< మార్కు 8 >
1 ౧ ఆ రోజుల్లో ఒకసారి పెద్ద జనసమూహం గుమిగూడారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోయింది. యేసు తన శిష్యులను పిలిచి,
I de samme dager, da det atter var meget folk, og de ikke hadde noget å ete, kalte han sine disipler til sig og sa til dem:
2 ౨ “ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది. వారు ఇప్పటికే మూడు రోజుల నుండి నా దగ్గర ఉన్నారు. తినడానికి వారి దగ్గర ఏమీ లేదు.
Jeg ynkes inderlig over folket; for de har alt vært hos mig i tre dager, og de har ikke noget å ete;
3 ౩ వారిని ఇప్పుడు పంపివేస్తే వారిలో కొందరు చాలా దూరం నుండి వచ్చారుగనక దారిలో సొమ్మసిల్లి పోవచ్చు” అని అన్నాడు.
og lar jeg dem fare fastende hjem, vil de vansmekte på veien; nogen av dem er jo kommet langveisfra.
4 ౪ ఆయన శిష్యులు, “ఈ నిర్జన ప్రాంతంలో ఇంతమందికి సరిపడినంత ఆహారం ఎక్కడ నుండి తేగలం?” అన్నారు.
Og hans disipler svarte ham: Hvorfra kan nogen få brød nok til å mette disse her i ørkenen?
5 ౫ “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని ఆయన వారిని అడిగాడు. వారు, “ఏడు” అన్నారు.
Og han spurte dem: Hvor mange brød har I? De sa: Syv.
6 ౬ యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ ఏడు రొట్టెలను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని విరిచి శిష్యులకిచ్చి వారికి పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు.
Da bød han folket sette sig ned på jorden, og han tok de syv brød, takket og brøt dem og gav dem til sine disipler, forat de skulde dele dem ut; og de delte ut til folket.
7 ౭ వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. యేసు వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని కూడా పంచమని శిష్యులకు ఇచ్చాడు.
Og de hadde nogen få småfisker, og han velsignet dem og bød at også de skulde deles ut.
8 ౮ ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు.
Og de åt og blev mette; og de tok op det som blev tilovers av stykkene, syv kurver.
9 ౯ తిన్నవారు సుమారు నాలుగు వేలమంది పురుషులు. యేసు వారిని పంపివేసి,
Men de var omkring fire tusen. Og han lot dem fare.
10 ౧౦ వెంటనే తన శిష్యులతో కలసి, పడవ ఎక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.
Og straks gikk han ut i båten med sine disipler, og kom til landet ved Dalmanuta.
11 ౧౧ పరిసయ్యులు వచ్చి యేసుతో వాదించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడం కోసం తమకు ఆకాశం నుండి ఒక సూచన చూపమని అడిగారు.
Og fariseerne kom der ut og begynte å tviste med ham, idet de krevde et tegn fra himmelen av ham for å friste ham.
12 ౧౨ దానికి ఆయన ఆత్మలో పెద్దగా నిట్టూర్చి, “ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలను చూపమని అడుగుతున్నారు? మీతో కచ్చితంగా చెప్తున్నాను, ఈ తరానికి ఏ సూచనా చూపడం జరగదు” అని వారితో చెప్పాడు.
Og han sukket i sin ånd og sa: Hvorfor krever denne slekt tegn? Sannelig sier jeg eder: Ikke skal det gis denne slekt noget tegn.
13 ౧౩ తరువాత ఆయన వారిని విడిచిపెట్టి, మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డు చేరుకున్నాడు.
Og han forlot dem og gikk atter i båten, og fór over til hin side.
14 ౧౪ శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర పడవలో ఒక రొట్టె తప్ప ఏమీ లేదు.
Og de hadde glemt å ta brød med, og hadde ikke mere enn et eneste brød med sig i båten.
15 ౧౫ యేసు వారితో, “పరిసయ్యులకు, హేరోదుకు సంబంధించిన పొంగజేసే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి!” అన్నాడు.
Og han bød dem: Se eder for, ta eder i vare for fariseernes surdeig og for Herodes' surdeig!
16 ౧౬ శిష్యులు, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా?” అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
Og de talte sig imellem: Det er fordi vi ikke har brød med.
17 ౧౭ అది కనిపెట్టి యేసు, “రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా?
Og da han merket det, sa han til dem: Hvorfor taler I med hverandre om at I ikke har brød med? Skjønner og forstår I ennu ikke? Er eders hjerte forherdet?
18 ౧౮ మీరు కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు గుర్తు లేదా?
Har I øine og ser ikke, har I ører og hører ikke? Kommer I ikke i hu
19 ౧౯ ఐదు రొట్టెలు విరిచి ఐదు వేల మందికి నేను పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగాడు. వారు, “పన్నెండు” అని జవాబు చెప్పారు.
da jeg brøt de fem brød til de fem tusen, hvor mange kurver fulle av stykker I da tok op? De sa til ham: Tolv.
20 ౨౦ “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగినప్పుడు వారు, “ఏడు” అని జవాబు చెప్పారు.
Og da jeg brøt de syv til de fire tusen, hvor mange kurver fulle av stykker tok I da op? De sa: Syv.
21 ౨౧ ఆయన వారితో, “ఇంకా మీకు అర్థం కాలేదా?” అన్నాడు.
Og han sa til dem: Hvorledes går det da til at I ennu ikke forstår?
22 ౨౨ యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. కొందరు ఒక గుడ్డివాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు.
Og de kom til Betsaida. Og de førte en blind til ham og bad ham røre ved ham.
23 ౨౩ యేసు ఆ గుడ్డివాడి చెయ్యి పట్టుకుని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి, అతని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనిపిస్తుందా?” అన్నాడు.
Og han tok den blinde ved hånden og førte ham utenfor byen, og han spyttet i hans øine og la sine hender på ham, og spurte ham om han så noget.
24 ౨౪ ఆ గుడ్డివాడు పైకి చూస్తూ, “మనుషులు నడుస్తున్న చెట్ల లాగా కనిపిస్తున్నారు” అన్నాడు.
Og han så op og sa: Jeg kan se mennesker; for jeg ser folk gå omkring likesom trær.
25 ౨౫ అప్పుడు ఆయన మళ్ళీ అతని కళ్ళపై తన చేతులుంచాడు. అప్పుడా మనిషి కళ్ళు తెరుచుకుని బాగుపడి అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడు.
Så la han atter sine hender på hans øine, og han så klart, og han blev helbredet og kunde se alt tydelig på frastand.
26 ౨౬ యేసు అతనిని పంపివేస్తూ, “నీవు ఊరిలోకి వెళ్ళవద్దు” అని అతనితో చెప్పాడు.
Og han sendte ham hjem til hans hus og sa: Du skal ikke gå inn i byen eller si det til nogen i byen.
27 ౨౭ యేసు ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరయ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? అని తన శిష్యులను అడిగాడు.
Og Jesus og hans disipler gikk ut til byene omkring Cesarea Filippi; og på veien spurte han sine disipler og sa til dem: Hvem sier folk at jeg er?
28 ౨౮ అందుకు వారు, “బాప్తిసం ఇచ్చే యోహానని కొందరూ, ఏలీయా అని కొందరూ, ప్రవక్తల్లో ఒకడు అని కొందరూ అంటున్నారు” అని చెప్పారు.
De svarte ham: Nogen sier døperen Johannes, og andre Elias, andre igjen en av profetene.
29 ౨౯ “అయితే మీరు నేనెవరినని అనుకుంటున్నారు?” అని ఆయన వారిని అడిగాడు. దానికి జవాబుగా పేతురు, “నీవు అభిషిక్తుడివి!” అన్నాడు.
Og han spurte dem: Men I, hvem sier I at jeg er? Peter svarte og sa til ham: Du er Messias.
30 ౩౦ అప్పుడు ఆయన తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు.
Og han bød dem strengt at de ikke skulde si dette om ham til nogen.
31 ౩౧ ఆ తరువాత యేసు వారితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు భరిస్తాడు. పెద్దలు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులచే ఆయన తృణీకారానికి గురై మరణమౌతాడు. ఆయన మూడు రోజుల తరువాత సజీవంగా బ్రతికి వస్తాడు.”
Og han begynte å lære dem at Menneskesønnen skulde lide meget og forkastes av de eldste og yppersteprestene og de skriftlærde og ihjelslåes og opstå tre dager efter.
32 ౩౨ యేసు ఈ విషయం చాలా స్పష్టంగానే చెప్పాడు. అయితే పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, పక్కకు తీసుకు వెళ్ళి ఆయనను మందలించ సాగాడు.
Og han talte rent ut om det. Da tok Peter ham til side og begynte å irettesette ham.
33 ౩౩ కాని యేసు వెనక్కి తిరిగి తన శిష్యులను చూసి పేతురుతో, “సైతానూ! నా వెనక్కి పో! మనుషుల సంగతుల పైనే గాని దేవుని సంగతుల మీద నీకు మనసు లేదు” అని గద్దించాడు.
Men han vendte sig om og så på sine disipler og irettesatte Peter og sa: Vik bak mig, Satan! for du har ikke sans for det som hører Gud til, men bare for det som hører menneskene til.
34 ౩౪ తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని, తన సిలువను మోసుకుంటూ నాతో నడవాలి.
Og han kalte folket til sig tillikemed sine disipler og sa til dem: Den som vil følge efter mig, han må fornekte sig selv og ta sitt kors op og følge mig.
35 ౩౫ ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు.
For den som vil berge sitt liv, skal miste det; men den som mister sitt liv for min skyld og for evangeliets skyld, han skal berge det.
36 ౩౬ ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం?
For hvad gagner det et menneske om han vinner den hele verden og tar skade på sin sjel?
37 ౩౭ ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు?
For hvad kan vel et menneske gi til vederlag for sin sjel?
38 ౩౮ వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”
For den som skammer sig ved mig og mine ord i denne utro og syndige slekt, ham skal også Menneskesønnen skamme sig ved når han kommer i sin Faders herlighet med de hellige engler.