< మత్తయి 12 >
1 ౧ ఆ రోజుల్లో యేసు ఒక విశ్రాంతి దినాన పంటచేలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులకు ఆకలి వేసి కంకులు తుంచి తింటున్నారు.
時,耶穌在安息日由麥田中經過:衪的門徒餓了,開始掐麥穗吃。
2 ౨ పరిసయ్యులు అది చూసి, “చూడు, విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు” అని ఆయనతో అన్నారు.
法利賽人一見,便衪說:「看,你的門徒作安息日不許作的事。」
3 ౩ ఆయన వారితో, “దావీదుకూ అతనితో ఉన్న వారికీ ఆకలి వేస్తే అతడు చేసిన దాని గురించి మీరు చదవలేదా?
耶穌說:「你們沒有念過:達味與那些同衪一起的人,飢餓時,作了什麼?
4 ౪ అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులే తప్ప తాను గానీ తనతో ఉన్నవారు గానీ తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు.
他怎麼進了天主的殿,吃了供餅!這供餅原是不准他吃,在不准同他在一起的人吃,而是只許司祭吃的。
5 ౫ విశ్రాంతి దినాన దేవాలయంలోని యాజకులు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా కూడా నిర్దోషులుగానే ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా?
或者你們在法律沒有念過:安息日,司祭在聖殿內犯了安息日,也不算為罪過嗎?
6 ౬ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను.
我告訴你們:這裏有比聖殿更的。
7 ౭ ‘కనికరాన్నే కోరుతున్నాను, బలిని కోరను’ అనే వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చరు.
假如你們瞭解『我喜歡仁愛勝過祭獻』是什麼,你們就決不會判斷無罪的人了,
8 ౮ కాగా మనుష్యకుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు” అన్నాడు.
因為人子是安息日的主。
9 ౯ ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించాడు. అక్కడ చచ్చుబడిన చేతితో ఒకడు కనిపించాడు.
耶穌就離開那裏,進了他們的會堂。
10 ౧౦ పరిసయ్యులు ఆయన మీద నేరం మోపాలని, “విశ్రాంతి దినాన బాగు చేయడం న్యాయమా?” అని ఆయనను అడిగారు.
看,那裏有一個人,他的一隻手乾枯了,他們問耶穌說:「安息日許不許治病? 」為的要控告衪。
11 ౧౧ అందుకాయన, “మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి, అది విశ్రాంతి దినాన గుంటలో పడితే అతడు దాన్ని పైకి తీయడా?
耶穌對他們說:「你們中誰有一隻羊,假如安息日掉在坑裏,而不把牠抓住,拉上來呢?
12 ౧౨ గొర్రె కంటే మనిషి ఎంతో విలువైన వాడు కాబట్టి విశ్రాంతి దినాన మంచి చేయడం న్యాయమే” అని చెప్పి
人比羊貴重得多了!所以,安息日是許可行善的。」
13 ౧౩ ఆ మనిషితో, “నీ చెయ్యి చాపు” అన్నాడు. వాడు చెయ్యి చాపగానే అది రెండవ చెయ్యి లాగా బాగుపడింది.
於是給那人說:「伸出你的手來!」那人一伸出來,手就完好如初,同另一隻手一樣。
14 ౧౪ పరిసయ్యులు బయటికి పోయి, ఆయనను ఎలా చంపాలా అని ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు.
法利賽人出去,商討怎麼陷害耶穌,怎樣除滅衪。
15 ౧౫ యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
耶穌知道了,就離開那裏;有許多人跟隨衪,衪都治好了他們;
16 ౧౬ చాలా మంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు.
且警告他們不要將衪摶出去;
17 ౧౭ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే,
這是為應驗那藉依撒意亞先知所說的話:
18 ౧౮ “ఈయన నా సేవకుడు. ఈయనను నేను ఏర్పరచుకున్నాను. ఈయన నాకెంతో ప్రియమైన వాడు. ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను. ఈయన యూదేతరులకు న్యాయం ప్రకటిస్తాడు.
『看,我的僕人,他是我所揀選,我所鍾的;他是我心靈所喜悅的;我要使我的神主在衪身上,他必向外邦人傳佈真道。
19 ౧౯ ఈయన పోట్లాడడు, కేకలు వేయడు. ఈయన స్వరం వీధిలో వారికెవ్వరికీ వినిపించదు.
他不爭辯,也不喧嚷,在街市上沒有人聽到他的聲音;
20 ౨౦ న్యాయాన్ని గెలిపించే వరకూ, ఈయన నలిగిన రెల్లును విరవడు. ఆరిపోతున్న వత్తిని నలపడు.
已壓破的蘆葦,他不折斷;將熄滅的燈心,他不吹滅,直到他使真道勝利。
21 ౨౧ ఈయన నామంలో యూదేతరులకు నిరీక్షణ కలుగుతుంది” అనే ప్రవచనం.
外邦人將要期待他的名字。
22 ౨౨ అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు. అతడు గుడ్డివాడు, మూగవాడు కూడా. ఆయన అతణ్ణి బాగుచేశాడు. అతనికి మాట, చూపు రెండూ వచ్చాయి.
那時,有人給衪領來一個又瞎又啞的附魔人,耶穌治好了他他,以致這啞吧能說話,也能看見。
23 ౨౩ అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడి, “దావీదు కుమారుడు ఈయనే అయి ఉంటాడా” అని చెప్పుకున్నారు.
群眾都驚奇說:「莫非這人是達味之子嗎﹖」
24 ౨౪ పరిసయ్యులు ఆ మాట విని, “వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరెవరి వలనా కాదు” అన్నారు.
法利賽人聽了說:「這人驅魔,無非是仗賴魔王貝爾則布。」
25 ౨౫ ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, “ఏ రాజ్యమైనా సరే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడైపోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ ఇల్లయినా నిలవదు.
耶穌知道了他們的意念,就對他們說:「凡一國自相紛爭,必成廢墟;凡一城或一家自相紛爭,必不得存立。
26 ౨౬ ఒకవేళ సాతాను సాతానును వెళ్ళగొడితే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు కదా. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది?
如果撒殫驅逐撒殫,是自相紛爭,那麼他的國如何能存立呢﹖
27 ౨౭ నేను బయెల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ వారు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులవుతారు.
如果我仗賴貝耳則布驅魔,你們的子弟是仗賴誰驅魔﹖為此,他們將是你們的裁判者。
28 ౨౮ దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్టే.
如果我仗賴天主的神驅魔,那麼,天主的國己經來到你們中間了。
29 ౨౯ ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలడు.
或者,一個人如何能進入一個壯士的家,搶他的家具﹖除非先把壯士捆住,然後才搶他的家。
30 ౩౦ నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే.
不隨同我的,就是反對我;不與我收集的,就是分散。
31 ౩౧ “కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు.
為此告訴你們:一切罪過和褻瀆,人都可得赦免;但是褻瀆聖神的罪,必不得赦免;
32 ౩౨ మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు. (aiōn )
凡出言干犯人子的,在今世及來世,都不得恕免。」 (aiōn )
33 ౩౩ “చెట్టు మంచిదయితే దాని పండూ మంచిదవుతుంది. అలా కాక, చెట్టు చెడ్డదయితే దాని పండూ చెడ్డదవుతుంది. చెట్టు ఎలాటిదో దాని పండు వలన తెలుసుకోవచ్చు.
你們或者說樹好,它的果子也好;或者說樹壞,它的果子也壞,因為由果子可認出樹來。
34 ౩౪ విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది.
毒蛇的種類啊! 你們既是惡的,怎能說出善來﹖因為心裏充滿什麼,口裏就說什麼。
35 ౩౫ మంచివాడు తన హృదయంలోని మంచి సంపదలో నుండి మంచి వాటిని బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన హృదయంలోని చెడ్డ సంపదలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు.
善人從善庫裏,取出善來;惡人從惡庫裏,取出惡來。
36 ౩౬ మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను.
但我告訴你們:人所說的每句廢話,在審判之日,都要交賬,
37 ౩౭ నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు.”
因為憑你的話,要定你為義人;也憑你的話,要定你為罪人。」
38 ౩౮ అప్పుడు ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యుల్లో కొందరు ఆయనకు జవాబిస్తూ, “బోధకుడా, నువ్వు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది” అన్నారు. ఆయన ఇలా అన్నాడు,
那時,有幾個經師和法利賽人對耶穌說:「師父,我們願意你顯示一個徵兆給我們看。」
39 ౩౯ “వ్యభిచారులైన ఈ దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వబడదు.
衪回答他們說:「邪惡淫亂的世代要求徵兆,但除了約納先知的徵兆外,必不給它其它的徵兆。
40 ౪౦ యోనా మూడు రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు.
有如約納曾在大魚腹中三天三夜,同樣,人子也要在地裏三天三夜。
41 ౪౧ నీనెవె ప్రజలు యోనా ప్రకటన విని పశ్చాత్తాప పడ్డారు కాబట్టి నీనెవె వారు ఈ తరం వారితో నిలబడి తీర్పు రోజున వారి మీద నేరం మోపుతారు. చూడండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
尼尼微人在審判時,將同這一代人起來,定他們的罪,因為尼尼微人因了約納的宣講而悔改了;看,這裏有一位大於約納的!
42 ౪౨ తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. అయితే చూడండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
南方的女王,在審判時,將同這一代人起來,而定他們的罪,因為她從地極而來,聽撒羅滿的智慧,看,這有裏有一位大於撒羅滿的!
43 ౪౩ “అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది.
邪魔由人身上出來以後,走遍乾旱之地,尋找一個安息之所,卻沒有找著,
44 ౪౪ దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది ‘నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను’ అనుకుని వచ్చి, ఆ ఇంట్లో ఎవరూ లేక అది ఊడ్చి చక్కగా సర్దిపెట్టి ఉండడం చూస్తుంది.
他於是說:我要回到我出來的那間屋裏去。他來到後,見裏面空著,打掃乾淨,裝飾整齊,
45 ౪౫ అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యాలను వెంటబెట్టుకుని వస్తుంది. అవన్నీ అక్కడే నివాసముంటాయి. అందుచేత ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దాని కంటే అధ్వాన్నం అవుతుంది. ఈ దుష్టతరం వారికీ అలాగే అవుతుంది.”
就去,帶了七個惢他更惡的魔鬼來,進去,住在那裏;那人末後的處境就比以前的更壞了。對這邪惡的世代也必是這樣。」
46 ౪౬ ఆయన ప్రజలతో ఇంకా మాట్లాడుతూ ఉండగా, ఆయన తల్లీ సోదరులూ ఆయనతో మాట్లాడాలని వచ్చి బయట నిలబడి ఉన్నారు.
耶穌還同群眾說話的時候,看,衪的母親和衪的兄弟,站在外邊,想要同衪說話。
47 ౪౭ అప్పుడొకడు, “నీ తల్లీ నీ సోదరులూ నీతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు” అని ఆయనతో చెప్పాడు.
有人告訴衪說:「看,你的母親同你的兄弟,站在外邊,想要同你說話。」
48 ౪౮ అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూసి, “నా తల్లి ఎవరు? నా సోదరులెవరు?” అని చెప్పి
衪卻回答那告訴他的人說:「誰是我母親﹖誰是我的兄弟﹖」
49 ౪౯ తన శిష్యులవైపు చెయ్యి చాపి, “నా తల్లి, నా సోదరులు వీరే!
遂伸出衪的手,指自己的門徒說:「看!我的母親,我的兄弟!
50 ౫౦ నా పరలోకపు తండ్రి ఇష్టం చొప్పున చేసేవాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అన్నాడు.
不拘誰遵行我在天之父的意旨,他就是我的兄弟,姊妹和母親。」