< మార్కు 13 >
1 ౧ యేసు దేవాలయంలో నుండి వస్తూ ఉండగా ఆయన శిష్యుల్లో ఒకడు, “బోధకా! ఈ రాళ్ళు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశావా!” అన్నాడు.
U Yesu pajendaga afume hushi bhaza, umo kati yabho asunda bhakwe ahabhuza, “Mwalimo, enya amawe gahunswisywa na mayumba!”
2 ౨ యేసు అతనితో, “ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు కదా! రాయి మీద రాయి నిలవకుండా ఈ రాళ్ళన్నీ కూలిపోతాయి” అన్నాడు.
Abhula, Mugalola ayumba amagosi? Nalimo ilyalya isangala hatalimo pamwanya yilyenje ilyasa lya igwisiwa paka pansi”.
3 ౩ యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు.
Nawope pali akhele pamwanya yi Gamba ilyi Mizaituni khosi ishibhanzu, Petulo, na Yakobo, Yohana nu Andeleya bhabhuzya husili,
4 ౪ “ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవి జరగడానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా?”
“Tubhule, amambo igagaibhali? Na henu atenyeje amambo paga ifumila?”
5 ౫ యేసు వారితో, “మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా, తప్పుదోవ పట్టించకుండా జాగ్రత పడండి.
U Yesu anda abhabhule, “Mubhanje maso umuntu yayundti asabhatezye.
6 ౬ చాలా మంది నా పేరుతో వచ్చి ‘నేనే ఆయనను’ అంటూ చాలా మందిని మోసం చేస్తారు.
Bhinji bhainza witawalwa ni bhaiyanga, 'Ane nene', na bhai bhatezya abhinji.
7 ౭ మీరు యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు.
Pamwayuvha ivita na itetesi ili vita, mundawogope; amambo igalazima afumile, lelo umwisho gusili.
8 ౮ జనం మీదికి జనం, దేశం మీదికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే.
Insi iyifuma alye ninsi iyinje, utawala akhomane nutawala uwinji. Wayibha antezywa mwunti mwunti munsi, waibha ni zala. Uwo mwanzo wichungu.
9 ౯ మీరు జాగ్రతగా ఉండండి! కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది.
Namwi munje maso. Munafisi nzyinyu maana bhai bhatwala amwe humabalaza nahusinagosi. Mwaikhomwa namwimwayegwa witanzi wa maliwali na watawala kwa ajili yalini, abheshuhuda wa bhene.
10 ౧౦ అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాలి.
Lelo izyo lazima alumbililye wa pansi bhunti.
11 ౧౧ వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ.
Paibhakata nabha vitwililye, munganje awogope huje munzayanje ayenu. Uwakati uwo, mungandasibhe izya munzayanje uwakati uwo pabhuzya saga mwimwe umzayanje ilyanza bhapele uwakati bhula; liyangaji maana sa mweme mwamuyanga yu Roho Uzelu.
12 ౧౨ సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు. అదే విధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు.
Uholo aitaka uhola wakwe huje bhagoje nubaba nu mwana. Umwana ayepaasu ayise bhabho nabhagoje.
13 ౧౩ నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని, చివరి వరకూ సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు.
Mwayegwa nashila muntu hasababu iyitawa lyani. Lelo uwaijimba paka pamalishilo, umuntu uyo aipona.
14 ౧౪ “వినాశకారి అయిన హేయ వస్తువు నిలబడకూడని స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు (ఇది చదివేవాడు గ్రహిస్తాడు గాక) యూదయలో ఉన్నవారు కొండల్లోకి పారిపోవాలి.
Pailola ilyavitililye lyiwima pasaliwaziwa awime (imanyila amanyaje), epo abhali muhati iya Yuda bhanyilaje humagamba,
15 ౧౫ మిద్దె మీద ఉన్న వారు కిందికి దిగి ఇళ్ళలోకి వెళ్ళడం గానీ తమ వస్తువులు తెచ్చుకోవడం గానీ చేయకూడదు.
wope uyali wigulu anganda wishe aweje ivhapansi nyumba au aweje hahunti hali hunzi,
16 ౧౬ పొలాల్లో ఉన్నవారు పై వస్త్రం తెచ్చుకోడానికి వెనక్కి రాకూడదు.
naulihugunda angandaa bhuye aweje umwenda gwakwe.
17 ౧౭ గర్భవతులకూ బాలింతలకూ ఆ రోజుల్లో ఎంతో కష్టం.
Lelo ole wabho abhashi abhikhanda nabhabha wonzya kati yisiku inzyo!
18 ౧౮ ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి.
Mulabhaje huje ingandafumile uwakati uwisasa.
19 ౧౯ ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి. అవి ఇక ముందు రావు కూడా.
Maana waibha na malabha amagosi gala gasa gawahile afumile awande Ungulubhi paumbaga insi, pakaishi, na hamo wala haifumila andtele.
20 ౨౦ దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చెయ్యకపోతే శరీరం ఉన్న ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని, తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు.
Bwana ugabhe haga azipunguzwaga insiku nanumo uwaponaga, lelo kwa ajili yate uliwa, azifupizye insiku izyo.
21 ౨౧ ఆ రోజుల్లో ఎవరైనా మీతో, ‘ఇదుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదుగో అక్కడ ఉన్నాడు’ అంటే నమ్మకండి.
Umuda ugwo umuntu yayunti uwayibhabhula, Enyi, uKilisti ali ipa!' au 'Enyi, pala!' mungandawamini.
22 ౨౨ కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించి తప్పు దారి పట్టిస్తారు.
Maana Akilisti abhilenga nakuwa abhilenga bhaifumila nabhaifumila ivhawenye na hajabu, ili amwe bhabhakhopele, yamukini nateuliwa.
23 ౨౩ అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను.
Mubhanje maso! Imalishe imba bhulile igagundti kabula yu wakati.
24 ౨౪ “ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో, సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు.
Lelo bada yimaimba iginsiku izyo, isanya lwaibhewa ikhisi, umwezi hagwaifumia umwanga gwakwe,
25 ౨౫ ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి.
intontwe zyaigwa afume humwanya, nikhone izywazi lihumwanya zyaiyinga.
26 ౨౬ అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు.
Pailola Umwana Adamu pawinza mabhingo nikhone igosi nusisya.
27 ౨౭ అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిస్తాడు.”
Ipo paituma awandumi bhakwe aibhabhunganya pandimo nateliwa bhakwe ipande zyunti ingosi nzene izinsi, afume humwisho uwidunia upaka umwisho uwimwanya.
28 ౨౮ “అంజూరు చెట్టును చూసి ఈ ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగురించడం చూసి వసంతకాలం వస్తున్నదని మీరు గ్రహిస్తారు.
Munyilaje wipishi ulusamba lubhi ha amatundu gakwe, pamwanya huje ulusanya lulipiphi.
29 ౨౯ అదే విధంగా ఈ సంగతులు జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడనీ, త్వరలో రాబోతున్నాడనీ తెలుసుకోండి.
Isho shashili, pailola amambo igapagafumila, mumanye ahuje alipipe, mundwango.
30 ౩౦ నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ తరం వారు బతికి ఉండగానే ఇవన్నీ జరుగుతాయి.
Lyoli, imbaula, ishizazi sashisizanya hutali kabula ya mambo hagafumile.
31 ౩౧ ఆకాశం, భూమి గతించిపోతాయి. కాని నా మాటలు ఎన్నటికీ గతించవు.
Imwanya ninsi zyainsinzanya, lelo amazyo gani haga insizanya na mwaha.
32 ౩౨ అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు.
Lelo ahusu isiku au isaa, numo uwaminye, hata awandumi ahumwanya, hata Umwana, ila Uyise.
33 ౩౩ జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు.
Munje maso, Pipo sagamumuminye mudashi gaifumila.
34 ౩౪ “ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్ళిన ఒక మనిషిలాగా ఉంటుంది. అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు.
Ishifwani shakwe shili nishi umuntu uwanza asafili: aileshile inyumba yakwe, apela atumwa bhakwe iamuli, nashila muntu imbombo ayakwe. Amula andalyango bhagonaje maso.
35 ౩౫ కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్థరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు.
Bhanji masolelo! Piposaminye painza ubwana uwinyumba huje ulwebhela au usiku umanane, au pazikuga ihanda au ushaphii.
36 ౩౬ ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త!
Asahinze mundunyu abhaje shamugonile.
37 ౩౭ నేను మీకు చెబుతున్నది అందరికి చెప్తున్నాను, మెలకువగా ఉండండి.”
Ili ilimbabula amwe imbabhula mwindti: Bhajimaso”!