< మార్కు 10 >
1 ౧ యేసు ఆ ప్రాంతం విడిచి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తరువాత యొర్దాను నదికి అవతల ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారు. ఎప్పటిలాగే యేసు వారికి ఉపదేశం చేశాడు.
Potem wyruszył stamtąd i przyszedł w granice Judei przez krainę [leżącą] za Jordanem; i ponownie zeszli się do niego ludzie, i znowu ich nauczał, jak miał w zwyczaju.
2 ౨ కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించే ఉద్దేశంతో, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మమేనా?” అని అడిగారు.
Wtedy faryzeusze podeszli i pytali go: Czy wolno mężowi oddalić żonę? A [robili to], wystawiając go na próbę.
3 ౩ యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు.
Lecz on im odpowiedział: Co wam nakazał Mojżesz?
4 ౪ వారు, “విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు” అన్నారు.
A oni powiedzieli: Mojżesz pozwolił napisać list rozwodowy i oddalić [ją].
5 ౫ యేసు, “మీరు దేవునికి లోబడని వారు, కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు.
Jezus odpowiedział im: Z powodu zatwardziałości waszego serca napisał wam to przykazanie.
6 ౬ కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు.
Lecz od początku stworzenia Bóg uczynił ich mężczyzną i kobietą.
7 ౭ అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు.
Dlatego opuści mężczyzna swego ojca i matkę i połączy się ze swoją żoną;
8 ౮ వారిద్దరు ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు.
I będą dwoje jednym ciałem. A tak już nie są dwoje, ale jedno ciało.
9 ౯ కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషీ వేరు చేయకూడదు” అని వారితో చెప్పాడు.
Co więc Bóg złączył, człowiek niech nie rozłącza.
10 ౧౦ అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు.
A w domu jego uczniowie znowu go o to pytali.
11 ౧౧ యేసు, “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే.
I powiedział im: Kto oddala swą żonę i żeni się z inną, cudzołoży wobec niej.
12 ౧౨ అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు.
A jeśli kobieta opuści swego męża i wyjdzie za innego, cudzołoży.
13 ౧౩ యేసు తమ చిన్న బిడ్డలను తాకాలని కొంతమంది వారిని తీసుకు వచ్చారు గాని, శిష్యులు వారిని అడ్డుకున్నారు.
I przynoszono do niego dzieci, aby ich dotknął, ale uczniowie gromili tych, którzy je przynosili.
14 ౧౪ ఇది చూసి యేసుకు చాలా బాధ కలిగింది. ఆయన శిష్యులతో, “చిన్న బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆపకండి. దేవుని రాజ్యం చిన్నపిల్లల్లాంటి వారిదే.
Gdy Jezus to zobaczył, oburzył się i powiedział do nich: Pozwólcie dzieciom przychodzić do mnie i nie zabraniajcie im. Do takich bowiem należy królestwo Boże.
15 ౧౫ మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారు అందులో ఎన్నడూ ప్రవేశించరు” అన్నాడు.
Zaprawdę powiadam wam: Kto nie przyjmie królestwa Bożego jak dziecko, nie wejdzie do niego.
16 ౧౬ ఆయన ఆ చిన్నపిల్లలను దగ్గరికి పిలిచి వారిపై చేతులుంచి వారిని దీవించాడు.
I brał je na ręce, a kładąc na nie ręce, błogosławił je.
17 ౧౭ ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు. (aiōnios )
A gdy wyruszał w drogę, przybiegł pewien [człowiek], upadł przed nim na kolana i zapytał: Nauczycielu dobry, co mam czynić, aby odziedziczyć życie wieczne? (aiōnios )
18 ౧౮ యేసు, “నేను మంచి వాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు.
Lecz Jezus mu odpowiedział: Dlaczego nazywasz mnie dobrym? Nikt nie jest dobry, tylko jeden – Bóg.
19 ౧౯ దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి” అన్నాడు.
Znasz przykazania: Nie będziesz cudzołożył, nie będziesz zabijał, nie będziesz kradł, nie będziesz mówił fałszywego świadectwa, nie będziesz oszukiwał, czcij swego ojca i matkę.
20 ౨౦ అతడు ఆయనతో, “బోధకా, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను” అని అన్నాడు.
A on mu odpowiedział: Nauczycielu, tego wszystkiego przestrzegałem od mojej młodości.
21 ౨౧ యేసు అతన్ని చూస్తూ, అతనిపై ప్రేమ భావం కలిగి ఇలా అన్నాడు, “నీకు ఒకటి తక్కువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు” అని అన్నాడు.
Wtedy Jezus, spojrzawszy na niego, umiłował go i powiedział: Jednego ci brakuje. Idź, sprzedaj wszystko, co masz i rozdaj ubogim, a będziesz miał skarb w niebie. Potem przyjdź, weź krzyż i chodź za mną.
22 ౨౨ అతడు గొప్ప సంపన్నుడు గనక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
Lecz on zmartwił się z powodu tych słów i odszedł smutny, miał bowiem wiele dóbr.
23 ౨౩ యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం” అని అన్నాడు.
A Jezus, spojrzawszy wokoło, powiedział do swoich uczniów: Jakże trudno tym, którzy mają bogactwa, wejść do królestwa Bożego!
24 ౨౪ ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. యేసు మళ్ళీ, “పిల్లలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం!
I uczniowie zdumieli się jego słowami. Lecz Jezus znowu powiedział: Dzieci, jakże trudno jest tym, którzy ufają bogactwom, wejść do królestwa Bożego!
25 ౨౫ ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళడం సులభం” అన్నాడు.
Łatwiej jest wielbłądowi przejść przez ucho igielne, niż bogatemu wejść do królestwa Bożego.
26 ౨౬ ఇది విని శిష్యులు ఇంకా ఆశ్చర్యపడ్డారు. వారు “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు.
A oni tym bardziej się zdumiewali i mówili między sobą: Któż więc może być zbawiony?
27 ౨౭ యేసు వారి వైపు చూసి, “మనుషులకు ఇది అసాధ్యమే గాని, దేవునికి కాదు. దేవునికి అన్నీ సాధ్యమే” అన్నాడు.
A Jezus, spojrzawszy na nich, powiedział: U ludzi to niemożliwe, ale nie u Boga. U Boga bowiem wszystko jest możliwe.
28 ౨౮ పేతురు ఆయనతో, “ఇదిగో, మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా!” అన్నాడు.
Wtedy Piotr zaczął mówić do niego: Oto my opuściliśmy wszystko i poszliśmy za tobą.
29 ౨౯ అందుకు యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నా కోసం, సువార్త కోసం, తన ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, ఆస్తులను వదిలిపెట్టిన వాడు.
A Jezus odpowiedział: Zaprawdę powiadam wam: Nie ma nikogo, kto by opuścił dom, braci lub siostry, ojca lub matkę, żonę, dzieci lub pole ze względu na mnie i na ewangelię;
30 ౩౦ ఇప్పుడు ఈ లోకంలో హింసలతో బాటు ఇళ్ళు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, ఆస్తులు, రానున్న లోకంలో శాశ్వత జీవం పొందుతాడు. (aiōn , aiōnios )
A kto by nie otrzymał stokrotnie [więcej] teraz, w tym czasie, domów, braci, sióstr, matek, dzieci i pól, wśród prześladowań, a w przyszłym świecie życia wiecznego. (aiōn , aiōnios )
31 ౩౧ కాని, మొదటివారు చాలా మంది చివరివారు అవుతారు, చివరివారు చాలా మంది మొదటివారు అవుతారు” అన్నాడు.
Ale wielu pierwszych będzie ostatnimi, a ostatnich pierwszymi.
32 ౩౨ యేసు, ఆయనతో ఉన్నవారంతా యెరూషలేము బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. ఆయనను అనుసరిస్తున్న ఇతరులు భయపడ్డారు. యేసు మళ్ళీ తన శిష్యులను పక్కకు పిలిచి, తనకు జరగబోయే వాటిని గురించి వారికి చెప్పాడు.
I byli w drodze, zdążając do Jerozolimy, a Jezus szedł przed nimi. I zdumiewali się, a idąc za nim, bali się. On zaś znowu wziął ze sobą dwunastu i zaczął im mówić o tym, co miało go spotkać:
33 ౩౩ ఆయన, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకు, ధర్మశాస్త్ర పండితులకు అప్పగిస్తారు. వారు ఆయనకు మరణశిక్ష విధించి, యూదేతర ప్రజలకు అప్పగిస్తారు.
Oto idziemy do Jerozolimy, a Syn Człowieczy zostanie wydany naczelnym kapłanom i uczonym w Piśmie. Oni skażą go na śmierć i wydadzą poganom.
34 ౩౪ వారు ఆయనను హేళన చేసి, ఆయన మీద ఉమ్మివేస్తారు. కొరడా దెబ్బలు కొడతారు, ఆ తరువాత చంపేస్తారు. మూడవ రోజున ఆయన మళ్ళీ సజీవంగా లేస్తాడు” అని వారితో చెప్పాడు.
I będą się z niego naśmiewać, ubiczują go, będą na niego pluć i zabiją go, ale trzeciego dnia zmartwychwstanie.
35 ౩౫ జెబెదయి కుమారులు యాకోబు, యోహాను ఆయన దగ్గరికి వచ్చి, “బోధకా! మేము అడిగింది మాకు అనుగ్రహిస్తావా?” అని అడిగారు.
Wtedy podeszli do niego Jakub i Jan, synowie Zebedeusza, i powiedzieli: Nauczycielu, chcemy, żebyś zrobił dla nas to, o co cię poprosimy.
36 ౩౬ ఆయన, “నేనేం చెయ్యాలని మీరు కోరుతున్నారు?” అని ప్రశ్నించాడు.
A on ich zapytał: Co chcecie, żebym dla was zrobił?
37 ౩౭ వారు, “నీవు మహిమలో మాలో ఒకరిని నీ కుడిచేతి వైపు, మరొకరిని ఎడమచేతి వైపు కూర్చోబెట్టుకో” అన్నారు.
Odpowiedzieli mu: Spraw, abyśmy siedzieli jeden po twojej prawej, a drugi po lewej stronie w twojej chwale.
38 ౩౮ యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను తాగిన దాన్ని మీరు తాగగలరా? నేను పొందే బాప్తిసం మీరు పొందగలరా?” అని అడిగాడు.
Lecz Jezus im powiedział: Nie wiecie, o co prosicie. Czy możecie pić kielich, który ja piję, i być ochrzczeni chrztem, którym ja się chrzczę?
39 ౩౯ వారు, “పొందగలం” అని జవాబు చెప్పారు. యేసు వారితో, “నేను తాగిన దాన్ని మీరు తాగుతారు, నేను పొందిన బాప్తిసం మీరు పొందుతారు.
Odpowiedzieli mu: Możemy. A Jezus im powiedział: Istotnie, kielich, który ja piję, będziecie pić i chrztem, którym ja się chrzczę, będziecie ochrzczeni.
40 ౪౦ కాని, నా కుడి వైపు, నా ఎడమవైపు కూర్చోడానికి అనుమతించేది నేను కాదు. ఆ స్థానాలు ఎవరి కోసం సిద్ధం చేసి ఉన్నాయో వారికే అవి దొరుకుతాయి” అన్నాడు.
Nie do mnie jednak należy danie miejsca po mojej prawej albo lewej stronie, ale [będzie dane] tym, którym zostało przygotowane.
41 ౪౧ ఇది విని మిగతా పదిమందికి యాకోబు, యోహానుల మీద కోపం వచ్చింది.
A gdy dziesięciu to usłyszało, zaczęli się oburzać na Jakuba i Jana.
42 ౪౨ అయితే యేసు వారిని దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు, “అన్యజనుల అధికారులు ప్రజల మీద తమ ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు. వారిలో ప్రముఖులు వారిపై అధికారం చెలాయిస్తారు.
Ale Jezus przywołał ich [do siebie] i powiedział: Wiecie, że ci, którzy uchodzą za władców narodów, panują nad nimi, a ich wielcy sprawują nad nimi swą władzę.
43 ౪౩ మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు కావాలనుకొనేవాడు సేవకుడై ఉండాలి.
Lecz nie tak ma być wśród was, ale kto między wami chce być wielki, [niech] będzie waszym sługą.
44 ౪౪ మీలో మొదటివాడు కావాలని కోరేవాడు అందరికీ దాసుడై ఉండాలి.
A kto z was chce być pierwszy, [niech] będzie sługą wszystkich.
45 ౪౫ ఎందుకంటే మనుష్య కుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు, సేవ చేయడానికీ, అందరి పక్షాన తన ప్రాణాన్ని వెలగా ధార పోయడానికి వచ్చాడు.”
Bo i Syn Człowieczy nie przyszedł, aby mu służono, ale aby służyć i aby dać swe życie na okup za wielu.
46 ౪౬ ఆ తరువాత వారు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వారితో ఉన్న జనసమూహం ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఉన్నాడు. అతడు భిక్షగాడు.
I przyszli do Jerycha. A gdy on wychodził z Jerycha ze swoimi uczniami oraz mnóstwem ludzi, ślepy Bartymeusz, syn Tymeusza, siedział przy drodze, żebrząc.
47 ౪౭ ఆ గుడ్డివాడు, వస్తున్నది నజరేయుడైన యేసు అని తెలుసుకుని, “యేసూ! దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని కేకలు పెట్టసాగాడు.
A słysząc, że to Jezus z Nazaretu, zaczął wołać: Jezusie, Synu Dawida, zmiłuj się nade mną!
48 ౪౮ చాలా మంది అతణ్ణి గద్దించి ఊరుకోమన్నారు. కాని ఆ గుడ్డివాడు, “దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు.
I wielu nakazywało mu milczeć. Lecz on tym głośniej wołał: Synu Dawida, zmiłuj się nade mną!
49 ౪౯ యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అన్నాడు. ప్రజలు ఆ గుడ్డివానితో, “ధైర్యంగా ఉండు! లే! ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అన్నారు.
Wtedy Jezus zatrzymał się i kazał go zawołać. Zawołali więc ślepego i powiedzieli do niego: Ufaj! Wstań, woła cię.
50 ౫౦ ఆ గుడ్డివాడు తాను కప్పుకొన్న పైబట్టను అవతల పారవేసి, గభాలున లేచి యేసు దగ్గరికి వెళ్ళాడు.
A on zrzucił swój płaszcz, wstał i przyszedł do Jezusa.
51 ౫౧ యేసు, “ఏం కావాలి?” అని అడిగాడు. ఆ గుడ్డివాడు, “రబ్బీ! నాకు మళ్లీ చూపు ప్రసాదించు” అని వేడుకున్నాడు.
I zapytał go Jezus: Co chcesz, abym ci uczynił? Ślepiec mu odpowiedział: Mistrzu, żebym widział.
52 ౫౨ యేసు, “నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది, ఇక వెళ్ళు” అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయనతో వెళ్ళాడు.
A Jezus mu powiedział: Idź, twoja wiara cię uzdrowiła. Zaraz też odzyskał wzrok i szedł drogą za Jezusem.