< మార్కు 1 >
1 ౧ దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన సువార్త ఆరంభం.
Shisoweru Shiwagira ashi sha Yesu Kristu, Mwana gwa Mlungu.
2 ౨ యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, “ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు.
Yankuyanja gambira Isaya mbuyi gwa Mlungu ntambu yakalembiti, “Mlungu kalongiti, ‘Guloli numtuma ntumintumi gwangu hakakulonguleri Hakakunywawili njira yaku.’
3 ౩ ‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి, ఆయన దారులు తిన్నగా చేయండి’ అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.”
Liziwu lya muntu lipikanika kushiwala, ‘Mumtenderi kala Mtuwa njira yakuwi, mumnyawili weri njira zyakuwi!’”
4 ౪ యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు.
Yohani kalawiriti kushiwala, kawabwelera wantu na kuwabatiza, pakawagambira, “Mleki vidoda vyenu na mbatizwi na Mlungu hakawalekiziyi vidoda vyenu.”
5 ౫ యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు.
Wantu wavuwa wamgenderiti Yohani, wantu yawalawiti Yerusalemu na Yudeya, walekiti vidoda vyawatenditi na yomberi kawabatiziti mulushemba lwa Yoridani.
6 ౬ యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం.
Yohani kavaliti nguwu yayinyawitwi kwa mibaira ya nkanyama ngamiya, mushunu kalitawiti lugoyi lwa lukuli na shiboga shakuwi shiweriti lwashi na wanjombi.
7 ౭ యోహాను, “నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను” అని ప్రకటించాడు.
Yohani kabweriti pakalonga, “Pa neni kankwiza muntu mkulu kuliku neni. Neni nfaa ndiri ata kuyopola lugoyi lwa vilwatu vyakuwi.
8 ౮ “నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు.
Neni nukubatizani kwa mashi, kumbiti yomberi hakawabatizani kwa Rohu Mnanagala.”
9 ౯ యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు.
Mashaka galii Yesu kiziti kulawa Nazareti lushi lwa Galilaya na kabatiziwitwi na Yohani mulushemba lwa Yoridani.
10 ౧౦ యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు.
Pala palii Yesu pakalawiti mumashi, kawona kumpindi kwa Mlungu kuvuguka na Rohu Mnanagala kamkangalira gambira ng'unda.
11 ౧౧ అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.”
Na liziwu lilawira kumpindi kwa Mlungu, lilonga, “Gwenga gwa Mwana gwangu yanukufira, gunfiriziya.”
12 ౧౨ వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు.
Pala palii Rohu Mnanagala kamlonguziyiti Yesu kushiwala.
13 ౧౩ ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.
Su kaweriti kushiwala aku mashaka malongu msheshi, pakajeresiwa na Shetani. Kalikaliti aku pamuhera na wankanyama wa kuntundu na wantumintumi wa kumpindi wamtenderiti.
14 ౧౪ యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ,
Yohani pawamtatiriti kala mushibetubetu, Yesu kagenditi lushi lwa Galilaya, kulii kanjiti kubwera Shisoweru Shiwagira sha Mlungu,
15 ౧౫ “కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు.
pakalonga, “Shipindi shiza! Ufalumi wa Mlungu wapakwegera. Mleki vidoda vyamtenda na mushijimiri Shisoweru Shiwagira!”
16 ౧౬ ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు.
Yesu kaweriti kankupita mumpeku mwa litanda lya Galilaya, kamwona Simoni na Andereya mlongu gwakuwi, womberi waweriti wankulowa wasomba.
17 ౧౭ యేసు, “నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని వారితో అన్నాడు.
Yesu kawagambira, “Munfati neni, hanuwafundi mwenga muweri walowa wantu.”
18 ౧౮ వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
Pala palii wazileka nyavu zyawu na wamfata.
19 ౧౯ ఆయన ఇంకా కొంతదూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు.
Yesu pakagenditi palongolu padidini, kawawoniti Yakobu na Yohani wana wa Zebedayu walivagiti mumtumbwi wankunyawa nyavu zyawu.
20 ౨౦ వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు.
Pala palii Yesu kawashema wamfati, womberi wamleka Zebedayu tati gwawu pamuhera na wantumintumi wakuwi mumtumbwi.
21 ౨౧ తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు.
Yesu na wantumintumi wakuwi wagenditi lushi lwa Kafarinaumu, palifikiti Lishaka lya Kwoyera Yesu kagenditi munumba ya Mlungu na kanja kufunda.
22 ౨౨ ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు.
Wantu yawampikaniriti Yesu walikangashiti nentu ntambu yakafunditi, toziya kafunditi ndiri gambira wafunda wawu wa Malagaliru ga Musa, kumbiti kafunditi gambira muntu yakawera na uwezu.
23 ౨౩ అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు.
Shipindi shilaa shilii kuweriti na muntu yakaweriti na washamshera Munumba ya Mlungu, yomberi kabotanga,
24 ౨౪ వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు.
“Yesu gwa Nazareti, gwana shishi na twenga? Shagwizira gutwagamiziyi? Neni nukumana kala kuwera gwenga gwa gaa, gwenga gwa Mnanagala gwa Mlungu.”
25 ౨౫ యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు.
Yesu kamkalipira shamshera ulii, “Umatu, gumwuki muntu ayu.”
26 ౨౬ ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది.
Shamshera kambegeziya nentu muntu ulii pakabotanga, shakapanu kamlekeziya.
27 ౨౭ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు.
Wantu woseri walikangashiti nentu na wanjiti kulikosiya, “Shishi ashi? Aga mafundu ga syayi yagawera na uwezu! Muntu ayu kawera na makakala ga kuwawinga washamshera na womberi wamjimira!”
28 ౨౮ ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.
Su visoweru vyakatenditi Yesu vipikinirika kanongola koseri mumkowa gwa Galilaya.
29 ౨౯ సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు.
Palaa palii pawalawiti Munumba ya Mlungu, womberi wagenditi pamuhera na Yakobu na Yohani mpaka ukaya kwa Simoni na Andereya.
30 ౩౦ సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు.
Pawasokiti palii, womberi wamgambiriti Yesu kuwera mikamwana gwa Simoni kapyupa kagonja mushitanda.
31 ౩౧ ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది.
Su Yesu kamgendera mlweri, kamkola liwoku na kumgolosiya, mawu ulii kawera mkomu na kanja kuwatelekera.
32 ౩౨ సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు.
Pamihi mshenji paguzyetiti, wantu wamjegera Yesu walweli woseri na walii yawaweriti na washamshera.
33 ౩౩ ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు.
Wantu woseri wa lushi lulii wajojinikiti paluwaga lwa numba.
34 ౩౪ రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
Yesu kawaponiziyiti wantu wavuwa yawaweriti na malweri ga kila ntambu. Viraa kawawingiti washamshera, kafiriti ndiri washamshera watakuli shintu shoseri toziya waweriti wankumumana.
35 ౩౫ ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు.
Shilawu yakuwi ligonugonu, Yesu kalawa kunja kwa lushi na kagenditi pahala pa gweka kumluwa Mlungu.
36 ౩౬ సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు.
Kumbiti Simoni na wayaguwi wagenditi kumsakula.
37 ౩౭ ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు.
Na pawamwoniti kala wamgambira, “Kila muntu kankukusakula!”
38 ౩౮ ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు.
Kumbiti Yesu kawankula, “Tugendeni pahala pamonga pa lushi zyaziwera pakwegera, su neni nwezi kubwera aku viraa toziya ashi ndo shashinjegiti kushitenda.”
39 ౩౯ ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
Su yomberi kagenda Mugalilaya kwoseri pakabwera mnumba za Mlungu na kuwawinga washamshera.
40 ౪౦ ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు.
Mungumbula yumu kamgenderiti Yesu kasuntumala na kamluwa, “Pagufira gumweni gumpungi neni.”
41 ౪౧ యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు.
Yesu kamwonera lusungu nentu, kamkola liwoku kalonga, “Neni nfira, gupungwi.”
42 ౪౨ వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు.
Palaa palii Muntu ungumbula umlekeziya.
43 ౪౩ ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి,
Shakapanu Yesu kambereziya muntu ulii, kamlekeziya kagendi zyakuwi
44 ౪౪ “నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు.
pakamgambira, “Nagumgambira muntu yoseri visoweru avi, kumbiti gugendi gwakaliranguziyi kwa mtambika gwa Numba ya Mlungu na gulaviyi malaviwu kwajili ya kupungwa kwaku gambira Musa ntambu yakalagaliriti kuwera ukapitawu kwa woseri kuwera guponiziwa.”
45 ౪౫ కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.
Kumbiti muntu ulii kagenda kanja kubwera visoweru vya kuponiziwa kwakuwi kwa kila yakamwona. Su Yesu kasinda kuliyonisiya mulushi lulii, yomberi kalikaliti pahala pa gweka. Pamuhera na hangu wantu waweriti wankumgendera yomberi kulawa wega zoseri.