< మార్కు 15 >
1 ౧ తెల్లవారు జామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందిన సభ్యులు కలసి సమాలోచన చేశారు. తరువాత వారు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమా గవర్నర్ పిలాతుకు అప్పగించారు.
As soon as it was morning, the chief priests took counsel with the elders, scribes, and the whole Sanhedrin. They bound Jesus, led him away, and handed him over to Pilate.
2 ౨ పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ప్రశ్నించాడు. అందుకు యేసు, “నువ్వే అంటున్నావుగా” అని అతనికి జవాబిచ్చాడు.
So Pilate asked him, “Are yoʋ the king of the Jews?” Jesus answered him, “Yoʋ have said it yoʋrself.”
3 ౩ ముఖ్య యాజకులు ఆయన మీద చాలా నేరాలు మోపారు.
Then the chief priests accused him of many things.
4 ౪ కనుక పిలాతు మరొకసారి ఆయనను ప్రశ్నిస్తూ, “వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరారోపణలు చేస్తున్నారో చూడు! నీవేమీ జవాబు చెప్పవా?” అన్నాడు.
So Pilate asked him again, “Do yoʋ make no answer? See how many things they are testifying against yoʋ!”
5 ౫ అయినా యేసు మారు పలకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది.
But Jesus made no further answer, so Pilate was amazed.
6 ౬ పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ.
Now at the feast Pilate would release one prisoner for the people, whomever they requested.
7 ౭ బరబ్బ అనే ఒక ఖైదీ హంతకులైన తన తోటి తిరుగుబాటుదారులతో ఖైదులో ఉన్నాడు.
And there was a man named Barabbas who was in prison with his fellow insurrectionists who had committed murder in the insurrection.
8 ౮ జన సమూహం ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఆ సంవత్సరం కూడా ఒకరిని విడుదల చేయమని పిలాతును కోరారు.
So the crowd cried out and began to ask Pilate to do what he had always done for them.
9 ౯ పిలాతు, “యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా?” అని అన్నాడు.
Pilate answered them, “Do you want me to release for you the king of the Jews?”
10 ౧౦ ఎందుకంటే ముఖ్య యాజకులు కేవలం అసూయ చేతనే యేసును తనకు అప్పగించారని అతడు గ్రహించాడు.
(For he knew that the chief priests had handed Jesus over out of envy.)
11 ౧౧ కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బను విడుదల చెయ్యాలని కోరమని ప్రజలను పురికొల్పారు.
But the chief priests stirred up the crowd to have Pilate release for them Barabbas instead.
12 ౧౨ పిలాతు, “అలాగైతే ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ యేసును ఏమి చేయమంటారు?” అని అడిగాడు.
In response Pilate said to them again, “What then do you want me to do with the man you call King of the Jews?”
13 ౧౩ వారు కేకలు వేస్తూ, “సిలువ వేయండి” అన్నారు.
They cried out again, “Crucify him!”
14 ౧౪ పిలాతు, “ఎందుకు? అతడు చేసిన నేరమేంటి?” అన్నాడు. జనసమూహం, “సిలువ వేయండి” అంటూ ఇంకా ఎక్కువగా కేకలు వేశారు.
Pilate said to them, “Why? What evil has he done?” But they cried out all the more, “Crucify him!”
15 ౧౫ ఆ జనసమూహన్ని సంతోషపెట్టాలని పిలాతు వారు అడిగినట్టు బరబ్బను విడుదల చేసి, యేసును కొరడా దెబ్బలు కొట్టించి. సిలువ వేయడానికి అప్పగించాడు.
Then Pilate, wishing to satisfy the crowd, released for them Barabbas. But he scourged Jesus and handed him over to be crucified.
16 ౧౬ సైనికులు యేసును అధికార భవనంలోకి తీసుకు వెళ్ళి మిగిలిన సైనికులందర్నీ అక్కడికి పిలిచారు.
So the soldiers led him away into the palace (that is, the governor's headquarters) and called together the entire cohort of soldiers.
17 ౧౭ వారాయనకు ఊదా రంగు బట్టలు తొడిగి, ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలపై పెట్టారు.
They clothed him with a purple robe, and they twisted together a crown of thorns and put it on him.
18 ౧౮ ఆ తరువాత, “యూదుల రాజా, జయం!” అంటూ ఆయనకు వందనం చేయసాగారు.
Then they began to salute him: “Hail, King of the Jews!”
19 ౧౯ రెల్లు కర్రతో తలపై కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన ముందు మోకరించి నమస్కరించారు.
They kept beating him on the head with a reed, spitting on him, and bending down on their knees to pay homage to him.
20 ౨౦ ఈ విధంగా ఆయనను అవహేళన చేసిన తరువాత ఆ ఊదా రంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు.
When they had finished mocking him, they stripped him of the purple robe and put his own garments back on him. Then they led him out to crucify him.
21 ౨౧ కురేనే ప్రాంతానికి చెందిన సీమోను (ఇతడు అలెగ్జాండర్, రూఫస్ అనే వారి తండ్రి) ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి, సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు.
Now a certain man from Cyrene, Simon, the father of Alexander and Rufus, was passing by on his way in from the countryside. The soldiers pressed him into service, forcing him to carry Jesus' cross,
22 ౨౨ వారు యేసును, “గొల్గొతా” అనే చోటికి తీసుకు వచ్చారు, గొల్గొతా అంటే, “కపాల స్థలం” అని అర్థం.
and they brought Jesus to the place called Golgotha (which means, “Place of the Skull”).
23 ౨౩ అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు.
Then they gave him wine to drink, mixed with myrrh, but he did not take it.
24 ౨౪ ఆ తరువాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి, ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు.
And they crucified him. Then they divided his garments, casting lots for them to see who would take what.
25 ౨౫ ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు.
It was the third hour when they crucified him.
26 ౨౬ “యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు.
The inscription of the charge against him was written as follows: “The King of the Jews.”
27 ౨౭ ఆయనతో ఇద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువ వేశారు.
With him they crucified two robbers, one on his right and one on his left.
28 ౨౮ ‘ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు’ అని లేఖనాల్లో రాసిన వాక్కు దీని వలన నెరవేరింది.
So the Scripture was fulfilled that says, “He was numbered with the lawless.”
29 ౨౯ ఆ దారిన వెళ్ళే వారు ఆయనను దూషిస్తూ తలలాడిస్తూ, “దేవాలయాన్ని కూలదోసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్నావు కదా!
Those who passed by reviled him, shaking their heads and saying, “Ha! Yoʋ who would destroy the temple and build it in three days,
30 ౩౦ ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నువ్వే రక్షించుకో!” అన్నారు.
save yoʋrself and come down from the cross!”
31 ౩౧ ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయనను హేళన చేస్తూ, “వీడు ఇతరులను రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు!
In the same way the chief priests also, along with the scribes, were mocking him among themselves, saying, “He saved others, but he cannot save himself.
32 ౩౨ ‘క్రీస్తు’ అనే ఈ ‘ఇశ్రాయేలు రాజు’ సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుతో పాటు సిలువ వేసినవారు కూడా ఆయనను నిందించారు.
Let the Christ, the king of Israel, come down now from the cross, so that we may see it and believe him.” The men who were crucified with him were also insulting him.
33 ౩౩ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.
From the sixth hour until the ninth hour, there was darkness over the whole land.
34 ౩౪ మూడు గంటలకు యేసు, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, “నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?” అని అర్థం.
And at the ninth hour Jesus cried out with a loud voice, “Eloi, Eloi, lima sabachthani?” which means, “My God, my God, why have yoʋ forsaken me?”
35 ౩౫ దగ్గర నిలుచున్న కొందరు అది విని, “ఇదిగో, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.
When some of those standing nearby heard this, they said, “Behold, he is calling for Elijah.”
36 ౩౬ ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్ళి స్పాంజ్ ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి రెల్లు కర్రకు తగిలించి యేసుకు తాగడానికి అందించాడు. “ఏలీయా వచ్చి ఇతన్ని కిందికి దించుతాడేమో చూద్దాం” అని అతడు అన్నాడు.
Then a man ran and filled a sponge with sour wine, put it on a reed, and gave it to him to drink, saying, “Leave him alone. Let us see if Elijah comes to take him down.”
37 ౩౭ అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు.
But Jesus let out a loud cry and breathed his last breath.
38 ౩౮ ఆ వెంటనే దేవాలయంలో తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగిపోయింది.
Then the veil of the temple was torn in two from top to bottom.
39 ౩౯ యేసు ఎదుట నిలబడి ఉన్న శతాధిపతి ఆయన చనిపోయిన విధానం అంతా గమనించి, “నిజంగా ఈయన దేవుని కుమారుడు” అన్నాడు.
Now when the centurion who was standing in front of Jesus saw how he cried out and breathed his last breath, he said, “Truly this man was the Son of God.”
40 ౪౦ కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబు, యోసేల తల్లి మరియ, సలోమి ఉన్నారు.
There were also some women looking on from a distance, among whom were Mary Magdalene, Mary the mother of James the younger and of Joses, and Salome.
41 ౪౧ యేసు గలిలయలో ఉన్నపుడు వీరు ఆయనను వెంబడిస్తూ ఆయనకు సేవ చేసేవారు. వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు.
These women had followed Jesus and provided for him when he was in Galilee. There were also many other women who had come up with him to Jerusalem.
42 ౪౨ అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు.
When evening had come, since it was the day of Preparation (that is, the day before the Sabbath),
43 ౪౩ యూదుల మహా సభలో పేరు పొందిన ఒక సభ్యుడు, అరిమతయి వాడైన యోసేపు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు. అతడు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.
Joseph of Arimathea, a respected council member, who was himself also waiting for the kingdom of God, came and boldly went in before Pilate to ask for Jesus' body.
44 ౪౪ యేసు అంత త్వరగా చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపోయి, శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు.
Pilate was surprised that Jesus was already dead, so he called the centurion over and asked him if Jesus had been dead for some time.
45 ౪౫ ఆయన చనిపోయాడని శతాధిపతి ద్వారా తెలుసుకుని ఆయన దేహాన్ని యోసేపుకు అప్పగించాడు.
When he found out from the centurion that it was so, he granted the body to Joseph.
46 ౪౬ యోసేపు సన్న నారబట్ట కొని యేసును కిందికి దింపి ఆ బట్టలో చుట్టాడు. ఆ తరువాత రాతిలో తొలిపించిన సమాధిలో ఆయనను పెట్టాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధిని మూసివేశాడు.
After buying a linen cloth and taking him down, Joseph wrapped him in the linen cloth and laid him in a tomb that had been hewn in a rock. Then he rolled a stone against the entrance of the tomb.
47 ౪౭ మగ్దలేనే మరియ, యేసు తల్లి అయిన మరియ ఆయనను ఉంచిన చోటును చూశారు.
And Mary Magdalene and Mary the mother of Joses saw where he was laid.