< లూకా 5 >
1 ౧ ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు. ప్రజలు గుంపుగూడి ఆయనపైకి తోసుకువస్తూ దేవుని వాక్కు వింటూ ఉన్నారు.
Ühel päeval, kui Jeesus seisis Galilea mere ääres, tunglesid inimesed tema ümber, et Jumala sõna kuulda.
2 ౨ ఆ సరస్సు తీరాన ఉన్న రెండు పడవలను ఆయన చూశాడు. చేపలు పట్టేవారు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు.
Jeesus märkas kaldal kaht paati, mille olid jätnud sinna kalurid, kes oma võrke pesid.
3 ౩ పడవల్లో సీమోను పడవ ఒకటి. యేసు ఆ పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు.
Jeesus astus paati, sellesse, mis kuulus Siimonale, ja palus tal paadi vette tõugata, kaldast veidi eemale. Siis Jeesus istus paadis maha ja õpetas sealt rahvast.
4 ౪ ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో, “పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి” అన్నాడు.
Pärast seda kui ta kõnelemise oli lõpetanud, ütles ta Siimonale: „Mine välja sügavamasse vette ja lase oma võrgud püüdmiseks sisse.“
5 ౫ సీమోను, “స్వామీ, రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు.
„Õpetaja, nägime kogu öö tõsist vaeva, kuid ei püüdnud midagi. Aga kui sa nii ütled, siis lasen võrgud sisse, “vastas Siimon.
6 ౬ వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి.
Kui võrgud olid vees, täitis suur kalaparv võrgud nii, et need olid rebenemas.
7 ౭ వారు వేరే పడవల్లోని తమ సహచరులను వచ్చి తమకు సహాయం చేయమని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు ఎంతగా నింపారంటే ఆ బరువుకు పడవలు మునిగిపోసాగాయి.
Nad andsid märku kaaslastele teises paadis ja palusid neil appi tulla. Teised tulid ja mõlemad paadid said kalu täis. Paadid olid nii täis, et hakkasid vajuma.
8 ౮ సీమోను పేతురు అది చూసి, యేసు మోకాళ్ళ ముందు పడి, “ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు” అన్నాడు.
Kui Siimon Peetrus nägi, mis oli juhtunud, langes ta Jeesuse ette põlvili. „Issand, hoia palun minust eemale, sest ma olen patune inimene!“hüüatas ta.
9 ౯ ఎందుకంటే అతడూ అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు.
Sest tema ja kõik, kes olid temaga koos, olid maale tõmmatud kalasaagist hämmastuses.
10 ౧౦ వీరిలో సీమోను జతగాళ్ళు జెబెదయి కుమారులు యాకోబు, యోహాను కూడా ఉన్నారు. అందుకు యేసు సీమోనుతో, “భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు” అన్నాడు.
Jaakobus ja Johannes, Sebedeuse pojad, Siimona kaaskalurid, tundsid sama. „Ära karda, “ütles Jeesus Siimonale. „Sest nüüdsest peale püüad sa inimesi!“
11 ౧౧ వారు పడవలను ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు.
Nõnda siis vedasid nad paadid kaldale, jätsid kõik maha ja järgnesid Jeesusele.
12 ౧౨ యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే అతడు సాగిలపడి, “ప్రభూ! నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను వేడుకున్నాడు.
Kord kui Jeesus külastas üht linna, kohtus ta mehega, kel oli väga raske pidalitõbi. Mees heitis näoli maha ja anus Jeesust: „Palun, Issand, kui sa tahad, võid sa mind puhtaks teha.“
13 ౧౩ అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, “నాకిష్టమే. బాగు పడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు వ్యాధి పోయింది.
Jeesus sirutas käe ja puudutas meest. „Ma tahan, “ütles ta. „Saa puhtaks!“Pidalitõbi kadus otsekohe.
14 ౧౪ “ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. అయితే వెళ్ళి యాజకునికి కనబడు. వారికి సాక్ష్యంగా శుద్ధి కోసం మోషే విధించిన దాన్ని అర్పించు” అని యేసు అతన్ని ఆదేశించాడు.
„Ära kellelgi midagi ütle, “õpetas Jeesus teda. „Mine ja näita end preestrile ja too oma tervenemise tõestuseks Moosese seaduses nõutud tseremoniaalohvrid.“
15 ౧౫ అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది. ప్రజలు గుంపులు గుంపులుగా, ఆయన బోధ వినడానికీ తమ రోగాలను బాగుచేసుకోడానికీ వచ్చారు.
Ikkagi levisid kuuldused Jeesusest üha enam ja enam. Suured rahvahulgad tulid Jeesust kuulama ja oma haigustest terveks saama.
16 ౧౬ అయితే ఆయన తరచుగా జన సంచారం లేని చోటులకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు.
Aga sageli tõmbus Jeesus vaiksesse paika ja palvetas.
17 ౧౭ ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలిలయ, యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది.
Ühel päeval, kui Jeesus õpetas, istusid seal ka variserid ja vaimulikud õpetajad, kes olid tulnud kogu Galileast, Juudamaalt ja Jeruusalemmast. Issanda vägi tervendada oli temaga, nii et ta suutis inimesi terveks teha.
18 ౧౮ కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని
Mõned mehed tulid ja kandsid mati peal halvatud meest. Nad üritasid teda sisse viia, et teda Jeesuse ette asetada.
19 ౧౯ ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు.
Kuid nad ei suutnud läbi rahva teed leida, seega läksid nad üles katusele ja tegid katusekivide vahele augu. Seejärel lasksid nad mehe koos matiga alla, otse rahva sekka, Jeesuse ette.
20 ౨౦ యేసు వారి విశ్వాసం చూసి, “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
Kui Jeesus nägi, missugune usk oli neil temasse, ütles ta mehele: „Sinu patud on andeks antud.“
21 ౨౧ శాస్త్రులూ పరిసయ్యులూ, “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?” అనుకున్నారు
Vaimulikud õpetajad ja variserid hakkasid selle üle arutlema. „Kes ta on, et niimoodi Jumalat teotab?“küsisid nad. „Kes võib patte andeks anda? Ainult Jumal võib seda teha!“
22 ౨౨ యేసు వారి ఆలోచన గ్రహించి, “మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు?
Jeesus teadis, mida nad arutlevad, seepärast küsis ta neilt: „Miks te seda kahtluse alla seate?
23 ౨౩ ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా?
Mis on lihtsam? Kas öelda, et sinu patud on andeks antud või „Tõuse püsti ja kõnni!“?
24 ౨౪ అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు. తరువాత పక్షవాత రోగిని చూసి, “లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
Kuid ma tõestan teile, et inimese Pojal on õigus siin maa peal patte andeks anda.“Seejärel ütles ta halvatud mehele: „Ma ütlen sulle: tõuse üles, võta oma matt ja mine koju.“
25 ౨౫ వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు.
Jalamaid tõusis mees nende ees püsti. Ta võttis mati, mille peal ta oli lamanud, ning läks Jumalat ülistades koju.
26 ౨౬ అందరూ విస్మయం చెంది, “ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం” అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు.
Kõik olid juhtunust täielikult jahmunud ning suures aukartuses ülistasid nad Jumalat, öeldes: „See, mida me täna nägime, oli hämmastav!“
27 ౨౭ ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి పన్నులు వసూలు చేసే లేవీ అనే ఒక వ్యక్తిని చూశాడు. అతడు పన్నులు కట్టించుకొనే చోట కూర్చుని ఉన్నాడు. ఆయన అతనితో, “నా వెంట రా” అన్నాడు.
Hiljem, kui Jeesus oli linnast lahkumas, nägi ta maksukogujat nimega Leevi oma tolliputkas istumas. „Järgne mulle, “ütles Jeesus talle.
28 ౨౮ అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు.
Leevi tõusis püsti, jättis kõik sinnapaika ja järgnes Jeesusele.
29 ౨౯ లేవీ తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసే వారూ వేరే వారూ వారితో కూడ భోజనానికి కూర్చున్నారు.
Leevi korraldas oma kodus Jeesuse auks suure pidusöögi. Rahva hulgas, kes koos nendega sõi, oli palju maksukogujaid ja teisi. Kuid variserid ja vaimulikud õpetajad kurtis Jeesuse jüngritele, öeldes:
30 ౩౦ పరిసయ్యులూ వారి శాస్త్రులూ, “మీరు పన్నులు వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి?” అని శిష్యుల మీద సణుక్కున్నారు.
„Miks te sööte ja joote koos maksukogujate ja patustega?“
31 ౩౧ అందుకు యేసు, “రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర లేదు.
„Arsti ei vaja terved, vaid haiged, “vastas Jeesus.
32 ౩౨ పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు” అన్నాడు.
„Ma ei tulnud kutsuma meeleparandusele neid, kes elavad õigesti. Ma tulin kutsuma patuseid.“
33 ౩౩ వారాయనతో, “యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. పరిసయ్యుల శిష్యులు కూడా అలాగే చేస్తారు. కానీ నీ శిష్యులు తిని తాగుతూ ఉన్నారు” అని అన్నారు.
„Aga Johannese jüngrid paastuvad sageli ja palvetavad ning variseride jüngrid samuti. Kuid sinu jüngrid seda ei tee, nad käivad söömas ja joomas, “ütlesid nad talle.
34 ౩౪ అందుకు యేసు, “పెళ్ళి కొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి ఇంట్లో ఉన్న వారితో మీరు ఉపవాసం చేయించగలరా?
„Kas peiupoisid peaksid paastuma sel ajal, kui peigmees on nende juures?“küsis Jeesus.
35 ౩౫ పెళ్ళి కొడుకును వారి దగ్గర నుండి తీసుకు పోయే రోజులు వస్తాయి. ఆ రోజుల్లో వారు ఉపవాసం చేస్తారు” అని వారితో చెప్పాడు.
„Ei, aga tuleb aeg, mil peigmees võetakse nende juurest ära. Küll nad siis paastuvad.“
36 ౩౬ ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, “ఎవరూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయరు. ఒక వేళ అలా చేస్తే కొత్త బట్ట చింపవలసి వస్తుంది. కొత్తదానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలవదు.
Siis esitas ta neile näitliku selgituse: „Uute rõivaste küljest ei rebita paika, et vanu rõivaid lappida. Muidu oleks uued rõivad rikutud ja uuelt pärit paik ei sobiks vanale.
37 ౩౭ ఎవడూ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయడు. పోస్తే కొత్త ద్రాక్షారసం వలన ఆ తిత్తులు చినిగిపోతాయి. రసం కారిపోతుంది. తిత్తులు పాడవుతాయి.
Värsket veini ei panda vanadesse nahklähkritesse, sest kui seda teha, rebeneksid vanad lähkrid värske veini tõttu. Siis läheks raisku nii vein kui ka veinilähkrid.
38 ౩౮ అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోయాలి.
Värske vein pannakse uutesse lähkritesse.
39 ౩౯ పాత ద్రాక్షారసం తాగిన తరువాత కొత్త దాన్ని ఎవరూ ఆశించరు. ఎందుకంటే ‘పాతదే బాగుంది,’ అంటారు.”
Ja pärast vana veini joomist ei soovi keegi värsket veini, sest öeldakse, et „vana maitseb hästi“.“