< మార్కు 4 >

1 మరొకసారి ఆయన సముద్రం ఒడ్డున ఉపదేశించడం ప్రారంభించాడు. ఆయన చుట్టూ చాలా మంది ప్రజలు ఉండడం వల్ల, ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు.
anantaraṁ sa samudrataṭe punarupadeṣṭuṁ prārebhe, tatastatra bahujanānāṁ samāgamāt sa sāgaropari naukāmāruhya samupaviṣṭaḥ; sarvve lokāḥ samudrakūle tasthuḥ|
2 ఆయన ఉదాహరణల సహాయంతో అనేక విషయాలు వారికి బోధించాడు. ఆయన వారితో ఇలా అన్నాడు.
tadā sa dṛṣṭāntakathābhi rbahūpadiṣṭavān upadiśaṁśca kathitavān,
3 “వినండి! ఒక రైతు విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు.
avadhānaṁ kuruta, eko bījavaptā bījāni vaptuṁ gataḥ;
4 విత్తనాలు చల్లుతూ ఉండగా, కొన్ని దారి పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినేశాయి.
vapanakāle kiyanti bījāni mārgapāśve patitāni, tata ākāśīyapakṣiṇa etya tāni cakhāduḥ|
5 మరికొన్ని విత్తనాలు, మట్టి ఎక్కువగా లేని రాతినేల మీద పడ్డాయి. అవి త్వరగానే మొలకెత్తాయి.
kiyanti bījāni svalpamṛttikāvatpāṣāṇabhūmau patitāni tāni mṛdolpatvāt śīghramaṅkuritāni;
6 కాని వాటి వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోయాయి.
kintūdite sūryye dagdhāni tathā mūlāno nādhogatatvāt śuṣkāṇi ca|
7 ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ఆ ముళ్ళ తుప్పలు పెరిగి మొక్కలను అణచి వేయడం వల్ల అవి పంటకు రాలేదు.
kiyanti bījāni kaṇṭakivanamadhye patitāni tataḥ kaṇṭakāni saṁvṛdvya tāni jagrasustāni na ca phalitāni|
8 మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి ముప్ఫై రెట్లు, అరవై రెట్లు, వంద రెట్లు పండి కోతకు వచ్చాయి.”
tathā kiyanti bījānyuttamabhūmau patitāni tāni saṁvṛdvya phalānyutpāditāni kiyanti bījāni triṁśadguṇāni kiyanti ṣaṣṭiguṇāni kiyanti śataguṇāni phalāni phalitavanti|
9 యేసు ఇలా చెప్పి, “వినడానికి చెవులు ఉన్నవాడు వినుగాక” అన్నాడు.
atha sa tānavadat yasya śrotuṁ karṇau staḥ sa śṛṇotu|
10 ౧౦ తరువాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు, ఆయన సన్నిహితులు కొందరు ఆ ఉదాహరణల గురించి ఆయనను అడిగారు.
tadanantaraṁ nirjanasamaye tatsaṅgino dvādaśaśiṣyāśca taṁ taddṛṣṭāntavākyasyārthaṁ papracchuḥ|
11 ౧౧ ఆయన వారితో, “దేవుని రాజ్యం గురించిన రహస్య సత్యం మీకు చెప్పాను. కాని బయటి వారికి ప్రతి విషయమూ ఉపమానాల రూపంలోనే లభిస్తుంది.
tadā sa tānuditavān īśvararājyasya nigūḍhavākyaṁ boddhuṁ yuṣmākamadhikāro'sti;
12 ౧౨ ఎందుకంటే, వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి. వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.”
kintu ye vahirbhūtāḥ "te paśyantaḥ paśyanti kintu na jānanti, śṛṇvantaḥ śṛṇvanti kintu na budhyante, cettai rmanaḥsu kadāpi parivarttiteṣu teṣāṁ pāpānyamocayiṣyanta," atohetostān prati dṛṣṭāntaireva tāni mayā kathitāni|
13 ౧౩ ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? అయితే మిగతా ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు?
atha sa kathitavān yūyaṁ kimetad dṛṣṭāntavākyaṁ na budhyadhve? tarhi kathaṁ sarvvān dṛṣṭāntāna bhotsyadhve?
14 ౧౪ విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు.
bījavaptā vākyarūpāṇi bījāni vapati;
15 ౧౫ దారి పక్కన ఉన్నవారెవరంటే, వాక్కు వారిలో పడింది గాని, వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు.
tatra ye ye lokā vākyaṁ śṛṇvanti, kintu śrutamātrāt śaitān śīghramāgatya teṣāṁ manaḥsūptāni tāni vākyarūpāṇi bījānyapanayati taeva uptabījamārgapārśvesvarūpāḥ|
16 ౧౬ అలాగే కొంతమంది రాతినేల లాంటి వారు. వీళ్ళు వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు.
ye janā vākyaṁ śrutvā sahasā paramānandena gṛhlanti, kintu hṛdi sthairyyābhāvāt kiñcit kālamātraṁ tiṣṭhanti tatpaścāt tadvākyahetoḥ
17 ౧౭ కానీ వారిలో వాక్కు లోతుగా వేరు పారని కారణంగా కష్టం, హింస కలిగితే దాన్ని వదిలివేస్తారు.
kutracit kleśe upadrave vā samupasthite tadaiva vighnaṁ prāpnuvanti taeva uptabījapāṣāṇabhūmisvarūpāḥ|
18 ౧౮ కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. దేవుని వాక్కు వింటారు.
ye janāḥ kathāṁ śṛṇvanti kintu sāṁsārikī cintā dhanabhrānti rviṣayalobhaśca ete sarvve upasthāya tāṁ kathāṁ grasanti tataḥ mā viphalā bhavati (aiōn g165)
19 ౧౯ కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి. (aiōn g165)
taeva uptabījasakaṇṭakabhūmisvarūpāḥ|
20 ౨౦ మరి కొందరు సారవంతమైన నేలలాంటి వారు, వీళ్ళు దేవుని వాక్కు విని, అంగీకరించి కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిస్తారు.”
ye janā vākyaṁ śrutvā gṛhlanti teṣāṁ kasya vā triṁśadguṇāni kasya vā ṣaṣṭiguṇāni kasya vā śataguṇāni phalāni bhavanti taeva uptabījorvvarabhūmisvarūpāḥ|
21 ౨౧ ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “దీపాన్ని తెచ్చి బోర్లించిన పాత్ర కింద, లేక మంచం కింద ఉంచుతారా? దాన్ని దీపస్తంభం మీద ఉంచుతాం గదా!
tadā so'paramapi kathitavān kopi jano dīpādhāraṁ parityajya droṇasyādhaḥ khaṭvāyā adhe vā sthāpayituṁ dīpamānayati kiṁ?
22 ౨౨ దాచి ఉంచినవన్నీ బహిర్గతమౌతాయి. అన్ని రహస్యాలూ బయట పడిపోతాయి.
atoheto ryanna prakāśayiṣyate tādṛg lukkāyitaṁ kimapi vastu nāsti; yad vyaktaṁ na bhaviṣyati tādṛśaṁ guptaṁ kimapi vastu nāsti|
23 ౨౩ వినడానికి చెవులు గలవాడు వినుగాక.”
yasya śrotuṁ karṇau staḥ sa śṛṇotu|
24 ౨౪ యేసు వారితో ఇంకా ఇలా అన్నాడు, “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతలో కొలిచి ఇస్తారో అదే కొలతలో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు.
aparamapi kathitavān yūyaṁ yad yad vākyaṁ śṛṇutha tatra sāvadhānā bhavata, yato yūyaṁ yena parimāṇena parimātha tenaiva parimāṇena yuṣmadarthamapi parimāsyate; śrotāro yūyaṁ yuṣmabhyamadhikaṁ dāsyate|
25 ౨౫ కలిగిన వారికి దేవుడు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వారి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు.”
yasyāśraye varddhate tasmai aparamapi dāsyate, kintu yasyāśraye na varddhate tasya yat kiñcidasti tadapi tasmān neṣyate|
26 ౨౬ ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఒక మనిషి భూమి మీద విత్తనాలు చల్లినట్టు ఉంటుంది.
anantaraṁ sa kathitavān eko lokaḥ kṣetre bījānyuptvā
27 ౨౭ ఆ వ్యక్తి నిద్ర పోతున్నా మెలకువగా ఉన్నా రాత్రి, పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి.
jāgaraṇanidrābhyāṁ divāniśaṁ gamayati, parantu tadvījaṁ tasyājñātarūpeṇāṅkurayati varddhate ca;
28 ౨౮ ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు పుడతాయి.
yatohetoḥ prathamataḥ patrāṇi tataḥ paraṁ kaṇiśāni tatpaścāt kaṇiśapūrṇāni śasyāni bhūmiḥ svayamutpādayati;
29 ౨౯ పంట పండినప్పుడు అతడు కోతకాలం వచ్చిందని వెంటనే కొడవలితో కోస్తాడు.”
kintu phaleṣu pakkeṣu śasyacchedanakālaṁ jñātvā sa tatkṣaṇaṁ śasyāni chinatti, anena tulyamīśvararājyaṁ|
30 ౩౦ ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు. “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం?
punaḥ so'kathayad īśvararājyaṁ kena samaṁ? kena vastunā saha vā tadupamāsyāmi?
31 ౩౧ అది ఆవగింజ లాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అది చిన్నది.
tat sarṣapaikena tulyaṁ yato mṛdi vapanakāle sarṣapabījaṁ sarvvapṛthivīsthabījāt kṣudraṁ
32 ౩౨ కాని దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి.”
kintu vapanāt param aṅkurayitvā sarvvaśākād bṛhad bhavati, tasya bṛhatyaḥ śākhāśca jāyante tatastacchāyāṁ pakṣiṇa āśrayante|
33 ౩౩ యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి, వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ వారికి ఉపదేశించాడు.
itthaṁ teṣāṁ bodhānurūpaṁ so'nekadṛṣṭāntaistānupadiṣṭavān,
34 ౩౪ ఉపమానం లేకుండా వారికి ఏ ఉపదేశమూ చేయలేదు. తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అన్నీ వివరించి చెప్పాడు.
dṛṣṭāntaṁ vinā kāmapi kathāṁ tebhyo na kathitavān paścān nirjane sa śiṣyān sarvvadṛṣṭāntārthaṁ bodhitavān|
35 ౩౫ ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు.
taddinasya sandhyāyāṁ sa tebhyo'kathayad āgacchata vayaṁ pāraṁ yāma|
36 ౩౬ శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి.
tadā te lokān visṛjya tamavilambaṁ gṛhītvā naukayā pratasthire; aparā api nāvastayā saha sthitāḥ|
37 ౩౭ అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి.
tataḥ paraṁ mahājhañbhśagamāt nau rdolāyamānā taraṅgeṇa jalaiḥ pūrṇābhavacca|
38 ౩౮ పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు.
tadā sa naukācaścādbhāge upadhāne śiro nidhāya nidrita āsīt tataste taṁ jāgarayitvā jagaduḥ, he prabho, asmākaṁ prāṇā yānti kimatra bhavataścintā nāsti?
39 ౩౯ ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.
tadā sa utthāya vāyuṁ tarjitavān samudrañcoktavān śāntaḥ susthiraśca bhava; tato vāyau nivṛtte'bdhirnistaraṅgobhūt|
40 ౪౦ అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు.
tadā sa tānuvāca yūyaṁ kuta etādṛkśaṅkākulā bhavata? kiṁ vo viśvāso nāsti?
41 ౪౧ వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.
tasmātte'tīvabhītāḥ parasparaṁ vaktumārebhire, aho vāyuḥ sindhuścāsya nideśagrāhiṇau kīdṛgayaṁ manujaḥ|

< మార్కు 4 >