< లూకా 5 >

1 ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు. ప్రజలు గుంపుగూడి ఆయనపైకి తోసుకువస్తూ దేవుని వాక్కు వింటూ ఉన్నారు.
On one occasion the crowd was pressing on Him and listening to God's Message, while He was standing by the Lake of Gennesaret.
2 ఆ సరస్సు తీరాన ఉన్న రెండు పడవలను ఆయన చూశాడు. చేపలు పట్టేవారు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు.
He, however, saw two fishing-boats drawn up on the beach (for the men had gone away from them and were washing the nets),
3 పడవల్లో సీమోను పడవ ఒకటి. యేసు ఆ పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు.
and going on board one of them, which was Simon's He asked him to push out a little from land. Then He sat down and taught the crowd of people from the boat.
4 ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో, “పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి” అన్నాడు.
When He had finished speaking, He said to Simon, "Push out into deep water, and let down your nets for a haul."
5 సీమోను, “స్వామీ, రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు.
"Rabbi," replied Peter, "all night long we have worked hard and caught nothing; but at your command I will let down the nets."
6 వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి.
This they did, and enclosed a vast number of fish; and their nets began to break.
7 వారు వేరే పడవల్లోని తమ సహచరులను వచ్చి తమకు సహాయం చేయమని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు ఎంతగా నింపారంటే ఆ బరువుకు పడవలు మునిగిపోసాగాయి.
So they signalled to their partners in the other boat to come and help them; they came, and they filled both the boats so that they almost sank.
8 సీమోను పేతురు అది చూసి, యేసు మోకాళ్ళ ముందు పడి, “ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు” అన్నాడు.
When Simon Peter saw this, he fell down at the knees of Jesus, and exclaimed, "Master, leave my boat, for I am a sinful man."
9 ఎందుకంటే అతడూ అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు.
(For he was astonished and terrified--he and all his companions--at the haul of fish which they had taken;
10 ౧౦ వీరిలో సీమోను జతగాళ్ళు జెబెదయి కుమారులు యాకోబు, యోహాను కూడా ఉన్నారు. అందుకు యేసు సీమోనుతో, “భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు” అన్నాడు.
and so were Simon's partners James and John, the sons of Zabdi.) But Jesus replied to Simon, "Fear not: from this time you shall be a catcher of men."
11 ౧౧ వారు పడవలను ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు.
Then, after bringing their boats to land, they left everything and followed Him.
12 ౧౨ యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే అతడు సాగిలపడి, “ప్రభూ! నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను వేడుకున్నాడు.
On another occasion, when He was in one of the towns, there was a man there covered with leprosy, who, seeing Jesus, threw himself at His feet and implored Him, saying, "Sir, if only you are willing, you are able to make me clean."
13 ౧౩ అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, “నాకిష్టమే. బాగు పడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు వ్యాధి పోయింది.
Reaching out His hand and touching him, Jesus said, "I am willing; be cleansed!" And instantly the leprosy left him.
14 ౧౪ “ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. అయితే వెళ్ళి యాజకునికి కనబడు. వారికి సాక్ష్యంగా శుద్ధి కోసం మోషే విధించిన దాన్ని అర్పించు” అని యేసు అతన్ని ఆదేశించాడు.
He ordered him to tell no one. "But go," He said, "show yourself to the Priest, and make the offering for your purification which Moses appointed, as evidence for them."
15 ౧౫ అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది. ప్రజలు గుంపులు గుంపులుగా, ఆయన బోధ వినడానికీ తమ రోగాలను బాగుచేసుకోడానికీ వచ్చారు.
But all the more the report about Him spread abroad, and great multitudes crowded to hear Him and to be cured of their diseases;
16 ౧౬ అయితే ఆయన తరచుగా జన సంచారం లేని చోటులకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు.
but Jesus Himself constantly withdrew into the Desert and there prayed.
17 ౧౭ ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలిలయ, యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది.
One day He was teaching, and there were Pharisees and teachers of the Law sitting there who had come from every village in Galilee and Judaea and from Jerusalem. And the power of the Lord was present for Him to cure people.
18 ౧౮ కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని
And a party of men came carrying a palsied man on a bed, and they endeavoured to bring him in and lay him before Jesus.
19 ౧౯ ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు.
But when they could find no way of doing so because of the crowd, they went up on the roof and let him down through the tiling--bed and all--into the midst, in front of Jesus.
20 ౨౦ యేసు వారి విశ్వాసం చూసి, “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
He saw their faith and said to him, "Friend, your sins are forgiven."
21 ౨౧ శాస్త్రులూ పరిసయ్యులూ, “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?” అనుకున్నారు
Then the Scribes and Pharisees began to cavil, asking, "Who is this, uttering blasphemies? Who but God alone can forgive sins?"
22 ౨౨ యేసు వారి ఆలోచన గ్రహించి, “మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు?
Well aware of their reasonings, Jesus answered their questions by asking in turn, "What is this that you are debating in your hearts?
23 ౨౩ ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా?
Which is easier? --to say, 'Your sins are forgiven,' or to say, 'Rise and walk'?
24 ౨౪ అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు. తరువాత పక్షవాత రోగిని చూసి, “లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
But to prove to you that the Son of Man has authority on earth to forgive sins" --Turning to the paralytic He said, "I bid you, Rise, take up your bed, and go home."
25 ౨౫ వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు.
Instantly he stood up in their presence, took up the mattress on which he had been lying, and went away to his home, giving glory to God.
26 ౨౬ అందరూ విస్మయం చెంది, “ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం” అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు.
Amazement seized them all. "Glory to God!" was the abiding feeling. Yet fear flashed through their minds and they said, "We have seen strange things to-day."
27 ౨౭ ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి పన్నులు వసూలు చేసే లేవీ అనే ఒక వ్యక్తిని చూశాడు. అతడు పన్నులు కట్టించుకొనే చోట కూర్చుని ఉన్నాడు. ఆయన అతనితో, “నా వెంట రా” అన్నాడు.
After this He went out and noticed a tax-gatherer, Levi by name, sitting at the Toll office; and He said to him, "Follow me."
28 ౨౮ అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు.
He rose, left everything, and followed Him.
29 ౨౯ లేవీ తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసే వారూ వేరే వారూ వారితో కూడ భోజనానికి కూర్చున్నారు.
Levi also gave a great entertainment at his house in honour of Jesus, and there was a large party of tax-gatherers and others at table with them.
30 ౩౦ పరిసయ్యులూ వారి శాస్త్రులూ, “మీరు పన్నులు వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి?” అని శిష్యుల మీద సణుక్కున్నారు.
This led the Pharisees and Scribes of their party to expostulate with His disciples and ask, "Why are you eating and drinking with these tax-gatherers and notorious sinners?"
31 ౩౧ అందుకు యేసు, “రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర లేదు.
But Jesus replied to them, "It is not men in good health who require a physician, but the sick.
32 ౩౨ పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు” అన్నాడు.
I have not come to call the righteous to repentance, but sinners."
33 ౩౩ వారాయనతో, “యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. పరిసయ్యుల శిష్యులు కూడా అలాగే చేస్తారు. కానీ నీ శిష్యులు తిని తాగుతూ ఉన్నారు” అని అన్నారు.
Again they said to Him, "John's disciples fast often and pray, as do also those of the pharisees; but yours eat and drink."
34 ౩౪ అందుకు యేసు, “పెళ్ళి కొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి ఇంట్లో ఉన్న వారితో మీరు ఉపవాసం చేయించగలరా?
"Can you compel the bridal party to fast," replied Jesus, "so long as they have the bridegroom among them?
35 ౩౫ పెళ్ళి కొడుకును వారి దగ్గర నుండి తీసుకు పోయే రోజులు వస్తాయి. ఆ రోజుల్లో వారు ఉపవాసం చేస్తారు” అని వారితో చెప్పాడు.
But a time for this will come, when the Bridegroom has been taken away from them: then, at that time, they will fast."
36 ౩౬ ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, “ఎవరూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయరు. ఒక వేళ అలా చేస్తే కొత్త బట్ట చింపవలసి వస్తుంది. కొత్తదానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలవదు.
He also spoke in figurative language to them. "No one," He said, "tears a piece from a new garment to mend an old one. Otherwise he would not only spoil the new, but the patch from the new would not match the old.
37 ౩౭ ఎవడూ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయడు. పోస్తే కొత్త ద్రాక్షారసం వలన ఆ తిత్తులు చినిగిపోతాయి. రసం కారిపోతుంది. తిత్తులు పాడవుతాయి.
Nor does any one pour new wine into old wine-skins. Otherwise the new wine would burst the skins, the wine itself would be spilt, and the skins be destroyed.
38 ౩౮ అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోయాలి.
But new wine must be put into fresh wineskins.
39 ౩౯ పాత ద్రాక్షారసం తాగిన తరువాత కొత్త దాన్ని ఎవరూ ఆశించరు. ఎందుకంటే ‘పాతదే బాగుంది,’ అంటారు.”
Nor does any one after drinking old wine wish for new; for he says, 'The old is better.'"

< లూకా 5 >