< మార్కు 2 >

1 కొద్ది రోజుల తరువాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు.
Nakabola kuKkapenawumi nikwakiinda mazuba mache kwakamvwika kuti Jesu mwali mumunzi.
2 ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమికూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేయసాగాడు.
Bantu bingi bakabungana kwakuti takwe nikwachili busena, munganda nikuba kumulyango, Jesu kali kukambawuka ijwi kuli mbabo.
3 నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు.
Kwakasika balumi bakanyampwide mwalumi wakayuminide mubili; kanyampwidwe abalumi bone.
4 ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు.
Nibakabula mweenya wakuswena afwifwi anguwe nkambo kakuvula kwabantu, bakavumbula kaluli awo Jesu mpakabede nibakavumbula bakaseluzya bulo bwawaka yuminide mubili mpakabede.
5 యేసు వారి విశ్వాసం చూసి, “కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
Nakabona kusyoma lwabo, Jesu wakati kuli wakayuminide mubili, “Omwana, zibi zyako zyalekelelwa”.
6 అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు,
Lino bamwi balembi bakekkede, bakayeya munyono yabo,
7 “అతడీ విధంగా ఎలా మాట్లాడగలడు? దైవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?”
“Nkambonzi mwalumi oyu nambula obu? Utuka Leza alikke?”
8 వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, “మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక?
Chakufwambana Jesu wakaziba mumuya wkwe nzibakali kuyeya mumyoyo yabo. Wakati kulimbabo, “Nkambonzi nimulikuyeya ezi mumyoyo yanu?
9 ఈ పక్షవాత రోగితో, ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పడక ఎత్తుకుని నడువు’ అనడమా?
Nchechili chuuba kwamba kuti kumulwazi, “Walekelelwa zibi, na kuti bweza bulo bwako weende?”
10 ౧౦ భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి
Asi kuti muzibe kuti Mwana aMuntu ulamanguzu ano ansi enyika kulekelela zibi, wakati kuliwakayuminide mubili
11 ౧౧ ఆ పక్షవాత రోగిని చూసి, “నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను” అన్నాడు.
“Ndati kulinduwe nyampuka, bweza bulo bwako, uye kunganda yako”.
12 ౧౨ వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, “మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే” అని దేవుణ్ణి స్తుతించారు.
Wakanyampuka chakufwambana wabweza bulo, wakazwa munganda kunembo lyabantu boonse, abobo boonse bakagamba bapabulumbu kuli Leza, bati, “Ezi tatuna zibona pe”.
13 ౧౩ యేసు మళ్లీ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారికి ఉపదేశం చేశాడు.
Wakayinka lubo kunkomwe yalwizi, makamu abantu akamutobela, mpawo wakabayiisya.
14 ౧౪ ఆయన నడుస్తుండగా, దారిలో అల్ఫయి కుమారుడు లేవీని చూశాడు. అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు.
Kayabweenda, wakabona Levi mwana wa Alufayewusi kakkede mutente lyabasimutelo wakati kulinguwe, “Nditobele”. Wakanyampuka wamutobela.
15 ౧౫ యేసు లేవి ఇంట్లో భోజనం చేస్తున్నపుడు పన్ను వసూలు చేసేవారు, పాపులు, చాలామంది ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయనను వెంబడిస్తున్నారు.
Jesu wakali kulya munganda yaLevi, abasimutelo abasizibi bakali kulya awe abasikwiiya bakwe, kwakali biingi abobo bakamutobela.
16 ౧౬ అది చూసి ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఆయన శిష్యులతో, “ఈయన పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి భోజనం చేస్తున్నాడేమిటి?” అన్నారు.
Balembi, bakali baFalisi, nibakabona Jesu kalikulya abasizibi, bakati kuli basikwiiya bakwe, “Nkamboonzi nalya abasimutelo abasizibi?”
17 ౧౭ యేసు ఈ మాట విని వారితో, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుని అవసరం లేదు. రోగులకే వైద్యుడు అవసరం. నేను నీతిపరులను పిలవడానికి రాలేదు, పాపాత్ములను పిలవడానికే వచ్చాను” అని అన్నాడు.
Jesu nakamvwa obo wakati kulimbabo, “Bantu baponede mumubili tabayandi musilisi; asi bachiswa, mbibayanda musilisi. Tendazida kwiita baluleme asi basizibi”.
18 ౧౮ యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసం చేస్తారు. వారు వచ్చి, “యోహాను శిష్యులూ, పరిసయ్యుల శిష్యులూ ఉపవాసం చేస్తారు గాని నీ శిష్యులు ఉపవాసం చెయ్యరేమిటి?” అని ఆయనను అడిగారు.
Lino basikwiiya ba Joni abaFalisi kali kulyimya kulya. Bamwi bantu bakasika kulinguwe, “Nkambonzi basikwiiya baJoni abaFalisi balalyiima, asi bako tabalyimyi pe?”
19 ౧౯ యేసు, “పెళ్ళికొడుకు తమతో ఉన్న సమయంలో పెళ్లి వారు ఉపవాసం చేస్తారా? అతడు ఉన్నంత కాలం వారు ఉపవాసం చేయరు.
Jesu wakati kulimbabo, “Nkujana basikutambwa kubwinga balyiimya na sibwiinga nkalabo?” Nkachilabo sibwiinga, tabalyimyi.
20 ౨౦ పెళ్ళికొడుకును వారి దగ్గర నుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు.
Ayosika mazuba sibwiinga akubwezegwa kuzwa kulimbabo, ayo mazuba bayolyiimya.
21 ౨౧ “పాత బట్ట చిరుగుకు కొత్త బట్టతో ఎవరూ మాసిక వేయరు. అలా చేస్తే కొత్తది పాత దాన్ని గుంజి, చినుగు పెద్దదవుతుంది.
Takwe usuma chigamba chamulembo mupya achizwato chikulukulu, chigamba chilakonzya kudeluka, chipya kuzwa kuli chachiindi, chiyodelukisya.
22 ౨౨ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం ఎవరూ పోయరు. అలా పోస్తే కొత్త ద్రాక్షరసం వల్ల ఆ తిత్తులు చినిగిపోతాయి. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే పోయాలి” అని వారితో అన్నాడు.
Takwe ubikka wayini mupya munkomo yachiindi wabona wayini ulabbalula inkomo mpawo zyoonse wayini a ziyonyonyoka. Wayini mupya ubikwa munkomo mpya.
23 ౨౩ విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు తాము తినడానికి కొన్ని ధాన్యం కంకులను తుంచారు.
Musabata Jesu wakayinda mumunda wamayila, basikwiiya bakabweza mayila.
24 ౨౪ పరిసయ్యులు, “చూడు, నీ శిష్యులు విశ్రాంతి దినాన చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని ఆయనను అడిగారు.
Mpawo baFalisi bakati kulinguwe, “Langa nkambonzi basikwiiya nibalikuchita zintu zityola mulawo abuzuba bwaSabata?”
25 ౨౫ అందుకాయన వారితో ఇలా అన్నాడు, “దావీదు, అతనితో ఉన్నవారు అవసరంలో ఆకలిగా ఉన్నప్పుడు అతడు చేసింది మీరు చదవలేదా?
Wakati kulimbabo, “Temwakabala na kuti Davida nakabula akuba anzala - we abalumi mbakalabo -
26 ౨౬ అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా?” అన్నాడు.
mbakanjila munganda yaJehova Abbiyata nkali mupatiyizi mupati, akulya chinkwa chabukamu, chitazumizigwi kuligwa amuntu kupela kunze kwabapayizi, wakapa abalabo mbakalabo?”
27 ౨౭ ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “విశ్రాంతి దినం మనుషుల కోసమేగాని మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు.
Jesu wakati, “Sabata lyakalengelwa bantu, pepe bantu kulengelwa Sabata.
28 ౨౮ అందుచేత మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే!” అని వారితో చెప్పాడు.
Aboobo, Mwana aMuntu Mwami, ku Sabata”.

< మార్కు 2 >