< మార్కు 14 >
1 ౧ రెండు రోజుల తరువాత పస్కా పండగ, పొంగని రొట్టెల పండగ రాబోతున్నాయి. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు యేసును రహస్యంగా బంధించి చంపాలని కుట్రలు పన్నుతున్నారు.
La Pâque et les Azymes devaient avoir lieu deux jours après; et les Princes des prêtres et les scribes cherchaient les moyens de se saisir de Jésus par ruse, afin de le faire mourir.
2 ౨ అయితే ప్రజల్లో అల్లరి జరగవచ్చు అని భయపడి, పండగ సమయంలో వద్దు అని చెప్పుకున్నారు.
« Mais, disaient-ils, que ce ne soit pas pendant la fête, de peur qu’il n’y ait du tumulte parmi le peuple. »
3 ౩ ఆ సమయంలో యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఒక స్త్రీ అగరు చెట్ల నుండి చేసిన స్వచ్ఛమైన, ప్రశస్తమైన అత్తరును ఒక చలువరాతి సీసాలో తన వెంట తెచ్చింది. ఆమె ఆ సీసా పగలగొట్టి ఆ అత్తరును యేసు తల మీద పోసింది.
Comme Jésus était à Béthanie, dans la maison de Simon le lépreux, une femme entra pendant qu’il se trouvait à table. Elle tenait un vase d’albâtre plein d’un parfum de nard pur d’un grand prix; et ayant brisé le vase, elle répandit le parfum sur sa tête.
4 ౪ అయితే ఇది చూసి అక్కడ ఉన్న కొందరు కోపం తెచ్చుకున్నారు. వారు, “అత్తరు ఇలా వృధా చేయడం ఎందుకు?
Plusieurs de ceux qui étaient là en témoignaient entre eux leur mécontentement: « Pourquoi perdre ainsi ce parfum?
5 ౫ ఈ అత్తరు అమ్మి ఉంటే మూడువందల దేనారాల కంటే ఎక్కువే వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు ఇచ్చి ఉండవలసింది” అని తమలో తాము చెప్పుకుని ఆ స్త్రీని గద్దించారు.
On aurait pu le vendre plus de trois cents deniers, et les donner aux pauvres. » Et ils se fâchaient contre elle.
6 ౬ అయితే యేసు, “ఆమె జోలికి వెళ్ళకండి! ఆమెను ఎందుకు కంగారు పెడుతున్నారు? ఈమె నా విషయంలో శ్రేష్ఠమైన పని చేసింది.
Mais Jésus dit: « Laissez-la; pourquoi lui faites-vous de la peine? C’est une bonne action qu’elle a faite à mon égard.
7 ౭ పేదవారు ఎప్పుడూ మీతో ఉంటారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు వారికి సహాయం చేయవచ్చు. కాని, నేను ఎల్లకాలం మీతో ఉండను.
Car vous avez toujours les pauvres avec vous, et toutes les fois que vous voulez, vous pouvez leur faire du bien; mais moi, vous ne m’avez pas toujours.
8 ౮ ఈమె తాను చేయగలిగింది చేసింది. ఈమె నా శరీరాన్ని భూస్థాపన కోసం ముందుగా అభిషేకించింది.
Cette femme a fait ce qu’elle a pu; elle a d’avance embaumé mon corps pour la sépulture.
9 ౯ మీతో నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటా సువార్త ప్రకటన జరిగే ప్రతిచోటా ఈమె చేసినది కూడా జ్ఞాపకం చేసుకుని ప్రశంసిస్తారు” అన్నాడు.
Je vous le dis, en vérité, partout où sera prêché cet évangile, dans le monde entier, on racontera aussi ce qu’elle a fait, en mémoire d’elle. »
10 ౧౦ ఆ తరువాత పన్నెండు మందిలో ఒకడైన యూదా ఇస్కరియోతు యేసును పట్టి ఇచ్చేందుకు ప్రధాన యాజకులతో మాట్లాడడానికి వారి దగ్గరికి వెళ్ళాడు.
Or, Judas l’Iscariote, l’un des Douze, alla vers les Princes des prêtres pour livrer Jésus.
11 ౧౧ అది విని వారు చాలా సంతోషించి అతనికి కొంత సొమ్ము ముట్టజెపుతామని మాట ఇచ్చారు. అప్పటినుండీ యేసును వారికి అప్పగించడానికి తగిన అవకాశం కోసం యూదా ఎదురు చూస్తూ ఉన్నాడు.
Après l’avoir entendu, ils furent dans la joie et promirent de lui donner de l’argent. Et Judas cherchait une occasion favorable pour le livrer.
12 ౧౨ పొంగని రొట్టెల పండగ మొదటి రోజున పస్కా గొర్రె పిల్లను వధించే రోజు వచ్చినప్పుడు యేసు శిష్యులు, “పస్కా విందును ఎక్కడ సిద్ధం చేయమంటావు?” అని ఆయనను అడిగారు.
Le premier jour des Azymes, où l’on immolait la Pâque, ses disciples dirent à Jésus: « Où veux-tu que nous allions te préparer ce qu’il faut pour manger la Pâque? »
13 ౧౩ యేసు తన శిష్యుల్లో ఇద్దరిని పంపుతూ, “మీరు ఊళ్ళోకి వెళ్ళండి. నీళ్ళ కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతని వెంట వెళ్ళండి.
Et il envoya deux de ses disciples, et leur dit: « Allez à la ville; vous rencontrerez un homme portant une cruche d’eau, suivez-le.
14 ౧౪ అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడుగుతున్నాడు’ అని చెప్పండి.
Quelque part qu’il entre, dites au propriétaire de la maison: Le Maître te fait dire: Où est la salle où je pourrai manger la Pâque avec mes disciples?
15 ౧౫ అతడు పూర్తి సామగ్రితో సిద్ధంగా ఉన్న విశాలమైన మేడ గది మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి” అని ఆదేశించాడు.
Et il vous montrera un grand cénacle meublé et tout prêt: faites-nous là les préparatifs. »
16 ౧౬ ఆ శిష్యులు బయలుదేరి నగరంలోకి వెళ్ళారు. ఆయన తమతో చెప్పినట్టే అన్నీ జరిగాయి. వారు పస్కా పండగ భోజనం సిద్ధం చేశారు.
Ses disciples partirent et allèrent à la ville; et ils trouvèrent les choses comme il le leur avait dit, et ils préparèrent la Pâque.
17 ౧౭ సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు.
Sur le soir, Jésus vint avec les Douze.
18 ౧౮ వారంతా బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తుండగా యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నాతో కలిసి భోజనం చేస్తూ ఉన్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అన్నాడు.
Pendant qu’ils étaient à table et mangeaient, Jésus dit: « Je vous le dis en vérité, un de vous me trahira; celui qui mange avec moi! »
19 ౧౯ వారికి దుఃఖం కలిగింది. ఒకరి తరవాత ఒకరు ఆయనతో, “నేను కాదు కదా!” అన్నారు.
Et ils se mirent à s’attrister et à lui dire l’un après l’autre: « Est-ce moi? »
20 ౨౦ ఆయన వారితో, “అతడు ఈ పన్నెండు మందిలో ఒకడు, నాతో కలసి పాత్రలో చెయ్యి ముంచేవాడే!
Il leur répondit: « C’est un des Douze, qui met avec moi la main dans le plat.
21 ౨౧ ఎందుకంటే మనుష్య కుమారుడి గురించి రాసి ఉన్నట్టే ఆయన చనిపోతాడు గాని, ఆయనను శత్రువులకు అప్పగించిన వాడికి శిక్ష తప్పదు. వాడు పుట్టకపోతే బాగుండేది” అన్నాడు.
Pour le Fils de l’homme, il s’en va, ainsi qu’il est écrit de lui; mais malheur à l’homme par qui le Fils de l’homme est trahi! Mieux vaudrait pour cet homme qu’il ne fût pas né. »
22 ౨౨ వారు భోజనం చేస్తూ ఉండగా యేసు రొట్టె తీసుకుని ఆశీర్వదించి, దాన్ని విరిచి వారికిచ్చి, “దీన్ని తీసుకుని తినండి. ఇది నా దేహం” అన్నాడు.
Pendant le repas, Jésus prit du pain, et après avoir prononcé une bénédiction, il le rompit, et le leur donna, en disant: « Prenez, ceci est mon corps. »
23 ౨౩ తరువాత ఒక పాత్ర తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వారికి ఇచ్చాడు. ఆ పాత్రలోనిది వారందరూ తాగారు.
Il prit ensuite la coupe, et, ayant rendu grâces, il la leur donna, et ils en burent tous.
24 ౨౪ ఆయన వారితో, “ఇది నా రక్తం. అనేకుల కోసం చిందే నిబంధన రక్తం.
Et il leur dit: « Ceci est mon sang, le sang de la nouvelle alliance, répandu pour la multitude.
25 ౨౫ నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి, కొత్త ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకూ ఇక నేను దాన్ని తాగను అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను” అన్నాడు.
Je vous le dis, en vérité, je ne boirai plus jamais du fruit de la vigne, jusqu’au jour où je le boirai nouveau dans le royaume de Dieu. »
26 ౨౬ అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారు.
Après le chant de l’hymne, ils s’en allèrent au mont des Oliviers.
27 ౨౭ అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి నా విషయంలో మీరంతా నాకు ముఖం చాటేస్తారు. ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది, ‘కాపరిని కొడతాను, గొర్రెలు చెదరిపోతాయి.’
Alors Jésus leur dit: « Je serai pour vous tous, cette nuit, une occasion de chute, car il est écrit: Je frapperai le berger, et les brebis seront dispersées.
28 ౨౮ కాని నేను తిరిగి సజీవంగా లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను” అని చెప్పాడు.
Mais, après que je serai ressuscité, je serai à votre tête, en Galilée. »
29 ౨౯ అయితే పేతురు ఆయనతో, “అందరూ అలా చేసినా నేను మాత్రం నిన్ను విడిచి పెట్టను” అన్నాడు.
Pierre lui dit: « Quand tu serais pour tous une occasion de chute, tu ne le serais jamais pour moi. »
30 ౩౦ అప్పుడు యేసు, “నీతో కచ్చితంగా చెప్పేదేమిటంటే ఈ రాత్రి కోడి రెండు సార్లు కూయక ముందే నీవు మూడు సార్లు నేనెవరో తెలియదని అబద్ధం ఆడతావు” అని అతనితో అన్నాడు.
Jésus lui dit: « Je te le dis, en vérité, aujourd’hui, cette nuit même, avant que le coq ait chanté deux fois, trois fois tu me renieras. »
31 ౩౧ “నేను నీతో చావవలసి వచ్చినా నువ్వు తెలియదు అనను” అని పేతురు గట్టిగా చెప్పాడు. మిగిలిన శిష్యులు కూడా అదే విధంగా అన్నారు.
Mais Pierre insistait encore plus: « Quand il me faudrait mourir avec toi, je ne te renierai pas. » Et tous dirent de même.
32 ౩౨ అందరూ గేత్సేమనే అనే చోటికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థన చేసి వచ్చే వరకూ మీరు ఇక్కడే ఉండండి” అన్నాడు.
Ils arrivèrent à un domaine appelé Gethsémani, et il dit à ses disciples: « Asseyez-vous ici pendant que je prierai. »
33 ౩౩ అప్పుడాయన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, నిస్పృహలో మునిగిపోసాగాడు.
Et ayant pris avec lui Pierre, Jacques et Jean, il commença à sentir de la frayeur et de l’abattement.
34 ౩౪ ఆయన వారితో, “ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను. మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి” అని చెప్పి,
Et il leur dit: « Mon âme est triste jusqu’à la mort; restez ici et veillez. »
35 ౩౫ ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు.
S’étant un peu avancé, il se jeta contre terre; et il priait que cette heure, s’il se pouvait, s’éloignât de lui.
36 ౩౬ ఆయన, “అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు.
Et il disait: « Abba (Père), tout t’est possible, éloigne de moi ce calice; cependant, non pas ma volonté, mais la tienne! »
37 ౩౭ ఆయన వచ్చి తన శిష్యులు నిద్రపోతూ ఉండడం చూసి, “సీమోనూ! నిద్రపోతున్నావా? ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయావా?
Il vint ensuite et trouva ses disciples endormis; et il dit à Pierre: « Simon, tu dors! Tu n’as pu veiller une heure!
38 ౩౮ మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది” అన్నాడు.
Veillez et priez afin que vous n’entriez pas en tentation. L’esprit est prompt, mais la chair est faible. »
39 ౩౯ ఆయన మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు.
Et, s’éloignant de nouveau, il pria, disant les mêmes paroles.
40 ౪౦ ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకు ఏమి జవాబు చెప్పాలో శిష్యులకు తోచలేదు.
Puis, étant revenu, il les trouva encore endormis; car leurs yeux étaient appesantis, et ils ne savaient que lui répondre.
41 ౪౧ మూడవ సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, “మీరింకా నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు. ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి. మనుష్య కుమారుణ్ణి పాపులు బంధించబోతున్నారు.
Il revint une troisième fois et leur dit: « Dormez maintenant, et reposez-vous. — C’est assez! L’heure est venue; voici que le Fils de l’homme est livré aux mains des pécheurs.
42 ౪౨ వెళ్దాం రండి. నన్ను అప్పగించబోతున్న వాడు దగ్గరలోనే ఉన్నాడు.”
Levez-vous, allons; celui qui me trahit est près d’ici. »
43 ౪౩ ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులూ దుడ్డు కర్రలూ ఉన్నాయి.
Au même moment, comme il parlait encore, arrive Judas, l’un des Douze, et avec lui une grande troupe armée d’épées et de bâtons, envoyée par les Princes des prêtres, par les scribes et par les Anciens.
44 ౪౪ ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, “నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను బంధించి తీసుకు వెళ్ళండి” అన్నాడు.
Le traître leur avait donné ce signe: « Celui que je baiserai, c’est lui, saisissez-le, et emmenez-le sûrement. »
45 ౪౫ అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి, “రబ్బీ!” అంటూ ఆయనను ముద్దుపెట్టుకున్నాడు.
Dès qu’il fut arrivé, s’approchant de Jésus, il dit: « Maître! » et il le baisa.
46 ౪౬ అప్పుడు వారు యేసు మీద పడి గట్టిగా పట్టుకున్నారు.
Les autres jetèrent les mains sur lui et l’arrêtèrent.
47 ౪౭ అక్కడ నిలుచున్న వారిలో ఒకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని కొట్టి అతని చెవి నరికి వేశాడు.
Un de ceux qui étaient là, tirant l’épée, en frappa le serviteur du grand prêtre, et lui enleva l’oreille.
48 ౪౮ యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు కత్తులతో గదలతో వచ్చి బంధించడానికి నేను దోపిడీ దొంగనా?
Jésus, prenant la parole, leur dit: « Vous êtes venus comme à un brigand, avec des épées et des bâtons pour me prendre.
49 ౪౯ నేను ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశం చేస్తూ మీతో ఉన్నవాడినే కదా! అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు? లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది.”
Tous les jours j’étais parmi vous, enseignant dans le temple, et vous ne m’avez pas arrêté; mais c’est afin que les Écritures s’accomplissent. »
50 ౫౦ అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు.
Alors tous ses disciples l’abandonnèrent et prirent la fuite.
51 ౫౧ ఒక యువకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతని శరీరం మీద నారబట్ట తప్ప ఇంకేమీ లేదు. వారు అతనిని కూడా పట్టుకున్నారు.
Un jeune homme le suivait, couvert seulement d’un drap; on se saisit de lui;
52 ౫౨ కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు.
mais il lâcha le drap, et s’enfuit nu de leurs mains.
53 ౫౩ వారు యేసుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకు వెళ్ళారు. అక్కడ ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు అందరూ సమావేశమయ్యారు.
Ils emmenèrent Jésus chez le grand prêtre, où s’assemblèrent tous les Princes des prêtres, les scribes et les Anciens.
54 ౫౪ పేతురు యేసుకు దూరంగా ఉండి వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా కూర్చుని మంట దగ్గర చలి కాచుకుంటూ ఉన్నాడు.
Pierre le suivit de loin, jusque dans l’intérieur de la cour du grand prêtre, et s’étant assis près du feu avec les serviteurs, il se chauffait.
55 ౫౫ ముఖ్య యాజకులు, యూదుల మహా సభలోని సభ్యులంతా యేసుకు మరణశిక్ష విధించడానికి తగిన సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు గానీ అది వారికి దొరకలేదు.
Cependant les Princes des prêtres et tout le conseil cherchaient un témoignage contre Jésus pour le faire mourir, et ils n’en trouvaient pas.
56 ౫౬ చాలామంది యేసుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు. కాని, వారి సాక్షాలు ఒకదానితో ఒకటి పొసగలేదు.
Car plusieurs déposèrent faussement contre lui, mais les dépositions ne s’accordaient pas.
57 ౫౭ అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెబుతూ,
Enfin quelques-uns se levant, portèrent contre lui ce faux témoignage:
58 ౫౮ “ఇతడు ‘మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మనుషులు కట్టని మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు.
« Nous l’avons entendu dire: Je détruirai ce temple fait de main d’homme, et en trois jours j’en rebâtirai un autre qui ne sera pas fait de main d’homme. »
59 ౫౯ కాని, వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు.
Mais sur cela même leurs témoignages ne s’accordaient pas.
60 ౬౦ అప్పుడు ప్రధాన యాజకుడు లేచి అందరి సమక్షంలో యేసుతో, “నీవేమీ మాట్లాడవేంటి? వీరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా!” అని యేసును ప్రశ్నించాడు.
Alors le grand prêtre se leva, et venant au milieu, il interrogea Jésus, disant: « Ne réponds-tu rien à ce que ces hommes déposent contre toi? »
61 ౬౧ కాని యేసు మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా?” అని మళ్ళీ యేసును ప్రశ్నించాడు.
Mais Jésus garda le silence et ne répondit rien. Le grand prêtre l’interrogea de nouveau et lui dit: « Es-tu le Christ, le Fils de celui qui est Béni? »
62 ౬౨ అప్పుడు యేసు, “నేనే. మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి వైపున కూర్చుని ఉండటం, పరలోకం నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు” అన్నాడు.
Jésus lui dit: « Je le suis, et vous verrez le Fils de l’homme siéger à la droite de la Puissance, et venir avec des nuées du ciel. »
63 ౬౩ ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకుని, “ఇంకా మనకు సాక్షాలతో ఏం పని?
Alors le grand prêtre déchira ses vêtements et dit: « Qu’avons-nous donc besoin de témoins?
64 ౬౪ ఇతడు దేవ దూషణ చేయడం మీరు విన్నారు కదా! మీరేమంటారు?” అన్నాడు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందరూ తీర్పు చెప్పారు.
Vous avez entendu le blasphème; que vous en semble? » Tous prononcèrent qu’il méritait la mort.
65 ౬౫ అప్పుడు కొందరు యేసు మీద ఉమ్మివేసి, ఆయన కళ్ళకు గంతలు కట్టి, ఆయనను గుద్ది, “ఎవరో ప్రవచించు” అన్నారు. భటులు కూడా ఆయనను కొట్టారు.
Et quelques-uns se mirent à cracher sur lui, et, lui voilant le visage, ils le frappaient du poing, en lui disant: « Fais le prophète! »; et les gardes le rouèrent de coup.
66 ౬౬ పేతురు ఇంటి లోగిట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని పనిపిల్ల అక్కడకు వచ్చింది.
Pendant que Pierre était en bas, dans la cour, il vint une des servantes du grand prêtre;
67 ౬౭ పేతురు చలి కాచుకుంటూ అక్కడ ఉండడం చూసి, “నజరేతు వాడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావుగదా!” అని అతనితో అంది.
et voyant Pierre qui se chauffait, elle le regarda et lui dit: « Toi aussi, tu étais avec Jésus de Nazareth. »
68 ౬౮ పేతురు కాదన్నాడు. “నేను ఆయనను ఎరగను. నీవేం అంటున్నావో నాకు అర్థం కావడం లేదు” అని అన్నాడు. ఆ వెంటనే లేచి ఆవరణలోకి వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది.
Mais il le nia, en disant: « Je ne sais, ni ne comprends ce que tu veux dire. » Puis il s’en alla, gagnant le vestibule; et le coq chanta.
69 ౬౯ ఆ పనిపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వారితో, “ఇతడు వారిలో ఒకడు” అంది.
La servante l’ayant aperçu de nouveau, se mit à dire aux assistants: « Voilà un de ces gens-là. »
70 ౭౦ పేతురు మళ్ళీ కాదన్నాడు. కాసేపటికి పక్కన నిలుచున్నవారు అతనితో, “నిజమే! నువ్వు వాళ్ళలో ఒకడివే. ఎందుకంటే నువ్వు కూడా గలిలయ వాడివే కదా!” అన్నారు.
Et il le nia de nouveau. Un peu après, ceux qui étaient là dirent à Pierre: « Tu es certainement des leurs, car tu es Galiléen. »
71 ౭౧ అయితే పేతురు, “మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో తెలియదు” అంటూ తనను తాను శపించుకోవడం, ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు.
Alors il se mit à faire des imprécations et à dire avec serment: « Je ne connais pas l’homme dont vous parlez. »
72 ౭౨ వెంటనే రెండోసారి కోడి కూసింది. ‘కోడి రెండు సార్లు కూసే ముందే నన్నెరుగనని మూడు సార్లు బొంకుతావు’ అని యేసు తనతో చెప్పిన మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. అతడు దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు.
Et aussitôt, pour la seconde fois, le coq chanta. Et Pierre se souvint de la parole que Jésus lui avait dite: « Avant que le coq ait chanté deux fois, trois fois tu me renieras »; et il se mit à pleurer.