< మత్తయి 15 >

1 ఆ రోజుల్లో యెరూషలేము నుండి ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ వచ్చి,
اَپَرَں یِرُوشالَمْنَگَرِییاح کَتِپَیا اَدھْیاپَکاح پھِرُوشِنَشْچَ یِیشوح سَمِیپَماگَتْیَ کَتھَیاماسُح،
2 “నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి?” అని యేసుని అడిగారు.
تَوَ شِشْیاح کِمَرْتھَمْ اَپْرَکْشالِتَکَرَے رْبھَکْشِتْوا پَرَمْپَراگَتَں پْراچِیناناں وْیَوَہارَں لَنْوَنْتے؟
3 అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు, “మీరు మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞనే మీరుతున్నారు.
تَتو یِیشُح پْرَتْیُواچَ، یُویَں پَرَمْپَراگَتاچارینَ کُتَ اِیشْوَراجْناں لَنْوَدھْوے۔
4 ఎలాగంటే తల్లిదండ్రులను ఘనపరచమనీ, తండ్రిని గాని తల్లిని గాని దూషించేవాడికి శిక్ష మరణమేననీ దేవుడు చెప్పాడు.
اِیشْوَرَ اِتْیاجْناپَیَتْ، تْوَں نِجَپِتَرَو سَںمَنْییتھاح، یینَ چَ نِجَپِتَرَو نِنْدْییتے، سَ نِشْچِتَں مْرِییتَ؛
5 కాని మీరు మాత్రం ఎవరైనా తన తండ్రితో, తల్లితో నా నుండి మీకు ఏమైనా లాభం కలుగుతూ ఉంటే దాన్ని దేవునికి ఇచ్చేశాను అని చెబితే అతడు ఇక నుండి తన తల్లిదండ్రులను పట్టించుకోనక్కర లేదని చెబుతారు.
کِنْتُ یُویَں وَدَتھَ، یَح سْوَجَنَکَں سْوَجَنَنِیں وا واکْیَمِدَں وَدَتِ، یُواں مَتّو یَلَّبھیتھے، تَتْ نْیَوِدْیَتَ،
6 ఆ విధంగా మీరు మీ సంప్రదాయాల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశారు.
سَ نِجَپِتَرَو پُنَ رْنَ سَںمَںسْیَتے۔ اِتّھَں یُویَں پَرَمْپَراگَتینَ سْویشاماچارینیشْوَرِییاجْناں لُمْپَتھَ۔
7 వేష ధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే, మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు’ అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు.”
رے کَپَٹِنَح سَرْوّے یِشَیِیو یُشْمانَدھِ بھَوِشْیَدْوَچَنانْییتانِ سَمْیَگْ اُکْتَوانْ۔
8
وَدَنَے رْمَنُجا ایتے سَمایانْتِ مَدَنْتِکَں۔ تَتھادھَرَے رْمَدِییَنْچَ مانَں کُرْوَّنْتِ تے نَراح۔
9
کِنْتُ تیشاں مَنو مَتّو وِدُورَایوَ تِشْٹھَتِ۔ شِکْشَیَنْتو وِدھِینْ نْراجْنا بھَجَنْتے ماں مُدھَیوَ تے۔
10 ౧౦ ఆయన ప్రజలందరినీ పిలిచి, “మీరు తెలుసుకోవలసింది ఏమంటే,
تَتو یِیشُ رْلوکانْ آہُویَ پْروکْتَوانْ، یُویَں شْرُتْوا بُدھْیَدھْبَں۔
11 ౧౧ ఒక వ్యక్తి నోటిలోకి వెళ్ళేది అతనినేమీ అపవిత్రపరచదు. నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది” అని చెప్పాడు.
یَنْمُکھَں پْرَوِشَتِ، تَتْ مَنُجَمْ اَمیدھْیَں نَ کَروتِ، کِنْتُ یَداسْیاتْ نِرْگَچّھَتِ، تَدیوَ مانُشَمَمیدھْیِی کَروتِی۔
12 ౧౨ అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, “నీకు తెలుసా? పరిసయ్యులు నీ మాటలు విని చాలా నొచ్చుకున్నారు” అని ఆయనతో అన్నారు.
تَدانِیں شِشْیا آگَتْیَ تَسْمَے کَتھَیانْچَکْرُح، ایتاں کَتھاں شْرُتْوا پھِرُوشِنو وْیَرَجْیَنْتَ، تَتْ کِں بھَوَتا جْنایَتے؟
13 ౧౩ ఆయన, “పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కనూ పీకివేయడం జరుగుతుంది.
سَ پْرَتْیَوَدَتْ، مَمَ سْوَرْگَسْتھَح پِتا یَں کَنْچِدَنْکُرَں ناروپَیَتْ، سَ اُتْپاوْدْیَتے۔
14 ౧౪ వారి జోలికి వెళ్ళవద్దు. వారు గుడ్డివారు. వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా” అన్నాడు.
تے تِشْٹھَنْتُ، تے اَنْدھَمَنُجانامْ اَنْدھَمارْگَدَرْشَکا ایوَ؛ یَدْیَنْدھونْدھَں پَنْتھانَں دَرْشَیَتِ، تَرْہْیُبھَو گَرْتّے پَتَتَح۔
15 ౧౫ అందుకు పేతురు, “ఈ ఉపమానభావం మాకు వివరించు” అని ఆయనను అడిగాడు.
تَدا پِتَرَسْتَں پْرَتْیَوَدَتْ، درِشْٹانْتَمِمَمَسْمانْ بودھَیَتُ۔
16 ౧౬ అప్పుడాయన, “మీరు ఇంకా అవివేకంగా ఉన్నారా?
یِیشُنا پْروکْتَں، یُویَمَدْیَ یاوَتْ کِمَبودھاح سْتھَ؟
17 ౧౭ నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది.
کَتھامِماں کِں نَ بُدھْیَدھْبے ؟ یَداسْیَں پْریوِشَتِ، تَدْ اُدَرے پَتَنْ بَہِرْنِرْیاتِ،
18 ౧౮ కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా?
کِنْتْواسْیادْ یَنِّرْیاتِ، تَدْ اَنْتَحکَرَناتْ نِرْیاتَتْواتْ مَنُجَمَمیدھْیَں کَروتِ۔
19 ౧౯ హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి.
یَتونْتَحکَرَناتْ کُچِنْتا بَدھَح پارَدارِکَتا ویشْیاگَمَنَں چَیرْیَّں مِتھْیاساکْشْیَمْ اِیشْوَرَنِنْدا چَیتانِ سَرْوّانِ نِرْیّانْتِ۔
20 ౨౦ మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.
ایتانِ مَنُشْیَمَپَوِتْرِی کُرْوَّنْتِ کِنْتْوَپْرَکْشالِتَکَرینَ بھوجَنَں مَنُجَمَمیدھْیَں نَ کَروتِ۔
21 ౨౧ యేసు బయలుదేరి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు.
اَنَنْتَرَں یِیشُسْتَسْماتْ سْتھاناتْ پْرَسْتھایَ سورَسِیدونَّگَرَیوح سِیمامُپَتَسْیَو۔
22 ౨౨ అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి, “ప్రభూ, దావీదు కుమారా, నన్ను కరుణించు. నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది” అని పెద్దగా అరిచి చెప్పింది.
تَدا تَتْسِیماتَح کاچِتْ کِنانِییا یوشِدْ آگَتْیَ تَمُچَّیرُواچَ، ہے پْرَبھو دایُودَح سَنْتانَ، مَمَیکا دُہِتاسْتے سا بھُوتَگْرَسْتا سَتِی مَہاکْلیشَں پْراپْنوتِ مَمَ دَیَسْوَ۔
23 ౨౩ కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు, “ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది, ఈమెని పంపించెయ్యి” అని ఆయనను వేడుకున్నారు.
کِنْتُ یِیشُسْتاں کِمَپِ نوکْتَوانْ، تَتَح شِشْیا آگَتْیَ تَں نِویدَیاماسُح، ایشا یوشِدْ اَسْماکَں پَشْچادْ اُچَّیراہُویاگَچّھَتِ، ایناں وِسرِجَتُ۔
24 ౨౪ దానికి ఆయన, “దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు” అని జవాబిచ్చాడు.
تَدا سَ پْرَتْیَوَدَتْ، اِسْراییلْگوتْرَسْیَ ہارِتَمیشانْ وِنا کَسْیاپْیَنْیَسْیَ سَمِیپَں ناہَں پْریشِتوسْمِ۔
25 ౨౫ అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నాకు సహాయం చెయ్యి” అంది.
تَتَح سا نارِیسَماگَتْیَ تَں پْرَنَمْیَ جَگادَ، ہے پْرَبھو مامُپَکُرُ۔
26 ౨౬ ఆయన, “పిల్లలు తినే రొట్టెను కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు” అని ఆమెతో అన్నాడు.
سَ اُکْتَوانْ، بالَکاناں بھَکْشْیَمادایَ سارَمیییبھْیو دانَں نوچِتَں۔
27 ౨౭ ఆమె, “ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా” అంది.
تَدا سا بَبھاشے، ہے پْرَبھو، تَتْ سَتْیَں، تَتھاپِ پْرَبھو رْبھَنْچادْ یَدُچّھِشْٹَں پَتَتِ، تَتْ سارَمییاح کھادَنْتِ۔
28 ౨౮ అందుకు యేసు, “నీ నమ్మకం గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది” అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.
تَتو یِیشُح پْرَتْیَوَدَتْ، ہے یوشِتْ، تَوَ وِشْواسو مَہانْ تَسْماتْ تَوَ مَنوبھِلَشِتَں سِدْیَّتُ، تینَ تَسْیاح کَنْیا تَسْمِنّیوَ دَنْڈے نِرامَیابھَوَتْ۔
29 ౨౯ యేసు అక్కడ నుండి బయలుదేరి, గలిలయ సముద్రం పక్కగా ఉన్న ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు.
اَنَنْتَرَں یِیشَسْتَسْماتْ سْتھاناتْ پْرَسْتھایَ گالِیلْساگَرَسْیَ سَنِّدھِماگَتْیَ دھَرادھَرَمارُہْیَ تَتْروپَوِویشَ۔
30 ౩౦ ప్రజలు గుంపులు గుంపులుగా అనేకమంది కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, వికలాంగులను, ఇంకా అనేక రోగాలున్న వారిని తీసుకు వచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు. ఆయన వారిని బాగుచేశాడు.
پَشْچاتْ جَنَنِوَہو بَہُونْ کھَنْچانْدھَمُوکَشُشْکَکَرَمانُشانْ آدایَ یِیشوح سَمِیپَماگَتْیَ تَچَّرَنانْتِکے سْتھاپَیاماسُح، تَتَح سا تانْ نِرامَیانْ اَکَروتْ۔
31 ౩౧ మూగవారు మాట్లాడటం, వికలాంగులు బాగుపడటం, కుంటివారు నడవటం, గుడ్డివారికి చూపు రావడం చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. వారంతా ఇశ్రాయేలీయుల దేవునికి స్తుతులు చెల్లించారు.
اِتّھَں مُوکا واکْیَں وَدَنْتِ، شُشْکَکَراح سْواسْتھْیَمایانْتِ، پَنْگَوو گَچّھَنْتِ، اَنْدھا وِیکْشَنْتے، اِتِ وِلوکْیَ لوکا وِسْمَیَں مَنْیَمانا اِسْراییلَ اِیشْوَرَں دھَنْیَں بَبھاشِرے۔
32 ౩౨ అప్పుడు యేసు తన శిష్యులను పిలిచి, “ఈ ప్రజల మీద నాకు జాలిగా ఉంది. మూడు రోజుల నుండి వీరు నా దగ్గరే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వారు దారిలోనే స్పృహ తప్పి పోతారేమో” అన్నాడు.
تَدانِیں یِیشُح سْوَشِشْیانْ آہُویَ گَدِتَوانْ، ایتَجَّنَنِوَہیشُ مَمَ دَیا جایَتے، ایتے دِنَتْرَیَں مَیا ساکَں سَنْتِ، ایشاں بھَکْشْیَوَسْتُ چَ کَنْچِدَپِ ناسْتِ، تَسْمادَہَمیتانَکرِتاہارانْ نَ وِسْرَکْشْیامِ، تَتھاتْوے وَرْتْمَمَدھْیے کْلامْییشُح۔
33 ౩౩ ఆయన శిష్యులు, “ఇంతమందికి సరిపడినన్ని రొట్టెలు ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి?” అన్నారు.
تَدا شِشْیا اُوچُح، ایتَسْمِنْ پْرانْتَرَمَدھْیَ ایتاوَتو مَرْتْیانْ تَرْپَیِتُں وَیَں کُتْرَ پُوپانْ پْراپْسْیامَح؟
34 ౩౪ యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగాడు. వారు, “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి” అని చెప్పారు.
یِیشُرَپرِچّھَتْ، یُشْماکَں نِکَٹے کَتِ پُوپا آسَتے؟ تَ اُوچُح، سَپْتَپُوپا اَلْپاح کْشُدْرَمِیناشْچَ سَنْتِ۔
35 ౩౫ అప్పుడు యేసు “నేల మీద కూర్చోండి” అని ఆ ప్రజలకి ఆజ్ఞాపించి,
تَدانِیں سَ لوکَنِوَہَں بھُوماوُپَویشْٹُمْ آدِشْیَ
36 ౩౬ ఆ ఏడు రొట్టెలు, ఆ చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ముక్కలు చేసి తన శిష్యులకిచ్చాడు. శిష్యులు ఆ ప్రజలకు వాటిని పంచిపెట్టారు.
تانْ سَپْتَپُوپانْ مِیناںشْچَ گرِہْلَنْ اِیشْوَرِییَگُنانْ اَنُودْیَ بھَںکْتْوا شِشْییبھْیو دَدَو، شِشْیا لوکیبھْیو دَدُح۔
37 ౩౭ వారంతా కడుపారా తిన్న తరువాత అక్కడ ఏడు గంపల నిండుగా ముక్కలు మిగిలిపోయాయి.
تَتَح سَرْوّے بھُکْتْوا ترِپْتَوَنْتَح؛ تَدَوَشِشْٹَبھَکْشْیینَ سَپْتَڈَلَکانْ پَرِپُورْیَّ سَںجَگرِہُح۔
38 ౩౮ స్త్రీలు, పిల్లలు కాకుండా కేవలం పురుషులే నాలుగువేల మంది తిన్నారు.
تے بھوکْتارو یوشِتو بالَکاںشْچَ وِہایَ پْرایینَ چَتُحسَہَسْرانِ پُرُشا آسَنْ۔
39 ౩౯ తరువాత ఆయన ఆ ప్రజలందరినీ పంపివేసి, పడవ మీద మగదాను ప్రాంతానికి వచ్చాడు.
تَتَح پَرَں سَ جَنَنِوَہَں وِسرِجْیَ تَرِمارُہْیَ مَگْدَلاپْرَدیشَں گَتَوانْ۔

< మత్తయి 15 >