< మత్తయి 14 >

1 ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని,
তদানীং রাজা হেরোদ্ যীশো র্যশঃ শ্রুৎৱা নিজদাসেযান্ জগাদ্,
2 “ఇతడు బాప్తిసమిచ్చే యోహాను, చనిపోయి తిరిగి లేచాడు. అందుకే అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని తన సేవకులతో చెప్పాడు.
এষ মজ্জযিতা যোহন্, প্রমিতেভযস্তস্যোত্থানাৎ তেনেত্থমদ্ভুতং কর্ম্ম প্রকাশ্যতে|
3 అంతకు పూర్వం, “నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను చెప్పినందుకు
পুরা হেরোদ্ নিজভ্রাতু: ফিলিপো জাযাযা হেরোদীযাযা অনুরোধাদ্ যোহনং ধারযিৎৱা বদ্ধা কারাযাং স্থাপিতৱান্|
4 హేరోదు ఆమె కోసం యోహానును బంధించి ఖైదులో వేయించాడు.
যতো যোহন্ উক্তৱান্, এৎসযাঃ সংগ্রহো ভৱতো নোচিতঃ|
5 హేరోదు అతన్ని చంపాలనుకున్నాడు గాని ప్రజలు అతన్ని ప్రవక్తగా భావించారు కాబట్టి వారికి భయపడ్డాడు.
তস্মাৎ নৃপতিস্তং হন্তুমিচ্ছন্নপি লোকেভ্যো ৱিভযাঞ্চকার; যতঃ সর্ৱ্ৱে যোহনং ভৱিষ্যদ্ৱাদিনং মেনিরে|
6 హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది.
কিন্তু হেরোদো জন্মাহীযমহ উপস্থিতে হেরোদীযাযা দুহিতা তেষাং সমক্ষং নৃতিৎৱা হেরোদমপ্রীণ্যৎ|
7 కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు.
তস্মাৎ ভূপতিঃ শপথং কুর্ৱ্ৱন্ ইতি প্রত্যজ্ঞাসীৎ, ৎৱযা যদ্ যাচ্যতে, তদেৱাহং দাস্যামি|
8 తన తల్లి ఆమెకిచ్చిన సూచన ప్రకారం, “బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది.
সা কুমারী স্ৱীযমাতুঃ শিক্ষাং লব্ধা বভাষে, মজ্জযিতুর্যোহন উত্তমাঙ্গং ভাজনে সমানীয মহ্যং ৱিশ্রাণয|
9 ఆమె అభ్యర్ధనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం, తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం అలా జరగాలని ఆజ్ఞాపించాడు.
ততো রাজা শুশোচ, কিন্তু ভোজনাযোপৱিশতাং সঙ্গিনাং স্ৱকৃতশপথস্য চানুরোধাৎ তৎ প্রদাতুম আদিদেশ|
10 ౧౦ భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు.
১০পশ্চাৎ কারাং প্রতি নরং প্রহিত্য যোহন উত্তমাঙ্গং ছিত্ত্ৱা
11 ౧౧ వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె తన తల్లికి ఇచ్చింది.
১১তৎ ভাজন আনায্য তস্যৈ কুমার্য্যৈ ৱ্যশ্রাণযৎ, ততঃ সা স্ৱজনন্যাঃ সমীপং তন্নিনায|
12 ౧౨ యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టారు. ఆ తరువాత యేసు దగ్గరికి వెళ్ళి ఈ సంగతి తెలియజేశారు.
১২পশ্চাৎ যোহনঃ শিষ্যা আগত্য কাযং নীৎৱা শ্মশানে স্থাপযামাসুস্ততো যীশোঃ সন্নিধিং ৱ্রজিৎৱা তদ্ৱার্ত্তাং বভাষিরে|
13 ౧౩ యేసు పడవ ఎక్కి, అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ప్రజలు ఆ సంగతి విని, పట్టణాల నుంచి కాలి నడకన ఆయన వెంట వెళ్ళారు.
১৩অনন্তরং যীশুরিতি নিশভ্য নাৱা নির্জনস্থানম্ একাকী গতৱান্, পশ্চাৎ মানৱাস্তৎ শ্রুৎৱা নানানগরেভ্য আগত্য পদৈস্তৎপশ্চাদ্ ঈযুঃ|
14 ౧౪ యేసు పడవ దిగి ఆ పెద్ద గుంపును చూశాడు. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు.
১৪তদানীং যীশু র্বহিরাগত্য মহান্তং জননিৱহং নিরীক্ষ্য তেষু কারুণিকঃ মন্ তেষাং পীডিতজনান্ নিরামযান্ চকার|
15 ౧౫ సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం. ఇప్పటికే పొద్దుపోయింది. ఈ ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కోడానికి వారిని పంపి వెయ్యి” అన్నారు.
১৫ততঃ পরং সন্ধ্যাযাং শিষ্যাস্তদন্তিকমাগত্য কথযাঞ্চক্রুঃ, ইদং নির্জনস্থানং ৱেলাপ্যৱসন্না; তস্মাৎ মনুজান্ স্ৱস্ৱগ্রামং গন্তুং স্ৱার্থং ভক্ষ্যাণি ক্রেতুঞ্চ ভৱান্ তান্ ৱিসৃজতু|
16 ౧౬ యేసు వారితో, “వారు వెళ్ళనక్కర లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అన్నాడు.
১৬কিন্তু যীশুস্তানৱাদীৎ, তেষাং গমনে প্রযোজনং নাস্তি, যূযমেৱ তান্ ভোজযত|
17 ౧౭ వారు, “ఇక్కడ మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్ప ఇంకేమీ లేవు” అని ఆయనతో అన్నారు.
১৭তদা তে প্রত্যৱদন্, অস্মাকমত্র পূপপঞ্চকং মীনদ্ৱযঞ্চাস্তে|
18 ౧౮ అందుకు ఆయన, “వాటిని నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు.
১৮তদানীং তেনোক্তং তানি মদন্তিকমানযত|
19 ౧౯ ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతిలో తీసుకుని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు.
১৯অনন্তরং স মনুজান্ যৱসোপর্য্যুপৱেষ্টুম্ আজ্ঞাপযামাস; অপর তৎ পূপপঞ্চকং মীনদ্ৱযঞ্চ গৃহ্লন্ স্ৱর্গং প্রতি নিরীক্ষ্যেশ্ৱরীযগুণান্ অনূদ্য ভংক্ত্ৱা শিষ্যেভ্যো দত্তৱান্, শিষ্যাশ্চ লোকেভ্যো দদুঃ|
20 ౨౦ వారంతా తిని సంతృప్తి చెందిన తరువాత మిగిలిపోయిన ముక్కలు పోగుచేస్తే మొత్తం పన్నెండు గంపలు నిండాయి.
২০ততঃ সর্ৱ্ৱে ভুক্ত্ৱা পরিতৃপ্তৱন্তঃ, ততস্তদৱশিষ্টভক্ষ্যৈঃ পূর্ণান্ দ্ৱাদশডলকান্ গৃহীতৱন্তঃ|
21 ౨౧ స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు.
২১তে ভোক্তারঃ স্ত্রীর্বালকাংশ্চ ৱিহায প্রাযেণ পঞ্চ সহস্রাণি পুমাংস আসন্|
22 ౨౨ యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు.
২২তদনন্তরং যীশু র্লোকানাং ৱিসর্জনকালে শিষ্যান্ তরণিমারোঢুং স্ৱাগ্রে পারং যাতুঞ্চ গাঢমাদিষ্টৱান্|
23 ౨౩ ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు.
২৩ততো লোকেষু ৱিসৃষ্টেষু স ৱিৱিক্তে প্রার্থযিতুং গিরিমেকং গৎৱা সন্ধ্যাং যাৱৎ তত্রৈকাকী স্থিতৱান্|
24 ౨౪ అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది.
২৪কিন্তু তদানীং সম্মুখৱাতৎৱাৎ সরিৎপতে র্মধ্যে তরঙ্গৈস্তরণির্দোলাযমানাভৱৎ|
25 ౨౫ రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు.
২৫তদা স যামিন্যাশ্চতুর্থপ্রহরে পদ্ভ্যাং ৱ্রজন্ তেষামন্তিকং গতৱান্|
26 ౨౬ ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు.
২৬কিন্তু শিষ্যাস্তং সাগরোপরি ৱ্রজন্তং ৱিলোক্য সমুদ্ৱিগ্না জগদুঃ, এষ ভূত ইতি শঙ্কমানা উচ্চৈঃ শব্দাযাঞ্চক্রিরে চ|
27 ౨౭ వెంటనే యేసు, “ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు.
২৭তদৈৱ যীশুস্তানৱদৎ, সুস্থিরা ভৱত, মা ভৈষ্ট, এষোঽহম্|
28 ౨౮ పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు.
২৮ততঃ পিতর ইত্যুক্তৱান্, হে প্রভো, যদি ভৱানেৱ, তর্হি মাং ভৱৎসমীপং যাতুমাজ্ঞাপযতু|
29 ౨౯ యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని
২৯ততঃ তেনাদিষ্টঃ পিতরস্তরণিতোঽৱরুহ্য যীশেরন্তিকং প্রাপ্তুং তোযোপরি ৱৱ্রাজ|
30 ౩౦ గాలిని చూసి భయపడి మునిగిపోతూ, “ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు.
৩০কিন্তু প্রচণ্ডং পৱনং ৱিলোক্য ভযাৎ তোযে মংক্তুম্ আরেভে, তস্মাদ্ উচ্চৈঃ শব্দাযমানঃ কথিতৱান্, হে প্রভো, মামৱতু|
31 ౩౧ వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు.
৩১যীশুস্তৎক্ষণাৎ করং প্রসার্য্য তং ধরন্ উক্তৱান্, হ স্তোকপ্রত্যযিন্ ৎৱং কুতঃ সমশেথাঃ?
32 ౩౨ యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది.
৩২অনন্তরং তযোস্তরণিমারূঢযোঃ পৱনো নিৱৱৃতে|
33 ౩౩ అప్పుడు పడవలో ఉన్న శిష్యులు వచ్చి, “నువ్వు నిజంగా దేవుని కుమారుడివి” అని చెప్పి ఆయనను ఆరాధించారు.
৩৩তদানীং যে তরণ্যামাসন্, ত আগত্য তং প্রণভ্য কথিতৱন্তঃ, যথার্থস্ত্ৱমেৱেশ্ৱরসুতঃ|
34 ౩౪ వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకున్నారు.
৩৪অনন্তরং পারং প্রাপ্য তে গিনেষরন্নামকং নগরমুপতস্থুঃ,
35 ౩౫ అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు.
৩৫তদা তত্রত্যা জনা যীশুং পরিচীয তদ্দেশ্স্য চতুর্দিশো ৱার্ত্তাং প্রহিত্য যত্র যাৱন্তঃ পীডিতা আসন্, তাৱতএৱ তদন্তিকমানযামাসুঃ|
36 ౩౬ “వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు” అని ఆయనను బతిమాలారు. ముట్టిన వారంతా బాగయ్యారు.
৩৬অপরং তদীযৱসনস্য গ্রন্থিমাত্রং স্প্রষ্টুং ৱিনীয যাৱন্তো জনাস্তৎ স্পর্শং চক্রিরে, তে সর্ৱ্ৱএৱ নিরামযা বভূৱুঃ|

< మత్తయి 14 >