< మార్కు 8 >

1 ఆ రోజుల్లో ఒకసారి పెద్ద జనసమూహం గుమిగూడారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోయింది. యేసు తన శిష్యులను పిలిచి,
တဒါ တတ္သမီပံ ဗဟဝေါ လောကာ အာယာတာ အတသ္တေၐာံ ဘောဇျဒြဝျာဘာဝါဒ် ယီၑုး ၑိၐျာနာဟူယ ဇဂါဒ, ၊
2 “ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది. వారు ఇప్పటికే మూడు రోజుల నుండి నా దగ్గర ఉన్నారు. తినడానికి వారి దగ్గర ఏమీ లేదు.
လောကနိဝဟေ မမ ကၖပါ ဇာယတေ တေ ဒိနတြယံ မယာ သာရ္ဒ္ဓံ သန္တိ တေၐာံ ဘောဇျံ ကိမပိ နာသ္တိ၊
3 వారిని ఇప్పుడు పంపివేస్తే వారిలో కొందరు చాలా దూరం నుండి వచ్చారుగనక దారిలో సొమ్మసిల్లి పోవచ్చు” అని అన్నాడు.
တေၐာံ မဓျေ'နေကေ ဒူရာဒ် အာဂတား, အဘုက္တေၐု တေၐု မယာ သွဂၖဟမဘိပြဟိတေၐု တေ ပထိ က္လမိၐျန္တိ၊
4 ఆయన శిష్యులు, “ఈ నిర్జన ప్రాంతంలో ఇంతమందికి సరిపడినంత ఆహారం ఎక్కడ నుండి తేగలం?” అన్నారు.
ၑိၐျာ အဝါဒိၐုး, ဧတာဝတော လောကာန် တရ္ပယိတုမ် အတြ ပြန္တရေ ပူပါန် ပြာပ္တုံ ကေန ၑကျတေ?
5 “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని ఆయన వారిని అడిగాడు. వారు, “ఏడు” అన్నారు.
တတး သ တာန် ပပြစ္ဆ ယုၐ္မာကံ ကတိ ပူပါး သန္တိ? တေ'ကထယန် သပ္တ၊
6 యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ ఏడు రొట్టెలను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని విరిచి శిష్యులకిచ్చి వారికి పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు.
တတး သ တာလ္လောကာန် ဘုဝိ သမုပဝေၐ္ဋုမ် အာဒိၑျ တာန် သပ္တ ပူပါန် ဓၖတွာ ဤၑွရဂုဏာန် အနုကီရ္တ္တယာမာသ, ဘံက္တွာ ပရိဝေၐယိတုံ ၑိၐျာန် ပြတိ ဒဒေါ်, တတသ္တေ လောကေဘျး ပရိဝေၐယာမာသုး၊
7 వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. యేసు వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని కూడా పంచమని శిష్యులకు ఇచ్చాడు.
တထာ တေၐာံ သမီပေ ယေ က္ၐုဒြမတ္သျာ အာသန် တာနပျာဒါယ ဤၑွရဂုဏာန် သံကီရ္တျ ပရိဝေၐယိတုမ် အာဒိၐ္ဋဝါန်၊
8 ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు.
တတော လောကာ ဘုက္တွာ တၖပ္တိံ ဂတာ အဝၑိၐ္ဋခါဒျဲး ပူရ္ဏား သပ္တဍလ္လကာ ဂၖဟီတာၑ္စ၊
9 తిన్నవారు సుమారు నాలుగు వేలమంది పురుషులు. యేసు వారిని పంపివేసి,
ဧတေ ဘောက္တာရး ပြာယၑ္စတုး သဟသြပုရုၐာ အာသန် တတး သ တာန် ဝိသသရ္ဇ၊
10 ౧౦ వెంటనే తన శిష్యులతో కలసి, పడవ ఎక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.
အထ သ ၑိၐျး သဟ နာဝမာရုဟျ ဒလ္မာနူထာသီမာမာဂတး၊
11 ౧౧ పరిసయ్యులు వచ్చి యేసుతో వాదించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడం కోసం తమకు ఆకాశం నుండి ఒక సూచన చూపమని అడిగారు.
တတး ပရံ ဖိရူၑိန အာဂတျ တေန သဟ ဝိဝဒမာနာသ္တသျ ပရီက္ၐာရ္ထမ် အာကာၑီယစိဟ္နံ ဒြၐ္ဋုံ ယာစိတဝန္တး၊
12 ౧౨ దానికి ఆయన ఆత్మలో పెద్దగా నిట్టూర్చి, “ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలను చూపమని అడుగుతున్నారు? మీతో కచ్చితంగా చెప్తున్నాను, ఈ తరానికి ఏ సూచనా చూపడం జరగదు” అని వారితో చెప్పాడు.
တဒါ သော'န္တရ္ဒီရ္ဃံ နိၑွသျာကထယတ်, ဧတေ ဝိဒျမာနနရား ကုတၑ္စိနှံ မၖဂယန္တေ? ယုၐ္မာနဟံ ယထာရ္ထံ ဗြဝီမိ လောကာနေတာန် ကိမပိ စိဟ္နံ န ဒရ္ၑယိၐျတေ၊
13 ౧౩ తరువాత ఆయన వారిని విడిచిపెట్టి, మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డు చేరుకున్నాడు.
အထ တာန် ဟိတွာ ပုန ရ္နာဝမ် အာရုဟျ ပါရမဂါတ်၊
14 ౧౪ శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర పడవలో ఒక రొట్టె తప్ప ఏమీ లేదు.
ဧတရှိ ၑိၐျဲး ပူပေၐု ဝိသ္မၖတေၐု နာဝိ တေၐာံ သန္နိဓော် ပူပ ဧကဧဝ သ္ထိတး၊
15 ౧౫ యేసు వారితో, “పరిసయ్యులకు, హేరోదుకు సంబంధించిన పొంగజేసే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి!” అన్నాడు.
တဒါနီံ ယီၑုသ္တာန် အာဒိၐ္ဋဝါန် ဖိရူၑိနာံ ဟေရောဒၑ္စ ကိဏွံ ပြတိ သတရ္ကား သာဝဓာနာၑ္စ ဘဝတ၊
16 ౧౬ శిష్యులు, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా?” అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
တတသ္တေ'နျောနျံ ဝိဝေစနံ ကရ္တုမ် အာရေဘိရေ, အသ္မာကံ သန္နိဓော် ပူပေါ နာသ္တီတိ ဟေတောရိဒံ ကထယတိ၊
17 ౧౭ అది కనిపెట్టి యేసు, “రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా?
တဒ် ဗုဒွွာ ယီၑုသ္တေဘျော'ကထယတ် ယုၐ္မာကံ သ္ထာနေ ပူပါဘာဝါတ် ကုတ ဣတ္ထံ ဝိတရ္ကယထ? ယူယံ ကိမဒျာပိ ကိမပိ န ဇာနီထ? ဗောဒ္ဓုဉ္စ န ၑက္နုထ? ယာဝဒဒျ ကိံ ယုၐ္မာကံ မနာံသိ ကဌိနာနိ သန္တိ?
18 ౧౮ మీరు కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు గుర్తు లేదా?
သတ္သု နေတြေၐု ကိံ န ပၑျထ? သတ္သု ကရ္ဏေၐု ကိံ န ၑၖဏုထ? န သ္မရထ စ?
19 ౧౯ ఐదు రొట్టెలు విరిచి ఐదు వేల మందికి నేను పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగాడు. వారు, “పన్నెండు” అని జవాబు చెప్పారు.
ယဒါဟံ ပဉ္စပူပါန် ပဉ္စသဟသြာဏာံ ပုရုၐာဏာံ မဓျေ ဘံက္တွာ ဒတ္တဝါန် တဒါနီံ ယူယမ် အဝၑိၐ္ဋပူပဲး ပူရ္ဏာန် ကတိ ဍလ္လကာန် ဂၖဟီတဝန္တး? တေ'ကထယန် ဒွါဒၑဍလ္လကာန်၊
20 ౨౦ “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగినప్పుడు వారు, “ఏడు” అని జవాబు చెప్పారు.
အပရဉ္စ ယဒါ စတုးသဟသြာဏာံ ပုရုၐာဏာံ မဓျေ ပူပါန် ဘံက္တွာဒဒါံ တဒါ ယူယမ် အတိရိက္တပူပါနာံ ကတိ ဍလ္လကာန် ဂၖဟီတဝန္တး? တေ ကထယာမာသုး သပ္တဍလ္လကာန်၊
21 ౨౧ ఆయన వారితో, “ఇంకా మీకు అర్థం కాలేదా?” అన్నాడు.
တဒါ သ ကထိတဝါန် တရှိ ယူယမ် အဓုနာပိ ကုတော ဗောဒွွုံ န ၑက္နုထ?
22 ౨౨ యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. కొందరు ఒక గుడ్డివాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు.
အနန္တရံ တသ္မိန် ဗဲတ္သဲဒါနဂရေ ပြာပ္တေ လောကာ အန္ဓမေကံ နရံ တတ္သမီပမာနီယ တံ သ္ပြၐ္ဋုံ တံ ပြာရ္ထယာဉ္စကြိရေ၊
23 ౨౩ యేసు ఆ గుడ్డివాడి చెయ్యి పట్టుకుని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి, అతని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనిపిస్తుందా?” అన్నాడు.
တဒါ တသျာန္ဓသျ ကရော် ဂၖဟီတွာ နဂရာဒ် ဗဟိရ္ဒေၑံ တံ နီတဝါန်; တန္နေတြေ နိၐ္ဌီဝံ ဒတ္တွာ တဒ္ဂါတြေ ဟသ္တာဝရ္ပယိတွာ တံ ပပြစ္ဆ, ကိမပိ ပၑျသိ?
24 ౨౪ ఆ గుడ్డివాడు పైకి చూస్తూ, “మనుషులు నడుస్తున్న చెట్ల లాగా కనిపిస్తున్నారు” అన్నాడు.
သ နေတြေ ဥန္မီလျ ဇဂါဒ, ဝၖက္ၐဝတ် မနုဇာန် ဂစ္ဆတော နိရီက္ၐေ၊
25 ౨౫ అప్పుడు ఆయన మళ్ళీ అతని కళ్ళపై తన చేతులుంచాడు. అప్పుడా మనిషి కళ్ళు తెరుచుకుని బాగుపడి అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడు.
တတော ယီၑုး ပုနသ္တသျ နယနယော ရှသ္တာဝရ္ပယိတွာ တသျ နေတြေ ဥန္မီလယာမာသ; တသ္မာတ် သ သွသ္ထော ဘူတွာ သ္ပၐ္ဋရူပံ သရွွလောကာန် ဒဒရ္ၑ၊
26 ౨౬ యేసు అతనిని పంపివేస్తూ, “నీవు ఊరిలోకి వెళ్ళవద్దు” అని అతనితో చెప్పాడు.
တတး ပရံ တွံ ဂြာမံ မာ ဂစ္ဆ ဂြာမသ္ထံ ကမပိ စ ကိမပျနုက္တွာ နိဇဂၖဟံ ယာဟီတျာဒိၑျ ယီၑုသ္တံ နိဇဂၖဟံ ပြဟိတဝါန်၊
27 ౨౭ యేసు ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరయ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? అని తన శిష్యులను అడిగాడు.
အနန္တရံ ၑိၐျဲး သဟိတော ယီၑုး ကဲသရီယာဖိလိပိပုရံ ဇဂါမ, ပထိ ဂစ္ဆန် တာနပၖစ္ဆတ် ကော'ဟမ် အတြ လောကား ကိံ ဝဒန္တိ?
28 ౨౮ అందుకు వారు, “బాప్తిసం ఇచ్చే యోహానని కొందరూ, ఏలీయా అని కొందరూ, ప్రవక్తల్లో ఒకడు అని కొందరూ అంటున్నారు” అని చెప్పారు.
တေ ပြတျူစုး တွာံ ယောဟနံ မဇ္ဇကံ ဝဒန္တိ ကိန္တု ကေပိ ကေပိ ဧလိယံ ဝဒန္တိ; အပရေ ကေပိ ကေပိ ဘဝိၐျဒွါဒိနာမ် ဧကော ဇန ဣတိ ဝဒန္တိ၊
29 ౨౯ “అయితే మీరు నేనెవరినని అనుకుంటున్నారు?” అని ఆయన వారిని అడిగాడు. దానికి జవాబుగా పేతురు, “నీవు అభిషిక్తుడివి!” అన్నాడు.
အထ သ တာနပၖစ္ဆတ် ကိန္တု ကောဟမ်? ဣတျတြ ယူယံ ကိံ ဝဒထ? တဒါ ပိတရး ပြတျဝဒတ် ဘဝါန် အဘိၐိက္တသ္တြာတာ၊
30 ౩౦ అప్పుడు ఆయన తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు.
တတး သ တာန် ဂါဎမာဒိၑဒ် ယူယံ မမ ကထာ ကသ္မဲစိဒပိ မာ ကထယတ၊
31 ౩౧ ఆ తరువాత యేసు వారితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు భరిస్తాడు. పెద్దలు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులచే ఆయన తృణీకారానికి గురై మరణమౌతాడు. ఆయన మూడు రోజుల తరువాత సజీవంగా బ్రతికి వస్తాడు.”
မနုၐျပုတြေဏာဝၑျံ ဗဟဝေါ ယာတနာ ဘောက္တဝျား ပြာစီနလောကဲး ပြဓာနယာဇကဲရဓျာပကဲၑ္စ သ နိန္ဒိတး သန် ဃာတယိၐျတေ တၖတီယဒိနေ ဥတ္ထာသျတိ စ, ယီၑုး ၑိၐျာနုပဒေၐ္ဋုမာရဘျ ကထာမိမာံ သ္ပၐ္ဋမာစၐ္ဋ၊
32 ౩౨ యేసు ఈ విషయం చాలా స్పష్టంగానే చెప్పాడు. అయితే పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, పక్కకు తీసుకు వెళ్ళి ఆయనను మందలించ సాగాడు.
တသ္မာတ် ပိတရသ္တသျ ဟသ္တော် ဓၖတွာ တံ တရ္ဇ္ဇိတဝါန်၊
33 ౩౩ కాని యేసు వెనక్కి తిరిగి తన శిష్యులను చూసి పేతురుతో, “సైతానూ! నా వెనక్కి పో! మనుషుల సంగతుల పైనే గాని దేవుని సంగతుల మీద నీకు మనసు లేదు” అని గద్దించాడు.
ကိန္တု သ မုခံ ပရာဝရ္တျ ၑိၐျဂဏံ နိရီက္ၐျ ပိတရံ တရ္ဇယိတွာဝါဒီဒ် ဒူရီဘဝ ဝိဃ္နကာရိန် ဤၑွရီယကာရျျာဒပိ မနုၐျကာရျျံ တုဘျံ ရောစတတရာံ၊
34 ౩౪ తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని, తన సిలువను మోసుకుంటూ నాతో నడవాలి.
အထ သ လောကာန် ၑိၐျာံၑ္စာဟူယ ဇဂါဒ ယး ကၑ္စိန် မာမနုဂန္တုမ် ဣစ္ဆတိ သ အာတ္မာနံ ဒါမျတု, သွကြုၑံ ဂၖဟီတွာ မတ္ပၑ္စာဒ် အာယာတု၊
35 ౩౫ ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు.
ယတော ယး ကၑ္စိတ် သွပြာဏံ ရက္ၐိတုမိစ္ဆတိ သ တံ ဟာရယိၐျတိ, ကိန္တု ယး ကၑ္စိန် မဒရ္ထံ သုသံဝါဒါရ္ထဉ္စ ပြာဏံ ဟာရယတိ သ တံ ရက္ၐိၐျတိ၊
36 ౩౬ ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం?
အပရဉ္စ မနုဇး သရွွံ ဇဂတ် ပြာပျ ယဒိ သွပြာဏံ ဟာရယတိ တရှိ တသျ ကော လာဘး?
37 ౩౭ ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు?
နရး သွပြာဏဝိနိမယေန ကိံ ဒါတုံ ၑက္နောတိ?
38 ౩౮ వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”
ဧတေၐာံ ဝျဘိစာရိဏာံ ပါပိနာဉ္စ လောကာနာံ သာက္ၐာဒ် ယဒိ ကောပိ မာံ မတ္ကထာဉ္စ လဇ္ဇာသ္ပဒံ ဇာနာတိ တရှိ မနုဇပုတြော ယဒါ ဓရ္မ္မဒူတဲး သဟ ပိတုး ပြဘာဝေဏာဂမိၐျတိ တဒါ သောပိ တံ လဇ္ဇာသ္ပဒံ ဇ္ဉာသျတိ၊

< మార్కు 8 >