< మత్తయి 22 >
1 ౧ యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు,
અનન્તરં યીશુઃ પુનરપિ દૃષ્ટાન્તેન તાન્ અવાદીત્,
2 ౨ “పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది.
સ્વર્ગીયરાજ્યમ્ એતાદૃશસ્ય નૃપતેઃ સમં, યો નિજ પુત્રં વિવાહયન્ સર્વ્વાન્ નિમન્ત્રિતાન્ આનેતું દાસેયાન્ પ્રહિતવાન્,
3 ౩ ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు.
કિન્તુ તે સમાગન્તું નેષ્ટવન્તઃ|
4 ౪ అప్పుడు ఆ రాజు, ‘ఇదిగో, నా విందు సిద్ధంగా ఉంది. ఎద్దులను, కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను. పెళ్ళి విందుకు రండి’ అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు.
તતો રાજા પુનરપિ દાસાનન્યાન્ ઇત્યુક્ત્વા પ્રેષયામાસ, નિમન્ત્રિતાન્ વદત, પશ્યત, મમ ભેજ્યમાસાદિતમાસ્તે, નિજવ્ટષાદિપુષ્ટજન્તૂન્ મારયિત્વા સર્વ્વં ખાદ્યદ્રવ્યમાસાદિતવાન્, યૂયં વિવાહમાગચ્છત|
5 ౫ కానీ వారు లెక్క చేయకుండా, ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు.
તથપિ તે તુચ્છીકૃત્ય કેચિત્ નિજક્ષેત્રં કેચિદ્ વાણિજ્યં પ્રતિ સ્વસ્વમાર્ગેણ ચલિતવન્તઃ|
6 ౬ మిగిలినవారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు.
અન્યે લોકાસ્તસ્ય દાસેયાન્ ધૃત્વા દૌરાત્મ્યં વ્યવહૃત્ય તાનવધિષુઃ|
7 ౭ కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.
અનન્તરં સ નૃપતિસ્તાં વાર્ત્તાં શ્રુત્વા ક્રુધ્યન્ સૈન્યાનિ પ્રહિત્ય તાન્ ઘાતકાન્ હત્વા તેષાં નગરં દાહયામાસ|
8 ౮ అప్పుడతడు, ‘పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు.
તતઃ સ નિજદાસેયાન્ બભાષે, વિવાહીયં ભોજ્યમાસાદિતમાસ્તે, કિન્તુ નિમન્ત્રિતા જના અયોગ્યાઃ|
9 ౯ కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి’ అని తన దాసులతో చెప్పాడు.
તસ્માદ્ યૂયં રાજમાર્ગં ગત્વા યાવતો મનુજાન્ પશ્યત, તાવતએવ વિવાહીયભોજ્યાય નિમન્ત્રયત|
10 ౧౦ ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారిని, మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ ఇల్లంతా పెళ్ళి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది.
તદા તે દાસેયા રાજમાર્ગં ગત્વા ભદ્રાન્ અભદ્રાન્ વા યાવતો જનાન્ દદૃશુઃ, તાવતએવ સંગૃહ્યાનયન્; તતોઽભ્યાગતમનુજૈ ર્વિવાહગૃહમ્ અપૂર્ય્યત|
11 ౧౧ “రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు.
તદાનીં સ રાજા સર્વ્વાનભ્યાગતાન્ દ્રષ્ટુમ્ અભ્યન્તરમાગતવાન્; તદા તત્ર વિવાહીયવસનહીનમેકં જનં વીક્ષ્ય તં જગાદ્,
12 ౧౨ రాజు అతనితో, ‘మిత్రమా, పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు.
હે મિત્ર, ત્વં વિવાહીયવસનં વિના કથમત્ર પ્રવિષ્ટવાન્? તેન સ નિરુત્તરો બભૂવ|
13 ౧౩ కాబట్టి రాజు, ‘ఇతని కాళ్ళు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి’ అని తన పరిచారకులతో చెప్పాడు.
તદા રાજા નિજાનુચરાન્ અવદત્, એતસ્ય કરચરણાન્ બદ્ધા યત્ર રોદનં દન્તૈર્દન્તઘર્ષણઞ્ચ ભવતિ, તત્ર વહિર્ભૂતતમિસ્રે તં નિક્ષિપત|
14 ౧౪ ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.”
ઇત્થં બહવ આહૂતા અલ્પે મનોભિમતાઃ|
15 ౧౫ అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు.
અનન્તરં ફિરૂશિનઃ પ્રગત્ય યથા સંલાપેન તમ્ ઉન્માથે પાતયેયુસ્તથા મન્ત્રયિત્વા
16 ౧౬ వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరికి పంపించారు. వారు ఆయనతో, “బోధకా, నీవు యథార్ధవంతుడివనీ, దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివనీ, ఎవరినీ లెక్క చేయవనీ, ఎలాటి పక్షపాతం చూపవనీ మాకు తెలుసు.
હેરોદીયમનુજૈઃ સાકં નિજશિષ્યગણેન તં પ્રતિ કથયામાસુઃ, હે ગુરો, ભવાન્ સત્યઃ સત્યમીશ્વરીયમાર્ગમુપદિશતિ, કમપિ માનુષં નાનુરુધ્યતે, કમપિ નાપેક્ષતે ચ, તદ્ વયં જાનીમઃ|
17 ౧౭ సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు” అని అడిగారు.
અતઃ કૈસરભૂપાય કરોઽસ્માકં દાતવ્યો ન વા? અત્ર ભવતા કિં બુધ્યતે? તદ્ અસ્માન્ વદતુ|
18 ౧౮ యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, “కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు?
તતો યીશુસ્તેષાં ખલતાં વિજ્ઞાય કથિતવાન્, રે કપટિનઃ યુયં કુતો માં પરિક્ષધ્વે?
19 ౧౯ ఏదీ, సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి” అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు.
તત્કરદાનસ્ય મુદ્રાં માં દર્શયત| તદાનીં તૈસ્તસ્ય સમીપં મુદ્રાચતુર્થભાગ આનીતે
20 ౨౦ ఆయన, “దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని వారినడిగాడు. వారు, “అవి సీజరు చక్రవర్తివి” అన్నారు.
સ તાન્ પપ્રચ્છ, અત્ર કસ્યેયં મૂર્ત્તિ ર્નામ ચાસ્તે? તે જગદુઃ, કૈસરભૂપસ્ય|
21 ౨౧ ఆయన వెంటనే, “అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అని వారితో చెప్పాడు.
તતઃ સ ઉક્તવાન, કૈસરસ્ય યત્ તત્ કૈસરાય દત્ત, ઈશ્વરસ્ય યત્ તદ્ ઈશ્વરાય દત્ત|
22 ౨౨ వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు.
ઇતિ વાક્યં નિશમ્ય તે વિસ્મયં વિજ્ઞાય તં વિહાય ચલિતવન્તઃ|
23 ౨౩ అదే రోజు, మరణించిన వారు తిరిగి లేవడం జరగదని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చి,
તસ્મિન્નહનિ સિદૂકિનોઽર્થાત્ શ્મશાનાત્ નોત્થાસ્યન્તીતિ વાક્યં યે વદન્તિ, તે યીશેરન્તિકમ્ આગત્ય પપ્રચ્છુઃ,
24 ౨౪ “బోధకా, ‘ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్ళి చేసికుని తన సోదరునికి సంతానం కలిగించాలి’ అని మోషే చెప్పాడు గదా.
હે ગુરો, કશ્ચિન્મનુજશ્ચેત્ નિઃસન્તાનઃ સન્ પ્રાણાન્ ત્યજતિ, તર્હિ તસ્ય ભ્રાતા તસ્ય જાયાં વ્યુહ્ય ભ્રાતુઃ સન્તાનમ્ ઉત્પાદયિષ્યતીતિ મૂસા આદિષ્ટવાન્|
25 ౨౫ మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. అతని తమ్ముడు అతని భార్యను చేసుకున్నాడు.
કિન્ત્વસ્માકમત્ર કેઽપિ જનાઃ સપ્તસહોદરા આસન્, તેષાં જ્યેષ્ઠ એકાં કન્યાં વ્યવહાત્, અપરં પ્રાણત્યાગકાલે સ્વયં નિઃસન્તાનઃ સન્ તાં સ્ત્રિયં સ્વભ્રાતરિ સમર્પિતવાન્,
26 ౨౬ ఈ రెండోవాడు, మూడోవాడు, తరువాత ఏడోవాడి వరకూ అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు.
તતો દ્વિતીયાદિસપ્તમાન્તાશ્ચ તથૈવ ચક્રુઃ|
27 ౨౭ వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది.
શેષે સાપી નારી મમાર|
28 ౨౮ చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా?” అని అడిగారు.
મૃતાનામ્ ઉત્થાનસમયે તેષાં સપ્તાનાં મધ્યે સા નારી કસ્ય ભાર્ય્યા ભવિષ્યતિ? યસ્માત્ સર્વ્વએવ તાં વ્યવહન્|
29 ౨౯ అందుకు యేసు, “మీకు లేఖనాలూ, దేవుని శక్తీ తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు.
તતો યીશુઃ પ્રત્યવાદીત્, યૂયં ધર્મ્મપુસ્તકમ્ ઈશ્વરીયાં શક્તિઞ્ચ ન વિજ્ઞાય ભ્રાન્તિમન્તઃ|
30 ౩౦ పునరుత్థానం జరిగిన తరువాత ఎవరూ పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు.
ઉત્થાનપ્રાપ્તા લોકા ન વિવહન્તિ, ન ચ વાચા દીયન્તે, કિન્ત્વીશ્વરસ્ય સ્વર્ગસ્થદૂતાનાં સદૃશા ભવન્તિ|
31 ౩౧ చనిపోయిన వారి పునరుత్థానం విషయమైతే దేవుడు, ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి’ అని చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన బ్రతికి ఉన్నవారికే దేవుడు, చనిపోయిన వారికి కాదు” అని వారితో చెప్పాడు.
અપરં મૃતાનામુત્થાનમધિ યુષ્માન્ પ્રતીયમીશ્વરોક્તિઃ,
"અહમિબ્રાહીમ ઈશ્વર ઇસ્હાક ઈશ્વરો યાકૂબ ઈશ્વર" ઇતિ કિં યુષ્માભિ ર્નાપાઠિ? કિન્ત્વીશ્વરો જીવતામ્ ઈશ્વર: , સ મૃતાનામીશ્વરો નહિ|
33 ౩౩ ఈ మాటలు విన్న జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు.
ઇતિ શ્રુત્વા સર્વ્વે લોકાસ્તસ્યોપદેશાદ્ વિસ્મયં ગતાઃ|
34 ౩౪ ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు.
અનન્તરં સિદૂકિનામ્ નિરુત્તરત્વવાર્તાં નિશમ્ય ફિરૂશિન એકત્ર મિલિતવન્તઃ,
35 ౩౫ వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి,
તેષામેકો વ્યવસ્થાપકો યીશું પરીક્ષિતું પપચ્છ,
36 ౩౬ “బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.
હે ગુરો વ્યવસ્થાશાસ્ત્રમધ્યે કાજ્ઞા શ્રેષ્ઠા?
37 ౩౭ అందుకు యేసు, “‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.
તતો યીશુરુવાચ, ત્વં સર્વ્વાન્તઃકરણૈઃ સર્વ્વપ્રાણૈઃ સર્વ્વચિત્તૈશ્ચ સાકં પ્રભૌ પરમેશ્વરે પ્રીયસ્વ,
38 ౩౮ ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.
એષા પ્રથમમહાજ્ઞા| તસ્યાઃ સદૃશી દ્વિતીયાજ્ઞૈષા,
39 ౩౯ ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.
તવ સમીપવાસિનિ સ્વાત્મનીવ પ્રેમ કુરુ|
40 ౪౦ ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు.
અનયો ર્દ્વયોરાજ્ઞયોઃ કૃત્સ્નવ્યવસ્થાયા ભવિષ્યદ્વક્તૃગ્રન્થસ્ય ચ ભારસ્તિષ્ઠતિ|
41 ౪౧ మరోసారి పరిసయ్యులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు, యేసు వారిని,
અનન્તરં ફિરૂશિનામ્ એકત્ર સ્થિતિકાલે યીશુસ્તાન્ પપ્રચ્છ,
42 ౪౨ “క్రీస్తు విషయంలో మీ అభిప్రాయమేమిటి? ఆయన ఎవరి కుమారుడు?” అని ప్రశ్నించాడు. వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు.
ખ્રીષ્ટમધિ યુષ્માકં કીદૃગ્બોધો જાયતે? સ કસ્ય સન્તાનઃ? તતસ્તે પ્રત્યવદન્, દાયૂદઃ સન્તાનઃ|
43 ౪౩ అందుకు యేసు, “అయితే, ‘నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ
તદા સ ઉક્તવાન્, તર્હિ દાયૂદ્ કથમ્ આત્માધિષ્ઠાનેન તં પ્રભું વદતિ?
44 ౪౪ నీవు నా కుడి పక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు’ అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు?
યથા મમ પ્રભુમિદં વાક્યમવદત્ પરમેશ્વરઃ| તવારીન્ પાદપીઠં તે યાવન્નહિ કરોમ્યહં| તાવત્ કાલં મદીયે ત્વં દક્ષપાર્શ્વ ઉપાવિશ| અતો યદિ દાયૂદ્ તં પ્રભું વદતિ, ર્તિહ સ કથં તસ્ય સન્તાનો ભવતિ?
45 ౪౫ దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు?” అని వారిని అడిగాడు.
તદાનીં તેષાં કોપિ તદ્વાક્યસ્ય કિમપ્યુત્તરં દાતું નાશક્નોત્;
46 ౪౬ ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. అంతే కాదు, ఆ రోజు నుండి ఆయనను ఒక ప్రశ్న అడగడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు.
તદ્દિનમારભ્ય તં કિમપિ વાક્યં પ્રષ્ટું કસ્યાપિ સાહસો નાભવત્|