< మలాకీ 2 >
1 ౧ కాబట్టి యాజకులారా, నేనిచ్చే ఈ ఆజ్ఞ మీ కోసమే.
And now to you, O ye priests, is this commandment:
2 ౨ సైన్యాలకు అధిపతియైన యెహోవా చెప్పేది ఏమిటంటే, మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలు పాటించకుండా, నా నామాన్ని మనస్ఫూర్తిగా గౌరవించడానికి నిశ్చయించుకోకపోతే నేను మీ మీదికి శాపం వచ్చేలా చేస్తాను. మీకు కలిగిన ఆశీర్వాద ఫలాలను శపిస్తాను. మీరు ఇంకా దాన్ని గుర్తుకు తెచ్చుకోలేదు గనుక ఇంతకుముందే నేను వాటిని శపించాను.
If ye will not hearken, If ye will not lay it to heart, To give glory to my name, saith Jehovah of hosts, I will send a curse upon you, And I will curse your blessings; Yea, I have cursed them already, Because ye do not lay it to heart.
3 ౩ మిమ్మల్ని బట్టి మీ సంతానాన్ని పెకలించి వేస్తాను. మీ పండగల్లో మీరు అర్పించే పశువుల పేడ మీ ముఖాలపై వేయిస్తాను. పేడ ఊడ్చి వేసే స్థలానికి మీరు ఊడ్చి వేయబడేలా చేస్తాను.
Behold, I will rebuke your seed, And I will scatter dung in your faces, The dung of your solemn feasts, And ye shall be carried to it.
4 ౪ దీన్ని బట్టి నేను లేవీయులకు నిబంధనగా ఉండేలా ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాణ్ణి నేనే అని మీరు తెలుసు కుంటారు అని సేనల ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు.
And ye shall know that I have sent to you this commandment, That my covenant may remain with Levi, Saith Jehovah of hosts.
5 ౫ నేను చేసిన నిబంధన వారి ప్రాణానికి, శాంతికి మూల కారణం. నా పట్ల వారికి భయభక్తులు కలిగించడానికి నేను వాటిని ఇచ్చాను. కాబట్టి వారు నా పట్ల భయభక్తులు కలిగి, నా నామం విషయంలో భయం కలిగి నడుచుకున్నారు.
My covenant was with him for life and peace, Which I gave to him for the fear wherewith he feared me, And was afraid before my name.
6 ౬ వారు దుర్బోధ ఎంతమాత్రమూ చేయకుండా సత్యమైన ధర్మశాస్త్రం బోధిస్తూ వచ్చారు. సమాధానంతో, యథార్థతతో నన్ను అనుసరించి అనేకులను అన్యాయం నుండి మళ్ళుకునేలా చేశారు.
The law of truth was in his mouth, And unrighteousness was not found in his lips; He walked with me in truth and equity, And turned many away from iniquity.
7 ౭ యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా వార్తాహరులు గనుక ప్రజలు వారి నోటనుండి వచ్చే ధర్మశాస్త్ర విధులు నేర్చుకొంటారు గనుక వారు జ్ఞానం కలిగి వాటిని బోధించాలి.
For the lips of the priest should keep knowledge, And men should seek the law from his mouth; For he is the messenger of Jehovah of hosts.
8 ౮ అయితే మీరు దారి తప్పారు. మీరు చేసిన ఉపదేశం వల్ల చాలా మంది దారి తప్పారు. నేను లేవీయులతో చేసిన నిబంధనను వమ్ము చేశారు.
But ye have departed from the way, Ye have caused many to stumble at the law, And ye have made void the covenant with Levi, Saith Jehovah of hosts.
9 ౯ ధర్మశాస్త్ర ఉపదేశంలో మీరు జరిగించిన పక్షపాతం వల్ల ప్రజలందరి ఎదుట మిమ్మల్ని తిరస్కారానికి గురైన వారుగా, అణగారి పోయిన వారుగా చేశాను అని సేనల ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు.
Therefore will I also make you Despicable and base before all the people; According as ye have not kept my ways. But have had respect to persons in the law.
10 ౧౦ మనకందరికి తండ్రి ఒక్కడే కదా. ఒక్క దేవుడే మనలను సృష్టించాడు కదా. అలాంటప్పుడు మనం ఒకరి పట్ల ఒకరం ద్రోహం చేసుకుంటూ, మన పూర్వీకులతో చేసిన కట్టడను ఎందుకు తిరస్కరిస్తున్నాం?
Have we not all one Father? Hath not one God created us? Why should we deal treacherously one against another, And profane the covenant made with our fathers?
11 ౧౧ యూదా ప్రజలు ద్రోహులుగా మారారు. ఇశ్రాయేలు ప్రజల మధ్య యెరూషలేములోనే నీచ కార్యాలు జరుగుతున్నాయి. యూదా ప్రజలు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేసి అన్యదేవత ఆరాధకుల పిల్లలను వివాహం చేసుకున్నారు.
Judah hath dealt treacherously, And an abomination is committed in Israel and in Jerusalem. For Judah hath profaned the holy people of Jehovah, which he loveth, And hath married the daughter of a strange god.
12 ౧౨ ఈ విధంగా చేసిన వాళ్ళను యాకోబు సంతానానికి చెందిన గుడారాల్లో లేకుండా, సైన్యాలకు అధిపతియైన యెహోవాకు నైవేద్యాలు అర్పించే వారి సహవాసంలో లేకుండా యెహోవా నాశనం చేస్తాడు.
Jehovah will cut off the man that doeth this, Him that waketh and him that answereth, from the tents of Jacob, And him that bringeth an offering to Jehovah of hosts.
13 ౧౩ మళ్ళీ రెండోసారి కూడా మీరు అలాగే చేస్తారు. అయితే ఆయన మీ నైవేద్యాన్ని స్వీకరించడు. మీరు అర్పించే అర్పణలు ఆయన లక్ష్యపెట్టడు. అప్పుడు యెహోవా బలిపీఠాన్ని ఏడ్పుతో, కన్నీళ్లతో, రోదనతో మీరు తడుపుతారు.
And this also ye do: Ye cover the altar of Jehovah with tears, With weeping and with groans, So that he no more hath regard to the offering, Nor receiveth it with good-will from your hand.
14 ౧౪ ఇలా ఎందుకు జరుగుతుంది? అని మీరు అడుగుతారు. యవ్వన కాలంలో నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయంగా విడిచిపెట్టిన నీ భార్య పక్షంగా యెహోవా సాక్షిగా నిలబడతాడు. నీ భార్య నీ సహకారి కాదా, నీవు చేసిన నిబంధన ప్రకారం భార్య కాదా.
Yet ye say, “Wherefore?” It is because Jehovah has been a witness between thee and the wife of thy youth, Against whom thou hast dealt unfaithfully, Although she was thy companion and thy covenanted wife.
15 ౧౫ ఆయన మీ ఇద్దరినీ ఒక్కటిగా చేశాడు. శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా. అలా ఒకటిగా చేయడం దేనికి? దేవుని మూలంగా వారికి సంతతి కలగాలని. అందువల్ల మిమ్మల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. యవ్వనంలో పెళ్లి చేసుకున్న మీ భార్యలకు ద్రోహం చేసి విశ్వాస ఘాతకులుగా మారకండి.
But did not He make one only? And yet had he a residue of the spirit; And wherefore one? He sought a godly race. Therefore take heed to your spirit, And be not unfaithful to the wife of thy youth!
16 ౧౬ ఒకడు తన భార్యను విడిచి పెట్టడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఒకడు తన బట్టలతో బాటు బలాత్కారంతో తనను కప్పుకోవడం నాకు అసహ్యమని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నాడు. కనుక మీ హృదయాలను కాపాడుకోండి. విశ్వాస ఘాతకులుగా ఉండకండి.
For I hate him that putteth away, Saith Jehovah, the God of Israel, And him that covereth his garment with violence, Saith Jehovah of hosts. Therefore take heed to your spirit, and be not unfaithful.
17 ౧౭ మీరు మీ మాటలతో యెహోవాకు చిరాకు కలిగించారు. “ఏ విధంగా ఆయనకు చిరాకు కలిగించాం?” అని మీరు అడుగుతున్నారు. “చెడ్డ పనులు చేసే వాళ్ళంతా యెహోవా దృష్టిలో మంచివారే. వారిపట్ల ఆయన ఆనందిస్తాడు. లేకపోతే న్యాయం చేసే దేవుడు ఇక ఎందుకు?” అని చెప్పుకోవడం ద్వారా మీరు ఆయనకు చిరాకు కలిగిస్తున్నారు.
Ye have wearied Jehovah with your words; Yet ye say, “Wherein have we wearied him?” In that ye say, “Every one of them that do evil Is good in the sight of Jehovah, And in them he hath delight”; Or, “Where is the God of judgment?”