkhsiuats kŏk staiĭstutsĭssuai stsĭk'ists.
24 ౨౪ అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమలను వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు.
Kits' apstsiotŭpĭnŭkipuau, kitai'soautsauau inŭx'soĭsksĭssi, ki kitaits'ĭssttimauau camel:
25 ౨౫ అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో, అత్యాశతో నిండి ఉన్నాయి.
Kitaks'ksĭnipuau maka'pi ksĕsto'au ai'sinakix ki Pharisees, kitsiksĭs'tapokŏmotsitappiansuai! Kŏs'ă ki saiĕtso'kosi sauauts'i kitŭs'siipuaiau, ki pĭstots'ĭm itui'tsiau minĭk'otŭksĭnni ki auŭt'tseisĭnni.
26 ౨౬ గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది.
Kitsaps'tsii Pharisee, matom'siitau pistots'im kos'ă ki saiĕtso'kosa mŏk'ŭtsitsiksixĭssi sauauts'i,
27 ౨౭ అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయటకి అందంగానే కనిపిస్తాయి. కాని, లోపల చచ్చినవారి యెముకలతో, సమస్త కల్మషంతో నిండి ఉంటాయి.
Kitsaks'ksĭnipuau maka'pi ksĕsto'au ai'sĭnakix ki Pharisee kitsiksĭs'tapokŏmotsitappiansuai! Ksĭkoken'imanĭsts kine'tŭmanĭstspuau ai'ŏkhsĭnipiau sauauts'ĭstsi, ki pĭstots' im itui'tsiau enix' okin'oauĕsts ki makap'ĭsts.
28 ౨౮ అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు. కానీ, మీరు లోపల కపటంతో, దుష్టత్వంతో నిండి ఉంటారు.
Netoi'nitsiii ksĕsto'au kĭto'kŏmotsitappiĭnipuau matap'pi, ki pĭstots'im kitotuitskitsipuai ksĭs'tapokŏmotsitappiisĭnni ki sauum'itsitappiisĭnni.
29 ౨౯ “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు, నీతిమంతుల సమాధులకు రంగులు వేస్తారు.
Kitaks'ksĭnipuau maka'pi ksĕsto'au ai'sinakix ki Pharisees, kitsiksĭs'tapokŏmotsitappiansuai! Kitap'ĭstutsipuaiau prophetix otoken'imanoauĕsts, ki kita'nŭtsĭstutsipuaiau mokŏm'otsitappix otoken'imanoauĕsts,
30 ౩౦ ‘మేమే గనుక మా పూర్వికుల రోజుల్లో జీవించి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో వారితో కలిసే వాళ్ళం కాము’ అని చెప్పుకొంటారు.
Ki kitanipuau nitsa'kiaitappiipĭnanopi nĭn'anĭx otsa'kiaitappiisau nĭs'tasauopoksĭstokemaumŭnanopiau prophetix otsa'apŭnoauĕsts.
31 ౩౧ నిజానికి మీరు ప్రవక్తలను చంపినవారి సంతానం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు.
Ŭn'nikaie kit'auŭtanipuau, ksĕsto'auŭkauk anniks'isk matap'pixk initsixk' prophetsix o'kosoauax.
32 ౩౨ ఇంకేం, మీ పూర్వికుల దోషాలను మీరే పూర్తి చేయండి.
Tu'itok kĭn'oauax otsauum'itsitappiisuauĕsts.
33 ౩౩ “సర్పాల్లారా, పాము పిల్లలారా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు. (Geenna )
Pitseksĭnax, opĭx'exĭnasĭnna, Tsa'a kitakanĭstupĭs'tapixsattopats Hell ĭstokŏk'itsimani? (Geenna )
34 ౩౪ కాబట్టి వినండి! నేను మీ దగ్గరికి ప్రవక్తలనూ, జ్ఞానులనూ, ధర్మశాస్త్ర పండితులనూ పంపుతున్నాను. మీరు వారిలో కొంతమందిని చంపుతారు. సిలువ వేస్తారు. కొంతమందిని మీ సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు. మరి కొందరిని ఊరినుంచి ఊరికి తరిమి కొడతారు.
Ŭn'nikaie, sat'sĭk kĭtakittŭp'skoaiau ksĕsto'au prophetix, ki mokŏk'ietappix ki ai'sĭnakix: ki stsĭk'ĭx kitax'enitauaiau ki kitiikau'aistauaiau; ki stsĭk'ĭx kitakitsipstŭstsipĭs'auaiau kitatoi'apioyimoauests, ki kĭtak'auksĭstutuauaiau amian'ĭstakap'ioyĭsts otai'akitsipĭsau:
35 ౩౫ నీతిపరుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి, మీరు దేవాలయం, బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీ పైకి వస్తుంది.
Mŏkĭttokh'ittaitsĭssi ksĕsto'au kŏnau'kŏmotsitappiaapŭni ksŏk'kum itsai'kimskaii. Abel mokŏm'otsitappiuă otsa'apŭn itŭpots'tsiuaie Zacharias, Barachias okku'i otsa'apŭniaie annŏk', kitsitsenitauauŏk itŭt'sikatsi omŭk'atoiapioyĭs ki altar.
36 ౩౬ అదంతా ఈ తరం వారి మీదికి వస్తుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
Kitau'mŭnĭstopuau kŏnai'sĭstskă aunok' o'tappiisĭnna akĭtotu'iĕsts.
37 ౩౭ “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ, దేవుడు నీ దగ్గరికి పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకుని దాచిపెడుతుందో అదే విధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను గానీ నువ్వు ఇష్టపడలేదు.
Jerusalem, Jerusalem ksĕsto'auă kitai'nitauaie prophetĭx, ki anniks'isk itŭp'skuaxk ksĕsto'auă ok'otokĭx kumutauauaiak'iauaiau, nŏkstanĭstsikapumoi'piauopi ko'kosoauax nipuau'ă manĭstau'moipiopi o'kosĭx ki kimat'ŏkhsitsipuau'ats!
38 ౩౮ ఇదుగో, ఇక మీ ఇల్లు మీకే పాడుగా విడిచి పెట్టేస్తున్నాను
Sat'sĭk, Koko'auai nam'itaitsiu kĭt'skĭtomoko.
39 ౩౯ ఇప్పటి నుండి మీరు ‘ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతులు పొందుతాడు గాక’ అని చెప్పే వరకూ మీరు నన్ను చూడరని నేను మీతో చెబుతున్నాను.”
Kitan'ĭstopuau, ĭssoots'i kimatakainokipuaua sauanenoainiki Atsĭm'siu annŏk' paiuksipu'ŏk Ap'istotokiuă otsĭn'ikŏsĭm.