< మార్కు 1 >

1 దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన సువార్త ఆరంభం.
The beginning of the gospel of Jesus Christ the Son of God;
2 యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, “ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు.
As it is written in the prophets, Behold, I send my messenger before thy face, who shall prepare thy way before thee;
3 ‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి, ఆయన దారులు తిన్నగా చేయండి’ అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.”
The voice of one crying in the wilderness, Prepare ye the way of the Lord, make his paths straight.
4 యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు.
John was baptizing in the wilderness, and preaching the baptism of repentance, for the remission of sins.
5 యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు.
And there went out to him all the land of Judea, and they of Jerusalem, and were all baptized by him in the river Jordan, confessing their sins.
6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం.
And John was clothed with camels hair, and with a girdle of a skin about his loins; and he ate locusts and wild honey;
7 యోహాను, “నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను” అని ప్రకటించాడు.
And preached, saying, There cometh after me one mightier than I, the latchet of whose shoes I am not worthy to stoop down and unloose.
8 “నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు.
I indeed have baptized you with water: but he will baptize you with the Holy Spirit.
9 యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు.
And it came to pass in those days, that Jesus came from Nazareth to Galilee, and was baptized by John in Jordan.
10 ౧౦ యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు.
And immediately coming up out of the water, he saw the heavens opened, and the Spirit like a dove descending upon him.
11 ౧౧ అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.”
And there came a voice from heaven, [saying], Thou art my beloved Son, in whom I am well pleased.
12 ౧౨ వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు.
And immediately the spirit driveth him into the wilderness.
13 ౧౩ ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.
And he was there in the wilderness forty days tempted by Satan: and was with the wild beasts, and the angels ministered to him.
14 ౧౪ యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ,
Now after John was put in prison, Jesus came into Galilee, preaching the gospel of the kingdom of God,
15 ౧౫ “కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు.
And saying, The time is fulfilled, and the kingdom of God is at hand: repent ye, and believe the gospel.
16 ౧౬ ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు.
Now as he was walking by the sea of Galilee, he saw Simon, and Andrew his brother, casting a net into the sea: for they were fishers.
17 ౧౭ యేసు, “నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని వారితో అన్నాడు.
And Jesus said to them, Come ye after me, and I will make you to become fishers of men.
18 ౧౮ వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
And immediately they forsook their nets, and followed him.
19 ౧౯ ఆయన ఇంకా కొంతదూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు.
And when he had gone a little further thence, he saw James the [son] of Zebedee, and John his brother, who also were in the boat mending their nets.
20 ౨౦ వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు.
And immediately he called them: and they left their father Zebedee in the boat with the hired servants, and went after him.
21 ౨౧ తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు.
And they went into Capernaum; and immediately on the sabbath he entered into the synagogue and taught.
22 ౨౨ ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు.
And they were astonished at his doctrine: for he taught them as one that had authority, and not as the scribes.
23 ౨౩ అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు.
And there was in their synagogue a man with an unclean spirit; and he cried out,
24 ౨౪ వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు.
Saying, Let [us] alone; what have we to do with thee, thou Jesus of Nazareth? art thou come to destroy us? I know thee who thou art, the Holy One of God.
25 ౨౫ యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు.
And Jesus rebuked him, saying, Hold thy peace, and come out of him.
26 ౨౬ ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది.
And when the unclean spirit had torn him, and cried with a loud voice, he came out of him.
27 ౨౭ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు.
And they were all amazed, so that they questioned among themselves, saying, What thing is this? what new doctrine [is] this? for with authority he commandeth even the unclean spirits, and they obey him.
28 ౨౮ ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.
And immediately his fame spread abroad throughout all the region around Galilee.
29 ౨౯ సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు.
And forthwith, when they had come out of the synagogue, they entered into the house of Simon and Andrew, with James and John.
30 ౩౦ సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు.
But the mother of Simon's wife lay sick with a fever; and forthwith they tell him of her.
31 ౩౧ ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది.
And he came and took her by the hand, and lifted her up; and immediately the fever left her, and she ministered to them.
32 ౩౨ సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు.
And at evening, when the sun had set, they brought to him all that were diseased, and them that were possessed with demons.
33 ౩౩ ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు.
And all the city was gathered at the door.
34 ౩౪ రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
And he healed many that were sick with divers diseases, and cast out many demons; and suffered not the demons to speak, because they knew him.
35 ౩౫ ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు.
And in the morning, rising a great while before day, he went out and departed into a solitary place, and there prayed.
36 ౩౬ సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు.
And Simon, and they that were with him, followed after him.
37 ౩౭ ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు.
And when they had found him, they said to him, All [men] seek for thee.
38 ౩౮ ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు.
And he said to them, Let us go into the next towns, that I may preach there also: for, for this purpose have I come.
39 ౩౯ ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
And he preached in their synagogues throughout all Galilee, and cast out demons.
40 ౪౦ ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు.
And there came a leper to him, beseeching him, and kneeling down to him, and saying to him, If thou wilt, thou canst make me clean.
41 ౪౧ యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు.
And Jesus, moved with compassion, put forth [his] hand, and touched him, and saith to him, I will; be thou clean.
42 ౪౨ వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు.
And as soon as he had spoken, immediately the leprosy departed from him, and he was cleansed.
43 ౪౩ ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి,
And he strictly charged him, and forthwith sent him away;
44 ౪౪ “నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు.
And saith to him, See thou say nothing to any man; but go, show thyself to the priest, and offer for thy cleansing those things which Moses commanded, for a testimony to them.
45 ౪౫ కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.
But he went out, and began to publish [it] much, and to blaze abroad the matter, so that Jesus could no more openly enter into the city, but was without in desert places: and they came to him from every quarter.

< మార్కు 1 >