< మత్తయి 21 >
1 ౧ వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు. అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి,
Και ότε επλησίασαν εις Ιεροσόλυμα και ήλθον εις Βηθφαγή προς το όρος των ελαιών, τότε ο Ιησούς απέστειλε δύο μαθητάς,
2 ౨ “మీకు ఎదురుగా కనిపించే గ్రామంలోకి వెళ్ళండి. వెళ్ళగానే కట్టేసి ఉన్న ఒక గాడిదా, దాని పిల్లా మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరికి తోలుకుని రండి.
λέγων προς αυτούς· Υπάγετε εις την κώμην την απέναντι υμών, και ευθύς θέλετε ευρεί όνον δεδεμένην και πωλάριον μετ' αυτής· λύσατε και φέρετέ μοι.
3 ౩ ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అప్పుడు అతడు వెంటనే వాటిని మీతో పంపుతాడు” అని చెప్పి వారిని పంపించాడు.
Και εάν τις σας είπη τι, θέλετε ειπεί ότι ο Κύριος έχει χρείαν αυτών· και ευθύς θέλει αποστείλει αυτά.
4 ౪ దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నెరవేరేలా ఇది జరిగింది, ఆ మాటలు ఏవంటే,
Τούτο δε όλον έγεινε διά να πληρωθή το ρηθέν διά του προφήτου, λέγοντος·
5 ౫ “ఇదిగో నీ రాజు దీనుడుగా గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి.”
Είπατε προς την θυγατέρα Σιών, Ιδού, ο βασιλεύς σου έρχεται προς σε πραΰς και καθήμενος επί όνου και πώλου υιού υποζυγίου.
6 ౬ అప్పుడా శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.
Πορευθέντες δε οι μαθηταί και ποιήσαντες καθώς προσέταξεν αυτούς ο Ιησούς,
7 ౭ వారు ఆ గాడిదను, దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. వాటిమీద ఆయన కూర్చున్నాడు.
έφεραν την όνον και το πωλάριον, και έβαλον επάνω αυτών τα ιμάτια αυτών και επεκάθισαν αυτόν επάνω αυτών.
8 ౮ జనసమూహంలో అనేకమంది తమ బట్టలు దారి పొడుగునా నేలమీద పరిచారు. కొందరైతే చెట్లకొమ్మలు నరికి దారిలో పరిచారు.
Ο δε περισσότερος όχλος έστρωσαν τα ιμάτια εαυτών εις την οδόν, άλλοι δε έκοπτον κλάδους από των δένδρων και έστρωνον εις την οδόν.
9 ౯ జనసమూహంలో ఆయనకు ముందూ, వెనకా నడుస్తూ, “దావీదు కుమారుడికి జయం! ప్రభువు పేరిట వచ్చేవాడికి స్తుతులు, ఉన్నతమైన స్థలాల్లో జయం” అని కేకలు వేస్తూ వచ్చారు.
Οι δε όχλοι οι προπορευόμενοι και οι ακολουθούντες έκραζον, λέγοντες· Ωσαννά τω υιώ Δαβίδ· ευλογημένος ο ερχόμενος εν ονόματι Κυρίου· Ωσαννά εν τοις υψίστοις.
10 ౧౦ ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా, “ఎవరీయన?” అని కలవరంతో నిండిపోయింది.
Και ότε εισήλθεν εις Ιεροσόλυμα, εσείσθη πάσα η πόλις, λέγουσα· Τις είναι ούτος;
11 ౧౧ ఆయనతో వచ్చిన జనసమూహం, “ఈయన యేసు. గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త” అని వారికి జవాబిచ్చారు.
Οι δε όχλοι έλεγον· Ούτος είναι Ιησούς ο προφήτης ο από Ναζαρέτ της Γαλιλαίας.
12 ౧౨ యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మేవారిని కొనేవారిని అందరినీ వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేసేవారి బల్లలనూ, పావురాలు అమ్మేవారి పీటలనూ పడదోశాడు.
Και εισήλθεν ο Ιησούς εις το ιερόν του Θεού και εξέβαλε πάντας τους πωλούντας και αγοράζοντας εν τω ιερώ, και τας τραπέζας των αργυραμοιβών ανέτρεψε και τα καθίσματα των πωλούντων τας περιστεράς,
13 ౧౩ వారితో ఇలా అన్నాడు, “‘నా ఆలయం ప్రార్థనకు నిలయం’ అని రాసి ఉంది. కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు.”
και λέγει προς αυτούς· Είναι γεγραμμένον, Ο οίκός μου οίκος προσευχής θέλει ονομάζεσθαι, σεις δε εκάμετε αυτόν σπήλαιον ληστών.
14 ౧౪ అక్కడి గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరికి వచ్చారు, ఆయన వారందరినీ బాగుచేశాడు.
Και προσήλθον προς αυτόν τυφλοί και χωλοί εν τω ιερώ και εθεράπευσεν αυτούς.
15 ౧౫ ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు.
Ιδόντες δε οι αρχιερείς και οι γραμματείς τα θαυμάσια, τα οποία έκαμε, και τους παίδας κράζοντας εν τω ιερώ και λέγοντας, Ωσαννά τω υιώ Δαβίδ, ηγανάκτησαν
16 ౧౬ “వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?” అని వారితో చెప్పి
και είπον προς αυτόν· Ακούεις τι λέγουσιν ούτοι; Ο δε Ιησούς λέγει προς αυτούς· Ναί· ποτέ δεν ανεγνώσατε ότι εκ στόματος νηπίων και θηλαζόντων ητοίμασας αίνεσιν;
17 ౧౭ ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియ వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపాడు.
Και αφήσας αυτούς εξήλθεν έξω της πόλεως εις Βηθανίαν και διενυκτέρευσεν εκεί.
18 ౧౮ తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది.
Ότε δε το πρωΐ επέστρεφεν εις την πόλιν, επείνασε·
19 ౧౯ అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే, దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, “ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!” అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది. (aiōn )
και ιδών μίαν συκήν επί της οδού, ήλθε προς αυτήν και ουδέν ηύρεν επ' αυτήν ειμή φύλλα μόνον, και λέγει προς αυτήν· Να μη γείνη πλέον από σου καρπός εις τον αιώνα. Και παρευθύς εξηράνθη η συκή. (aiōn )
20 ౨౦ అది చూసి, శిష్యులు ఆశ్చర్యపోయి, “ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా!” అని చెప్పుకున్నారు.
Και ιδόντες οι μαθηταί, εθαύμασαν λέγοντες· Πως παρευθύς εξηράνθη συκή;
21 ౨౧ అందుకు యేసు, “మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది.
Αποκριθείς δε ο Ιησούς είπε προς αυτούς· Αληθώς σας λέγω, εάν έχητε πίστιν και δεν διστάσητε, ουχί μόνον το της συκής θέλετε κάμει, αλλά και εις το όρος τούτο αν είπητε, Σηκώθητι και ρίφθητι εις την θάλασσαν, θέλει γείνει·
22 ౨౨ మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు” అని వారితో చెప్పాడు.
και πάντα όσα αν ζητήσητε εν τη προσευχή έχοντες πίστιν θέλετε λάβει.
23 ౨౩ ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, “ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అడిగారు.
Και ότε ήλθεν εις το ιερόν, προσήλθον προς αυτόν, ενώ εδίδασκεν οι αρχιερείς και οι πρεσβύτεροι του λαού, λέγοντες· Εν ποία εξουσία πράττεις ταύτα, και τις σοι έδωκε την εξουσίαν ταύτην;
24 ౨౪ యేసు, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను.
Αποκριθείς δε ο Ιησούς, είπε προς αυτούς· Θέλω σας ερωτήσει και εγώ ένα λόγον, τον οποίον εάν μοι είπητε, και εγώ θέλω σας ειπεί εν ποία εξουσία πράττω ταύτα·
25 ౨౫ యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?” అని వారిని అడిగాడు. అప్పుడు వారు, “మనం పరలోకం నుండి, అని చెబితే, ‘మీరెందుకు యోహానును నమ్మలేదు?’ అంటాడు.
το βάπτισμα του Ιωάννου πόθεν ήτο, εξ ουρανού ή εξ ανθρώπων; Και εκείνοι διελογίζοντο καθ' εαυτούς λέγοντες· Εάν είπωμεν, Εξ ουρανού, θέλει ειπεί προς ημάς, Διά τι λοιπόν δεν επιστεύσατε εις αυτόν·
26 ౨౬ మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది అని తమలో తాము చర్చించుకుని,
εάν δε είπωμεν, Εξ ανθρώπων, φοβούμεθα τον όχλον· διότι πάντες έχουσι τον Ιωάννην ως προφήτην.
27 ౨౭ “మాకు తెలియదు” అన్నారు. అప్పుడాయన “అలాగైతే నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో కూడా చెప్పను” అన్నాడు.
Και αποκριθέντες προς τον Ιησούν, είπον· Δεν εξεύρομεν. Είπε προς αυτούς και αυτός· Ουδέ εγώ λέγω προς υμάς εν ποία εξουσία πράττω ταύτα.
28 ౨౮ ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ, “మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో, ‘బాబూ, పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి’ అన్నాడు.
Αλλά τι σας φαίνεται; Άνθρωπος τις είχε δύο υιούς, και ελθών προς τον πρώτον είπε· Τέκνον, ύπαγε σήμερον εργάζου εν τω αμπελώνι μου.
29 ౨౯ అతడు, ‘నేను వెళ్ళను’ అని జవాబిచ్చాడుగానీ తరవాత మనసు మార్చుకుని వెళ్ళాడు.
Ο δε αποκριθείς είπε· Δεν θέλω· ύστερον όμως μετανοήσας υπήγε.
30 ౩౦ అప్పుడా తండ్రి తన రెండవ కొడుకు దగ్గరికి వచ్చి అదే విధంగా అడిగాడు. అతడు, ‘నేను వెళతాను’ అన్నాడుగానీ వెళ్ళలేదు.
Και ελθών προς τον δεύτερον είπεν ωσαύτως. Και εκείνος αποκριθείς είπεν· Εγώ υπάγω, κύριε· και δεν υπήγε.
31 ౩౧ ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?” అని వారిని అడిగాడు. వారు, “మొదటివాడే” అని జవాబిచ్చారు. యేసు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు.
Τις εκ των δύο έκαμε το θέλημα του πατρός; Λέγουσι προς αυτόν· Ο πρώτος. Λέγει προς αυτούς ο Ιησούς· Αληθώς σας λέγω ότι οι τελώναι και αι πόρναι υπάγουσι πρότερον υμών εις την βασιλείαν του Θεού.
32 ౩౨ యోహాను నీతి మార్గంలో మీ దగ్గరికి వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడ లేదు, అతనిని నమ్మలేదు.
Διότι ήλθε προς υμάς ο Ιωάννης εν οδώ δικαιοσύνης, και δεν επιστεύσατε εις αυτόν· οι τελώναι όμως και αι πόρναι επίστευσαν εις αυτόν· σεις δε ιδόντες δεν μετεμελήθητε ύστερον, ώστε να πιστεύσητε εις αυτόν.
33 ౩౩ “ఇంకో ఉపమానం వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు.
Άλλην παραβολήν ακούσατε. Ήτο άνθρωπός τις οικοδεσπότης, όστις εφύτευσεν αμπελώνα και περιέβαλεν εις αυτόν φραγμόν και έσκαψεν εν αυτώ ληνόν και ωκοδόμησε πύργον, και εμίσθωσεν αυτόν εις γεωργούς και απεδήμησεν.
34 ౩౪ కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు.
Ότε δε επλησίασεν ο καιρός των καρπών, απέστειλε τους δούλους αυτού προς τους γεωργούς διά να λάβωσι τους καρπούς αυτού.
35 ౩౫ ఆ రైతులు అతని దాసులను పట్టుకుని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు. ఇంకొకణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు.
Και πιάσαντες οι γεωργοί τους δούλους αυτού, άλλον μεν έδειραν, άλλον δε εφόνευσαν, άλλον δε ελιθοβόλησαν.
36 ౩౬ అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసులను పంపాడు. కానీ వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు.
Πάλιν απέστειλεν άλλους δούλους πλειοτέρους των πρώτων, και έκαμον εις αυτούς ωσαύτως.
37 ౩౭ చివరికి ఆ యజమాని ‘నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు.
Ύστερον δε απέστειλε προς αυτούς τον υιόν αυτού λέγων· Θέλουσιν εντραπή τον υιόν μου.
38 ౩౮ అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి, ‘అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి’ అని తమలో తాము చెప్పుకున్నారు.
Αλλ' οι γεωργοί, ιδόντες τον υιόν, είπον προς αλλήλους· Ούτος είναι ο κληρονόμος· έλθετε, ας φονεύσωμεν αυτόν και ας κατακρατήσωμεν την κληρονομίαν αυτού.
39 ౩౯ వారు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు.
Και πιάσαντες αυτόν, εξέβαλον έξω του αμπελώνος και εφόνευσαν.
40 ౪౦ ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతులను ఏం చేస్తాడు?” అని వారిని అడిగాడు.
Όταν λοιπόν έλθη ο κύριος του αμπελώνος, τι θέλει κάμει εις τους γεωργούς εκείνους;
41 ౪౧ వారు “అతడు ఆ దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని ఆయనకు జవాబిచ్చారు.
Λέγουσι προς αυτόν· Κακούς κακώς θέλει απολέσει αυτούς, και τον αμπελώνα θέλει μισθώσει εις άλλους γεωργούς, οίτινες θέλουσιν αποδώσει εις αυτόν τους καρπούς εν τοις καιροίς αυτών.
42 ౪౨ అప్పుడు యేసు వారితో, “‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’ అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?
Λέγει προς αυτούς ο Ιησούς· Ποτέ δεν ανεγνώσατε εν ταις γραφαίς, Ο λίθος, τον οποίον απεδοκίμασαν οι οικοδομούντες, ούτος έγεινε κεφαλή γωνίας· παρά Κυρίου έγεινεν αύτη και είναι θαυμαστή εν οφθαλμοίς υμών;
43 ౪౩ “కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి, దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను.
Διά τούτο λέγω προς υμάς ότι θέλει αφαιρεθή αφ' υμών η βασιλεία του Θεού και θέλει δοθή εις έθνος κάμνον τους καρπούς αυτής·
44 ౪౪ ఈ బండ మీద పడేవాడు ముక్కలై పోతాడు గానీ అది ఎవరి మీద పడుతుందో వాణ్ణి అది నలిపి పొడి చేస్తుంది” అన్నాడు.
και όστις πέση επί τον λίθον τούτον θέλει συντριφθή· εις όντινα δε επιπέση, θέλει κατασυντρίψει αυτόν.
45 ౪౫ ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ముఖ్య యాజకులు, పరిసయ్యులు గ్రహించారు.
Και ακούσαντες οι αρχιερείς και οι Φαρισαίοι τας παραβολάς αυτού, ενόησαν ότι περί αυτών λέγει·
46 ౪౬ వారు ఆయనను పట్టుకోడానికి తగిన సమయం కోసం చూశారుగానీ ప్రజలకు భయపడ్దారు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తున్నారు.
και ζητούντες να πιάσωσιν αυτόν, εφοβήθησαν τους όχλους, επειδή είχον αυτόν ως προφήτην.