< మత్తయి 18 >
1 ౧ ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి, “పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు?” అని యేసుని అడిగారు.
১তদানীং শিষ্যা যীশোঃ সমীপমাগত্য পৃষ্টৱন্তঃ স্ৱৰ্গৰাজ্যে কঃ শ্ৰেষ্ঠঃ?
2 ౨ అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి, వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు,
২ততো যীশুঃ ক্ষুদ্ৰমেকং বালকং স্ৱসমীপমানীয তেষাং মধ্যে নিধায জগাদ,
3 ౩ “మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
৩যুষ্মানহং সত্যং ব্ৰৱীমি, যূযং মনোৱিনিমযেন ক্ষুদ্ৰবালৱৎ ন সন্তঃ স্ৱৰ্গৰাজ্যং প্ৰৱেষ্টুং ন শক্নুথ|
4 ౪ కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు.
৪যঃ কশ্চিদ্ এতস্য ক্ষুদ্ৰবালকস্য সমমাত্মানং নম্ৰীকৰোতি, সএৱ স্ৱৰ্গৰাজযে শ্ৰেষ্ঠঃ|
5 ౫ 5 ఇలాంటి చిన్నవారిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే.
৫যঃ কশ্চিদ্ এতাদৃশং ক্ষুদ্ৰবালকমেকং মম নাম্নি গৃহ্লাতি, স মামেৱ গৃহ্লাতি|
6 ౬ కానీ నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
৬কিন্তু যো জনো মযি কৃতৱিশ্ৱাসানামেতেষাং ক্ষুদ্ৰপ্ৰাণিনাম্ একস্যাপি ৱিধ্নিং জনযতি, কণ্ঠবদ্ধপেষণীকস্য তস্য সাগৰাগাধজলে মজ্জনং শ্ৰেযঃ|
7 ౭ “నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి తీర్పుకు కారణమౌతుంది. ఆటంకాలు రాక మానవు. కానీ అవి ఎవరి వలన కలుగుతాయో, ఆ వ్యక్తికి శిక్ష తప్పదు.
৭ৱিঘ্নাৎ জগতঃ সন্তাপো ভৱিষ্যতি, ৱিঘ্নোঽৱশ্যং জনযিষ্যতে, কিন্তু যেন মনুজেন ৱিঘ্নো জনিষ্যতে তস্যৈৱ সন্তাপো ভৱিষ্যতি|
8 ౮ నీ చెయ్యి గాని, నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే, దాన్ని నరికి పారవెయ్యి. రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో, అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది. (aiōnios )
৮তস্মাৎ তৱ কৰশ্চৰণো ৱা যদি ৎৱাং বাধতে, তৰ্হি তং ছিত্ত্ৱা নিক্ষিপ, দ্ৱিকৰস্য দ্ৱিপদস্য ৱা তৱানপ্তৱহ্নৌ নিক্ষেপাৎ, খঞ্জস্য ৱা ছিন্নহস্তস্য তৱ জীৱনে প্ৰৱেশো ৱৰং| (aiōnios )
9 ౯ నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది. (Geenna )
৯অপৰং তৱ নেত্ৰং যদি ৎৱাং বাধতে, তৰ্হি তদপ্যুৎপাৱ্য নিক্ষিপ, দ্ৱিনেত্ৰস্য নৰকাগ্নৌ নিক্ষেপাৎ কাণস্য তৱ জীৱনে প্ৰৱেশো ৱৰং| (Geenna )
10 ౧౦ 10 ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు. వీరిని కాపాడే దూతలు ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు.
১০তস্মাদৱধদ্ধং, এতেষাং ক্ষুদ্ৰপ্ৰাণিনাম্ একমপি মা তুচ্ছীকুৰুত,
11 ౧౧ “మీరేమంటారు? ఒక మనిషికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి,
১১যতো যুষ্মানহং তথ্যং ব্ৰৱীমি, স্ৱৰ্গে তেষাং দূতা মম স্ৱৰ্গস্থস্য পিতুৰাস্যং নিত্যং পশ্যন্তি| এৱং যে যে হাৰিতাস্তান্ ৰক্ষিতুং মনুজপুত্ৰ আগচ্ছৎ|
12 ౧౨ మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్తాడు గదా?
১২যূযমত্ৰ কিং ৱিৱিংগ্ঘ্ৱে? কস্যচিদ্ যদি শতং মেষাঃ সন্তি, তেষামেকো হাৰ্য্যতে চ, তৰ্হি স একোনশতং মেষান্ ৱিহায পৰ্ৱ্ৱতং গৎৱা তং হাৰিতমেকং কিং ন মৃগযতে?
13 ౧౩ అది అతనికి దొరికినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే ఆ ఒక్క గొర్రెను గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
১৩যদি চ কদাচিৎ তন্মেষোদ্দেশং লমতে, তৰ্হি যুষ্মানহং সত্যং কথযামি, সোঽৱিপথগামিভ্য একোনশতমেষেভ্যোপি তদেকহেতোৰধিকম্ আহ্লাদতে|
14 ౧౪ అదే విధంగా ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం పరలోకంలోని మీ తండ్రికి ఇష్టం లేదు.
১৪তদ্ৱদ্ এতেষাং ক্ষুদ্ৰপ্ৰাএনাম্ একোপি নশ্যতীতি যুষ্মাকং স্ৱৰ্গস্থপিতু ৰ্নাভিমতম্|
15 ౧౫ “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే.
১৫যদ্যপি তৱ ভ্ৰাতা ৎৱযি কিমপ্যপৰাধ্যতি, তৰ্হি গৎৱা যুৱযোৰ্দ্ৱযোঃ স্থিতযোস্তস্যাপৰাধং তং জ্ঞাপয| তত্ৰ স যদি তৱ ৱাক্যং শৃণোতি, তৰ্হি ৎৱং স্ৱভ্ৰাতৰং প্ৰাপ্তৱান্,
16 ౧౬ అతడు వినకపోతే, ‘ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి.’ కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు.
১৬কিন্তু যদি ন শৃণোতি, তৰ্হি দ্ৱাভ্যাং ত্ৰিভি ৰ্ৱা সাক্ষীভিঃ সৰ্ৱ্ৱং ৱাক্যং যথা নিশ্চিতং জাযতে, তদৰ্থম্ একং দ্ৱৌ ৱা সাক্ষিণৌ গৃহীৎৱা যাহি|
17 ౧౭ అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు.
১৭তেন স যদি তযো ৰ্ৱাক্যং ন মান্যতে, তৰ্হি সমাজং তজ্জ্ঞাপয, কিন্তু যদি সমাজস্যাপি ৱাক্যং ন মান্যতে, তৰ্হি স তৱ সমীপে দেৱপূজকইৱ চণ্ডালইৱ চ ভৱিষ্যতি|
18 ౧౮ “నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు.
১৮অহং যুষ্মান্ সত্যং ৱদামি, যুষ্মাভিঃ পৃথিৱ্যাং যদ্ বধ্যতে তৎ স্ৱৰ্গে ভংৎস্যতে; মেদিন্যাং যৎ ভোচ্যতে, স্ৱৰ্গেঽপি তৎ মোক্ষ্যতে|
19 ౧౯ ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.
১৯পুনৰহং যুষ্মান্ ৱদামি, মেদিন্যাং যুষ্মাকং যদি দ্ৱাৱেকৱাক্যীভূয কিঞ্চিৎ প্ৰাৰ্থযেতে, তৰ্হি মম স্ৱৰ্গস্থপিত্ৰা তৎ তযোঃ কৃতে সম্পন্নং ভৱিষ্যতি|
20 ౨౦ “ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”
২০যতো যত্ৰ দ্ৱৌ ত্ৰযো ৱা মম নান্নি মিলন্তি, তত্ৰৈৱাহং তেষাং মধ্যেঽস্মি|
21 ౨౧ అప్పుడు పేతురు వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?” అని యేసుని అడిగాడు.
২১তদানীং পিতৰস্তৎসমীপমাগত্য কথিতৱান্ হে প্ৰভো, মম ভ্ৰাতা মম যদ্যপৰাধ্যতি, তৰ্হি তং কতিকৃৎৱঃ ক্ষমিষ্যে?
22 ౨౨ అందుకు యేసు అతనికి జవాబిస్తూ, “ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను.
২২কিং সপ্তকৃৎৱঃ? যীশুস্তং জগাদ, ৎৱাং কেৱলং সপ্তকৃৎৱো যাৱৎ ন ৱদামি, কিন্তু সপ্তত্যা গুণিতং সপ্তকৃৎৱো যাৱৎ|
23 ౨౩ కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది.
২৩অপৰং নিজদাসৈঃ সহ জিগণযিষুঃ কশ্চিদ্ ৰাজেৱ স্ৱৰ্গৰাজযং|
24 ౨౪ అతడు లెక్క చూడడం ప్రారంభించగానే, అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు.
২৪আৰব্ধে তস্মিন্ গণনে সাৰ্দ্ধসহস্ৰমুদ্ৰাপূৰিতানাং দশসহস্ৰপুটকানাম্ একোঽঘমৰ্ণস্তৎসমক্ষমানাযি|
25 ౨౫ ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు.
২৫তস্য পৰিশোধনায দ্ৰৱ্যাভাৱাৎ পৰিশোধনাৰ্থং স তদীযভাৰ্য্যাপুত্ৰাদিসৰ্ৱ্ৱস্ৱঞ্চ ৱিক্ৰীযতামিতি তৎপ্ৰভুৰাদিদেশ|
26 ౨౬ అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు.
২৬তেন স দাসস্তস্য পাদযোঃ পতন্ প্ৰণম্য কথিতৱান্, হে প্ৰভো ভৱতা ঘৈৰ্য্যে কৃতে মযা সৰ্ৱ্ৱং পৰিশোধিষ্যতে|
27 ౨౭ ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేశాడు.
২৭তদানীং দাসস্য প্ৰভুঃ সকৰুণঃ সন্ সকলৰ্ণং ক্ষমিৎৱা তং তত্যাজ|
28 ౨౮ అయితే ఆ పనివాడు బయటికి వెళ్ళి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి ‘నా బాకీ తీర్చు’ అని అతని గొంతు పట్టుకున్నాడు.
২৮কিন্তু তস্মিন্ দাসে বহি ৰ্যাতে, তস্য শতং মুদ্ৰাচতুৰ্থাংশান্ যো ধাৰযতি, তং সহদাসং দৃষ্দ্ৱা তস্য কণ্ঠং নিষ্পীড্য গদিতৱান্, মম যৎ প্ৰাপ্যং তৎ পৰিশোধয|
29 ౨౯ అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, ‘కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు.
২৯তদা তস্য সহদাসস্তৎপাদযোঃ পতিৎৱা ৱিনীয বভাষে, ৎৱযা ধৈৰ্য্যে কৃতে মযা সৰ্ৱ্ৱং পৰিশোধিষ্যতে|
30 ౩౦ కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకూ అతణ్ణి ఖైదులో పెట్టించాడు.
৩০তথাপি স তৎ নাঙগীকৃত্য যাৱৎ সৰ্ৱ্ৱমৃণং ন পৰিশোধিতৱান্ তাৱৎ তং কাৰাযাং স্থাপযামাস|
31 ౩౧ “అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు.
৩১তদা তস্য সহদাসাস্তস্যৈতাদৃগ্ আচৰণং ৱিলোক্য প্ৰভোঃ সমীপং গৎৱা সৰ্ৱ্ৱং ৱৃত্তান্তং নিৱেদযামাসুঃ|
32 ౩౨ అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, ‘నువ్వు చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశానే!
৩২তদা তস্য প্ৰভুস্তমাহূয জগাদ, ৰে দুষ্ট দাস, ৎৱযা মৎসন্নিধৌ প্ৰাৰ্থিতে মযা তৱ সৰ্ৱ্ৱমৃণং ত্যক্তং;
33 ౩౩ నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా’ అని చెప్పి
৩৩যথা চাহং ৎৱযি কৰুণাং কৃতৱান্, তথৈৱ ৎৱৎসহদাসে কৰুণাকৰণং কিং তৱ নোচিতং?
34 ౩౪ అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు.
৩৪ইতি কথযিৎৱা তস্য প্ৰভুঃ ক্ৰুদ্ধ্যন্ নিজপ্ৰাপ্যং যাৱৎ স ন পৰিশোধিতৱান্, তাৱৎ প্ৰহাৰকানাং কৰেষু তং সমৰ্পিতৱান্|
35 ౩౫ మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.
৩৫যদি যূযং স্ৱান্তঃকৰণৈঃ স্ৱস্ৱসহজানাম্ অপৰাধান্ ন ক্ষমধ্ৱে, তৰ্হি মম স্ৱৰ্গস্যঃ পিতাপি যুষ্মান্ প্ৰতীত্থং কৰিষ্যতি|