< మత్తయి 10 >

1 ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు.
అనన్తరం యీశు ర్ద్వాదశశిష్యాన్ ఆహూయామేధ్యభూతాన్ త్యాజయితుం సర్వ్వప్రకారరోగాన్ పీడాశ్చ శమయితుం తేభ్యః సామర్థ్యమదాత్|
2 ఆ పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి. మొట్ట మొదటిగా పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ, జెబెదయి కొడుకు యాకోబు, అతని సోదరుడు యోహాను.
తేషాం ద్వాదశప్రేష్యాణాం నామాన్యేతాని| ప్రథమం శిమోన్ యం పితరం వదన్తి, తతః పరం తస్య సహజ ఆన్ద్రియః, సివదియస్య పుత్రో యాకూబ్
3 ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరి మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి,
తస్య సహజో యోహన్; ఫిలిప్ బర్థలమయ్ థోమాః కరసంగ్రాహీ మథిః, ఆల్ఫేయపుత్రో యాకూబ్,
4 కనానీయుడు సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
కినానీయః శిమోన్, య ఈష్కరియోతీయయిహూదాః ఖ్రీష్టం పరకరేఽర్పయత్|
5 యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, “మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు. సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకీ వెళ్ళొద్దు.
ఏతాన్ ద్వాదశశిష్యాన్ యీశుః ప్రేషయన్ ఇత్యాజ్ఞాపయత్, యూయమ్ అన్యదేశీయానాం పదవీం శేమిరోణీయానాం కిమపి నగరఞ్చ న ప్రవిశ్యే
6 ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి.
ఇస్రాయేల్గోత్రస్య హారితా యే యే మేషాస్తేషామేవ సమీపం యాత|
7 వెళుతూ, ‘పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించండి.
గత్వా గత్వా స్వర్గస్య రాజత్వం సవిధమభవత్, ఏతాం కథాం ప్రచారయత|
8 రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.
ఆమయగ్రస్తాన్ స్వస్థాన్ కురుత, కుష్ఠినః పరిష్కురుత, మృతలోకాన్ జీవయత, భూతాన్ త్యాజయత, వినా మూల్యం యూయమ్ అలభధ్వం వినైవ మూల్యం విశ్రాణయత|
9 బంగారం, వెండి, ఇత్తడి, ప్రయాణం కోసం పెట్టె, రెండు అంగీలు, చెప్పులు, చేతికర్ర, ఇవేవీ మీ సంచిలో ఉంచుకోవద్దు. ఎందుకంటే పనివాడు తన ఆహారానికి అర్హుడు.
కిన్తు స్వేషాం కటిబన్ధేషు స్వర్ణరూప్యతామ్రాణాం కిమపి న గృహ్లీత|
10 ౧౦
అన్యచ్చ యాత్రాయై చేలసమ్పుటం వా ద్వితీయవసనం వా పాదుకే వా యష్టిః, ఏతాన్ మా గృహ్లీత, యతః కార్య్యకృత్ భర్త్తుం యోగ్యో భవతి|
11 ౧౧ మీరు ఏదైనా పట్టణంలో లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి. అక్కడ నుండి వెళ్ళే వరకూ అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపొండి.
అపరం యూయం యత్ పురం యఞ్చ గ్రామం ప్రవిశథ, తత్ర యో జనో యోగ్యపాత్రం తమవగత్య యానకాలం యావత్ తత్ర తిష్ఠత|
12 ౧౨ ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి శుభం పలకండి.
యదా యూయం తద్గేహం ప్రవిశథ, తదా తమాశిషం వదత|
13 ౧౩ ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని పైకి వస్తుంది. దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకు తిరిగి వచ్చేస్తుంది.
యది స యోగ్యపాత్రం భవతి, తర్హి తత్కల్యాణం తస్మై భవిష్యతి, నోచేత్ సాశీర్యుష్మభ్యమేవ భవిష్యతి|
14 ౧౪ ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ మాటలు వినకపోతే మీరు ఆ ఇంటిని గానీ ఆ ఊరిని గానీ, విడిచి వెళ్ళిపోయేటపుడు మీ పాదధూళి దులిపి వేయండి.
కిన్తు యే జనా యుష్మాకమాతిథ్యం న విదధతి యుష్మాకం కథాఞ్చ న శృణ్వన్తి తేషాం గేహాత్ పురాద్వా ప్రస్థానకాలే స్వపదూలీః పాతయత|
15 ౧౫ తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటే సొదొమ గొమొర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
యుష్మానహం తథ్యం వచ్మి విచారదినే తత్పురస్య దశాతః సిదోమమోరాపురయోర్దశా సహ్యతరా భవిష్యతి|
16 ౧౬ “తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి.
పశ్యత, వృకయూథమధ్యే మేషః యథావిస్తథా యుష్మాన ప్రహిణోమి, తస్మాద్ యూయమ్ అహిరివ సతర్కాః కపోతాఇవాహింసకా భవత|
17 ౧౭ మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు.
నృభ్యః సావధానా భవత; యతస్తై ర్యూయం రాజసంసది సమర్పిష్యధ్వే తేషాం భజనగేహే ప్రహారిష్యధ్వే|
18 ౧౮ వీరికీ యూదేతరులకూ సాక్షార్థంగా నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరకీ రాజుల దగ్గరకీ తెస్తారు.
యూయం మన్నామహేతోః శాస్తృణాం రాజ్ఞాఞ్చ సమక్షం తానన్యదేశినశ్చాధి సాక్షిత్వార్థమానేష్యధ్వే|
19 ౧౯ వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు.
కిన్త్విత్థం సమర్పితా యూయం కథం కిముత్తరం వక్ష్యథ తత్ర మా చిన్తయత, యతస్తదా యుష్మాభి ర్యద్ వక్తవ్యం తత్ తద్దణ్డే యుష్మన్మనః సు సముపస్థాస్యతి|
20 ౨౦ మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు.
యస్మాత్ తదా యో వక్ష్యతి స న యూయం కిన్తు యుష్మాకమన్తరస్థః పిత్రాత్మా|
21 ౨౧ సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కొడుకునూ చావుకు అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు.
సహజః సహజం తాతః సుతఞ్చ మృతౌ సమర్పయిష్యతి, అపత్యాగి స్వస్వపిత్రో ర్విపక్షీభూయ తౌ ఘాతయిష్యన్తి|
22 ౨౨ నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకూ సహించే వారిని దేవుడు రక్షిస్తాడు.
మన్నమహేతోః సర్వ్వే జనా యుష్మాన్ ఋతీయిష్యన్తే, కిన్తు యః శేషం యావద్ ధైర్య్యం ఘృత్వా స్థాస్యతి, స త్రాయిష్యతే|
23 ౨౩ వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తుంటే వేరే పట్టణానికి పారిపొండి. మనుష్య కుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు పట్టణాలు అన్నిటికీ వెళ్ళి ఉండరు అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
తై ర్యదా యూయమేకపురే తాడిష్యధ్వే, తదా యూయమన్యపురం పలాయధ్వం యుష్మానహం తథ్యం వచ్మి యావన్మనుజసుతో నైతి తావద్ ఇస్రాయేల్దేశీయసర్వ్వనగరభ్రమణం సమాపయితుం న శక్ష్యథ|
24 ౨౪ గురువు కంటే శిష్యుడూ యజమాని కంటే పనివాడూ గొప్పవారేమీ కాదు.
గురోః శిష్యో న మహాన్, ప్రభోర్దాసో న మహాన్|
25 ౨౫ శిష్యుడు తన గురువు లాగా, పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానికి బయెల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉంటే అతని ఇంటివారిని మరి ఇంకెంతగా అంటారు గదా!
యది శిష్యో నిజగురో ర్దాసశ్చ స్వప్రభోః సమానో భవతి తర్హి తద్ యథేష్టం| చేత్తైర్గృహపతిర్భూతరాజ ఉచ్యతే, తర్హి పరివారాః కిం తథా న వక్ష్యన్తే?
26 ౨౬ కాబట్టి మీరు వారికి భయపడవద్దు. కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు.
కిన్తు తేభ్యో యూయం మా బిభీత, యతో యన్న ప్రకాశిష్యతే, తాదృక్ ఛాదితం కిమపి నాస్తి, యచ్చ న వ్యఞ్చిష్యతే, తాదృగ్ గుప్తం కిమపి నాస్తి|
27 ౨౭ మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడలమీద చాటించండి.
యదహం యుష్మాన్ తమసి వచ్మి తద్ యుష్మాభిర్దీప్తౌ కథ్యతాం; కర్ణాభ్యాం యత్ శ్రూయతే తద్ గేహోపరి ప్రచార్య్యతాం|
28 ౨౮ “ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి. (Geenna g1067)
యే కాయం హన్తుం శక్నువన్తి నాత్మానం, తేభ్యో మా భైష్ట; యః కాయాత్మానౌ నిరయే నాశయితుం, శక్నోతి, తతో బిభీత| (Geenna g1067)
29 ౨౯ రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు.
ద్వౌ చటకౌ కిమేకతామ్రముద్రయా న విక్రీయేతే? తథాపి యుష్మత్తాతానుమతిం వినా తేషామేకోపి భువి న పతతి|
30 ౩౦ మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు.
యుష్మచ్ఛిరసాం సర్వ్వకచా గణితాంః సన్తి|
31 ౩౧ కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.
అతో మా బిభీత, యూయం బహుచటకేభ్యో బహుమూల్యాః|
32 ౩౨ మనుషుల ముందు నన్ను ఒప్పుకొనే వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ ఒప్పుకుంటాను.
యో మనుజసాక్షాన్మామఙ్గీకురుతే తమహం స్వర్గస్థతాతసాక్షాదఙ్గీకరిష్యే|
33 ౩౩ ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ తెలియదంటాను.
పృథ్వ్యామహం శాన్తిం దాతుమాగతఇతి మానుభవత, శాన్తిం దాతుం న కిన్త్వసిం|
34 ౩౪ “నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు.
పితృమాతృశ్చశ్రూభిః సాకం సుతసుతాబధూ ర్విరోధయితుఞ్చాగతేస్మి|
35 ౩౫ అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను.
తతః స్వస్వపరివారఏవ నృశత్రు ర్భవితా|
36 ౩౬ ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు.
యః పితరి మాతరి వా మత్తోధికం ప్రీయతే, స న మదర్హః;
37 ౩౭ నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు.
యశ్చ సుతే సుతాయాం వా మత్తోధికం ప్రీయతే, సేపి న మదర్హః|
38 ౩౮ తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు.
యః స్వక్రుశం గృహ్లన్ మత్పశ్చాన్నైతి, సేపి న మదర్హః|
39 ౩౯ తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు.
యః స్వప్రాణానవతి, స తాన్ హారయిష్యతే, యస్తు మత్కృతే స్వప్రాణాన్ హారయతి, స తానవతి|
40 ౪౦ మిమ్మల్ని చేర్చుకొనేవాడు నన్ను చేర్చుకొంటాడు. నన్ను చేర్చుకొనేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకొంటాడు.
యో యుష్మాకమాతిథ్యం విదధాతి, స మమాతిథ్యం విదధాతి, యశ్చ మమాతిథ్యం విదధాతి, స మత్ప్రేరకస్యాతిథ్యం విదధాతి|
41 ౪౧ ప్రవక్త అని ఒక ప్రవక్తను చేర్చుకొనేవాడు ప్రవక్తకు దక్కే ప్రతిఫలం పొందుతాడు. నీతిమంతుడని ఒక నీతిమంతుణ్ణి చేర్చుకొనేవాడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు.
యో భవిష్యద్వాదీతి జ్ఞాత్వా తస్యాతిథ్యం విధత్తే, స భవిష్యద్వాదినః ఫలం లప్స్యతే, యశ్చ ధార్మ్మిక ఇతి విదిత్వా తస్యాతిథ్యం విధత్తే స ధార్మ్మికమానవస్య ఫలం ప్రాప్స్యతి|
42 ౪౨ శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను.”
యశ్చ కశ్చిత్ ఏతేషాం క్షుద్రనరాణామ్ యం కఞ్చనైకం శిష్య ఇతి విదిత్వా కంసైకం శీతలసలిలం తస్మై దత్తే, యుష్మానహం తథ్యం వదామి, స కేనాపి ప్రకారేణ ఫలేన న వఞ్చిష్యతే|

< మత్తయి 10 >