< మత్తయి 19 >
1 ౧ యేసు ఈ మాటలు చెప్పిన తరువాత గలిలయ ప్రాంతాన్ని విడిచి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వచ్చాడు.
అనన్తరమ్ ఏతాసు కథాసు సమాప్తాసు యీశు ర్గాలీలప్రదేశాత్ ప్రస్థాయ యర్దన్తీరస్థం యిహూదాప్రదేశం ప్రాప్తః|
2 ౨ గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. ఆయన వారిని అక్కడ బాగుచేశాడు.
తదా తత్పశ్చాత్ జననివహే గతే స తత్ర తాన్ నిరామయాన్ అకరోత్|
3 ౩ పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఆయనను పరీక్షించడం కోసం, “ఏ కారణం చేతనైనా సరే, పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం చట్టబద్ధమేనా?” అని అడిగారు.
తదనన్తరం ఫిరూశినస్తత్సమీపమాగత్య పారీక్షితుం తం పప్రచ్ఛుః, కస్మాదపి కారణాత్ నరేణ స్వజాయా పరిత్యాజ్యా న వా?
4 ౪ అందుకాయన, “సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ,
స ప్రత్యువాచ, ప్రథమమ్ ఈశ్వరో నరత్వేన నారీత్వేన చ మనుజాన్ ససర్జ, తస్మాత్ కథితవాన్,
5 ౫ ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు’ అని చెప్పాడనీ మీరు చదవలేదా?
మానుషః స్వపితరౌ పరిత్యజ్య స్వపత్న్యామ్ ఆసక్ష్యతే, తౌ ద్వౌ జనావేకాఙ్గౌ భవిష్యతః, కిమేతద్ యుష్మాభి ర్న పఠితమ్?
6 ౬ కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు” అని జవాబిచ్చాడు.
అతస్తౌ పున ర్న ద్వౌ తయోరేకాఙ్గత్వం జాతం, ఈశ్వరేణ యచ్చ సమయుజ్యత, మనుజో న తద్ భిన్ద్యాత్|
7 ౭ అందుకు వారు, “అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని అడిగారు.
తదానీం తే తం ప్రత్యవదన్, తథాత్వే త్యాజ్యపత్రం దత్త్వా స్వాం స్వాం జాయాం త్యక్తుం వ్యవస్థాం మూసాః కథం లిలేఖ?
8 ౮ అప్పుడాయన, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడు గానీ, ప్రారంభం నుండీ అలా జరగలేదు.
తతః స కథితవాన్, యుష్మాకం మనసాం కాఠిన్యాద్ యుష్మాన్ స్వాం స్వాం జాయాం త్యక్తుమ్ అన్వమన్యత కిన్తు ప్రథమాద్ ఏషో విధిర్నాసీత్|
9 ౯ భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను” అని వారితో అన్నాడు.
అతో యుష్మానహం వదామి, వ్యభిచారం వినా యో నిజజాయాం త్యజేత్ అన్యాఞ్చ వివహేత్, స పరదారాన్ గచ్ఛతి; యశ్చ త్యక్తాం నారీం వివహతి సోపి పరదారేషు రమతే|
10 ౧౦ ఆయన శిష్యులు, “భార్యాభర్తల మధ్య సంబంధం ఇలాటిదైతే అసలు పెళ్ళి చేసుకోక పోవడమే మంచిది” అని ఆయనతో అన్నారు.
తదా తస్య శిష్యాస్తం బభాషిరే, యది స్వజాయయా సాకం పుంస ఏతాదృక్ సమ్బన్ధో జాయతే, తర్హి వివహనమేవ న భద్రం|
11 ౧౧ అందుకు యేసు, “దేవుడు అనుమతించిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను అంగీకరించ లేరు.
తతః స ఉక్తవాన్, యేభ్యస్తత్సామర్థ్యం ఆదాయి, తాన్ వినాన్యః కోపి మనుజ ఏతన్మతం గ్రహీతుం న శక్నోతి|
12 ౧౨ తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు, మనుషులు నపుంసకులుగా తయారు చేసినవారు ఉన్నారు. పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారూ ఉన్నారు. ఈ మాటను అంగీకరించ గలవాడు దాన్ని స్వీకరించి పాటిస్తాడు గాక” అని వారితో చెప్పాడు.
కతిపయా జననక్లీబః కతిపయా నరకృతక్లీబః స్వర్గరాజ్యాయ కతిపయాః స్వకృతక్లీబాశ్చ సన్తి, యే గ్రహీతుం శక్నువన్తి తే గృహ్లన్తు|
13 ౧౩ అప్పుడు కొందరు తమ పిల్లల మీద యేసు తన చేతులుంచి ప్రార్థన చేయాలని కోరుతూ చిన్నపిల్లలను ఆయన దగ్గరకి తీసుకుని వచ్చారు. అయితే ఆయన శిష్యులు ఆ పిల్లలను తీసుకొచ్చిన వారిని గద్దించారు.
అపరమ్ యథా స శిశూనాం గాత్రేషు హస్తం దత్వా ప్రార్థయతే, తదర్థం తత్సమీంపం శిశవ ఆనీయన్త, తత ఆనయితృన్ శిష్యాస్తిరస్కృతవన్తః|
14 ౧౪ అప్పుడు యేసు, “చిన్నపిల్లలను అడ్డుకోకుండా నా దగ్గరికి రానియ్యండి. పరలోకరాజ్యం ఇలాటి వారిదే” అని వారితో చెప్పాడు.
కిన్తు యీశురువాచ, శిశవో మదన్తికమ్ ఆగచ్ఛన్తు, తాన్ మా వారయత, ఏతాదృశాం శిశూనామేవ స్వర్గరాజ్యం|
15 ౧౫ ఆ పిల్లల మీద చేతులుంచిన తరవాత ఆయన అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
తతః స తేషాం గాత్రేషు హస్తం దత్వా తస్మాత్ స్థానాత్ ప్రతస్థే|
16 ౧౬ ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, “బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి?” అని ఆయనను అడిగాడు. (aiōnios )
అపరమ్ ఏక ఆగత్య తం పప్రచ్ఛ, హే పరమగురో, అనన్తాయుః ప్రాప్తుం మయా కిం కిం సత్కర్మ్మ కర్త్తవ్యం? (aiōnios )
17 ౧౭ అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు.
తతః స ఉవాచ, మాం పరమం కుతో వదసి? వినేశ్చరం న కోపి పరమః, కిన్తు యద్యనన్తాయుః ప్రాప్తుం వాఞ్ఛసి, తర్హ్యాజ్ఞాః పాలయ|
18 ౧౮ అతడు, “ఏ ఆజ్ఞలు?” అని ఆయనను అడిగాడు. యేసు, “నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు,
తదా స పృష్టవాన్, కాః కా ఆజ్ఞాః? తతో యీశుః కథితవాన్, నరం మా హన్యాః, పరదారాన్ మా గచ్ఛేః, మా చోరయేః, మృషాసాక్ష్యం మా దద్యాః,
19 ౧౯ నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే” అని చెప్పాడు.
నిజపితరౌ సంమన్యస్వ, స్వసమీపవాసిని స్వవత్ ప్రేమ కురు|
20 ౨౦ అందుకు ఆ యువకుడు, “వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?” అన్నాడు.
స యువా కథితవాన్, ఆ బాల్యాద్ ఏతాః పాలయామి, ఇదానీం కిం న్యూనమాస్తే?
21 ౨౧ అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు” అని అతనితో చెప్పాడు.
తతో యీశురవదత్, యది సిద్ధో భవితుం వాఞ్ఛసి, తర్హి గత్వా నిజసర్వ్వస్వం విక్రీయ దరిద్రేభ్యో వితర, తతః స్వర్గే విత్తం లప్స్యసే; ఆగచ్ఛ, మత్పశ్చాద్వర్త్తీ చ భవ|
22 ౨౨ అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.
ఏతాం వాచం శ్రుత్వా స యువా స్వీయబహుసమ్పత్తే ర్విషణః సన్ చలితవాన్|
23 ౨౩ యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం.
తదా యీశుః స్వశిష్యాన్ అవదత్, ధనినాం స్వర్గరాజ్యప్రవేశో మహాదుష్కర ఇతి యుష్మానహం తథ్యం వదామి|
24 ౨౪ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిరంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక.”
పునరపి యుష్మానహం వదామి, ధనినాం స్వర్గరాజ్యప్రవేశాత్ సూచీఛిద్రేణ మహాఙ్గగమనం సుకరం|
25 ౨౫ శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. “ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?” అన్నారు.
ఇతి వాక్యం నిశమ్య శిష్యా అతిచమత్కృత్య కథయామాసుః; తర్హి కస్య పరిత్రాణం భవితుం శక్నోతి?
26 ౨౬ యేసు వారితో, “ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే” అని చెప్పాడు.
తదా స తాన్ దృష్ద్వా కథయామాస, తత్ మానుషాణామశక్యం భవతి, కిన్త్వీశ్వరస్య సర్వ్వం శక్యమ్|
27 ౨౭ అప్పుడు పేతురు, “ఇదిగో మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాం గదా, మాకేమి లభిస్తుంది?” అని ఆయనను అడగగా
తదా పితరస్తం గదితవాన్, పశ్య, వయం సర్వ్వం పరిత్యజ్య భవతః పశ్చాద్వర్త్తినో ఽభవామ; వయం కిం ప్రాప్స్యామః?
28 ౨౮ యేసు వారితో ఇలా అన్నాడు, “కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు.
తతో యీశుః కథితవాన్, యుష్మానహం తథ్యం వదామి, యూయం మమ పశ్చాద్వర్త్తినో జాతా ఇతి కారణాత్ నవీనసృష్టికాలే యదా మనుజసుతః స్వీయైశ్చర్య్యసింహాసన ఉపవేక్ష్యతి, తదా యూయమపి ద్వాదశసింహాసనేషూపవిశ్య ఇస్రాయేలీయద్వాదశవంశానాం విచారం కరిష్యథ|
29 ౨౯ నా నామం నిమిత్తం సోదరులను, సోదరీలను, తండ్రినీ, తల్లినీ, పిల్లలనూ, భూములనూ ఇళ్ళనూ విడిచిపెట్టిన ప్రతివాడూ అంతకు వంద రెట్లు పొందుతాడు. దానితోబాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు. (aiōnios )
అన్యచ్చ యః కశ్చిత్ మమ నామకారణాత్ గృహం వా భ్రాతరం వా భగినీం వా పితరం వా మాతరం వా జాయాం వా బాలకం వా భూమిం పరిత్యజతి, స తేషాం శతగుణం లప్స్యతే, అనన్తాయుమోఽధికారిత్వఞ్చ ప్రాప్స్యతి| (aiōnios )
30 ౩౦ మొదటివారిలో చాలామంది చివరి వారవుతారు. చివరివారిలో చాలామంది మొదటి వారవుతారు.”
కిన్తు అగ్రీయా అనేకే జనాః పశ్చాత్, పశ్చాతీయాశ్చానేకే లోకా అగ్రే భవిష్యన్తి|