< మార్కు 16 >

1 విశ్రాంతి దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు.
అథ విశ్రామవారే గతే మగ్దలీనీ మరియమ్ యాకూబమాతా మరియమ్ శాలోమీ చేమాస్తం మర్ద్దయితుం సుగన్ధిద్రవ్యాణి క్రీత్వా
2 ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరికి వస్తూ,
సప్తాహప్రథమదినేఽతిప్రత్యూషే సూర్య్యోదయకాలే శ్మశానముపగతాః|
3 “మన కోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
కిన్తు శ్మశానద్వారపాషాణోఽతిబృహన్ తం కోఽపసారయిష్యతీతి తాః పరస్పరం గదన్తి!
4 వారు వచ్చి సమాధికేసి చూడగా ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది.
ఏతర్హి నిరీక్ష్య పాషాణో ద్వారో ఽపసారిత ఇతి దదృశుః|
5 వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు.
పశ్చాత్తాః శ్మశానం ప్రవిశ్య శుక్లవర్ణదీర్ఘపరిచ్ఛదావృతమేకం యువానం శ్మశానదక్షిణపార్శ్వ ఉపవిష్టం దృష్ట్వా చమచ్చక్రుః|
6 అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకండి! మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే.
సోఽవదత్, మాభైష్ట యూయం క్రుశే హతం నాసరతీయయీశుం గవేషయథ సోత్ర నాస్తి శ్మశానాదుదస్థాత్; తై ర్యత్ర స స్థాపితః స్థానం తదిదం పశ్యత|
7 మీరు వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి. “యేసు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు.”
కిన్తు తేన యథోక్తం తథా యుష్మాకమగ్రే గాలీలం యాస్యతే తత్ర స యుష్మాన్ సాక్షాత్ కరిష్యతే యూయం గత్వా తస్య శిష్యేభ్యః పితరాయ చ వార్త్తామిమాం కథయత|
8 ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ, ఆ సమాధి నుండి పరుగెత్తి వెళ్ళిపోయారు. వారు భయం వల్ల తమలో తాము ఏమీ మాట్లాడుకోలేదు.
తాః కమ్పితా విస్తితాశ్చ తూర్ణం శ్మశానాద్ బహిర్గత్వా పలాయన్త భయాత్ కమపి కిమపి నావదంశ్చ|
9 (note: The most reliable and earliest manuscripts do not include Mark 16:9-20.) వారం మొదటి రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా యేసు లేచి, తాను ఏడు దయ్యాలను వదిలించిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించాడు.
(note: The most reliable and earliest manuscripts do not include Mark 16:9-20.) అపరం యీశుః సప్తాహప్రథమదినే ప్రత్యూషే శ్మశానాదుత్థాయ యస్యాః సప్తభూతాస్త్యాజితాస్తస్యై మగ్దలీనీమరియమే ప్రథమం దర్శనం దదౌ|
10 ౧౦ ఆమె, యేసుతో కలిసి ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది. వారు దుఃఖిస్తూ, విలపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది.
తతః సా గత్వా శోకరోదనకృద్భ్యోఽనుగతలోకేభ్యస్తాం వార్త్తాం కథయామాస|
11 ౧౧ యేసు మళ్ళీ బతికాడనీ, తాను ఆయనను చూశాననీ చెప్పింది. కాని, వారు ఆమె మాటలు నమ్మలేదు.
కిన్తు యీశుః పునర్జీవన్ తస్యై దర్శనం దత్తవానితి శ్రుత్వా తే న ప్రత్యయన్|
12 ౧౨ ఆ తరువాత వారిలో ఇద్దరు శిష్యులు వారి గ్రామానికి నడిచి వెళ్తూ ఉండగా ఆయన వారికి వేరే రూపంలో కనిపించాడు.
పశ్చాత్ తేషాం ద్వాయో ర్గ్రామయానకాలే యీశురన్యవేశం ధృత్వా తాభ్యాం దర్శన దదౌ!
13 ౧౩ వారు తిరిగి వెళ్ళి మిగిలిన వారికి ఆ సంగతి చెప్పారు గానీ వారు నమ్మలేదు.
తావపి గత్వాన్యశిష్యేభ్యస్తాం కథాం కథయాఞ్చక్రతుః కిన్తు తయోః కథామపి తే న ప్రత్యయన్|
14 ౧౪ ఆ తరువాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తూ ఉండగా యేసు వారికి కనిపించాడు. తాను తిరిగి బతికిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మకం, హృదయ కాఠిన్యం బట్టి వారిని గద్దించాడు.
శేషత ఏకాదశశిష్యేషు భోజనోపవిష్టేషు యీశుస్తేభ్యో దర్శనం దదౌ తథోత్థానాత్ పరం తద్దర్శనప్రాప్తలోకానాం కథాయామవిశ్వాసకరణాత్ తేషామవిశ్వాసమనఃకాఠిన్యాభ్యాం హేతుభ్యాం స తాంస్తర్జితవాన్|
15 ౧౫ యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి.
అథ తానాచఖ్యౌ యూయం సర్వ్వజగద్ గత్వా సర్వ్వజనాన్ ప్రతి సుసంవాదం ప్రచారయత|
16 ౧౬ దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.
తత్ర యః కశ్చిద్ విశ్వస్య మజ్జితో భవేత్ స పరిత్రాస్యతే కిన్తు యో న విశ్వసిష్యతి స దణ్డయిష్యతే|
17 ౧౭ “నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు.
కిఞ్చ యే ప్రత్యేష్యన్తి తైరీదృగ్ ఆశ్చర్య్యం కర్మ్మ ప్రకాశయిష్యతే తే మన్నామ్నా భూతాన్ త్యాజయిష్యన్తి భాషా అన్యాశ్చ వదిష్యన్తి|
18 ౧౮ తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు.”
అపరం తైః సర్పేషు ధృతేషు ప్రాణనాశకవస్తుని పీతే చ తేషాం కాపి క్షతి ర్న భవిష్యతి; రోగిణాం గాత్రేషు కరార్పితే తేఽరోగా భవిష్యన్తి చ|
19 ౧౯ ప్రభు యేసు వారితో మాట్లాడిన తరవాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించాడు. అక్కడ యేసు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు.
అథ ప్రభుస్తానిత్యాదిశ్య స్వర్గం నీతః సన్ పరమేశ్వరస్య దక్షిణ ఉపవివేశ|
20 ౨౦ ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకూ వెళ్ళి యేసును ప్రకటించారు. ప్రభువు వారికి తోడై, వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు.
తతస్తే ప్రస్థాయ సర్వ్వత్ర సుసంవాదీయకథాం ప్రచారయితుమారేభిరే ప్రభుస్తు తేషాం సహాయః సన్ ప్రకాశితాశ్చర్య్యక్రియాభిస్తాం కథాం ప్రమాణవతీం చకార| ఇతి|

< మార్కు 16 >