< మార్కు 9 >
1 ౧ ఆయన వారితో, “నేను మీతో కచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం శక్తితో రావడం చూస్తారు. దానికంటే ముందు వారు మరణించరు” అని అన్నాడు.
and to say it/s/he amen to say you that/since: that to be one here the/this/who to stand who/which no not to taste death until if to perceive: see the/this/who kingdom the/this/who God to come/go in/on/among power
2 ౨ ఆరు రోజుల తరవాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ఏకాంతంగా ఒక ఎతైన కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు.
and with/after day six to take the/this/who Jesus the/this/who Peter and the/this/who James and the/this/who John and to carry up it/s/he toward mountain high according to one's own/private alone and to transform before it/s/he
3 ౩ ఆయన వస్త్రాలు ధగధగా మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి.
and the/this/who clothing it/s/he (to be *NK(o)*) to shine white greatly (as/when snow *K*) such as one who bleaches upon/to/against the/this/who earth: planet no be able (thus(-ly) *no*) to bleach
4 ౪ అప్పుడు ఏలీయా, మోషేలు అక్కడ ప్రత్యక్షమై యేసుతో మాటలాడడం శిష్యులు చూశారు.
and to appear it/s/he Elijah with Moses and to be to talk with the/this/who Jesus
5 ౫ పేతురు యేసుతో, “రబ్బీ! మనం ఇక్కడే ఉండడం మంచిది. మేము మూడు పాకలు వేస్తాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలీయాకి” అన్నాడు.
and to answer the/this/who Peter to say the/this/who Jesus Rabbi good to be me here to exist and to do/make: do Three tent you one and Moses one and Elijah one
6 ౬ తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు.
no for to perceive: know which? (to answer *N(k)(o)*) terrified for (to be *N(k)O*)
7 ౭ అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది. “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి.”
and to be cloud to overshadow it/s/he and (to be *N(k)O*) voice/sound: voice out from the/this/who cloud (to say *k*) this/he/she/it to be the/this/who son me the/this/who beloved to hear it/s/he
8 ౮ వెంటనే వారు తమ చుట్టూ చూశారు, యేసు తప్ప మరెవ్వరూ వారికి కనిపించలేదు.
and suddenly to look around no still none to perceive: see (but *NK(o)*) the/this/who Jesus alone with/after themself
9 ౯ వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి బతికే వరకూ మీరు చూసిన ఈ దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.
(and *no*) to come/go down (then *k*) it/s/he (out from *N(k)O*) the/this/who mountain to give orders it/s/he in order that/to nothing which to perceive: see to relate fully if: not not when(-ever) the/this/who son the/this/who a human out from dead to arise
10 ౧౦ అందువల్ల వారు ఆ విషయం తమలోనే దాచుకుని, “చనిపోయి తిరిగి బ్రతకడం” గురించి తమలో తాము చర్చించుకున్నారు.
and the/this/who word to grasp/seize to/with themself to debate which? to be the/this/who out from dead to arise
11 ౧౧ అప్పుడు వారు, “ఏలీయా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు అంటున్నారు?” అని ఆయనను అడిగారు.
and to question it/s/he to say that/since: that to say the/this/who scribe that/since: that Elijah be necessary to come/go first
12 ౧౨ యేసు జవాబు చెబుతూ, “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మనుష్య కుమారుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది?
the/this/who then (to answer *k*) (to assert *N(k)O*) it/s/he Elijah on the other hand to come/go first to restore all and how! to write upon/to/against the/this/who son the/this/who a human in order that/to much to suffer and be rejected
13 ౧౩ నేను మీతో చెప్పేదేమంటే, ఏలీయా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు” అన్నాడు.
but to say you that/since: that and Elijah to come/go and to do/make: do it/s/he just as/how much (to will/desire *N(k)O*) as/just as to write upon/to/against it/s/he
14 ౧౪ మిగిలిన శిష్యుల దగ్గరికి ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉండడం, కొందరు ధర్మశాస్త్ర పండితులు వారితో వాదిస్తుండడం చూశాడు.
and (to come/go *N(k)O*) to/with the/this/who disciple (to perceive: see *N(K)O*) crowd much about it/s/he and scribe to debate (to/with *no*) (it/s/he *N(k)O*)
15 ౧౫ ఆ ప్రజలు యేసును చూసిన వెంటనే ఆశ్చర్యానందానికి లోనయ్యారు. వారంతా ఆయన దగ్గరికి పరుగెత్తి వచ్చి ఆయనకు నమస్కరించారు.
and immediately all the/this/who crowd (to perceive: see *N(k)O*) it/s/he (be awe-struck *N(k)O*) and to hasten to pay respects to it/s/he
16 ౧౬ యేసు, “దేనిని గురించి వారితో వాదిస్తున్నారు?” అని వారిని అడిగాడు.
and to question (it/s/he *N(k)O*) (scribe *K*) which? to debate to/with (it/s/he *NK(O)*)
17 ౧౭ ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, “బోధకుడా! దయ్యం పట్టి మూగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకు వచ్చాను.
and (to answer *N(k)O*) (it/s/he *no*) one out from the/this/who crowd (to say *k*) teacher to bear/lead the/this/who son me to/with you to have/be spirit/breath: spirit mute
18 ౧౮ ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను. కాని, వారు చేయలేకపోయారు” అన్నాడు.
and where(-ever) (if *N(k)O*) it/s/he to grasp to throw violently it/s/he and to foam and to gnash the/this/who tooth (it/s/he *k*) and to dry and to say the/this/who disciple you in order that/to it/s/he to expel and no be strong
19 ౧౯ అందుకు యేసు, “విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎంత కాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకుని రండి” అన్నాడు.
the/this/who then to answer (it/s/he *N(K)O*) to say oh! generation unbelieving until when? to/with you to be until when? to endure you to bear/lead it/s/he to/with me
20 ౨౦ వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు.
and to bear/lead it/s/he to/with it/s/he and to perceive: see it/s/he the/this/who spirit/breath: spirit immediately (to convulse *N(k)O*) it/s/he and to collapse upon/to/against the/this/who earth: soil to wallow to foam
21 ౨౧ యేసు వాడి తండ్రితో, “ఇతనికి ఇది ఎంత కాలం నుండి ఉంది?” అని అడిగాడు. ఆ తండ్రి, “వాడి బాల్యం నుండి.
and to question the/this/who father it/s/he how much/many? time to be as/when this/he/she/it to be it/s/he the/this/who then to say (out from *no*) from childhood
22 ౨౨ ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు.
and often and toward (the/this/who *o*) fire it/s/he to throw: throw and toward water in order that/to to destroy it/s/he but if one be able to help me to pity upon/to/against me
23 ౨౩ యేసు అతనితో, “నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే” అన్నాడు.
the/this/who then Jesus to say it/s/he the/this/who if be able (to trust (in) *K*) all able the/this/who to trust (in)
24 ౨౪ వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, “నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి” అన్నాడు.
(and *ko*) immediately to cry the/this/who father the/this/who child (with/after teardrop *K*) to say to trust (in) (lord: God *K*) to help me the/this/who unbelief
25 ౨౫ యేసు జనసమూహం తన దగ్గరికి పరుగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, “మూగ చెవిటి దయ్యమా! ఇతనిలో నుండి బయటకు రా! ఇంకెప్పుడూ ఇతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు.
to perceive: see then the/this/who Jesus that/since: that to run together crowd to rebuke the/this/who spirit/breath: spirit the/this/who unclean to say it/s/he the/this/who mute and deaf/mute (the/this/who *k*) spirit/breath: spirit I/we to command you to go out out from it/s/he and never again to enter toward it/s/he
26 ౨౬ ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి, ఆ పిల్లవాణ్ణి విలవిలలాడించి అతనిలో నుండి బయటకు వచ్చింది. ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాలా మంది అతడు చనిపోయాడనుకున్నారు.
and (to cry *N(k)O*) and much (to convulse *N(k)O*) (it/s/he *k*) to go out and to be like/as/about dead so (the/this/who *no*) much to say that/since: that to die
27 ౨౭ కాని, యేసు అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు.
the/this/who then Jesus to grasp/seize the/this/who hand (it/s/he *N(k)O*) to arise it/s/he and to arise
28 ౨౮ యేసు ఇంట్లోకి వచ్చిన తరవాత ఇతరులెవ్వరూ లేనప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం?” అని అడిగారు.
and (to enter it/s/he *N(k)O*) toward house: home the/this/who disciple it/s/he according to one's own/private to question it/s/he that/since: that me no be able to expel it/s/he
29 ౨౯ ఆయన వారితో, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం” అని జవాబు చెప్పాడు.
and to say it/s/he this/he/she/it the/this/who family: kind in/on/among none be able to go out if: not not in/on/among prayer (and fasting *KO*)
30 ౩౦ వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ ప్రాంతం మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని యేసు ఆశించాడు.
and from there to go out (to pass by/through *NK(o)*) through/because of the/this/who Galilee and no to will/desire in order that/to one to know
31 ౩౧ ఆయన వాళ్లతో, “మనుష్య కుమారుణ్ణి శత్రువుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను చంపుతారు. మూడు రోజుల తరువాత ఆయన తిరిగి బతికి వస్తాడు” అని అన్నాడు.
to teach for the/this/who disciple it/s/he and to say it/s/he that/since: that the/this/who son the/this/who a human to deliver toward hand a human and to kill it/s/he and to kill (with/after Three *N(k)O*) (day *NK(o)*) to arise
32 ౩౨ కానీ యేసు చెప్పింది శిష్యులు గ్రహించలేదు. దాని గురించి యేసును అడగడానికి వారు భయపడ్డారు.
the/this/who then be ignorant the/this/who declaration and to fear it/s/he to question
33 ౩౩ వారు కపెర్నహూము చేరారు. అందరూ ఇంట్లో చేరాక యేసు వారితో, “దారిలో మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు?” అని అడిగాడు.
and (to come/go *N(K)O*) toward Capernaum and in/on/among the/this/who home to be to question it/s/he which? in/on/among the/this/who road (to/with themself *K*) to discuss
34 ౩౪ అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప, అని వాదించుకున్నారు.
the/this/who then be quiet to/with one another for to dispute in/on/among the/this/who road which? great
35 ౩౫ యేసు కూర్చుని పన్నెండు మందిని పిలిచి, “మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి” అని వారితో అన్నాడు.
and to seat to call the/this/who twelve and to say it/s/he if one to will/desire first to exist to be all last/least and all servant
36 ౩౬ అప్పుడాయన ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలబెట్టాడు. ఆ బిడ్డను ఎత్తుకుని ఇలా అన్నాడు,
and to take child to stand it/s/he in/on/among midst it/s/he and to embrace it/s/he to say it/s/he
37 ౩౭ “నా పేరిట ఇలాంటి చిన్నవారిలో ఒకరిని ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్టే. నన్ను స్వీకరించేవారు నన్ను కాదు, నన్ను పంపిన ఆయనను కూడా స్వీకరిస్తున్నారు.”
which (if *N(k)O*) one the/this/who such as this child to receive upon/to/against the/this/who name me I/we to receive and which (if *N(k)O*) I/we (to receive *N(k)O*) no I/we to receive but the/this/who to send me
38 ౩౮ యోహాను ఆయనతో, “బోధకా! ఒకడు నీ పేరట దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం. అతడు మనవాడు కాదు. అందువల్ల అతన్ని అడ్డగించాం” అన్నాడు.
(to assert *N(k)O*) (then *k*) it/s/he the/this/who John (to say *k*) teacher to perceive: see one (in/on/among *no*) the/this/who name you to expel demon (which no to follow me *KO*) and (to prevent *N(k)O*) it/s/he that/since: since no (to follow *N(k)O*) me
39 ౩౯ అయితే యేసు, “అతనిని ఆపకండి. నా పేరట అద్భుతం చేసే వాడెవడూ నా గురించి అంత తేలికగా చెడు మాట్లాడలేడు.
the/this/who then Jesus to say not to prevent it/s/he none for to be which to do/make: do power upon/to/against the/this/who name me and be able quickly to curse/revile me
40 ౪౦ మనకు వ్యతిరేకంగా లేని వాడు మన పక్షంగా ఉన్నవాడే.
which for no to be according to (me *N(K)O*) above/for (me *N(K)O*) to be
41 ౪౧ మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు క్రీస్తుకు చెందిన వారని గుర్తించి నా పేరట ఒక గిన్నెడు నీళ్ళు ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు.
which for if to water you cup water in/on/among (the/this/who *k*) name (me *k*) that/since: since Christ to be amen to say you (that/since: that *no*) no not (to destroy *NK(o)*) the/this/who wage it/s/he
42 ౪౨ “కాని, నన్ను నమ్ముకున్న ఇలాంటి ఒక చిన్నబిడ్డకి ఎవరైనా అడ్డుబండగా ఉంటే అతని మెడకు పెద్ద తిరగలి రాయి కట్టి, అతన్ని సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
and which (if *NK(o)*) to cause to stumble one the/this/who small this/he/she/it the/this/who to trust (in) toward I/we good to be it/s/he more: rather if to surround (millstone huge millstone *N(k)O*) about the/this/who neck it/s/he and to throw: throw toward the/this/who sea
43 ౪౩ మీరు పాపం చేయడానికి మీ చెయ్యి కారణమైతే దాన్ని నరికివేయండి! రెండు చేతులుండి, నరకంలోని ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు. (Geenna )
and if (to cause to stumble *NK(o)*) you the/this/who hand you to cut off it/s/he good to be (you *N(k)O*) crippled to enter toward the/this/who life or the/this/who two hand to have/be to go away toward the/this/who hell: Gehenna toward the/this/who fire the/this/who unquenchable (Geenna )
(where(-ever) the/this/who worm it/s/he no to decease and the/this/who fire no to extinguish *KO*)
45 ౪౫ ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళు ఉండి నరకంలో ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు. (Geenna )
and if the/this/who foot you to cause to stumble you to cut off it/s/he good to be (you *N(k)O*) to enter toward the/this/who life lame or the/this/who two foot to have/be to throw: throw toward the/this/who hell: Gehenna (toward the/this/who fire the/this/who unquenchable *KO*) (Geenna )
(where(-ever) the/this/who worm it/s/he no to decease and the/this/who fire no to extinguish *KO*)
47 ౪౭ అలాగే మీరు పాపం చేయడానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. రెండు కళ్ళు ఉండి నరకంలో పడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు. (Geenna )
and if the/this/who eye you to cause to stumble you to expel it/s/he good (you *N(k)O*) to be one-eyed to enter toward the/this/who kingdom the/this/who God or two eye to have/be to throw: throw toward the/this/who hell: Gehenna (the/this/who fire *K*) (Geenna )
48 ౪౮ నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ()
where(-ever) the/this/who worm it/s/he no to decease and the/this/who fire no to extinguish
49 ౪౯ ప్రతి ఒక్కరూ మంటల మూలంగా ఉప్పు సారం పొందుతారు.
all for fire to salt (and all sacrifice salt to salt *KO*)
50 ౫౦ ఉప్పు మంచిదే కాని దానిలో ఉన్న ఉప్పదనం పోతే ఆ స్వభావం తిరిగి ఎలా వస్తుంది? మీలో ఉప్పదనం కలిగి ఉండండి, ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండండి” అని చెప్పాడు.
good the/this/who salt if then the/this/who salt unsalty to be in/on/among which? it/s/he to season to have/be in/on/among themself (salt *N(k)O*) and be at peace in/on/among one another