< లూకా 3 >
1 ౧ సీజరు తిబెరియస్ పాలించిన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు గవర్నర్. హేరోదు గలిలయకు చతుర్థాధికారి. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయకూ, త్రకోనీతి ప్రాంతాలకూ పాలకుడు. లుసానియ అబిలేనే పరగణాకు రాష్ట్రాధికారి.
Viidentenätoista keisari Tiberiuksen hallitusvuotena, kun Pontius Pilatus oli Juudean maaherrana ja Herodes Galilean neljännysruhtinaana ja hänen veljensä Filippus Iturean ja Trakonitiinmaan neljännysruhtinaana ja Lysanias Abilenen neljännysruhtinaana,
2 ౨ అన్న, కయప ముఖ్య యాజకులు. అప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడు యోహాను దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది.
siihen aikaan kun Hannas oli ylimmäisenä pappina, ynnä myös Kaifas, tuli Jumalan sana Johannekselle, Sakariaan pojalle, erämaassa.
3 ౩ అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు.
Ja hän vaelsi kaikissa seuduissa Jordanin varrella ja saarnasi parannuksen kastetta syntien anteeksisaamiseksi,
4 ౪ యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది, “అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన బాటలు తిన్నగా చేయండి.
niinkuin on kirjoitettuna profeetta Esaiaan sanojen kirjassa: "Huutavan ääni kuuluu erämaassa: 'Valmistakaa Herralle tie, tehkää polut hänelle tasaisiksi'.
5 ౫ ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి. వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి.
Kaikki laaksot täytettäköön, ja kaikki vuoret ja kukkulat alennettakoon, ja mutkat tulkoot suoriksi ja koleikot tasaisiksi teiksi,
6 ౬ ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు.”
ja kaikki liha on näkevä Jumalan autuuden."
7 ౭ అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో, “సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకొమ్మని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
Niin hän sanoi kansalle, joka vaelsi hänen kastettavakseen: "Te kyykäärmeitten sikiöt, kuka on teitä neuvonut pakenemaan tulevaista vihaa?
8 ౮ పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నాను.
Tehkää sentähden parannuksen soveliaita hedelmiä, älkääkä ruvetko sanomaan mielessänne: 'Onhan meillä isänä Aabraham', sillä minä sanon teille, että Jumala voi näistä kivistä herättää lapsia Aabrahamille.
9 ౯ ఇప్పటికే చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది. కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు” అని చెప్పాడు.
Jo on myös kirves pantu puitten juurelle; jokainen puu, joka ei tee hyvää hedelmää, siis hakataan pois ja heitetään tuleen."
10 ౧౦ అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు.
Ja kansa kysyi häneltä sanoen: "Mitä meidän siis pitää tekemän?"
11 ౧౧ అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు.
Hän vastasi ja sanoi heille: "Jolla on kaksi ihokasta, antakoon toisen sille, joka on ilman; ja jolla on ruokaa, tehköön samoin".
12 ౧౨ పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, “బోధకా, మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు.
Niin tuli myös publikaaneja kastettaviksi, ja he sanoivat hänelle: "Opettaja, mitä meidän pitää tekemän?"
13 ౧౩ అతడు, “మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని వారితో చెప్పాడు.
Hän sanoi heille: "Älkää vaatiko enempää, kuin mikä teille on säädetty".
14 ౧౪ “మా సంగతేంటి? మేమేం చేయాలి?” అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. “ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి” అని అతడు వారితో చెప్పాడు.
Myös sotamiehet kysyivät häneltä sanoen: "Mitäs meidän pitää tekemän?" Ja hän sanoi heille: "Älkää kiskoko keneltäkään älkääkä kiristäkö, vaan tyytykää palkkaanne".
15 ౧౫ క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ, యోహానే క్రీస్తు అయి ఉంటాడని అని అందరూ లోలోపల అనుకుంటున్నారు.
Mutta kun kansa yhä odotti ja kaikki ajattelivat sydämessään Johanneksesta, eikö hän itse ehkä ollut Kristus,
16 ౧౬ వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.
niin Johannes vastasi kaikille sanoen: "Minä kastan teidät vedellä, mutta on tuleva minua väkevämpi, jonka kengänpaulaakaan minä en ole kelvollinen päästämään; hän kastaa teidät Pyhällä Hengellä ja tulella.
17 ౧౭ తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.”
Hänellä on viskimensä kädessään, ja hän puhdistaa puimatanterensa ja kokoaa nisut aittaansa, mutta ruumenet hän polttaa sammumattomassa tulessa."
18 ౧౮ అతడు ఇంకా చాలా మాటలు చెప్పి ప్రజలను హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు.
Antaen myös monia muita kehoituksia hän julisti kansalle evankeliumia.
19 ౧౯ అయితే రాష్ట్రాధికారి హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం, అతని సోదరుని భార్య హేరోదియ విషయం యోహాను అతన్ని మందలించాడు.
Mutta kun Herodes, neljännysruhtinas, sai häneltä nuhteita veljensä vaimon, Herodiaan, tähden ja kaiken sen pahan tähden, mitä hän, Herodes, oli tehnyt,
20 ౨౦ హేరోదు అంతవరకూ తాను చేసిన చెడ్డ పనులు చాలవన్నట్టు యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు.
niin hän kaiken muun lisäksi teki senkin, että sulki Johanneksen vankeuteen.
21 ౨౧ ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది.
Kun siis kaikkea kansaa kastettiin ja myöskin Jeesus oli saanut kasteen ja rukoili, niin tapahtui, että taivas aukeni
22 ౨౨ పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”
ja Pyhä Henki laskeutui hänen päällensä ruumiillisessa muodossa, niinkuin kyyhkynen, ja taivaasta tuli ääni: "Sinä olet minun rakas Poikani; sinuun minä olen mielistynyt".
23 ౨౩ యేసు తన పని మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు సుమారు ముప్ఫై సంవత్సరాలు. ఆయన యోసేపు కొడుకు (అని ప్రజలు ఎంచారు). యోసేపు హేలీ కొడుకు.
Ja hän, Jeesus, oli alottaessaan vaikutuksensa noin kolmenkymmenen vuoden vanha, ja oli, niinkuin luultiin, Joosefin poika. Joosef oli Eelin poika,
24 ౨౪ హేలీ మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు. లేవి మెల్కీ కొడుకు.
Eeli Mattatin, tämä Leevin, tämä Melkin, tämä Jannain, tämä Joosefin,
25 ౨౫ మెల్కీ యన్న కొడుకు. యన్న యోసేపు కొడుకు. యోసేపు మత్తతీయ కొడుకు. మత్తతీయ ఆమోసు కొడుకు. ఆమోసు నాహోము కొడుకు. నాహోము ఎస్లి కొడుకు. ఎస్లి నగ్గయి కొడుకు.
tämä Mattatiaan, tämä Aamoksen, tämä Naahumin, tämä Eslin, tämä Naggain,
26 ౨౬ నగ్గయి మయతు కొడుకు. మయతు మత్తతీయ కొడుకు. మత్తతీయ సిమియ కొడుకు. సిమియ యోశేఖు కొడుకు. యోశేఖు యోదా కొడుకు.
tämä Maahatin, tämä Mattatiaan, tämä Semeinin, tämä Joosekin, tämä Joodan,
27 ౨౭ యోదా యోహన్న కొడుకు. యోహన్న రేసా కొడుకు. రేసా జెరుబ్బాబెలు కొడుకు. జెరుబ్బాబెలు షయల్తీయేలు కొడుకు. షయల్తీయేలు నేరి కొడుకు.
tämä Johananin, tämä Reesan, tämä Serubbaabelin, tämä Sealtielin, tämä Neerin,
28 ౨౮ నేరి మెల్కీ కొడుకు. మెల్కీ అద్ది కొడుకు. అద్ది కోసాము కొడుకు. కోసాము ఎల్మదాము కొడుకు. ఎల్మదాము ఏరు కొడుకు.
tämä Melkin, tämä Addin, tämä Koosamin, tämä Elmadamin, tämä Eerin,
29 ౨౯ ఏరు యెహోషువ కొడుకు. యెహోషువ ఎలీయెజెరు కొడుకు. ఎలీయెజెరు యోరీము కొడుకు. యోరీము మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు.
tämä Jeesuksen, tämä Elieserin, tämä Joorimin, tämä Mattatin, tämä Leevin,
30 ౩౦ లేవి షిమ్యోను కొడుకు. షిమ్యోను యూదా కొడుకు. యూదా యోసేపు కొడుకు. యోసేపు యోనాము కొడుకు. యోనాము ఎల్యాకీము కొడుకు.
tämä Simeonin, tämä Juudan, tämä Joosefin, tämä Joonamin, tämä Eliakimin,
31 ౩౧ ఎల్యాకీము మెలెయా కొడుకు. మెలెయా మెన్నా కొడుకు. మెన్నా మత్తతా కొడుకు. మత్తతా నాతాను కొడుకు. నాతాను దావీదు కొడుకు.
tämä Melean, tämä Mennan, tämä Mattatan, tämä Naatanin, tämä Daavidin,
32 ౩౨ దావీదు యెష్షయి కొడుకు. యెష్షయి ఓబేదు కొడుకు. ఓబేదు బోయజు కొడుకు. బోయజు శల్మాను కొడుకు. శల్మాను నయస్సోను కొడుకు.
tämä Iisain, tämä Oobedin, tämä Booaan, tämä Saalan, tämä Nahassonin,
33 ౩౩ నయస్సోను అమ్మీనాదాబు కొడుకు. అమ్మీనాదాబు అద్మిను కొడుకు. అద్మిను అర్నీ కొడుకు. అర్నీ ఎస్రోము కొడుకు, ఎస్రోము పెరెసు కొడుకు. పెరెసు యూదా కొడుకు.
tämä Aminadabin, tämä Adminin, tämä Arnin, tämä Esromin, tämä Faareen, tämä Juudan,
34 ౩౪ యూదా యాకోబు కొడుకు. యాకోబు ఇస్సాకు కొడుకు. ఇస్సాకు అబ్రాహాము కొడుకు. అబ్రాహాము తెరహు కొడుకు. తెరహు నాహోరు కొడుకు.
tämä Jaakobin, tämä Iisakin, tämä Aabrahamin, tämä Taaran, tämä Naahorin,
35 ౩౫ నాహోరు సెరూగు కొడుకు. సెరూగు రయూ కొడుకు. రయూ పెలెగు కొడుకు. పెలెగు హెబెరు కొడుకు. హెబెరు షేలహు కొడుకు.
tämä Serukin, tämä Ragaun, tämä Faalekin, tämä Eberin, tämä Saalan,
36 ౩౬ షేలహు కేయినాను కొడుకు. కేయినాను అర్పక్షదు కొడుకు. అర్పక్షదు షేము కొడుకు. షేము నోవహు కొడుకు. నోవహు లెమెకు కొడుకు.
tämä Kainamin, tämä Arfaksadin, tämä Seemin, tämä Nooan, tämä Laamekin,
37 ౩౭ లెమెకు మెతూషెల కొడుకు. మెతూషెల హనోకు కొడుకు. హనోకు యెరెదు కొడుకు. యెరెదు మహలలేలు కొడుకు. మహలలేలు కేయినాను కొడుకు.
tämä Metusalan, tämä Eenokin, tämä Jaaretin, tämä Mahalalelin, tämä Keenanin,
38 ౩౮ కేయినాను ఎనోషు కొడుకు. ఎనోషు షేతు కొడుకు. షేతు ఆదాము కొడుకు. ఆదాము దేవుని కొడుకు.
tämä Enoksen, tämä Seetin, tämä Aadamin, tämä Jumalan.