< మత్తయి 13 >

1 ఆ రోజు యేసు ఇంట్లో నుండి వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు.
Тогож дня вийшов Ісус із господи, та й сїв край моря.
2 ప్రజలు పెద్ద గుంపులుగా తన చుట్టూ చేరినపుడు ఆయన పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిలుచున్నారు.
І зібралось до Него багато, народу, так що Він увійшов у човен, та й сїв; а ввесь народ стояв на березї.
3 ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన వారితో, “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు.
І промовляв до него багато приповістями, глаголючи: Ото вийшов сїяч сїяти;
4 అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి.
і як він сїяв, инше впало край шляху, й прилетіло птаство, та й повизбирувало його.
5 కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి. అక్కడ మట్టి లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయిగానీ,
Инше ж упало на каменистому, де не мало землї багато, й зараз посходило, бо не мало глибокої землї;
6 ఎండ వచ్చినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి.
як же зійшло сонце, то й повяло воно, а, не мавши кореня, посохло.
7 కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. ముళ్ళ కంపలు ఎదిగి వాటిని అణిచి వేశాయి.
А инше попадало між тернину, й тернина, розвившись, поглушила його.
8 మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని వంద రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్ని ముప్ఫై రెట్లు ఫలించాయి.
Инше яг упало на добру землю, і дало овощ, одно в сотеро, друге в шісьдесятеро, инше ж у трийцятеро.
9 చెవులున్నవాడు విను గాక!” అన్నాడు.
Хто мав уші слухати, нехай слухав.
10 ౧౦ తరువాత శిష్యులు వచ్చి, “నీవు ఉపమానాలతో ఎందుకు వారితో మాట్లాడుతున్నావు?” అని అడిగారు. ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు,
І, приступивши ученики, казали до Него: На що ти глаголеш до них приповістями?
11 ౧౧ “పరలోక రాజ్య మర్మాలు గ్రహించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు, వారికి అనుగ్రహించలేదు.
Він же, озвавшись, рече до них: Вам дано знати тайни царства небесного, їм же не дано.
12 ౧౨ కలిగిన వాడికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేని వాని నుంచి అతని దగ్గర ఉన్న కొంచెం కూడా తీసివేయడం జరుగుతుంది.
Хто бо мав, тому дасть ся, й надто мати ме; а хто не мав, в того візьметь ся й те, що мав;
13 ౧౩ ఇందుకోసమే నేను వారికి ఉపమానాలతో బోధిస్తున్నాను. వారు చూస్తున్నారు గానీ నిజానికి చూడరు. వింటున్నారు గానీ నిజానికి వినరు, అర్థం చేసుకోరు.
Тим я глаголю до них приповістями: бо, дивлячись, не бачять, і слухаючи, не чують, анї розуміють.
14 ౧౪ యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయంలో నెరవేరింది. ‘మీరు వినడానికి వింటారు గాని గ్రహించనే గ్రహించరు. చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు.
І справджуєть ся на них пророцтво Ісаії, що глаголе: Слухом слухати мете, та й не зрозумієте, й, дивлячись, бачити мете, та й не постережете.
15 ౧౫ ఈ ప్రజల హృదయం బండబారి పోయింది. వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది. వారి కళ్ళు మూసుకుపోయాయి. వారు కళ్ళారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకుని నా వలన బాగుపడే వీలు లేకుండా అయిపోయింది.’
Затверділо бо серце народу сього, й ушима тяжко чують, й очі свої вони заплющили, щоб инкоди не побачити очима, й не почути ушима, й не зрозуміти серцем, і не навернутись, щоб сцїлив я їх.
16 ౧౬ “అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటున్నాయి, కాబట్టి అవి ధన్యమయ్యాయి.
Ваші ж очі блаженні, бо бачать, і уші ваші, бо чують.
17 ౧౭ చాలామంది ప్రవక్తలూ నీతిమంతులూ మీరు చూస్తున్నవాటిని చూడాలని ఆశించారు గానీ చూడలేక పోయారు. మీరు వింటున్న వాటిని వినాలనుకున్నారు గానీ వినలేకపోయారని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
Істино бо глаголю вам: Що многі пророки а праведники бажали бачити, що ви бачите, та й не бачили; й чути, що ви чуєте, та й не чули.
18 ౧౮ “విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి.
Оце ж послухайте приповістї про сїяча.
19 ౧౯ ఎవరైనా రాజ్యం గురించిన వాక్కు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన చల్లిన విత్తనాలు వీరే.
Коли хто чує слово царства, й не зрозумів, приходить лукавий, та й хапає, що посїяно у него в серцї. Се - засїяний край шляху.
20 ౨౦ రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు.
А засїяний на каменистому, се той, що чує слово, й зараз приймає його з радостю:
21 ౨౧ అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు.
тільки же не мав він кореня в собі, він до часу; як настане горе або гоненнє за слово, зараз блазнить ся.
22 ౨౨ ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వారు ఫలించకుండా పోతారు. (aiōn g165)
А засіяний в тернинї, се той, що чув слово, та журба віку сього і омана богацтва глушить слово, й робить ся без'овочним. (aiōn g165)
23 ౨౩ మంచి నేలపై చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్కు విని దాన్ని అర్థం చేసుకునేవాడు. అలాటి వారు నిజంగా ఫలించి వృద్ధి పొందుతారు. కొందరు వంద రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్ఫై రెట్లు ఫలిస్తారు.”
Засіяний же на добрій землї, се той, що чує слово й розуміє, й дав овощ; і родить одно в сотеро, друге в шістьдесятеро, инше ж у трийцятеро.
24 ౨౪ ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు, “పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా ఉంది.
Ще иншу приповість подав їм, глаголючи: Уподобилось царство небесне чоловікові, що сїв добре насіннє на ниві своїй;
25 ౨౫ మనుషులు నిద్రపోతూ ఉంటే అతని శత్రువు వచ్చి గోదుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు.
як же люде спали, прийшов ворог його, й насїяв куколю між пшеницю, та й піишов.
26 ౨౬ మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి.
Як же зійшов засїв, та приніс овощ, показавсь тоді й кукіль.
27 ౨౭ అప్పుడు ఆ రైతు పనివారు అతని దగ్గరికి వచ్చి ‘అయ్యా, నువ్వు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా, అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు.
І прийшли слуги господаря того, та й кажуть йому: Пане, хиба ти не добре насїннє сіяв на твоїй ниві? Звідкіля ж узяв ся кукіль?
28 ౨౮ ‘ఇది పగవాడు చేసిన పని’ అని అతడు వారితో అన్నాడు. ఆ పనివారు ‘మేము వెళ్ళి ఆ కలుపు మొక్కలను పీకేయమంటారా?’ అని అతన్ని అడిగారు.
Він же рече Їм: Се зробив чоловік ворог. Слуги ж сказали йому: Чи хочеш, щоб ми пійшли та випололи його?
29 ౨౯ అందుకు ఆ యజమాని, ‘వద్దు. కలుపు మొక్కలను పీకితే వాటితోబాటు గోదుమ మొక్కలనుకూడా పెళ్లగిస్తారేమో.
Він же рече: Нї, щоб виполюючи кукіль, разом з ним і пшеницї не повиривали.
30 ౩౦ కోతకాలం వరకూ రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో మొదట కలుపు మొక్కలను పోగు చేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. గోదుమలను నా గిడ్డంగిలో చేర్చండి, అని కోత కోసే వారికి చెబుతాను’ అన్నాడు.”
Нехай ростуть обоє до жнив, а в жнива я скажу женцям: Зберіть перш кукіль та повяжіть у снопи, щоб спалити, а пшеницю зложіть у клунї в мене.
31 ౩౧ ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు. “పరలోకరాజ్యం ఇలా ఉంది. ఒకడు తన పొలంలో ఒక ఆవ విత్తనం నాటాడు.
Иншу приповість подав їм, глаголючи: Царство небесне подібне зерну горчицї, що, взявши чоловік, посіяв на ниві своїй.
32 ౩౨ అది విత్తనాలన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటినీ మించిన పెద్ద చెట్టు అవుతుంది. పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి.”
Найдрібнїще воно між усяким насїннєм; як же виросте, то стане найбуйнїщим між яриною, і зробить ся деревом, так що птаство небесне прилїтає кублитись між гіллєм його.
33 ౩౩ ఆయన ఇంకొక ఉపమానం వారితో చెప్పాడు, “పరలోక రాజ్యం ఒక స్త్రీ మూడు మానికల పిండిలో వేసి కలిపి అది అంతా పులిసేలా చేసిన పులిపిండిలాగా ఉంది.”
Иншу приповість сказав їм, глаголючи: Царство небесне подібне квасу, що жінка візьме та й рощиаить ним три мірки борошна (муки), нова все вкисне.
34 ౩౪ “నేను నా నోరు తెరచి ఉపమానాలతో బోధిస్తాను. లోకం సృష్టి మొదలుకొని రహస్యంగా ఉండిపోయిన విషయాలు చెబుతాను.” అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరేలా యేసు ఈ సంగతులన్నీ ప్రజలకు ఉపమానాలతో బోధించాడు. ఉపమానం లేకుండా ఆయన వారికి దేన్నీ బోధించలేదు.
Все це говорив Ісус людям приповістями, а без приповістей не говорив їм:
35 ౩౫
щоб справдилось, що сказав пророк, глаголючи: Одкрию в приповістях уста мої, промовлю втаєне від настання сьвіта.
36 ౩౬ అప్పుడాయన ప్రజలను పంపివేసి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలోని కలుపు మొక్కలను గురించిన ఉపమానం అర్థం మాకు చెప్పు” అని అడిగారు.
Тоді одіслав Ісус людей та й пійшов до дому; і приступили до Него ученики Його, говорячи: Виясни нам приповість про кукіль на ниві.
37 ౩౭ అందుకాయన ఇలా అన్నాడు, “మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు.
Він же, озвавшись, рече їм: Сїючий добре насіннє, се Син чоловічий;
38 ౩౮ పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు.
а нива, се сьвіт; добре ж насіннє, се сини царства; а кукіль, се сини лукавого;
39 ౩౯ వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు. (aiōn g165)
ворог, що всіяв його, се диявол; жнива, се конець сьвіта; а женцї, се ангели. (aiōn g165)
40 ౪౦ కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది. (aiōn g165)
Оце ж, як той кукіль збираєть ся та палить ся огнем, так буде при кінці сьвіта сього: (aiōn g165)
41 ౪౧ మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు.
Пошле Син чоловічий ангели свої, й позбирають вони з царства Його все, що блазнить, і всіх, що роблять беззаконнє,
42 ౪౨ అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి.
та й повкидають їх ув огняну піч: там буде плач і скреготаннє зубів.
43 ౪౩ అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు విను గాక.
Тодї праведні сияти муть, як сонце в царстві Отця свого. Хто має уші слухати, нехай слухає.
44 ౪౪ “పరలోకరాజ్యం పొలంలో దాచిన నిధి లాగా ఉంది. ఒక మనిషి దాన్ని చూసి దాచి పెట్టి, అది దొరికిన సంతోషంతో వెళ్ళి, తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొంటాడు.
Знов, царство небесне подібне скарбу, закопаному на ниві: що, знайшовши його чоловік, приховав, і, радіючи, йде та й продав все, що має, та й купує ту ниву.
45 ౪౫ “పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడి లాగా ఉంది.
Знов, царство небесне подібне чоловікові купцеві, що шукає добрих перед;
46 ౪౬ అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు.
і знайшовши він одну перлу дорогоцінну, пійшов та й продав усе, що мав, та й купив її.
47 ౪౭ “పరలోకరాజ్యం సముద్రంలో వేసే వలను పోలి ఉంది. అందులో రకరకాల చేపలు పడతాయి.
Знов, царство небесне подібне неводові, що закинуто в море, й що зайняв усячини;
48 ౪౮ అది నిండినప్పుడు తీరానికి లాగి, కూర్చుని మంచి వాటిని గంపల్లో వేసుకుని పనికి రాని వాటిని విసిరి పారేస్తారు.
як же став повен, то витягли його на беріг, і посїдавши, вибрали що добре, у посуд, а що погане, те геть повикидали.
49 ౪౯ అలాగే ఈ లోకాంతంలో జరుగుతుంది. దేవ దూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేసి, (aiōn g165)
Так буде й при кінцї сьвіту: вийдуть ангели, та й повідлучають лихих зміж праведних, (aiōn g165)
50 ౫౦ వారిని అగ్ని గుండంలో పడవేస్తారు. అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.
та й повкидають їх ув огняну піч: там буде плач і скреготаннє зубів.
51 ౫౧ వీటినన్నిటిని మీరు గ్రహించారా?” అని ఆయన వారిని అడిగినప్పుడు వారు జవాబిస్తూ, “గ్రహించాము” అన్నారు.
І рече Ісус до них: Чи зрозуміли ви все? Кажуть вони Йому: Так, Господи.
52 ౫౨ ఆయన, “అందువలన దేవుని రాజ్యాన్ని గురించి ఉపదేశం పొందిన ప్రతి ధర్మశాస్త్ర పండితుడూ తన ఖజానాలో నుండి కొత్త వాటినీ పాత వాటినీ బయటికి తెచ్చే ఇంటి యజమానిలాగా ఉన్నాడు” అని వారితో చెప్పాడు.
Він же рече їм: Тим же то кожен письменник, навчений про царство небесне, подібен чоловікові господареві, що виносить із свого скарбу нове й старе.
53 ౫౩ యేసు ఈ ఉపమానాలు చెప్పి ఊరుకున్న తరువాత,
І сталось, як скінчив Ісус оцї приповістї, пійшов ізвідтіля.
54 ౫౪ ఆయన అక్కడ నుండి వెళ్ళి తన సొంత ఊరు వచ్చి, సమాజ మందిరాల్లో వారికి బోధిస్తూ ఉన్నాడు. వారు ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడ నుంచి వచ్చాయి?
І, прийшовши у свою країну, навчав їх у школї їх, так що вони дивувались і казали: Звідкіля в Сього така премудрість і сила?
55 ౫౫ ఇతడు వడ్రంగి కొడుకు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనే వారు ఇతని సోదరులు కారా?
Хиба Він не син теслї? хиба не Його мати зветься Мария? а брати Його Яков, та Йосій, та Симон, та Юда?
56 ౫౬ ఇతని సోదరీలంతా మనతోనే ఉన్నారు కదా! ఇతనికి ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి?” అని చెప్పుకుని ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు.
хиба не Його сестри між нами? Звідкіля ж се все в Него?
57 ౫౭ అయితే యేసు, “ఒక ప్రవక్త తన స్వదేశంలో, తన సొంత ఇంట్లో తప్ప మిగతా అన్ని చోట్లా ఘనత పొందుతాడు” అని వారితో చెప్పాడు.
І поблазнились Ним. Ісус же рече до них: Не є пророк без чести, хиба що в своїй отчинї та в своїй домівцї.
58 ౫౮ వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.
І не зробив там многих чудес через недовірство їх.

< మత్తయి 13 >