< మలాకీ 1 >

1 ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ప్రవక్త ద్వారా చెప్పబడిన యెహోవా వాక్కు.
מַשָּׂא דְבַר־יְהֹוָה אֶל־יִשְׂרָאֵל בְּיַד מַלְאָכִֽי׃
2 యెహోవా ఈ విధంగా అంటున్నాడు. “నేను మీ పట్ల ప్రేమ కనపరిచాను. అయితే మీరు ‘ఏ విషయంలో నీవు మా పట్ల ప్రేమ చూపించావు?’ అంటారు. ఏశావు యాకోబుకు అన్న కదా. నేను యాకోబును ప్రేమించాను.
אָהַבְתִּי אֶתְכֶם אָמַר יְהֹוָה וַֽאֲמַרְתֶּם בַּמָּה אֲהַבְתָּנוּ הֲלוֹא־אָח עֵשָׂו לְיַֽעֲקֹב נְאֻם־יְהֹוָה וָאֹהַב אֶֽת־יַעֲקֹֽב׃
3 ఏశావును ద్వేషించాను. అతని నివాస స్థలాలను పాడుచేసి అతని ఆస్తిని ఎడారిలో ఉన్న నక్కలపాలు చేశాను.”
וְאֶת־עֵשָׂו שָׂנֵאתִי וָאָשִׂים אֶת־הָרָיו שְׁמָמָה וְאֶת־נַחֲלָתוֹ לְתַנּוֹת מִדְבָּֽר׃
4 “మనం నాశనమై పోయాం. రండి, పాడైపోయిన మన నివాస స్థలాలు తిరిగి నిర్మించుకుందాం” అని ఎదోమీయులు అనుకొంటారు. అయితే సైన్యాలకు అధిపతియైన యెహోవా చెబుతున్నది ఏమిటంటే, వారు మళ్ళీ నిర్మించుకొన్నప్పటికీ నేను వాటిని క్రింద పడదోసి నాశనం చేస్తాను. వాళ్ళ దేశం భక్తిహీనుల ప్రదేశమనీ, వాళ్ళపై యెహోవా కోపం నిత్యమూ నిలిచి ఉంటుందని ఇతర ప్రజలు అంటారు.
כִּי־תֹאמַר אֱדוֹם רֻשַּׁשְׁנוּ וְנָשׁוּב וְנִבְנֶה חֳרָבוֹת כֹּה אָמַר יְהֹוָה צְבָאוֹת הֵמָּה יִבְנוּ וַאֲנִי אֶהֱרוֹס וְקָרְאוּ לָהֶם גְּבוּל רִשְׁעָה וְהָעָם אֲשֶׁר־זָעַם יְהֹוָה עַד־עוֹלָֽם׃
5 కళ్ళారా దాన్ని చూసిన మీరు “ఇశ్రాయేలు ప్రజల సరిహద్దుల అవతల కూడా యెహోవా గొప్పవాడు” అంటారు.
וְעֵינֵיכֶם תִּרְאֶינָה וְאַתֶּם תֹּֽאמְרוּ יִגְדַּל יְהֹוָה מֵעַל לִגְבוּל יִשְׂרָאֵֽל׃
6 “కుమారుడు తన తండ్రిని గొప్ప చేస్తాడు గదా, దాసుడు తన యజమానుని ఘనపరుస్తాడు గదా. నా గొప్పదనాన్ని నిర్లక్ష్యం చేసే యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయింది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు?” అని సేనల ప్రభువైన యెహోవా మిమ్మల్ని అడిగినప్పుడు “నీ నామాన్ని మేము ఏ విధంగా నిర్లక్ష్యం చేశాం?” అని మీరు అంటారు.
בֵּן יְכַבֵּד אָב וְעֶבֶד אֲדֹנָיו וְאִם־אָב אָנִי אַיֵּה כְבוֹדִי וְאִם־אֲדוֹנִים אָנִי אַיֵּה מוֹרָאִי אָמַר ׀ יְהֹוָה צְבָאוֹת לָכֶם הַכֹּֽהֲנִים בּוֹזֵי שְׁמִי וַאֲמַרְתֶּם בַּמֶּה בָזִינוּ אֶת־שְׁמֶֽךָ׃
7 మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన ఆహారం నాకు అర్పిస్తూ “ఏమి చేసి నిన్ను అపవిత్రపరచాం?” అంటారు. “యెహోవా భోజనపు బల్లను అవమాన పరచడం వల్లనే గదా
מַגִּישִׁים עַֽל־מִזְבְּחִי לֶחֶם מְגֹאָל וַֽאֲמַרְתֶּם בַּמֶּה גֵאַלְנוּךָ בֶּאֱמׇרְכֶם שֻׁלְחַן יְהֹוָה נִבְזֶה הֽוּא׃
8 గుడ్డి దాన్ని బలిగా అర్పించినప్పుడు అది దోషమే కదా. కుంటి దాన్ని, జబ్బు పడిన దాన్ని అర్పించినప్పుడు అది దోషం కాదా? అలాంటి వాటిని మీ యజమానికి ఇస్తే అతడు మిమ్మల్ని స్వీకరిస్తాడా? మిమ్మల్ని కనికరిస్తాడా?” అని సేనల ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు.
וְכִֽי־תַגִּישׁוּן עִוֵּר לִזְבֹּחַ אֵין רָע וְכִי תַגִּישׁוּ פִּסֵּחַ וְחֹלֶה אֵין רָע הַקְרִיבֵהוּ נָא לְפֶחָתֶךָ הֲיִרְצְךָ אוֹ הֲיִשָּׂא פָנֶיךָ אָמַר יְהֹוָה צְבָאֽוֹת׃
9 ఇప్పుడు దయ చూపమని ఆయనను ప్రాధేయపడండి. మీరే గదా ఆయనను అవమాన పరచారు. మీరు చేసిన పనులను బట్టి మీలో ఎవరినైనా ఆయన స్వీకరిస్తాడా? అని సేనల ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు.
וְעַתָּה חַלּוּ־נָא פְנֵי־אֵל וִֽיחׇנֵּנוּ מִיֶּדְכֶם הָיְתָה זֹּאת הֲיִשָּׂא מִכֶּם פָּנִים אָמַר יְהֹוָה צְבָאֽוֹת׃
10 ౧౦ “మీరు నా బలిపీఠం మీద వ్యర్థంగా నిప్పు రాజబెట్టకుండా మీలో ఒకడు నా ఆలయం ద్వారాలు మూసివేస్తే ఎంత బాగుండేది? మీరంటే నాకు ఇష్టం లేదు, మీరు అర్పించే నైవేద్యాలను నేను స్వీకరించను” అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.
מִי גַם־בָּכֶם וְיִסְגֹּר דְּלָתַיִם וְלֹא־תָאִירוּ מִזְבְּחִי חִנָּם אֵֽין־לִי חֵפֶץ בָּכֶם אָמַר יְהֹוָה צְבָאוֹת וּמִנְחָה לֹא־אֶרְצֶה מִיֶּדְכֶֽם׃
11 ౧౧ తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకూ ఇతర దేశాల ప్రజల్లో నా పేరును అంతా గౌరవిస్తారు. అన్ని ప్రాంతాల్లో నా పేరుకు ధూప నైవేద్యాలు, పవిత్రమైన అర్పణలు అర్పిస్తారు. అన్య దేశాల ప్రజల్లో నా పేరును ఉన్నతంగా ఎంచుతారు. అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.
כִּי מִמִּזְרַח־שֶׁמֶשׁ וְעַד־מְבוֹאוֹ גָּדוֹל שְׁמִי בַּגּוֹיִם וּבְכׇל־מָקוֹם מֻקְטָר מֻגָּשׁ לִשְׁמִי וּמִנְחָה טְהוֹרָה כִּֽי־גָדוֹל שְׁמִי בַּגּוֹיִם אָמַר יְהֹוָה צְבָאֽוֹת׃
12 ౧౨ మీరైతే యెహోవా బల్ల అపవిత్రమని, దాని మీద ఉంచిన ఆహారం నీచమైనదని అనుకుంటూ దానికి అవమానం కలిగిస్తున్నారు.
וְאַתֶּם מְחַלְּלִים אוֹתוֹ בֶּאֱמׇרְכֶם שֻׁלְחַן אֲדֹנָי מְגֹאָל הוּא וְנִיבוֹ נִבְזֶה אׇכְלֽוֹ׃
13 ౧౩ అయ్యో, ఇదంతా చేయడం వ్యర్ధమని ఆ బల్లను తిరస్కరిస్తున్నారు అని ఆయన సెలవిస్తున్నాడు. ఇది సేనల ప్రభువైన యెహోవా వాక్కు. దోచుకున్నదానినీ, కుంటిదానినీ, జబ్బు గలదానినీ మీరు తీసుకువచ్చి బలిగా అర్పించినప్పుడు అలాంటి వాటిని నేను స్వీకరిస్తానా? అని యెహోవా అడుగుతున్నాడు.
וַאֲמַרְתֶּם הִנֵּה מַתְּלָאָה וְהִפַּחְתֶּם אוֹתוֹ אָמַר יְהֹוָה צְבָאוֹת וַהֲבֵאתֶם גָּזוּל וְאֶת־הַפִּסֵּחַ וְאֶת־הַחוֹלֶה וַהֲבֵאתֶם אֶת־הַמִּנְחָה הַאֶרְצֶה אוֹתָהּ מִיֶּדְכֶם אָמַר יְהֹוָֽה׃
14 ౧౪ నేను ఘనమైన గొప్ప రాజును. అన్య దేశాల ప్రజల్లో నా పేరంటే భయం. యెహోవాకు మొక్కుబడి చెల్లించడానికి మగ జంతువు ఉన్నప్పటికీ జబ్బు పడిన దాన్ని అర్పించే వంచకుడు శాపానికి గురి అవుతాడు.
וְאָרוּר נוֹכֵל וְיֵשׁ בְּעֶדְרוֹ זָכָר וְנֹדֵר וְזֹבֵחַ מׇשְׁחָת לַאדֹנָי כִּי מֶלֶךְ גָּדוֹל אָנִי אָמַר יְהֹוָה צְבָאוֹת וּשְׁמִי נוֹרָא בַגּוֹיִֽם׃

< మలాకీ 1 >