< మార్కు 11 >

1 వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అనే గ్రామాలు చేరుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ఇలా అన్నాడు.
And as they were approaching Jerusalem and Bethania, toward the mount of Olives, he sent two of his disciples,
2 “మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇంతవరకూ దాని మీద ఎవరూ ఎన్నడూ స్వారీ చెయ్యలేదు. దాన్ని విప్పి తోలుకు రండి.
and he said to them: “Go into the village that is opposite you, and immediately upon entering there, you will find a colt tied, on which no man has yet sat. Release him and bring him.
3 అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ఇది ప్రభువుకు అవసరం’ అనండి. వెంటనే అతడు దాన్ని పంపిస్తాడు.”
And if anyone will say to you: ‘What are you doing?’ Say that the Lord has need of him. And he will immediately send him here.”
4 శిష్యులు వెళ్ళి, ఒక ఇంటి ముందు వీధిలో ఒక గాడిద పిల్ల ఉండడం చూసి, దాన్ని విప్పుతుండగా
And going out, they found the colt tied before the outer gate, at the meeting of two ways. And they untied him.
5 అక్కడ ఉన్న కొందరు వారితో, “మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?” అని అడిగారు.
And some of those who were standing there said to them, “What are you doing by releasing the colt?”
6 శిష్యులు యేసు చెప్పమన్నట్టే వారికి చెప్పారు. వెంటనే ఆ మనుషులు వారిని వెళ్ళనిచ్చారు.
And they spoke to them just as Jesus had instructed them. And they permitted them.
7 వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరికి తీసుకు వచ్చి తమ వస్త్రాలను దాని మీద పరిచారు. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు.
And they led the colt to Jesus. And they placed their garments on it; and he sat upon it.
8 చాలామంది ప్రజలు తమ వస్త్రాలు దారి పొడవునా పరిచారు. ఇంకొందరు చెట్ల కొమ్మలను నరికి దారిన పరిచారు.
Then many spread their garments along the way; but others cut down leafy branches from trees and scattered them on the way.
9 ముందు, వెనక నడుస్తున్న వారు కేకలు వేస్తూ, “జయం! ప్రభువు పేరిట వచ్చేవాడు ధన్యుడు!
And those who went ahead, and those who followed, cried out saying: “Hosanna! Blessed is he who has arrived in the name of the Lord.
10 ౧౦ రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యం. సర్వోన్నతమైన స్థలాల్లో జయం!” అని బిగ్గరగా కేకలు వేశారు.
Blessed is the advent of the kingdom of our father David. Hosanna in the highest!”
11 ౧౧ యేసు యెరూషలేము పట్టణ దేవాలయంలోకి ప్రవేశించాడు. చుట్టూ ఉన్న అన్నిటినీ చూశాడు. అప్పటికే పొద్దుపోవడం వల్ల ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కలిసి బేతనీకి వెళ్ళాడు.
And he entered into Jerusalem, into the temple. And having looked around at everything, since it was now the evening hour, he went out to Bethania with the twelve.
12 ౧౨ మరుసటి రోజు బేతనీ నుండి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది.
And the next day, as they were departing from Bethania, he was hungry.
13 ౧౩ కొంత దూరంలో ఆకులున్న అంజూరు చెట్టు ఆయనకు కనిపించింది. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయేమో అని చూడడానికి దగ్గరికి వెళ్ళాడు. కాని, అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు.
And when he had seen a fig tree with leaves in the distance, he went to it, in case he might find something on it. And when he had gone to it, he found nothing but leaves. For it was not the season for figs.
14 ౧౪ ఆయన ఆ చెట్టుతో, “ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు” అన్నాడు. ఆయన పలికినది శిష్యులు విన్నారు. (aiōn g165)
And in response, he said to it, “From now on and forever, may no one eat fruit from you again!” And his disciples heard this. (aiōn g165)
15 ౧౫ వారు యెరూషలేము వచ్చినప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించి, వ్యాపారం చేస్తున్నవారిని తరిమి వేయడం ప్రారంభించాడు. డబ్బు మార్చే వ్యాపారుల బల్లలు, పావురాలు అమ్ముతున్న వారి పీటలు పడదోశాడు.
And they went to Jerusalem. And when he had entered into the temple, he began to cast out the sellers and the buyers in the temple. And he overturned the tables of the moneychangers and the chairs of the vendors of doves.
16 ౧౬ దేవాలయం గుండా ఎవ్వరూ సరుకులు మోసుకుపోకుండా చేశాడు.
And he would not permit anyone to carry goods through the temple.
17 ౧౭ ఆయన వారికి బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జాతులకూ ప్రార్థనా ఆలయం అంటారు’ అని రాసి లేదా? కానీ మీరు దాన్ని దోపిడి దొంగల గుహగా చేశారు” అన్నాడు.
And he taught them, saying: “Is it not written: ‘For my house shall be called the house of prayer for all nations?’ But you have made it into a den of robbers.”
18 ౧౮ ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆ మాట విని ఆయనను ఎలా చంపాలా అని ఆలోచించారు గానీ అక్కడ ఉన్న ప్రజలంతా యేసు బోధకు ఆశ్చర్య చకితులై ఉండడం వల్ల ఆయనకు భయపడ్డారు.
And when the leaders of the priests, and the scribes, had heard this, they sought a means by which they might destroy him. For they feared him, because the entire multitude was in admiration over his doctrine.
19 ౧౯ సాయంకాలమైనప్పుడు ఆయన, ఆయన శిష్యులు పట్టణం విడిచి వెళ్ళిపోయారు.
And when evening had arrived, he departed from the city.
20 ౨౦ తరువాతి రోజు ఉదయం వారు ఆ దారిన నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు.
And when they passed by in the morning, they saw that the fig tree had dried up from the roots.
21 ౨౧ అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వచ్చి ఆయనతో, “రబ్బీ! నీవు శపించిన అంజూరు చెట్టు ఎండిపోయింది” అన్నాడు.
And Peter, remembering, said to him, “Master, behold, the fig tree that you cursed has withered.”
22 ౨౨ అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుని మీద విశ్వాసం ఉంచండి.
And in response, Jesus said to them: “Have the faith of God.
23 ౨౩ మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది.
Amen I say to you, that whoever will say to this mountain, ‘Be taken up and cast into the sea,’ and who will not have hesitated in his heart, but will have believed: then whatever he has said be done, it shall be done for him.
24 ౨౪ అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.
For this reason, I say to you, all things whatsoever that you ask for when praying: believe that you will receive them, and they will happen for you.
25 ౨౫ అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి.
And when you stand to pray, if you hold anything against anyone, forgive them, so that your Father, who is in heaven, may also forgive you your sins.
26 ౨౬ అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”
But if you will not forgive, neither will your Father, who is in heaven, forgive you your sins.”
27 ౨౭ యేసు, ఆయన శిష్యులు యెరూషలేము చేరుకున్నారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉండగా ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి
And they went again to Jerusalem. And when he was walking in the temple, the leaders of the priests, and the scribes, and the elders approached him.
28 ౨౮ ఆయనతో, “నీవు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు? ఈ పనులు చేయడానికి అధికారం నీకెవరిచ్చారు?” అని అడిగారు.
And they said to him: “By what authority do you do these things? And who has given you this authority, so that you would do these things?”
29 ౨౯ యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో మీకు చెబుతాను.
But in response, Jesus said to them: “I also will ask you one word, and if you answer me, I will tell you by what authority I do these things.
30 ౩౦ యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా మనుషుల నుండా? చెప్పండి” అన్నాడు.
The baptism of John: was it from heaven or from men? Answer me.”
31 ౩౧ వారు ఆ విషయాన్ని గురించి తమలో తాము ఈ విధంగా చర్చించుకున్నారు. “‘మనం పరలోకం నుండి’ అని అంటే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు?’ అంటాడు.
But they discussed it among themselves, saying: “If we say, ‘From heaven,’ he will say, ‘Then why did you not believe him?’
32 ౩౨ ‘మనుషుల నుండి’ అంటే ప్రజలకు మన మీద కోపం వస్తుంది” అనుకున్నారు. ఎందుకంటే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ నమ్మేవారు.
If we say, ‘From men,’ we fear the people. For they all hold that John was a true prophet.”
33 ౩౩ కనుక వారు, “మాకు తెలియదు” అని జవాబు చెప్పారు. యేసు, “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను” అన్నాడు.
And answering, they said to Jesus, “We do not know.” And in response, Jesus said to them, “Neither will I tell you by what authority I do these things.”

< మార్కు 11 >