< మార్కు 6 >
1 ౧ యేసు అక్కడ నుండి తన శిష్యులతో కలసి తన స్వగ్రామానికి వచ్చాడు
Pwu akhahege ukhuluta khujini gwa miave, avakhongi va mwene vakhenkonga.
2 ౨ విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఉపదేశించడం మొదలు పెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. “ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు! ఇతని చేతుల ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి?
Vuyefihe e Sabato, akhatengula ukhumanyisya mu sinagogi. Avanu vingi vakhampulekhe nu khudega. Vakhata, “Akavile ndahu ulumanyisyo alo?” Luhala lukhi ulwapevilwe?” Ivomba ndekhehi aga khu monokhoga mwene?”
3 ౩ ఇతడు వడ్రంగి కదూ! మరియ కొడుకు కదూ! యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇతడు అన్న కదూ! ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు కదా!” అని చెప్పుకుంటూ ఆయన విషయంలో చాలా అభ్యంతరపడ్డారు.
Oyo si ve ola u Selemala, nswambe va Mariamu na lokhololwe lwa va Yakobo, Yose, Yuta nu Simioni? Na vakhenchavevitama pakhapa nufwe?” Yavakhovoswe nu Yiisu.
4 ౪ యేసు వారితో, “ప్రవక్తకు తన సొంత ఊరిలో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప అన్ని చోట్లా గౌరవం లభిస్తుంది” అని అన్నాడు.
U Yiisu akhavavola, “Unyamalagosi dwadiwa, apange mjini gwa mwene na valokhololwe ava mbunchenge vwa mwene.”
5 ౫ అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద తన చేతులుంచి వారిని బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలూ చేయలేకపోయాడు.
Pwu sakhavomba inchakhudeega apo, akhavavekhela ifivokho avatamu vadebe vakhepona.
6 ౬ వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు.
Akhaswiga ulwa khuva savalekhwedekhe. Pwu akhavigendela ifijiji fya pawipi nu khumanyisya.
7 ౭ యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.
Akhavelanga avakongi kumi ne mbili akhatengula ukhuvasukha vavele vavele. Akhavapa ululagelo khu mepo imbivi,
8 ౮ “ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకు వెళ్ళకండి. ఆహారం గాని, చేతి సంచిగాని, నడికట్టులో డబ్బుగాని, తీసుకు వెళ్ళకండి.
Nu khuvalagela wasite ukhugega ekhe nu khyokhyoni vuvilula vagegage ingoma njene. Vasite ukhugega unkate, umpakho ni ndalama mufipakho;
9 ౯ చెప్పులు వేసుకోండి గాని, మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి.
Pwu vafyale ifikato, vasite ukhuva na magwanda gavele.
10 ౧౦ ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకూ ఆ ఇంట్లోనే ఉండండి.
Akhavavola, “Uvenjenge vwuwoni umuyakheva mukhwingela, mtamage apo mpakha vu mwikhega.
11 ౧౧ ఏ గ్రామం వారైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి వ్యతిరేక సాక్షంగా మీ పాద ధూళిని దులిపి వేయండి.”
Nu njini gyogyoni gugwa sakhuhovupilela ama nkhuvapulekhencha, mukhegege khuvene, mwekhuhune ulundukhulu lwa mmalunde genyo, kheve kheme nyekhelo khuvene.”
12 ౧౨ శిష్యులు వెళ్ళి ‘పశ్చాత్తాప పడండి’ అంటూ ప్రకటించారు.
Na vene vakhaluta nu khulumbelela avanu ukhuuta nu ukhunchilekha imbivi incha vene.
13 ౧౩ ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు.
Vakhavaswema imepo imbivi nu khuvabakha imono avatamu vakhapona.
14 ౧౪ యేసు పేరు ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి హేరోదు రాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని కొందరు అన్నారు.
Untwa u Herode vuapolikhe ago, ulwa khuva elitawa lya Yiisu levile lemanyekhikhe. Avange vakhata, “Yohani unyalyoncho anchokhile, amakhe ni fikhwani fivomba imbombo mu mwene.”
15 ౧౫ ఇతరులు, “ఈయన ఏలీయా” అన్నారు. ఇంకొందరు, “పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్త” అన్నారు.
Avange vakhata, “Oyo ve Eliya, “Nu avange vakhata, “Oyo ve nyamalago, alepaninie na vanyamalago avakhetale.”
16 ౧౬ కాని, హేరోదైతే, “నేను తల నరికించిన యోహాను మళ్ళీ బతికి వచ్చాడు” అన్నాడు.
Pwu u Herode vu apulikhe aga akhata, “Yohani, yoywa nagedile untwe anchokhile.”
17 ౧౭ ఇంతకు ముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. తాను వివాహం చేసుకున్న హేరోదియ కారణంగా అతడు ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య.
Ulwa khuva Herode yoywa alagile u Yohani ibatwe nu khukungwa khwa Herodia (udala va mbakhave va Filipo) ulwa khuva umene antolile ukhuva idala.
18 ౧౮ ఎందుకంటే యోహాను హేరోదుతో, “నీ సోదరుని భార్యను తెచ్చుకోవడం అన్యాయం” అని హెచ్చరించాడు.
Ulwa khuva u Yohani ambolile u Herode, “Lu vivi ukhuntola udala va mbakhavo.”
19 ౧౯ అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది కానీ అలా చెయ్యలేకపోయింది.
Pwu u Herode akhatengula ukhukalalela alekhulonda ukhumbuda, akhalemwa,
20 ౨౦ ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడేవాడు. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.
U Herode alekhundwadwa u Yohani; alomanyile ukhuta va ye lweli munu mbalanche, pwu akhandekhe. Vwu ipikhompole khencha akhavanulususuvalo, akhahovoha ukhumpole hencha.
21 ౨౧ ఒక రోజు హేరోదియకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సైన్యాధిపతులను, గలిలయలోని గొప్పవారిని పిలిచి తన పుట్టిన రోజు విందు చేశాడు.
Vwu gufikhe unsekhe vwu lekhegelile elinchuva lya khololiwa u Herode ahavandalela avakhongi va mwene, avasikhali, na valongonchi va Galileya.
22 ౨౨ హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధులను మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, “నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు.
Pwu umaleve va Herodia akhingela pakhonema, akhang'ovosya u Herode na vagenji avalepakhulya lyakhemihe pwu u herodeakhambula umwaleve, “Udove kyokyoni ikhevwunongwa une yanikhuhupa.”
23 ౨౩ “నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నా రాజ్యంలో సగమైనా సరే!” అని ప్రమాణం చేశాడు.
Akhadyega ukhuta, khyokyoni khekyo yavudova, yanikhuhupa, ndageve nusu ya indeva lwango.”
24 ౨౪ ఆమె బయటకి వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది. ఆమె, “బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో” అని చెప్పింది.
Akhahoma khunji akhavoncha khwa vanina, “Nedove ekhehi?” Akhata, “Untwe ugwa Yohani.”
25 ౨౫ వెంటనే ఆమె రాజు దగ్గరికి త్వరగా వెళ్ళి, “బాప్తిసం ఇచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే” అని అడిగింది.
Unsekhe gugwa akhingila khwa nkuludeva akhatengula ukhunchova, “Ninogwa umemu sakhani, untwe gwa Yohani.”
26 ౨౬ రాజుకు చాలా దుఃఖం కలిగింది గాని, తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేక పోయాడు.
Unkuludeva akhasususvala, ulwakhuva aedyegile pavageni, akhalemwa nkhubelela ekheadovile.
27 ౨౭ అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకు రమ్మని ఆజ్ఞాపించి భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి
Pwu unkuludeva akahasuha avasikhali va mwene akhavalagela ukhuluta ukhugegela umtwe gwa Yohani. Pwu usikhali akhalota khwigeda untwe mumbokongwa.
28 ౨౮ దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి, తీసుకు వచ్చి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది.
Akhagega untwe gwa Yohani mu sakhani akhampa umwana, umwana akhampa uvanina.
29 ౨౯ యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి అతని శవాన్ని తీసుకుపోయి సమాధి చేశారు.
Avakhongi va mwene vuvapulikhe ago, vakhaluta khuhogotola ufimba gwa mwene vakhaluta khusyila hulipumba.
30 ౩౦ అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు.
Avasukhiwa vakhalundamano popaninie khuvolongolo khwa Yiisu, vakhambula goni agavavombile nu khuvamanyisya.
31 ౩౧ వారి దగ్గరికి అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, “నాతో మీరు మాత్రమే ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి, కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.
Pwu akhavavola, “Mwinchange pavotitu tugatalukhe padebe.” Avanu vingi valekhwincha nu khuhega savakhava nu unsekhe ugwa khulavukha.
32 ౩౨ అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు.
Pwu vakhatoga mu mbwato vakhaluta pavutitu vakhava vene.
33 ౩౩ అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను గుర్తుపట్టి వివిధ గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు.
Vakhavavona vuvikhaga, vakhavamanya pupaninie vakhanyila ulwamalonde vakhavatalela ukhunchifikha.
34 ౩౪ పడవలో యేసు అక్కడికి చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించ సాగాడు.
Vuvafikhe khu mbwani, akhavavona ava lulundamano akhavakolela ekhesa, ulwa khuva vale ndi ng'osi imbula ndoleli. Akhatengula ukhuvamanyisya imbombo inyingi.
35 ౩౫ చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది.
Emisekhe vugelulile, avakhongi vakhakonga vakhata, “Apa pale pavutitu nu usekhe gulutile.
36 ౩౬ ఈ ప్రజలకు తినడానికి ఏమీ లేదు కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివెయ్యి” అన్నారు.
Welage valute khunji ni vijiji vakhagule ekyakhulya.”
37 ౩౭ అయితే యేసు వారితో, “మీరే వారికి ఆహారం పెట్టండి!” అన్నాడు. అందుకు వారు ఆయనతో, “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, వారికి పంచి పెట్టమంటావా” అని ఆయనను అడిగారు.
Pwu akhavanda akhata, “Muvape umwe ekyakhulya.” Vakhambola, “Tuwesye ukhuluta khwigula imikate igya dinari mia mbili nu khuvapa valye?”
38 ౩౮ ఆయన వారితో “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి” అన్నాడు. వారు వెళ్ళి చూసి, “ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి” అని అన్నారు.
Akhavavola, “Mle nemikate gelengi? Luta mukhalole.” Vovapatile vakhambola, “Emikate gekhano ni somba ivele.”
39 ౩౯ అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు.
Akhavalagela avanu vatame mu fipuga mu manyasi amigu.
40 ౪౦ ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు.
Vakhavatamekha mu fipuga; mu fipuga fya mamia khu hamsini.
41 ౪౧ యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు.
Pwu akhatola emikhate gekhano ni somba ivele, pwu akhalolakhukyanya akhagesaya, pwu akhavapa avakongi vavekhe mbulongolo pa lulundamano. Pwu akhagava isomba ivele khu vanu voni.
42 ౪౨ అందరూ తిని సంతృప్తి చెందారు.
Vakhalya voni vakhakwila.
43 ౪౩ శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.
Vakhalundania imikate emimenyule egesigile, vikhadega ifitondu kumi na mbili, ni somba inchi menyuliwe.
44 ౪౪ ఆ రోజు అక్కడ రొట్టెలు తిన్న పురుషులు ఐదు వేల మంది.
Vale avagosi elfu tano avalile emikate.
45 ౪౫ ఆ తరువాత యేసు తన శిష్యులను తనకన్నా ముందు బేత్సయిదాకు వెళ్ళమని చెప్పి వారిని పడవ ఎక్కించాడు.
Pwu akhavavola ukhuta vatoge mu mbwato valote khuvunge, vakhaluta khuabethsaida, vu ikhelaga nu vanya lulundamano.
46 ౪౬ జనసమూహాన్ని పంపివేసిన తరువాత ఆయన ప్రార్థించడానికి కొండకు వెళ్ళాడు.
avuvakhegile, akhaluta khukyomba khudova.
47 ౪౭ చీకటి పడుతూ ఉన్న సమయంలో శిష్యులు ఉన్న పడవ సముద్రం మధ్యలో ఉంది. యేసు మాత్రమే ఒడ్డున ఉన్నాడు.
vuyevile lyakhemile, uwato vwu vulepagati mu nyanja, umwene ale mwene khumwambo.
48 ౪౮ ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా,
Akhavavova vovigatanchiwa mu mbwato ulwa khuva imepo nchilikhuvasiga, vuvulepakhwikya akhavalotela, alekhugenda nkyanya munyanja, akhonogwa ukhulutaniche.
49 ౪౯ ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు.
Pwu vuvambwene igenda nkyanya mu magasi, vakhava nuludwadwa vakhata pamo misyokha pwu vakhaywega.
50 ౫౦ వెంటనే యేసు వారితో, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు.
Ulwa khuva vambwene vakhava nululundamano. Pwu akhanchova akhavavola, “Muve vakhangafu! Nene! Msite ukhudwada.”
51 ౫౧ ఆయన వారి దగ్గరికి వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు తమలో తాము ఆశ్చర్యపడుతూ అమితంగా విభ్రాంతి చెందారు.
Akhingela mu mbwaro, imepo yekhelekhelwa unkhuluguto, pwu vakhadega lweli.
52 ౫౨ ఎందుకంటే రొట్టెలు పంచిన అద్భుతాన్ని వారు చూశారు కాని, వారి హృదయం బండబారి పోయింది కాబట్టి రొట్టెలను గురించిన సంగతి వారు గ్రహించలేదు.
Pwu vakhava saveliwe elimenyu lya mikate. Ulwa khuva inyala nchavene nchale ndebe.
53 ౫౩ వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరి అక్కడ పడవ నిలిపారు.
Vovalowikhe khumwambo, vakhafikha ekhelunga ekhya Genesareti pwu uwato vakhema.
54 ౫౪ వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు.
Vovakhomile khunji khuwato, pwu vakhamanya.
55 ౫౫ ప్రజలు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు పరుగెత్తుకుంటూ వెళ్ళి రోగులను మంచాల మీద ఉంచి ఆయన ఉన్న చోటికి తీసుకు వచ్చారు.
Vakhanyila khulumbelela mu khelunga vakhatengula ukhuvagega avatamu mu fisanja, khela vuvapulikhe ukhuta ikhwincha.
56 ౫౬ యేసు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఏ పల్లెలో ప్రవేశించినా వారు రోగులను వీధుల్లో పడుకోబెట్టి, ఆయన వస్త్రాన్నయినా తాకనియ్యమని ఆయనను బతిమాలారు. ఆయనను తాకిన వారంతా బాగుపడ్డారు.
Popone opoaingile mu vijiji, ana mijini, amamukhelunga vakhavavekha avatamu upovigonchekhecha, vakhadova edekhe ukhwibata eligwanda lya mwene. Voni vavo vamwibite vakhapona.