< మత్తయి 11 >
1 ౧ యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఉపదేశించడం అయిపోయిన తరువాత వారి పట్టణాల్లో బోధించడానికీ, ప్రకటించడానికీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
Kui Jeesus oli lõpetanud oma kaheteistkümne jüngri õpetamise, läks ta ümbruskonna linnadesse õpetama ja avalikult kõnelema.
2 ౨ క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని,
Sel ajal kui Johannes oli vanglas, kuulis ta, mida Messias tegi, seega saatis ta oma jüngrid
3 ౩ “రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాడి కోసం కనిపెట్టాలా?” అని ఆయనను అడగడానికి తన శిష్యులను పంపాడు.
enda nimel küsima: „Kas sina oled see, kelle tulekut pidime ootama, või peame veel kedagi teist otsima?“
4 ౪ యేసు, “మీరు వెళ్ళి, విన్న వాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియజేయండి.
Jeesus vastas neile: „Minge tagasi ja rääkige Johannesele, mida te kuulete ja näete.
5 ౫ గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది.
Pimedad näevad, jalutud kõnnivad, pidalitõbised saavad terveks, kurdid kuulevad, surnud äratatakse üles ja vaesed kuulevad head sõnumit.
6 ౬ నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని జవాబిచ్చాడు.
Õnnistatud on need, kes mind tagasi ei lükka!“
7 ౭ వారు వెళ్ళిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు, “మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే గడ్డి పోచనా?
Kui nad lahkusid, hakkas Jeesus rahvale Johannesest rääkima. „Mida te lootsite näha, kui läksite välja kõrbesse? Tuule käes kõikuvat pilliroogu?
8 ౮ అయితే మరింకేమి చూడడానికి వెళ్ళారు? నాజూకు బట్టలు వేసుకొన్న వ్యక్తినా? నాజూకు బట్టలు వేసికొనే వారు రాజ భవనాల్లో ఉంటారు.
Mida te siis läksite vaatama? Uhketes rõivastes meest? Selliste rõivastega inimesed elavad kuningapaleedes.
9 ౯ మరింకేమి చూడడానికి వెళ్ళారు? ప్రవక్తనా? సరే గాని, ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు అని మీతో చెబుతున్నాను.
Mida te siis läksite vaatama? Prohvetit? Jah, ja ma ütlen teile, ta on palju enam kui prohvet!
10 ౧౦ ‘నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందు వెళ్ళి నీ దారి సిద్ధం చేస్తాడు’ అని రాసి ఉన్నది ఇతని గురించే.
Tema on see, kellest pühakirjas on kirjutatud: „Ma saadan oma käskjala sinu eel. Ta valmistab sulle teed.“
11 ౧౧ స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో కచ్చితంగా చెబుతున్నాను. అయినా పరలోకరాజ్యంలో అత్యల్పమైన వాడు అతని కంటే గొప్పవాడు.
Ma ütlen teile tõtt, et inimeste hulgas ei ole suuremat kui Ristija Johannes, aga isegi kõige tühisem taevariigis on temast suurem.
12 ౧౨ బాప్తిసమిచ్చే యోహాను కాలం నుండి ఇప్పటి వరకూ పరలోకరాజ్యం దాడులకు గురి అవుతూ ఉంది. తీవ్రత గలవారు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు.
Ristija Johannese ajast kuni praeguseni on taevariik jätkuvalt rünnakute all ning vägivaldsed inimesed üritavad seda jõuga enda valdusesse haarata.
13 ౧౩ ఎందుకంటే యోహాను కాలం వరకూ ప్రవక్తలూ, ధర్మశాస్త్రమూ ప్రవచిస్తూ వచ్చారు.
Sest kõik prohvetid ja seadus kõnelesid Jumala kasuks kuni Johannese tulekuni.
14 ౧౪ ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలీయా ఇతడే.
Kui olete valmis seda uskuma: tema on Eelija, see, kes pidi tulema.
15 ౧౫ వినే చెవులున్నవాడు విను గాక.
Kellel kõrvad on, see kuulaku!
16 ౧౬ ఈ తరం వారిని దేనితో పోల్చాలి?
Millega peaksin seda põlvkonda võrdlema? See on nagu turuplatsil istuvad lapsed, kes karjuvad üksteisele:
17 ౧౭ పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ ‘మీ కోసం వేణువు ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ప్రలాపించాం గాని మీరు ఏడవలేదు’ అని ఒకరితో ఒకరు చెప్పుకునే విధంగా ఉన్నారు.
„Me mängisime teile flööti ja te ei tantsinud; me laulsime laule ja te ei nutnud.“
18 ౧౮ ఎందుకంటే యోహాను వచ్చి రొట్టె తినకుండా, ద్రాక్షరసం తాగకుండా ఉండేవాడు. ‘అతనికి దయ్యం పట్టింది’ అని వారంటున్నారు.
Johannes ei tulnud sööma ja jooma, seepärast inimesed ütlevad: „Ta on kurjast vaimust vaevatud!“
19 ౧౯ మనుష్య కుమారుడు తింటూ, తాగుతూ వచ్చాడు. కాబట్టి ‘వీడు తిండిబోతూ, తాగుబోతూ, పన్నులు వసూలు చేసే వారికీ పాపులకూ స్నేహితుడు’ అని వారంటున్నారు. అయితే జ్ఞానం అది చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది.”
Inimese Poeg aga tuli, sõi ja jõi ning inimesed ütlevad: „Vaadake, ta on ahne ja joob liiga palju; ta on maksukogujate ja patuste sõber!“Kuid arukus näitab, et tal on õigus, sellega, mida ta teeb …“
20 ౨౦ అప్పుడాయన ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను గద్దించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాప పడలేదు.
Siis hakkas ta noomima linnu, kus ta oli teinud kõige rohkem imetegusid, sellepärast et nad ei olnud meelt parandanud.
21 ౨౧ “అయ్యో కొరాజీనూ! నీకు శిక్ష తప్పదు. అయ్యో బేత్సయిదా! నీకు శిక్ష తప్పదు. మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకుని బూడిద పూసుకునేవారే.
„Häbi sulle, Korasin! Häbi sulle, Betsaida! Kui Tüüroses ja Siidonis oleksid toimunud need imeteod, mis toimusid teie juures, oleksid nad juba ammu kotiriides ja tuhas kahetsenud.
22 ౨౨ తీర్పు దినాన మీకు పట్టే గతి కంటే తూరు సీదోను పట్టణాల వారి గతే ఓర్చుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను.
Aga ma ütlen teile, et kohtupäeval on Tüürose ja Siidoni olukord parem kui teil!
23 ౨౩ కపెర్నహూమా, పరలోకానికి హెచ్చిపోగలను అని నీవు అనుకుంటున్నావా? నీవు పాతాళంలోకి దిగి పోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకూ నిలిచి ఉండేదే! (Hadēs )
Ja kuidas on sinuga, Kapernaum? Kas sind ülendatakse taevasse? Ei, sa lähed alla manalasse! Kui Soodomas oleksid tehtud need imeteod, mis toimusid sinu juures, oleks Soodom veel tänapäevalgi alles. (Hadēs )
24 ౨౪ తీర్పు దినాన నీకు పట్టే గతి కంటే సొదొమ నగరానికి పట్టే గతే ఓర్చుకోదగినది అవుతుంది, అని మీతో చెప్తున్నాను.”
Aga ma ütlen teile, et kohtupäeval on Soodoma olukord parem kui sinul!“
25 ౨౫ ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు, “తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతులను మరుగు చేసి చిన్న పిల్లలకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను.
Siis Jeesus palvetas: „Ma kiidan sind, Isa, taeva ja maa Issand, et sa oled neid asju varjanud tarkade ja haritute eest. Selle asemel oled sa need ilmutanud tavalistele inimestele.
26 ౨౬ అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం.
Jah, Isa, sa tegid seda hea meelega!
27 ౨౭ సమస్తాన్నీ నా తండ్రి నాకు అప్పగించాడు. తండ్రి తప్ప కుమారుణ్ణి ఎవరూ ఎరగరు. కుమారుడూ, ఎవరికి వెల్లడించాలని కుమారుడు ఉద్దేశిస్తాడో వాడూ తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు.
Isa on kõik usaldanud minu kätte ja tegelikult ei mõista keegi Poega, välja arvatud Isa, ja keegi ei mõista tegelikult Isa, välja arvatud Poeg ja need, kellele Poeg otsustab teda ilmutada.
28 ౨౮ “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను.
Tulge minu juurde kõik, kes te praegu heitlete ja olete koormatud. Ma annan teile rahu.
29 ౨౯ నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది.
Võtke vastu minu ike ja õppige minult, sest mina olen lahke ja alandliku südamega ning te leiate minust rahu, mida vajate.
30 ౩౦ ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”
Sest minu ike on vaevu tuntav ja minu koorem on kerge.“