< మలాకీ 1 >
1 ౧ ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ప్రవక్త ద్వారా చెప్పబడిన యెహోవా వాక్కు.
Tā Kunga vārda spriedums par Israēli caur Malahiju.
2 ౨ యెహోవా ఈ విధంగా అంటున్నాడు. “నేను మీ పట్ల ప్రేమ కనపరిచాను. అయితే మీరు ‘ఏ విషయంలో నీవు మా పట్ల ప్రేమ చూపించావు?’ అంటారు. ఏశావు యాకోబుకు అన్న కదా. నేను యాకోబును ప్రేమించాను.
Es jūs esmu mīlējis, saka Tas Kungs; bet jūs sakāt: kā Tu mūs esi mīlējis? Vai Ēsavs nav Jēkabam brālis? Saka Tas Kungs; tomēr Es Jēkabu mīlēju
3 ౩ ఏశావును ద్వేషించాను. అతని నివాస స్థలాలను పాడుచేసి అతని ఆస్తిని ఎడారిలో ఉన్న నక్కలపాలు చేశాను.”
Un Ēsavu Es ienīdēju un viņa kalnus darīju par posta vietu un viņa mantas tiesu priekš šakāļiem tuksnesī.
4 ౪ “మనం నాశనమై పోయాం. రండి, పాడైపోయిన మన నివాస స్థలాలు తిరిగి నిర్మించుకుందాం” అని ఎదోమీయులు అనుకొంటారు. అయితే సైన్యాలకు అధిపతియైన యెహోవా చెబుతున్నది ఏమిటంటే, వారు మళ్ళీ నిర్మించుకొన్నప్పటికీ నేను వాటిని క్రింద పడదోసి నాశనం చేస్తాను. వాళ్ళ దేశం భక్తిహీనుల ప్రదేశమనీ, వాళ్ళపై యెహోవా కోపం నిత్యమూ నిలిచి ఉంటుందని ఇతర ప్రజలు అంటారు.
Un jebšu Edoms sacītu: mēs esam salauzti, tomēr tās posta vietas atkal gribam uztaisīt, - tad Tas Kungs Cebaot saka tā: tie uztaisīs, bet Es noārdīšu, un tos nosauks par bezdievības robežām un par ļaudīm, par ko Tas Kungs mūžīgi dusmo.
5 ౫ కళ్ళారా దాన్ని చూసిన మీరు “ఇశ్రాయేలు ప్రజల సరిహద్దుల అవతల కూడా యెహోవా గొప్పవాడు” అంటారు.
Un jūsu acis to redzēs, un jūs sacīsiet: Tas Kungs pagodināsies pāri pār Israēla robežām. -
6 ౬ “కుమారుడు తన తండ్రిని గొప్ప చేస్తాడు గదా, దాసుడు తన యజమానుని ఘనపరుస్తాడు గదా. నా గొప్పదనాన్ని నిర్లక్ష్యం చేసే యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయింది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు?” అని సేనల ప్రభువైన యెహోవా మిమ్మల్ని అడిగినప్పుడు “నీ నామాన్ని మేము ఏ విధంగా నిర్లక్ష్యం చేశాం?” అని మీరు అంటారు.
Dēlam būs godāt savu tēvu, un kalpam savu kungu. Ja Es esmu Tēvs, kur ir Mans gods? Un ja Es esmu Kungs, kur ir Mana bijāšana? saka Tas Kungs Cebaot uz jums priesteriem, Mana Vārda nicinātajiem; bet jūs sakāt: kā tad mēs nicinājam Tavu Vārdu?
7 ౭ మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన ఆహారం నాకు అర్పిస్తూ “ఏమి చేసి నిన్ను అపవిత్రపరచాం?” అంటారు. “యెహోవా భోజనపు బల్లను అవమాన పరచడం వల్లనే గదా
Jūs nesat uz Manu altāri sagānītu maizi. Tad jūs sakāt: ar ko mēs Tevi sagānījām? Ar to, ka jūs sakāt: Tā Kunga galds nav cienījams.
8 ౮ గుడ్డి దాన్ని బలిగా అర్పించినప్పుడు అది దోషమే కదా. కుంటి దాన్ని, జబ్బు పడిన దాన్ని అర్పించినప్పుడు అది దోషం కాదా? అలాంటి వాటిని మీ యజమానికి ఇస్తే అతడు మిమ్మల్ని స్వీకరిస్తాడా? మిమ్మల్ని కనికరిస్తాడా?” అని సేనల ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు.
Jo kad jūs ko aklu atnesat upurēt, tad tas jums nav nelabs, un ja jūs ko tizlu vai vāju atnesat, tad tas nav nelabs. Atnesat to jel savam valdītājam, vai viņam pie tevis būs labs prāts, jeb vai viņš tavu vaigu žēlīgi uzlūkos? saka Tas Kungs Cebaot.
9 ౯ ఇప్పుడు దయ చూపమని ఆయనను ప్రాధేయపడండి. మీరే గదా ఆయనను అవమాన పరచారు. మీరు చేసిన పనులను బట్టి మీలో ఎవరినైనా ఆయన స్వీకరిస్తాడా? అని సేనల ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు.
Nu tad pielūdziet jel Dieva vaigu, lai Viņš mums ir žēlīgs. No jūsu rokas tas noticis: vai tad Viņš jūsu vaigu žēlīgi uzskatīs? saka Tas Kungs Cebaot.
10 ౧౦ “మీరు నా బలిపీఠం మీద వ్యర్థంగా నిప్పు రాజబెట్టకుండా మీలో ఒకడు నా ఆలయం ద్వారాలు మూసివేస్తే ఎంత బాగుండేది? మీరంటే నాకు ఇష్టం లేదు, మీరు అర్పించే నైవేద్యాలను నేను స్వీకరించను” అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.
Kaut jel kāds būtu jūsu starpā, kas durvis aizslēdz, lai jūs velti uguni neiededzinājāt uz Mana altāra; Man nav labs prāts pie jums, saka Tas Kungs Cebaot, un tas upuris no jūsu rokām Man nepatīk.
11 ౧౧ తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకూ ఇతర దేశాల ప్రజల్లో నా పేరును అంతా గౌరవిస్తారు. అన్ని ప్రాంతాల్లో నా పేరుకు ధూప నైవేద్యాలు, పవిత్రమైన అర్పణలు అర్పిస్తారు. అన్య దేశాల ప్రజల్లో నా పేరును ఉన్నతంగా ఎంచుతారు. అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.
Jo no saules uzlēkšanas līdz noiešanai Mans Vārds ir paaugstināts starp tautām, un ikkatrā vietā Manam Vārdam top kvēpināts un šķīsts upuris atnests. Jo Mans Vārds ir liels starp tautām, saka Tas Kungs Cebaot.
12 ౧౨ మీరైతే యెహోవా బల్ల అపవిత్రమని, దాని మీద ఉంచిన ఆహారం నీచమైనదని అనుకుంటూ దానికి అవమానం కలిగిస్తున్నారు.
Bet jūs to sagānat, sacīdami: Tā Kunga galds, tas ir sagānīts, un viņa ienākumu riebj baudīt.
13 ౧౩ అయ్యో, ఇదంతా చేయడం వ్యర్ధమని ఆ బల్లను తిరస్కరిస్తున్నారు అని ఆయన సెలవిస్తున్నాడు. ఇది సేనల ప్రభువైన యెహోవా వాక్కు. దోచుకున్నదానినీ, కుంటిదానినీ, జబ్బు గలదానినీ మీరు తీసుకువచ్చి బలిగా అర్పించినప్పుడు అలాంటి వాటిని నేను స్వీకరిస్తానా? అని యెహోవా అడుగుతున్నాడు.
Un jūs sakāt: redzi, kāds grūtums! Un nebēdājat par to, saka Tas Kungs Cebaot, jūs atnesat, kas ir laupīts, un kas tizls un vājš, un tā upurējat upuri. Vai tas Man var patikt no jūsu rokas? saka Tas Kungs.
14 ౧౪ నేను ఘనమైన గొప్ప రాజును. అన్య దేశాల ప్రజల్లో నా పేరంటే భయం. యెహోవాకు మొక్కుబడి చెల్లించడానికి మగ జంతువు ఉన్నప్పటికీ జబ్బు పడిన దాన్ని అర్పించే వంచకుడు శాపానికి గురి అవుతాడు.
Nolādēts tas blēdis, kam savā ganāma pulkā ir auniņš, un kas sola un upurē Tam Kungam ko maitātu! Jo Es esmu liels Ķēniņš, saka Tas Kungs Cebaot: un Mans Vārds ir bijājams starp tautām.